Saturday, October 3, 2015

ఒక అవసరం జీవితంనీది నొప్పులు బాధల మయ జీవితం
నేను నీ కళ్ళలోకి చూస్తున్నాను
"కాస్తంతైనా కుదుటపడ్డావా" అని.
నీతో ఉండటము చూడటమూ వల్ల
నాకు పెద్ద లాభమూ నష్టమూ లేవు.
నీవేం ప్రత్యేకం కాదు .... నాకు
అయినా పక్కనే ఉన్నాను.
కారణం ఏదైనా కాని
నీ భయానికి మాత్రం కారణం నేనులా
నన్ను నమ్మి మోసపోతావేమో అన్నట్లు
దీనంగా చూస్తున్నావు.
కానీ నీవు నమ్మక తప్పదు
నీ జీవనానికి నా అవసరం ఉన్నా
నాకు ఇచ్చేందుకు నన్నాశకొల్పేందుకు
నీవద్ద ఏమీ లేవు.
ఏమీలేని దాని వై, ఎవ్వరికీ కాని దానివై
నీరసంతో నీవు సొమ్మసిల్లుతూ
చూస్తూ ఉన్నాను.
నీ ప్రపంచం ఎలాగూ నాశనం అయ్యింది.
నీ కలలన్నీ అబద్దాల కన్నీళ్ళయ్యాయి.
నీ పక్కన ఉండి నేను మాత్రం
నా సమయాన్ని వృధా చేసుకోవడం లేదు కదా అనే
మీమాంస ఉన్నా తప్పదు
వైద్య వృత్తి ....
నీవో అనామకురాలివి.
నొప్పి బాధల్ని శరీరమంతా నింపుకున్న అభాగ్యురాలివి.
నీకే తెలియదు భవిష్యత్తులో ....
ఎందుకు ఏ ఆశతో జీవించాలో
నీవింకా బ్రతికున్నది ....
నీవు కన్న అందమైన ఆత్మల్ని చూసుకునని
నీ ఇద్దరు బిడ్డల కోసమే అని
వారు, వారి కోసం నీవు ఏమీ చెయ్యలేదని
అనుకోకూడదనే ఈ భారజీవితాన్ని ఈడుస్తున్నావని,
శూన్యం నీవై శూన్యంగానే ఉండి ఎప్పటికీ ....
ఏ మాత్రం కష్టం కాదు ఎవరికీ .... నీ ఈ స్థితిని చూడటం
లోలోన నీవు చచ్చిపోయి
రోధిస్తూ ఉన్నావు.
ఒక జీవిత కాలం అబద్దాలతో సాహచర్యం చేసి
ఇప్పుడు నిన్ను రక్షించాల్సిన బాధ్యత నాది.
కానీ ఏమిటి ప్రయోజనం? ఏమిటి లాభం!?
నీవేమో చావును కోరుకుంటూ
నేనేమో నీకు వీడ్కోలు చెప్పాలని లేక