Saturday, December 23, 2017

కుశలమా నీవు .....?
నా హృదయం
ఎలాంటి వెచ్చదనమూ దొరకక
అతిశీతలత్వంతో
గడ్డకట్టుకుని పోయింది.
భావోద్వేగ రహితమై
బాధ ఆనందాల
భేదం తెలియక
మన్నన ప్రేమలకు దూరమై 


సూదులతో పొడిచినా దిగని
తెగని కఠిన చర్మం ....
ఈ శరీరం శిలలా మారి
అనుభూతుల్లేవు .... నాలో
ఏ హాని భావనా కలగడం లేదు.
ఎంతటి బలమైన పదాలతో గుచ్చినా
భావోద్వేగాలు లేకే
శరీరానికి నొప్పి తెలియడం లేదు. 


ఔనూ! నిజంగా అక్కడ్నుండి
అంత దూరం నుండి
ఆకాశాన్ని కప్పేసిన
ఆ మబ్బు పొగల్లోంచి ....
నీవు నన్ను చూస్తున్నావా?
నేను అనుకోవడం లేదు.
భావోద్వేగ రహితుడ్నైన నాకు,
నా ప్రేమకు అంత శక్తుందని

Wednesday, December 13, 2017

అది భయమే కదూనిరాశ, వ్యాకులత మబ్బులు
అన్నివైపులా అలుముకున్న
భయానక ఉదాసీనత .... అది
కాలంతో పొరాడుతున్నట్లు
ముక్కలు ముక్కలై
రంద్రాల మయమైన శరీరంలొంచి 
వేలకొద్దీ ఆలోచనల శతృవులు
వెలికొచ్చి .... వెంటాడి 
బలవంతపు హత్యకు .... గురి
కాబోతున్నప్పుడు అది మరణమే, ఆ మరణం
అలసత్వానికి నిజాయితీకి ఉరి
స్వర్గ శిఖరం చేరినా తప్పని 
పరిక్ష, ఉరిశిక్షే
బూడిద అంటిన శరీరంతో పాటు
కళ్ళకు  బూడిద రంగు పులిమి
నిలువుగా శరీరాన్ని చీల్చినట్లు ....
నమ్మకం కోల్పోయిన ఆత్మ
విలవిలా రోధిస్తూ కేకలు వేస్తూ
అనాశక్తత తలదించేలా చేస్తే

Sunday, December 3, 2017

ఆమెకు తెలియాలి అని
ఆమెను నేను
అమితంగా
ఆరాధిస్తున్నానని 

ఒక నమ్మకాన్నై
ఒక బాసటనై 
ఒక తోడునై .....

ఆమెనే విశ్వసిస్తూ
చూసి గర్వపడుతున్నానని
సంభ్రమాశ్చర్య చకితుడనై 

ఒక సౌందర్యారాధ్యదేవత
ఇంతటి అద్భుత అస్తిత్వమా 
ఆమె అని ....

మనఃపూర్వక కృతజ్ఞత
అభివందనాలు చెబుతున్నా 
ఆ సృష్టికర్తకు .....

ఆమె స్థిరనివాసం .... ఇప్పుడు
నా గుండె అను ఆనందం
అనుభూతి పొందుతున్నానని

Saturday, November 18, 2017

నా సంసారం నీవు
నెమలి ఈక పై నున్నని
మృదు ప్రియత్వం
మెరుపువు .... నీవు 


మొక్కజొన్న కండెపై
పసిడి రంగు
అలంకారం .... నీవు 


స్పష్ట నీలి పారదర్శక
నదీ ప్రవాహం
తీరే దాహం .... నీవు 


సాయంత్రపు నీలి ఆకాశం
గాలి తెమ్మెరల
స్వచ్చ శ్వాసవు .... నీవు 


హృదయ భావనలు
నక్షత్రాల వరకూ
వ్యాపించిన శాంతివి .... నీవు 


అలజడి మానసానికి
ఉపశమనాన్నిచ్చే
పవిత్ర నిశ్శబ్దానివి .... నీవు 


ఊహలకందని
అద్భుత సౌందర్య
అయస్కాంతానివి .... నీవు 


నన్ను నేేను
కోల్పోయిన క్షణాల
విజ్ఞతవు .... నీవు 


భయం
అదుపులో ఉంచుకున్న
ఆత్మ స్తైర్యానివి .... నీవు 


నీ ఆఖరి క్షణం వరకు
నా తోడై ఉన్న
నా ప్రాణవాయువు .... నీవు

Wednesday, October 4, 2017

వైరమైనా దూరమైనాఇష్టమే నాకు అన్నావు 
మన మధ్య 
ప్రబలిన ఈ దూరం ఈ వైరం ....
తగ్గే అవకాశం కోసం 
ప్రయత్నిద్దాం అని  

కానీ, గుండె గోడల్లోకి 
యింకి
సిరల్లో కి 
ధమనుల్లోకి వ్యాపించిన 
రాగబంధం మనది  

అలా అనుకోవడం 
భ్రమేమో అనుకుని 
ఝటిలం చెయ్యొద్దని   
సమశ్యను 
సాగదీయొద్దన్నావు 


నీవే .... 

ఈ వైరం ను, 
ఈ దూరం ను సమాధి చేద్దాం! 
పెరక్కుండా ఉండేందుకు .... 
తప్పదనుకుంటే  
విడైనా పోదాం అన్నావు 

అలాగే జరిగింది. 
నీ కోరిక మేరకే  

ఇప్పుడు మనం 
ఒకరికి ఒకరం 
ఏమీ కాని 
నీడలం అయ్యాము 

కాన ఏదో వెలితి 
అస్పష్టత .... అది 
నీ ముఖం పై 
ఆ చిరునవ్వును చూసే 
అది నిజమా అని 

నా గుండెలో మాత్రం 
ఆరని అగ్ని అశాంతి .... 
జ్వాలలు రగులుతున్నాయి. 
నీ, నా హృదయ బంధం 
సమాధి చేయబడిందని  

Wednesday, September 6, 2017

న్యాయంగా ఆలోచిస్తేభావోద్వేగం వూట ఊరి
బొట్లుబొట్లుగా జారుతుంటే
బహుశ
నీ ఉంగరాల జుట్టే
కారణం అనుకున్నా 

చెరువు వైపున
కిటికీలోంచి 
చల్లని గాలితెమ్మెరొకటి 
వెన్ను వద్ద తచ్చాడి
ఒళ్ళు జలదరించేంత వరకు 

నీవు నాదానవు

నీవే, అంతరాంతరాల్లో పెరిగే
భావొద్వేగాల మూలం అని 
పరీశీలించి తెలుసుకున్నా 
ఈ నిగూఢ ఉద్రిక్తతలన్నింటికీ
కేంద్రం నీ కళ్ళు అని 

Friday, September 1, 2017

మోమాటపడని వేళగులాబి అందం
హానికరం
చూపులతో తడిమినా
గుచ్చుకుంటూ
ముల్లు

సహజ రూప
అయస్కాంత గుణం సుమా
ఉద్వేగ అవగాహన
బలహీన నిస్సహాయత
ప్రేరణై నీకు

Thursday, August 31, 2017

నిరర్ధక జీవి
ఎక్కడో శిశువు ఏడుపు
చల్లని రాత్రి.
కటిక చీకటి,
కన్నతల్లి శుభాకాంక్షలు
దూరదేశం లో ఎక్కడో ఉన్న
కానరాని బిడ్డ క్షేమం కోసం

ఎవరికి తండ్రో అతను ....
ఒక అనాద శవం
అక్కడ .... పంచకూలా లో,
నీడ కొల్పోయిన కుటుంబం అబాండం
ఒంటరిగా వదిలెళ్ళాడని
అతనలా వెళ్ళుండాల్సింది కాదని

సంసారం పట్ల బాద్యత ....
బార్యపై ప్రేమ,
ఒక స్త్రీ కోరుకునేది .... అంతే
స్నేహితుల ప్రభావమో కుతూహలమో
ప్రత్యక్ష సాక్షవ్వాలని
తన్నే కోల్పోయిన నిరర్ధకతతను

Friday, August 4, 2017

దోష భావనఏ కాగితంపైనా విదిలించని 
అబద్ధాలే అన్నీ
నిజాయితీని చిందని ఈ సిరాలో ....

సంక్లిష్ట పరిస్థితులు మాత్రం
సూచించబడి .... కొన్ని తప్పులు
కొన్ని కర్మఫల దోషాలుగా

రక్తం రుచి మరిగిన
మనో వికారపు పరివర్తన లా
అస్పష్ట అక్షరదోష ప్రచురణలే అన్నీ

ఈ విపరీత భావనలు ప్రతిబింబిస్తూ 
అక్కడక్కడా .... కొన్ని
పగులు అద్దాల చరిత్ర పుటలు

రెచ్చగొట్టని పెరిగిన అకారణ పగ లా  
సమీపంలో .... చిరునామా లేని 
ఒక అపవిత్ర శిశు సమాధి

Wednesday, August 2, 2017

ఎవరు నాటారో గాని
నా ప్రియ
భావనలను,
జ్ఞాపకాల
గతం లోకి వెళ్ళి 
వెలికి తీసుకొచ్చినట్లు ....
ఉంచిన ....
ప్రతి కళాత్మక
చిత్రభంగిమల్లోనూ 
నీవు మాత్రమే
కనిపిస్తూ   ఐతే
గుర్తించలేని విధంగా 
కాలి బూడిదై
దూళై
మట్టై
ఆత్మ భాగమైన
ముఖాలేవో 
పరామర్శిస్తున్నాయి.
అన్ని ప్రశ్నల సమాధానం
నువ్వే అన్నట్లు

Wednesday, July 19, 2017

కోల్పోయాకే తెలిసిందివయసు మీద పడ్డాకైనా తప్పించుకోలేము .... గతపు పీడలనుంచి అని
పగిలి, విరిగి, నాశనమైన అస్తిత్వం పునాధులపై చదికిలపడాల్సొస్తుందని
కట్టెలపై భగ్గుమని మండాల్సిన
ఒకనాటి ఎండి రాలిన ఆశల కన్నీళ్ళ కలల శరీరావశేషాలపై
ఎంతో పటిష్టంగా నిర్మించుకున్న .... ఊహల సామ్రాజ్యమే
బానిస జీవనంగా అవిష్కారం ఔతుంది పరిణామక్రమంలో అని

ఎన్ని అవరోధాలు ఎన్ని ఎదురుదెబ్బలు ఎన్ని వినాశన చ్చాయలు
గతం లో, ఈ ఎద లో, శూన్యం అనేది లేని ఈ నగరపు ఒంటరితనంలో
ఈ నిరాశ నిస్పృహల్లోంచి నీతో కలిసి .... ఒకప్పటి గతం లో
పంచుకున్న ఆ ఆనందానుభూతుల జ్ఞాపకాల్లోకి జరగక తప్పక
మనము కలిసి గడిపిన నిన్నటి వేళల ఆ ఉన్నత ఆశయాల
ముద్దు ముచ్చట్ల పరిపూర్ణానందం .... విఫలపయత్నమే అని   ఎవరికోసమూ ఆగని కాలగమనంలో పునర్నిర్మాణావశ్యకత పెరిగి
జీవితానుభవసార అవసరాల కిటికీలోంచి చూడటంతో పాటు
నూతన సామాజిక ప్రాపంచిక మార్పుల ఆలోచనల గవాక్షంలోంచి
ప్రతిదీ నెమ్మదిగా సులోచనాలతో చూడటం ఆవశ్యకత అయ్యి
జీవన యానంలో కాలంతో పాటు  తప్పనిసరైన
మార్పు దిశగా పునర్పురోగమనానికి ఉపక్రమించక తప్పదు అని

Saturday, July 15, 2017

నా కలల్లో
పరవశ ఆనందాలం .... మనం
అన్ని వేళలా .... ఎక్కడ ఉన్నా
నా ఎదురుచూపులు .... అన్నీ
నిన్ను కనుగొనాలనే
నీకై పుట్టిన ప్రియభావనను నేను అని
నీ చెయ్యందుకుని
మృదువుగా నిన్ను స్పృశించాలనిపించే
నీ లోపలి .... వింత అనుభూతిని నేను
మంటల్లో కాలుతున్న విరహవేదనను పొందినా
బహుశ అందుకేనేమో ....
గొంతు పెగలని .... ఈ బలహీనత
నీవే నా ప్రేమ, నా ఆత్మ,
నీతోనే .... నా పరిపూర్ణత అనేనేమో
అన్నివేళలా అనురాగం తో
నిన్ను బంధీని చెయ్యాలి అనిపిస్తూ .....
కానీ మాట్లాడలేను.
అంతటి మదుర మనోజ్ఞతవు .... నీవు
నీవే నా స్వేచ్చవు, నా దానవు
నా వాస్తవాతీత గాథవు
కేవలం అది కలలో మాత్రమే అయినా

Sunday, July 9, 2017

కలలతో కలిసి విశ్రమిస్తే ....అరతెరిచిన కిటికీ లోంచి 
కలలు కొన్ని 
చిరు శబ్దం చేస్తూ 
వీధిలోకి జారుకున్నాయి  

నక్షత్రాల సమూహాలతో 
నిండిన ఆకాశం వైపు ....
బహుశ, ఆ నక్షత్రాల సరసన 
విశ్రమించేందుకనేనేమో  

అంతలోనే పిల్లగాలి తెరొకటి 
సున్నితంగా 
నా శరీరాన్ని తడిమి  
ఆత్మను తట్టింది 


నెమ్మదిలేని నా మదిని 
అభ్యుదయేచ్ఛతో నింపి ....
కలలపై ఇంద్రధనస్సు రంగు  
గమ్యాలను అద్ది  

కనీసం అందువల్లనైనా నేను 
స్థిమిత పడొచ్చని 
అక్కడ ఆ పక్కనే 
అదే అంతరిక్షం లో  సేదదీరితే     

సడిచెయ్యకుండా 
నిశ్శబ్దంగా 
ఆ నక్షత్రాలు, కలలతో కలిసి 
విశ్రమిస్తే ....

Tuesday, June 20, 2017

జాగ్రత్తమనమేమీ విశేషాలము కాము 
అలా అని వస్తువులమూ కాము

నావరకూ నేను ....
ఒక నటుడ్ని
ఒక రచయితను
ఒక కవిని
ఈ జీవన రంగస్థలం పై
మున్ముందు ఏమి చేస్తానో
తెలియని అశాంతి
అన్నీ పొందాలనే తపన తోడుగా  ఏదో ఒకటి
ఎప్పుడైనా రాస్తూ
ఎక్కువగా నటిస్తూ ఉన్న
ఒక కర్మణిక్రియను .... నేను

పొరపాటున నీవు గాని
నిన్ను .... ఎప్పుడైనా
విశేషానివి అనుకునేవు
బంధించబడుతావు
అసంతృప్తి ఆశయ జంజాటంలో

Friday, June 16, 2017

చీకటి నీడలు
నెమ్మదిగా శ్వాసిస్తూ ఉన్నాను.
భూత వర్తమాన భవిష్యత్ కాల
రహశ్యాల గుసగుసలేవో వినివస్తున్నట్లు
కలల్లో కరిగి స్వర్గం చేరి వచ్చిన
అనుభూతులనేవో పొందుతూ ఉన్నట్లు

కేవలం అది కూడా ఒక చీకటి నీడే
సాయంత్రపు నీడలు సాగిన
చీకటి వేళ
లెక్కించిన నక్షత్రాలు
సూర్యోదయమౌతూనే కరిగి మాయమైనట్లు

పొరపాటున కూడా
ఆ సాహచర్య అనుభవాల్లోకి
తొంగి చూడాలని అనుకోను
ఆ ముగింపును
గుర్తుతెచ్చుకోవడం .... దుర్భరం

Sunday, May 28, 2017

పోగొట్టుకున్నా
ఎంత క్రమశిక్షణో అంతే నిబద్దత
ఒక్క క్షణం కూడా వృధా కాని
చెయ్యాలనుకున్నది చేసే లక్షణం
కానీ, నీవు దూరమయ్యాక
నియంత్రణ లేదు .... కాలం పై

ఇప్పుడు ఒక ఖర్చైపోయిన క్షణం
కాలం కదిలెళ్ళిపోయిన గతం నేను
ఇంక ఏదీ మిగిలి లేదు.
నేను మాత్రం ఒంటరిగా మిగిలి
సర్వమూ శూన్యమయమై ముంగిట 

 
క్షణాలు ఇప్పుడు మరీ వేగంగా కదులుతూ
ఎండిన చెమట తడి చారలే అన్నీ
వైరాగ్యం ఇంకిన అసహాయ
హృదయ ఉద్విగ్నతల పగుళ్ళే అన్నీ
నీవు అను బంధం ఏదో తెగి దూరమై

Tuesday, May 23, 2017

పోయినా పొందినా ....


ఒకచోట కోల్పోయి
మరొకచోట కనుగొన్నా
ఒక అద్భుతం ....
ప్రేమ

ఎవ్వరూ కోల్పోవాలని కోరుకోని
జీవన సాహచర్యం

త్వరపడీ భంగపడరాని
ఉన్నత పరిమళానందం
ప్రేమ

Wednesday, May 3, 2017

మనుగడలో మలినతగత కొన్ని దశాబ్దాల వాస్తవికత 
అన్నీ కోల్పోయిన భావన .... ఆమెలో 
కుప్ప కూలిపోయి ఏడ్చేస్తుందేమో అనిపించేలా
అతను తన సమీపంలో ఉన్న ప్రతిసారీ 
అలజడే కానీ నిబ్బరించుకునేది. 
ముఖం నిండా పులుముకుని నవ్వును 
తన మనోభావనలు అంతరంగమూనూ 
 ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడి ....
ఆలోచించిన ప్రతిసారీ ఆమెలో అమిత కోపం ....
చుట్టూ ఉన్న ఎవ్వరైనా అడిగితే 
"అంతా ఓకే నా!? ఏమైనా కావాలా!? 
నేనేమైనా చెయ్యగలనా!?" అని 
ముక్తసరిగా థాంక్యూ అని 
 తనదైన పద్ధతిలో ఒక చిన్ని నవ్వు
ఆమె ఆ లక్షణమే అతనికి అయిష్టం 
ఆ సంగతి ఆమెకూ తెలుసు 
ఆమె ఆమెగా అలా 
విలక్షణంగా ఉండటమే అతనికిష్టం ఉండదు
ఆమెకు మాత్రం తను తనుగా ఉండటమే ఇష్టం 
అతను తనను ద్వేషించినా సరే .... 
ఇంకెవరిలానో ఉన్న తనతో ప్రేమలో పడే కన్నా
అందుకే ఆమె తన భావోద్విగ్నత ఆవేశాలను 
నియంత్రణలో ఉంచుకుని .... 
పొరపాటున కూడా చెదరనివ్వని 
చిరునవ్వుతో ఎదురొస్తుంటుంది అతనికి.
ఎప్పుడైనా నిజంగా ఎవరైనా ఒకవేళ 
సూటిగా ఆమె కళ్ళలోకి చూసే ప్రయత్నం చేస్తే మాత్రం 
తప్పకుండా తెలుస్తుంది. 
 అనాటకీయ వ్యక్తిత్వంతో సమాజంలో జీవించే స్త్రీ .... 
కోరుకున్న సాహచర్యం ఎందుకు కోల్పోతుందో

Monday, April 17, 2017

నేనే నువ్వునడుస్తూ వేళ్ళే ముందు
ఒక్క నిముషం ఆగు .....
నేను ముగించేవరకైనా 
ఎంతో చెప్పాలి నీకు
అంత అసహనంగా ఉన్నాను.

నీ బూటకపు ఆటలను
బెదిరింపులను గమనిస్తూ

పశ్చాత్తాపపడక తప్పదు నీకు 

ఈ రకంగా కోపంగా 
నాకు దూరంగా వెళ్ళిపోతే
నీ కన్నీళ్ళు తుడిచేందుకు
ఎవ్వరూ లేనప్పుడు
అర్ధం చేసుకున్నా
ప్రయోజనం ఉండదు. 

నా అవసరం నీకుందని 
మనిద్దరికీ తెలుసు
గుర్తుంచుకో మానసీ
ఈ దుడుకు బెట్టు తగదు.

అతి పెద్ద తప్పిదం చేస్తున్నావు

నీ రక్తనాళాల్లో
ప్రవహించే ఆక్సీజన్ను నేను
నానుంచి దూరంగా పోలేవు
భద్రంగా నీ నాడిని పట్టుకునున్నానని
ఇప్పటికైనా గుర్తుతెచ్చుకో 

నేనున్నాను నీ తోడు అనే వారు
ఎవ్వరూ లేనప్పుడు వరకూ
మొండికెయ్యకు 
ఎవ్వరూ అర్ధం చేసుకోలేరు
నాలా నిన్ను ....

ఇన్నినాళ్ళ మన
సాహచర్య అనుభవాన్ని
నెమరు వేసుకో .... వెనుదిరిగి
అనుభూతుల్లోకి చూసైనా 

నన్ను చేరువవ్వడంలోనె
విజ్ఞతుందని అర్ధమౌతుంది.

Saturday, April 15, 2017

ఆమెఆమె ఆలోచనల్లోంచి
పుట్టలేదు ....
ఆమె అస్తిత్వాన్ని
ఆమే కనుగొన్నది
బహు నిడివైన
నమ్మదగని
కుత్సిత
జీవన రహదారిలో
నడుస్తూనే ....
రహదారి మరింత
విశ్వాస ఘాతుకంగా
విస్పోటకంగా
పరిణమిస్తూ
ఆ పరిణామక్రమంలోనే
స్వయాన్ని ....
తనను తాను
పరిపూర్ణంగా కనుగొన్నది

Tuesday, March 28, 2017

ఆనందోదయ వేళతూరుపు కొండల్లో
ఉదయించిన 
సూర్యుని
అతిసూక్ష్మ కిరణాలు
కొన్ని
మంచు బిందువులపై
పరావర్తనము చెంది
నర్తించాలి అని
నా మానసి
ముఖారవిందం పై
నవ్వు పువ్వులు
నిండుగా విచ్చుకుని

Saturday, March 25, 2017

జీవితమే ఒక మాయ


ఎప్పుడూ నీవు నా ముందే ఉన్నట్లు ఉండి
అంతలోనే సప్త సముద్రాల అవతల ఎక్కడో
ఎప్పుడూ చూసుకోనంత దూరం లో ఉన్నట్లుంటుంది.
కాళీ కడుపులో లుకలుకలాడుతూ
మెలికలు తిరిగిన పేగుల ఆరాటం ఆబలా
ప్రతిరోజూ పునరావృతమే నాకు ఈ మనఃస్థితి
ప్రతిమలా నీవు నన్నే చూస్తున్నట్లు
అక్కడ నక్షత్రాల సరసన తేలుతూ దేవకన్యలా
నవ్వుతూ ఉన్నట్లుంటుంది.
పెదాలు కదుపని మౌనం మాటలు ఆడుతూ
అయోమయం గా ఉంటుంది.
ఈ హృదయం ముక్కలు ముక్కలుగా
చించివేయబడినట్లు అణువణువులోనూ అసంతృప్తి
ఎద మదిల మధ్య తీవ్ర పెనుగులాట
ప్రతిరాత్రీ నేను నిదురిస్తూ
పిల్ల గాలిలా నీవు నా కలల్లోకి వచ్చి
మయూరిలా నాట్యమాడుతున్నట్లుంటుంది.  


అప్పుడు నిన్ను చూస్తూ .... నాలో ఆశ్చర్యం
అదో వింత మాయాజాలం
ఆలోచించగలననే విషయాన్నే మరిచిపోతూ నేను
ఆ క్షణంలో నా మస్తిష్కంలో నీవు తిష్టవేసినట్లు
నిన్నే కోరుకుంటుంది ఈ హృదయం
ప్రతిసారీ కొత్తగా ఆశపడుతూ ఉంటుంది.
అంతలోనే నిరాశపడుతుంటుంది.
అది చెడుగా ఎక్కడ మలుపు తిరుగుతుందో అని
భయం .... అందుకే ప్రస్తుతానికి
ఆలోచించడమే మానేస్తున్నాను.
ఆకాంక్షిస్తూ .... పరిస్థితులు అంత అపసవ్యంగా
అభప్రదంగా ముగియకపోవచ్చు అనుకుంటూ


Friday, March 24, 2017

ఓ మానసీ .... నిన్నే


నీవన్నావు ఒకనాడు 
నాతో ఉంటే బాగుంటుందని, ఉంటానని .... 
నన్నెంతో శ్రద్దగా చూసుకుంటానని .... కానీ 
నిజంగా నేనెదురుగా ఉన్నప్పుడు మాత్రం 
నా ఉనికిని గమనించని నీ ప్రవర్తన 
నాకొక పెద్ద చెంప పెట్టు
నేనే ఎంతగానో ప్రయత్నించాను 
నిన్ను ఆనందంగా ఉంచాలని .... వీలైనన్ని విధాల 
 కానీ నిష్ప్రయోజనం 
మనస్పూర్తిగా నీకు నాతో ఉండాలని లేనప్పుడు 
నేనుగా చెయ్యగలిగింది చెప్పగలిగిందీ ఏమీ లేక
అకారణంగా నా కన్నీరు వృధా అవుతుంది తప్ప 

ప్రతిరాత్రీ నిద్దురలోకి జారుతూ రేపైనా 
అంతా సజావుగా జరగాలనే ఆకాంక్షతో విశ్రమిస్తాను. 
మరునాడు, ఏదీ మారదు నీ నా దూరంలా ....
చివరికి నేను గ్రహించిందొక్కటే 
 మార్పు, మనశ్శాంతి అసాధ్యం అని నీతో

Thursday, March 23, 2017

ఇంత అర్ధరహితమా జీవితం


ఇక్కడ, ఈ ఒంటరి తనం చీకటి లో
ఈ దుఃఖము, ఉదాసీనత, వ్యాకులత 
నిశ్శబ్దం నిండిన గది
లేని ....
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వింటున్నాను
నిన్ను స్పర్శించాలని చూస్తున్నాను
చేతితో గాలిని స్పర్శిస్తూ
అది నువ్వే అని
ఈ హృదయం ఒంటరిగా
ఒంటరితనం అనుభూతిని పొందుతూ 

ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది
నా చుట్టూ ఎవ్వరూ లేరా అని
నన్ను నన్నుగా గుర్తించి
నాతో సహచరించే తోడు
ఎంత ప్రాదేయపడినా క్షమించని సమాజం
గాలి లేదు .... ఉక్కపోత,
ఏడుపురాదు .... నిర్లిప్తత జీవితం ఇంతేనా అని
ఖాళీ గా అస్తిత్వం శూన్యమా అని 


ఒకప్పుడు ఎప్పుడూ నీతోనే అని 
సంరక్షిస్తామన్నవారు ఎక్కడికి పోయారో 
ప్రాణంలో ప్రాణంగా ఉంటామన్నవారు
ఈ చీకటిలో ఒంటరిని చేసి నన్నిక్కడ
తపించి అలమటించి మౌనంగా విలపిస్తుంటే ....
ఇంతేనేమో జీవితం
దుఃఖ, ఉదాసీనతలతో  
వికటాట్టహాసం చేస్తూ ఎప్పుడూ

Saturday, March 18, 2017

కలల ఎడారిలో కన్నీటి సుడులు


తుప్పుపట్టిన ఇనుపరెక్కల
సీతాకోకచిలుకనులా
అందవిహీనుడ్నై ఆకర్షణారహితంగా  
దుమ్ము దూళిమయ
చీకటి ఆచ్ఛాదన రూప లక్షణ  
అనాగరికత దుస్తులు తొడుక్కుని
శ్వాస భారమైన నన్ను చూసి
నవ్వుకుంటుందేమో నా మానసి స్వర్గంలో

నాలో మానసిక తుఫానును సృష్టించి
నన్ను ఛిన్నభిన్నం చేసి
స్పష్టత ఏకాగ్రత నిండిన నిష్కల్మష
అమాయక ప్రవర్తనతో చేరువై 
తన ఆలోచనల బంధీనైన నన్ను
తన ప్రేమకు ఆజన్మ ఖైదీని
అశక్తుడ్ని చేసి వెళ్ళిపోయి  
నా ఆక్రోశం వినబడనంత దూరంగా 


ఇప్పుడు నేనో నిరుపయోగ వృక్షాన్ని
నా నిశ్చలస్థితిని భరించలేని
నా చేతులు శాఖలు ఆయుధాలుగా మారి
నేనో కర్మయోగిని 
భాషాశాస్త్ర భావనల వస్త్రధారిని
నా మానసి మనోఉద్విగ్న భావనలతో
ఈదుతూ ఉన్నాను జీవ సాగరాన్ని
పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయి

నా మానసి ఉద్దేశ్యం కోరిక ఏమిటో
నేను ఎలా మారేనని అనుకుందో
ఆఖరి క్షణంలో ....
మార్పు జీవనం సాధ్య పడునని నాలో ....
నాకే తెలియని వణుకు
నా శరీరాన్ని కుదిపేస్తూ
చిక్కుకుపోతున్నాను .... తన గురించిన
అనంత ఆలోచనల కన్నీళ్ళ సుడిలో

Monday, March 13, 2017

ఏమౌతుందో అని
కోల్పోవాలని ఉంది ఈ అస్తిత్వాన్ని
నిన్ను కలవలేని జీవితాన్ని
ఇన్నినాళ్ళూ ఎదురు చూసి చూసి
అలసిపోయానని చెప్పాలనీ లేదు
కానీ .... అనిపిస్తుంది
జీవించాలని లేదని .... అగమ్యుడ్నై

విశ్రమించేవేళ ఎప్పుడూ
నిస్సహాయత విసుగు అనినిపిస్తుంటుంది.
ఒకవేళ అనాసక్తత పెరిగిందేమో అని ....
అలా అనుకోగానే ఉక్కిరిబిక్కిరౌతాను
జీవితమంతా విసృత ఆలోచనల అపసవ్యతల
అవశేషాలై మిగిలినట్లు .... ఉద్విగ్నుడ్నై

గొంతు గళముతో నా పొడి పెదాలపై
నీ పేరును కూడ పలుక్కుంటుంటాను
అమృతం అద్దిన అనుభూతిని పొందాలని
అది గరళమయమైనట్లై
నిలువునా చీల్చిన మరణానుభూతిని పొందుతుంటాను.
చివరి శ్వాసకై నిన్ను ప్రాదేయపడి
నీపై వాలిన నీరసజ్ఞాపకమై మిగులుతూ

అది అబద్ధమే ....
ఒకవేళ అన్నీ సజావుగానే అని
నమ్మబలికినా ....
లేదు నేను బాధ పడ్డం లేదు అని
అంతా సవ్యమే అని
ఎవరితోనైనా నేను ఒట్టేసి చెప్పినా
అది నవ్వుకోవాల్సిన అబద్ధమే

అదుకే ఈ అనురోధన, నేను మరణించినా
నాకోసం నువ్వు కన్నీరు కార్చొద్దు
బాధ పడొద్దు, ఒకవేళ అలా కాకపోతే
ఆ క్షణాల్ని ఊహించలేను ....
స్థిమిత పడలేను, రాజీ పడలేను.
ఈ ప్రపంచమంతా ఏకంగా మీదపడి .... ఎక్కడ
బ్రతికి బట్టకట్టనీయదో నిన్ను అని

Sunday, March 12, 2017

అపరిపూర్ణత


కళాత్మకమైన 
ఏ చిత్రమైనా చెబుతుంది 
శత సహస్త్ర అర్ధాలు

మనము అనే ఇద్దరిలో ఒకరిని 
కాలమే అయినా ఎవరైనా 
ఏకమైన మనలను .... చీల్చితే 


రెండు సగ భాగములుగా 

ఏ సగభాగమైనా 
ఏమని అంటుంది నీతో 

నా నా మనోభావనలు 
అస్తిత్వ, అపరిపక్వ 
అగమ్యతలను గురించి

Tuesday, March 7, 2017

విలక్షణత ప్రేమచెట్టు కొమ్మ, ప్రేమే
ప్రపంచం అని నమ్మిన
ప్రేమ జంటకు ....
కాలం, శూన్యం అంటే
పరిహాసం

ప్రేమే, పగలు
రాత్తిరి అని
ప్రేమే, సూర్యుడు
చంద్రుడు
నక్షత్రాలు అని ఆ జంటకు
ప్రేమే, సూర్యవర్ణము,
ఔన్నత్యము,
చిత్రమైన
వింత పరిమళమూను

సామాన్యత లోంచి
క్లిష్టత లోకి
పరిణామం చెందుతూ
ఊపిరాడనియ్యని విలక్షణత
ఆలోచనల సుడి, ప్రేమ