Wednesday, May 3, 2017

మనుగడలో మలినత



గత కొన్ని దశాబ్దాల వాస్తవికత 
అన్నీ కోల్పోయిన భావన .... ఆమెలో 
కుప్ప కూలిపోయి ఏడ్చేస్తుందేమో అనిపించేలా
అతను తన సమీపంలో ఉన్న ప్రతిసారీ 
అలజడే కానీ నిబ్బరించుకునేది. 
ముఖం నిండా పులుముకుని నవ్వును 
తన మనోభావనలు అంతరంగమూనూ 
 ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడి ....
ఆలోచించిన ప్రతిసారీ ఆమెలో అమిత కోపం ....
చుట్టూ ఉన్న ఎవ్వరైనా అడిగితే 
"అంతా ఓకే నా!? ఏమైనా కావాలా!? 
నేనేమైనా చెయ్యగలనా!?" అని 
ముక్తసరిగా థాంక్యూ అని 
 తనదైన పద్ధతిలో ఒక చిన్ని నవ్వు
ఆమె ఆ లక్షణమే అతనికి అయిష్టం 
ఆ సంగతి ఆమెకూ తెలుసు 
ఆమె ఆమెగా అలా 
విలక్షణంగా ఉండటమే అతనికిష్టం ఉండదు
ఆమెకు మాత్రం తను తనుగా ఉండటమే ఇష్టం 
అతను తనను ద్వేషించినా సరే .... 
ఇంకెవరిలానో ఉన్న తనతో ప్రేమలో పడే కన్నా
అందుకే ఆమె తన భావోద్విగ్నత ఆవేశాలను 
నియంత్రణలో ఉంచుకుని .... 
పొరపాటున కూడా చెదరనివ్వని 
చిరునవ్వుతో ఎదురొస్తుంటుంది అతనికి.
ఎప్పుడైనా నిజంగా ఎవరైనా ఒకవేళ 
సూటిగా ఆమె కళ్ళలోకి చూసే ప్రయత్నం చేస్తే మాత్రం 
తప్పకుండా తెలుస్తుంది. 
 అనాటకీయ వ్యక్తిత్వంతో సమాజంలో జీవించే స్త్రీ .... 
కోరుకున్న సాహచర్యం ఎందుకు కోల్పోతుందో

No comments:

Post a Comment