Thursday, October 31, 2013

ఈ నిశ్శబ్దం ...

దేశ, 
రాష్ట్ర .... 
ప్రాంతాల 
సూచిక లో 
ప్రస్తుతం 
శాంతి 
నెలకొని ఉంది. 

నా గుండె 
కొంచెము కొంచెముగా 
ప్రశాంతతను 
నిశ్శబ్దం .... 
రాత్రి నుండి
త్రాగుతుంది.  

బాష్ప వాయు ప్రయోగాలు, 
తుపాకులు పేలిన చప్పుళ్ళు ....
అరుపులు, 
కేకలు లాంటి ....
అసౌకర్యాల కు దురంగా, 
నా అవసరాలకు 
అణుగుణంగా .... బాగుంది.
ఈ నిశ్శబ్దం నాకు నచ్చింది. 

నీతోనే ఉండాలని ఉంది

సున్నితంగా, 
నిన్ను దరికి తీసుకుని
నీ ముఖాన అందమైన చిరునవ్వు
వర్ణాలు, ముద్దులు చిత్రించాలని ఉంది.

మృధువైన
అరచేతులతో
నీ అందాల్ని తాకి
పరామర్శించాలని ఉంది.

నిక్కబొడుచుకున్న
నీ రోమాల నేల,  చర్మం పై
తియ్యని సిగ్గుల చిరుగాలినై
గుసగుసలాడాలని ఉంది.


శతృవు


పసితనం పోని
కొంటె కృష్ణుడ్నే నేను .... ఇప్పటికీ
కానీ,
అత్యంత ప్రమాదకరమైన
రాక్షసుడితో ఆటాడబోతున్నాను.
నా ఆలోచనతో

సడి చేస్తూ

ఊపిరి విడుస్తూ .... కాంతి
మెల్లమెల్లగా నల్లగా మారి 
చీకటిలో
నీ శ్వాసానుభూతి
అడుగుల శబ్దం .... దగ్గరలో
నువ్వెళ్ళిపోతున్నట్లు 

Wednesday, October 30, 2013

ఉరుములు మెరుపుల ఆకాశం

వర్షిస్తుంది. ఆ వర్షించడం లో 
ఒక ప్రయాస, 
ఒక ప్రయాణం, 
ఒక చైతన్యం, ప్రాణం ఉన్నాయి. 
అందుకే 
అనుభవించాలి ఆ వర్షాన్ని 
ఆలింగనము చేసుకోవాలి ఈ జీవితాన్ని

ఎందుకిలా?


ఔనూ! ఎందుకిలా?
ఎందుకు 
ఆ కోకిల 
మోహన రాగమే పాడుతుంది? 
ఇక్కడ 
నేను బాధపడుతూ ఉంటే ....

ఆ జంటలు, ఆ నవ్వులు
ఆ యిక యిక, పకపకల ఆనందం 
చూడలేకపోతున్నాను. 
ఇక్కడ, నా పై కోపం తో 
నా చెలి .... నాకు దూరం అవుతూ ఉంటే  

ఎందుకు 
నా జీవ ప్రణయకావ్యం 
అసంతులనంగా అసంపూర్ణంగా ఉంది? 
కాలాన్ని మించినన్నినాళ్ళు 
నేనూ ఆమె ఒకరికొకరం తోడూ నీడాగా ఉండీ

నా ప్రపంచం, ఆమె ప్రపంచం అంటూ
ఇప్పుడే, వేరు వేరు అయ్యాయి ఎందుకో? 
అగ్ని సాక్షిగా, ఏడడుగులు వేసి 
ఎప్పటికీ కలిసుంటామని,
ప్రమాణాలు చేసుకున్నాక కూడా!

ఎందుకు? ఎందుకిలా?

ఆ వెలుగును నేనే!


నేను,
నాటుసారాయి తాగిలేను.
నల్ల మందు ప్రేరణ లో లేను.

నా మనసు తపనంతా ....
ఒక అగ్నికణం,
ఒక మెరుపు,
ఒక ప్రాణం, జ్ఞానం
ఎలా జాగృతం అవుతాయో
తెలుసుకోవాలని.

నా ఉత్సాహం
ఊహకందనంత ఎత్తులో
అంచనాలు, అవధులు దాటి
గాలిలో, ఇంద్రధనస్సులా,
ఆ ఆకాశం తెరపై అల్లుకుపోతూ,
ఆ ప్రేరణకు కారణం,
ఆ జీవం .... ఆ విధ్యుల్లత నేనే!

Tuesday, October 29, 2013

వడలిన పువ్వులం

అతను వొక మెరుపై వచ్చాడు.
అగ్నిలా దహించాడు.
ఎండిన కళ్ళతో రోదిస్తూ .... ఆమె
రక్తం వర్షమై కురిసింది.
అప్పుడు,
అతను పువ్వై విరిసాడు.
అతను వొక పిడుగై గర్జించాడు.
కటువు మాటల గునపాలు
గుండెలో దిగినట్లై,
జీవితం నరకతుల్యం,
ఇక చాలు అనుకుంది .... ఆమె.
కొనితెచ్చుకున్న నవ్వుల
పువ్వులు పరిచాడు .... అతను.
ప్రతి సారీ తప్పని తంతే ఇది,
జీవ రంగస్థలం పై ....
నాటకీయ అట్టహాసం చేస్తూ,

అన్నీ ప్రేమ భావనలే


ఉపద్రవాలకు దూరంగా, 
వెచ్చదనం ఆశ్రయంగా, 
జీవితాన్నిచ్చే ఒక మంచి మనసు, 
స్వేచ్చనిచ్చే ఒక సహృదయం కావాలి. 
ఉత్తమ జీవితం అర్ధం తెలిపి 
నాతో కలిసి సహచరించేందుకు.

నా స్వంతం అయిన 
దేన్నైనా ఇచ్చేస్తా! 
ఈ జీవితం, ఈ హృదయం, ఈ శ్వాస 
నాది అనే యేదైనా 
బేషరతుగా సమర్పించుకుంటాను. 
ప్రతిగా అలాంటి తోడును పొందేందుకు.

ప్రేమించడం నేర్పి
దేన్నైనా కొంతవరకే విడమర్చి, 
నాకు నేను మార్గం వెదుక్కునేలా 
శిక్షణ నిచ్చి ....
తనున్నాననే నమ్మకాన్నిచ్చే 
ఎవ్వరూ ఎరుగని 
నను వీడని భావం శాశ్వతత్వం కోసం

అప్పుడప్పుడూ ఆలోచనొస్తుంది.
ఎవరినైనా ఘాడంగా 
ప్రేమించి నప్పుడు,
అంతా నా ఇష్టమే అనుకునేంతగా ....
వేరెవరో కూడా వారిని ప్రేమిస్తే, 
వారిని నేను కోల్పోవాల్సొస్తే, 
ఎవరైనా వారిని నాకు దూరంగా తీసుకుపోతే .... అని.

అప్పుడు, 
నా అభ్యర్ధన ....
వారికీ వినపడదు గా అని,
నా మనసు చెప్పే పదభావనలు ....
చేరాల్సిన మనసును చేరవు గా అని,
ఆ వెచ్చని స్పర్శ లో అమరత్వం కోసం 
నేను పడే తపన అర్ధం కాదు కదా అని.నీవు మరిచిపోయావేమో

నాకింకా గుర్తుంది. 
విహారయాత్రలకని మనం 
నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు 
దిగువన కనవిందైన
ఆ ఎత్తిపోతల మనోహరం దృశ్యం 
మంచు శీతలం తుంపరలలో 
ఆనందం తో మనసులు నర్తించుతూ,

నేతల ఆలోచనల దృష్టి కోణం 
ఉద్యమాల బాట అయి 
సామాన్యులం మనం రోడ్లమీద 
వంటా వార్పూ
ఇల్లూ ఒళ్ళూ గుల్లచేసుకుని 
దారిద్ర్య రేఖ దరి చేరుతూ 
మన మధ్య, అర్ధం కాని
వింత నిశ్శబ్దం తాండవిస్తూ

మన నుదుటి రాతల 
చెమట నీరు
కళ్ళలోకి జారుతూ
అనర్ధకర వ్యాఖ్యల మంటలు 
ద్వేషాగ్నిలో మండిన 
నివాసాల .... భయం నీడలు 
లెక్కలేని, లెక్కకురాని ఆ కన్నీళ్ళు 
ఇంకా కళ్ళముందు కదులుతూ ....Monday, October 28, 2013

ఏకాంతం

మనసు మెచ్చేట్లు బ్రతకాలని. 
కానీ, ఈ సమాజం 
నా రహశ్య జీవనం లోకి 
ప్రాకుతూ, 
మీదిమీదకు వచ్చేస్తుంది. 
నా బ్రతుకును నిర్ధారించేందుకు.

ఎంతో దూరం పారిపోలేను. 

చెట్టు ను కాని. 
యాంత్రికంగా బ్రతకలేని, 
శిలను కాని నేను. 
మార్పు దిశగా కదిలే 
అడుగుల పడే చేతనత్వం ఉనికిని.  

ఏకాంతం దూరమై ఇక్కడే దొరికిపోతాను.

జీవితం తెర మీద ....

ఎప్పుడూ తప్పులు చెయ్యడం 
విచారించడం మాత్రమే కనిపిస్తుంది. 
ఏదీ, 
అర్ధవంతంగా కనిపించక. 
ప్రతిసారీ 
అయోమయావస్థలోకి వెళ్ళడం. 
జీవన అందం, 
ఆనందం, అనుభుతుల్ని 
సృష్టించుకునె ప్రయత్నం. 
కొన్ని కోరికలు 
కొన్ని జ్ఞాపకాలు 
కొన్ని భావోద్వేగాలు .... 
రేపటి కోసం దాచుకునే ప్రయత్నం. 
దేన్నీ చీకట్లో సమాధి చెయ్యలేక. 
కొన్నిసార్లు ఆ గతాన్ని ....
కాల్చెయ్యాలని ఉద్విగ్నుడయ్యి. 
ఆ జ్ఞాపకాలు, 
కొద్ది కొద్దిగా 
ఒక్కటొక్కటి గా 
తిరిగి మది పొరల్లో ఇమిడిపోతుంటే. 
తనను తాను నియంత్రించుకోలేని అతను ....
వాటినీ నియంత్రించలేక. 
ముఖం పై 
ఇప్పుడు మనకు కనబడుతున్న 
ఆ సామూహిక నగీషీ లు, 
ఆ నీడలు 
ఆ నవ్వులు 
అన్నీ 
సమాజం తెరపై 
ఒక సామాన్యుడి పాత్ర పోషణే!

Sunday, October 27, 2013

కలలోనూ నీవే


నా గానం, 
నా సంగీతం, 
నీ ఉశ్వాస నిశ్వాసల 
సాహిత్యం వినాలని 
మది తహతహ! 
నా మనోభావనలు 
అన్నీ ....
కేవలం 
నీ చుట్టే తిరగుతూ, 
నేను విపులీకరించే 
ప్రతి సంఘటన లోనూ
నిన్ను జ్ఞప్తికి తెచ్చుకునే, 
ఎద ఆవేశమే ....!
ఔనూ! 
నీవు కానిదేదైనా .... 
నేను కలగంటే కదా!?

అమరం ఆ ప్రేమ


పాత, నులక మంచం పై 
చిరుగుల .... పందిరి నీడ లో
ముసలిమనసు ఎదురుచూస్తూ ఉంది. 
ఎన్నాళ్ళ క్రితమో 
దూరమైన తోడు, 
ఆమె జ్ఞాపకాల్లో 
ఆమె ప్రేమజీవితం తొలి ఘడియలు  
కళ్ళముందు కదులుతూ

Saturday, October 26, 2013

ఒంటరిని

పుట్టేప్పుడు, ఏడుస్తూ పుట్టి
ఇప్పుడు, ఒంటరిని లా జీవిస్తున్నాను.
చచ్చేప్పుడూ, ఏడిపిస్తూ పోతానని తెలుసు.
చిత్రం! 
మనిషి జీవితం, ఈ ఒంటరి పయనం
నీకూ చిత్రం అని .... అనిపించడం లేదా!?
నాకు ....
ఈ ఒంటరి భావనల్తో విసుగేస్తుంది. 
ఒక వైపు యాంత్రికత 
యాంత్రిక ధనార్జన
మరొకవైపు ఆకలి ఆరాటం
ఆవేశం విసిరేసిన ఉగ్రవాదం
అనుక్షణం యుద్ధం .... నాలో 
తట్టుకొని .... నిలబడగలనని, లేనని. 
సార్వత్రికం చెయ్యలేని బాధ ఇది. 
ఒంటరిని నేను..

అందానికి మరో పేరు నా సహచరి


నీకు తెలుసా!
ఎప్పుడైనా
విహారానికి వెళ్ళినప్పుడు
మనం చేరువలోకి రాగానే
ఊపిరి ఆగిపోయినట్లు
ఎందరో
దృష్టిని మరల్చకుండా
మనవైపే చూస్తుండటం!?
...........
నీకు తెలియదు
వారు అలా ఎవరిని చూస్తున్నారో

నిజం!
నిజంగా నీకు తెలియదు.
నీవు,
ఒక సుందర,
సుకుమార, మధుర
మనోజ్ఞ సౌందర్యరాసివి అని.
ఎన్ని సార్లో అన్నాను.
సౌందర్య దేవతా .... అని,
..............
ప్రతి ప్రియుడి కళ్ళకు
ప్రేయసి అలాగే కనిపిస్తుంది.
అని నవ్వేదానివి.

అప్పుడప్పుడూ
వీధి చివరివరకూ నీవు
నెమ్మదిగా
నడిచివెళుతున్నప్పుడు,
ఎవరైనా
ఈలవేసి, నీ సౌందర్యాన్ని
ప్రసంశిస్తుండటం
నీవు చూడటం
సరికాదని,
...............
నీకు తెలుసా?
ఎన్నిసార్లు ఎంత ఆయాస పడ్డానో.

సూర్యోదయవేళల్లో
గజిబిజి గా,
నీ నుదుటి పై జారిన
జుట్టు తో ....
నీకు నీవు
చెత్తలా కనిపిస్తున్నప్పుడు,
నాకు మాత్రం
నీవు ముడిముత్యం లా
ఎందుకో తెలియదు.
.................
నీ మీదనుంచి
కళ్ళు మరల్చలేని క్షణాలవి.


Friday, October 25, 2013

అవిశ్వసనీయత!

ఎడతెగని ఆకలి
కాలుతున్న కోరిక  
దుష్టత్వం 
మనిషిలో 
మాంసభక్షక జంతువు 
నిద్రలేస్తూ, 
అభద్రతాభావన 

ఈ జీవితం

ఆ నక్షత్రాల లా నే మనం
మూలాలకు వేల మైళ్ళదూరం లో 
దూరం గా, ఒంటరిగా
ఒకర్ని మించి ఒకరు
స్వయం ప్రకాశం కోసం
ప్రయత్నించే ప్రక్రియ లో మట్టిపాలైఇద్దరొక్కటయ్యారు కానీ,


ప్రాకి, పోర్లాడి .... జరుగుతూ
వచ్చాడు అతను.
తన గంభీర,
తీవ్ర పదజాలంతో మది....లోకి.

మనసును సంబోధించి
అభిభాషిస్తూ,
ఆమె గుండె గోడలపై
అన్ని వైపులా తన జాడలు ముద్రిస్తూ,

అతనికి మాత్రమే తెలుసు.
ఆమె ఆనందంలో
తన ఆనందం ఎక్కడో ....
ఆలోచనల్ని ఏకం చెయ్యడం ఎలానో.

Monday, October 21, 2013

నా ప్రేమ భావగీతం


మెరుపు లా నీవు
వస్తావు, వెళ్ళిపోతావు. 
ఒక ఉదయం, 
ఒక అస్తమం లా ....
ఆ నక్షత్రాలను చూస్తూ
కదిలే ఆ మబ్బుల, 
వెన్నెల దోబూచుల్ని 
వెంటాడి .... అస్వాదించి,
నీ వాగ్దానాల 
నీడలలో నడుస్తున్నప్పుడు ....
అక్కడ
నాకు, ఎలాంటి 
స్వర్గ ద్వారం కనిపించలేదు.

గ్రహాంతరాల ఆవల


పగలు బాధ్యతల్లో తడిసి అలసిన శరీరం విశ్రమిస్తూ మనసు ఊహల ప్రపంచం అంచుల్లోకి ఎగిరిపోయింది. నా హృదయం పై తల ఆనించి .... నీవు ....
ఏవో కొత్త కొత్త ద్వనులు. ఏనాడూ విననట్లు వింత వింత గా .... పాట లా, నా తోడుగా వున్నానని నీవు చెబుతున్నట్లు, నా వెన్ను పై కదులుతూ నీ చేతులు.
అది వొక కొత్త అనుభూతి. ఎన్ని సార్లు అనుభవించినా, తపన తీరని ఆశ్చర్యం అద్భుతం గా నే వుంటూ ఎప్పుడూ ....
ఆ అలౌకికం ఆవల విశాలమైన ఆ తోటలో మత్తుగా .... నీ కళ్ళు నా కళ్ళకేవో వాగ్దానాలు చేస్తున్నాయి. నీవు పెదవులు విప్పి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నావు.
కానీ, నాలో ఆ క్షణం లో ఏదీ స్వీకరించలేని .... అచేతనావస్థ. నీ అనురాగం మాయ ఒడిలోకి జారిపోయాను.
నేను ఎప్పుడూ వింటున్న పదాలే అయినా కొత్తగా వినిపిస్తున్నాయి.
ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా ఒక కొత్త ఆరంభానికి కారణం శూత్రధారులం అవుదాం. జీవించి వర్ధిల్లుదాం. అని, నీవు రాసిన మనసు పాటను నేను పాడుతున్నా, ఎప్పుడో శృతి చేసిన రాగం లో

ప్రేమోదయ గీతం

బాకీపడిపోతున్నానని తెలుసు.
నా ప్రతి ప్రయత్నం, 
ప్రేరణ 
కారణం .... నీవు.
నీ 
నిశ్శబ్దం చూపుల్లో .... ప్రేమ,
నిజంలా, 
ఒక శాశ్వతత్వం లా. 
సామాజిక ప్రాణినై, 
మాట్లాడగలిగి ....
అన్నీ అందంగా చూడగలగడానికి  
కారణం .... నీ ప్రేమ.
నన్నెన్నడూ వొదిలి వెళ్ళ లేదు. 
నీవు ....
నా కళ్ళముందో, 
కలల్లోనో ఉంటూ వున్నావు. 
ఎన్నో 
ఏకాంత స్థలాల్లో తిరిగాను.
కానీ, 
నేను ఒంటరిని కాను.
ఒక సహచరి లా, 
ఒక దేవత లా 
నన్ను సంరక్షిస్తూ 
నీవు. 
నా కలల్లో, 
నన్ను సందర్శిస్తూ ....
అందం, 
అనుకూల చిరునవ్వుతో 
ఉదయం వేళల్లో, నిద్దుర లేస్తూ,
నీ పలుకరింపు .... 
ఒక కమ్మని పాట, ప్రేమోదయ గీతం లా, 
నా గళం లో నానుతూ ....

Sunday, October 20, 2013

చీకట్లు ముసురుతూ


సూర్యుడు 
బలహీనుడై పశ్చిమాన
సంద్యా సమయాన
ఆ చెట్ల, చిటారు కొమ్మల 
నీడలలో .... కాంతిని కోల్పోతూ
పూర్తిగా, చీకటికి 
దాసోహమవడం చూస్తున్నాను. 

నాలో బాధ, మదిలో అశక్తత తో
ఊహించుకుంటున్నాను. 
ఏదో ఒకరోజు 
ఈ జీవితమూ ఇంతేనేమో అని. 
కాంతి క్షీణించి 
పరిస్థితులకు లొంగి,
చీకటిని, అయోమయాందకారాన్ని ....
లోనికి రానియ్యడం తప్పదేమో అని.

అన్నీ నెమ్మదిగా, నాజూకుగా ....
పోగొట్టుకోవడం తప్పదేమో అని.
నిజం! 
ఇది ఒక తియ్యని బాధ 
ఒక తప్పని అందమైన విచారం!

ఆమె అతను


అతను చాలా సరదాగా, ఎంతో సాధారణంగా ఉంటాడు. చిలిపి పనులు చేస్తూ. 
అతనితో ఉండటం ఆమెకు చాలా ఇష్టం. 
తిడతారని తెలిసీ చావిట్లో కట్టేసిన లేగదూడను విప్పేసి, తిడుతుంటే బుద్దిమంతుడి లా తలొంచుకుని పడుతుంటాడు. 
దొంగతనం గా కోసుకొచ్చిన ఫలాల్ని ఆమె తో పంచుకుని తింటూ అన్నీ మరిచిపోతుంటాడు. 

ఎంత అదృష్టవంతురాలినో అనుకుంటుంటుంది ఆమె అప్పుడప్పుడూ. 
ఆమె జీవితం లో అతనే మొదటి వ్యక్తి. 
ఏనాడూ ఏ అమ్మాయినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నం చెయ్యలేదు. అతని మనస్తత్వం ఆమెకు ఇష్టం. ఏనాడూ ఎవరిలానూ ఉండాలని చూడని మొండిమనిషి కానీ నిండైన వ్యక్తిత్వం. మనసుకు నచ్చినట్లు నడుచుకుంటాడు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా.

ఆమె అంటే అతనికి ప్రేమ, గౌరవం. యాక్సిడెంట్ లో కాళ్ళు కోల్పోయినా ఆమెలో అంగవైకల్యం కనపడదు అతనికి. యాక్సిడెంట్ ముందులానే పలుకరిస్తూ. ఉడికించి ఆనందిస్తూ. ఆమె ఆనందం లో తన ఆనందాన్ని చూసుకుంటాడు. 
సమాజం, కుటుంబం కట్టుబాట్లు గౌరవం కోసం ఆలోచించడు. 
అందుకే అతనంటే ఆమెకు ప్రాణం.

Saturday, October 19, 2013

నేనూ నా రాక్షసి

తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాను.

కిచన్ రూం లోంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.

అడుగుల సవ్వడి చేస్తూ లోపలికి వెళ్ళాను.

కిచన్ ప్లాట్ ఫారం ముందు నిలబడి ఉంది సివంగి. ఒక చేతి లో చెక్క గరిట మరో చేతిలో చిన్న కత్తి ఉన్నాయి. స్టవ్ మీద గిన్నె ఉంది. గరిట తో గిన్నెలో తిప్పింది. రుచికరమైన వాసన గుప్పుమంది.
“కొత్త వంటకం లా ఉందే" అన్నాను. 

ఆమె నన్ను చూస్తూనే నా రాకను ఊహిస్తున్నట్లు చిరునవ్వు నవ్వింది.

నేనే ఉలిక్కిపడ్డాను "నేనొచ్చాను" అన్నాను గుర్తు చేస్తూ.
“ఏయ్ రాక్షసీ నిన్నే నేనొచ్చింది నీకు వంటలు చెయ్యడం రాకపోతే వంట సామానంతా తీసుకెళ్ళిపోదామని," అంటూ కుర్చీ ఒకటి లాక్కుని ఆమెకు దగ్గర్లో కూర్చున్నాను.

ఆమె కత్తి తో పచ్చి మిరపకాయల్ని తోటకూర కాడల్ని కట్ చేస్తుంది.
వెన్నను వేడి చేసి కరుగనిచ్చి ఉల్లి పాయల్ని విడదీస్తూ తన పని తాను చేసుకుపోతుంది.
సాటి స్త్రీలకు కూడా అసూయ కలిగించేలా ఆ కట్టూ, ఆ బొట్టూ, ఆ నవ్వు ముఖం, ఆ నుదుట స్వేదం .... ఆమె అందంగా కనిపించింది ఆ క్షణం లో.

ఆమె ఇబ్బందిగా కదిలింది. నా చూపులు గుచ్చుకున్నట్లు, "అవును నీకిక్కడేం పని. పోయి హాల్లో కూర్చో". "ఇది బాగా ఉడకాలి" అంది.

“అవునూ నీకీ టేజింగ్ కాలేజీ రోజుల్నుంచే అలవాటా” .... ఆమెను భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ అడిగాను.

కళ్ళతో గదుముతూ సున్నితంగా వదిలించుకుంది.

అప్పుడే చూసాను ఆమె వేసుకున్నఈ అప్రాన్ మీద అక్షరాల్ని.  "వంట ముద్దుగా .... నా చేత్తో చేస్తే” అని ఉంది.

"ఏదైనా ముద్దే నీ చేత్తో చేస్తే, ఆ అప్రాన్ అలాగే ఉండనీ .... ఇంట్లో ఉన్నంత సేపూ! అన్నాను దగ్గరకు జరుగుతూ చొరవగా.

సివంగిలోని రాక్షసి ఒక్కసారి గుర్రుగా చూసింది.

నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆ సీరియస్ చూపుల్ని తట్టుకోలేక హాల్లోకి కదిలాను.

ఆనందం ప్రతిబింబం


ఒత్తిడి తో ఏదీ సాధ్యం కాదు. 
అడుగడుగూ అవరోధకాలే అయితే,
సావధానంగా ఆలోచించక పోతే 
మనిషి, తనకు తానే అర్థం కాకపోతే.

అవగాహన అవసరమూ అర్ధమూ లేదు
సర్ధుకుని కదిలే ఉద్దేశ్యం లేక పోతే 
అనుభవజ్ఞతను మూర్ఘత్వం అనుకునే,
అహం నిలువెల్లా ఆవహించి ఉంటే ....?

జీవితం లో, లొంగిపోవాల్సిన సమయం ఒకటొస్తుంది. 
అందమైన ముగింపు చూసేందుకు 
అప్పుడప్పుడూ వేచి చూడాల్సి వస్తుంది. 
స్వేదించాల్సొస్తుంది. తప్పదు .... జీవితం కల కాదు. 

నిశ్చయంగా తెలుస్తుంది, జీవితం అందమైనదే అని
ఆమోదించే సామర్థ్యం మన మనసులో ఉంటే
జీవితమే ఒక సంతోషంగా సాగే జీవ సరళి .... 
సాటి మనిషితో కలిసి నడిచే సహృదయం మనలో ఉంటే

దయ్యం

అందమైన అమ్మాయి బొమ్మొకటి 
మునిగి, కొట్టుకుపోతూ 
వాగులో, ఆ నీటి ఉరవడి లో
జీవం లేని ఆ శూన్యం చూపుల్లో.
దయ్యమేదో ఆ శరీరాన్ని 
ఆవహించి
అందం, అలంకారం లా
గాలి కి అటూ ఇటూ వూగే 
హాలు లో వ్రేలాడదీయబడ్డ
చిన్ని చిన్ని మర బొమ్మల్లా ....
పైశాచికత్వం,
అలల ఉయ్యాలలో ఊగుతున్న 
అమ్మాయి బొమ్మను 
వాగునీటి చూరుకు ఉరేసినట్లు 
పరిక్షగా చూస్తే 
ఆ బొమ్మ అమ్మాయి వయస్సు .... 
అప్పుడు
నలబై యేళ్ళు లా .... వాగు లో
ఆ దయ్యం తేలుతూ ఈదుతూ 

Friday, October 18, 2013

సంరక్షణ

సంరక్షించుకో! 
ఆ పుటాకార దర్పణం లో
ముఖం కనిపించని, 
గాజుతోచేసిన ....
ఆ చాఱల విలక్షణత తళతళలకు 
దూరంగా .... 
నిన్ను నీవు

ఓదార్పు!

కన్నీళ్లు కోల్పోయిన 
ఆ క్షణాలని మరిచిపోలేను.
చెంప పైకి జారిన చెమ్మ 
అనుభూతిని .... గమనించి తుడిచేసే లోపే  
నా ఆత్మ నిలువెల్లా తడిసిపోయింది.
సరిగ్గా, 
ఆ క్షణాల్లోనే మేఘాలమీంచి దూకి
పరామర్శించేందుకన్నట్లు 
ఆ ఓదార్పు వర్షం జల్లులా కురిసింది.
ఆ వెచ్చదనం వర్షం లో నడుస్తున్నప్పుడు 
ఆ అభిరుచి లో 
ఆ స్నేహరాగం లో నేను నానిపోయాను.
నా శరీరం పై మమైకం అవుతూ 
వర్షం జల్లులు. నా కన్నీళ్ళు మధ్య 
ఒక రసాయనిక చర్యలో 
నా సిరలు వేడెక్కి 
మోహ భావనలేవో నా ఎదను హత్తుకుని 
సమ ఆవేశం .... 
కన్నీరు, వర్షం పన్నీరైనట్లు
ఏదో వెచ్చని అనుభూతి
కళ్ళు మూతలు పడి, 
కోరికల గమ్యం దిశ లో తడుస్తూ .... నేను.

అది నేనే .... నీలో

చూడగలిగితే చూడు నీలో, లోలోకి ....  
అక్కడ నేనే వున్నాను. ఆ అనియంత్రణను 
అరూప, అవస్తు చిత్ర ప్రేరణను .... నేను.
నీ ఎద లోతుల్లో భావోద్రేకాలను నియంత్రిస్తూ, 

స్పర్శిస్తూ, అంతరాంతరాల్లొంచి నిన్ను 
ఒక నిశ్శబ్దం ఊసును .... నేను, 
రాత్రి వేళల్లో నీవు కలల్లోకి జారుతున్నప్పుడు
సర్వం, సవ్యం అనుకునే విశ్వాసం .... కారణం నేను.

ఒంటరి క్షణాల్లో, నీ బాధ కన్నీరై ఒక్కో బొట్టూ  
నీ కణాలు విశ్చిన్నమయి .... నాపై కారుతూ
నేను మాత్రం .... అబిషేకించబడుతూ 
ఆ అలజడి, ఆ చైతన్యం కారణం .... నేను, నీ ఆత్మను

Thursday, October 17, 2013

అల్పంఒకరి ఇష్టం వొకరికి అయిష్టం.
ఆమె నాకిష్టమే అంది చివరికి. అతని ఇష్టాన్ని గౌరవించి,  
ఆమె గుండెలో మంటలు రగులుతాయని తెలిసీ.
కలిసుండలేమని తెలిసి తప్పుడు భ్రమ లో నడవడం అవసరమా .... 
విడిపోయి దగ్గరౌదాము, అదే యిద్దరికీ మంచిది అన్నాడు.
దూరమైపోయారు.
అతని ముఖాన పంతం నెగ్గించుకున్న నవ్వు
ఆమె ముఖాన తొందరపడి మనసు కోల్పోయిన మబ్బు.
నిజంగా జీవితం ఎంత చిన్నది!?

అసంపూర్ణుడ్ని

సన్నటి పొడుగాటి వేళ్ళూ, 
మోకాళ్ళవరకూ సాగిన బాహువులు, 
విశాల నయనాలు, ఉంగరాల జుట్టూ ....
ఒక పరిపూర్ణుడు. 
కారణ జన్ముడ్ని అనుకునేవాడ్ని.

వెన్ను మీద గొంగళిపురుగేదో జారి
నల్ల త్రాసు వొళ్ళంతా పాకి....నట్లు, 
ఝలదరింపు, 
ఉలిక్కిపాటు 
ఈ అసంపూర్ణత

అకస్మాతుగా ఫ్లాష్ లైట్ కాంతి 
కళ్ళమీద మీద పడినట్లై,
ఆ వెలుగు లో గమ్యం, నా నెచ్చెలి నీవు.
మరి నాకేమో .... 
నిన్ను ప్రేమించడం ఎలాగో తెలియదు. 

Wednesday, October 16, 2013

నేనింకా మరిచిపోలేదు

ఇంకా గుర్తున్నాయి. 
చెరువు లొ మనం కలిసి స్నానాలు చేసిన క్షణాలు.
పసివయస్సు లో 
ఆ అమాయక నగ్నత్వం 
పట్టుకున్న చేపలు 
చేసిన అగ్ని
అందరమూ కలిసి తిని .... 
స్నేహితులు, పొరుగింటి ప్రాణుల్లా 
కలిసి కదిలిన తేనెటీగల్లా మనం .... ఆ క్షణాల్లో, 

ఒక నిశ్శబ్ద కథానాయిక


ఆనందం కోసం, సమయాన్ని ఖర్చుపెట్టదు. 
దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న 
ఇరుగు పొరుగు వారి సహాయార్ధం 
అప్పుడప్పుడూ బయటకు వస్తుంది. 
కృతజ్ఞతలకోసం ఎదురుచూడని సహాయం చేసేందుకు,
ఆమె ఒక మంచి స్నేహితురాలు!

మల్లి పూల పరిమళం లా ప్రేమను వెదజల్లుతున్న, 
ఎప్పుడూ నిజం న్యాయం కోసం ....
పెద్ద పీట వేస్తున్న ఉన్నత జీవనం ఆమెది. 
అవసరానికి, తిరిగి సహాయ పడలేదని .... బాధపడని, 
ఆమె .... ఒక నిశ్శబ్ద కథానాయిక .... ఆ కాలనీ లో, 
ఆమె తెల్లని మనసున్న ఒక మంచి వ్యక్తి! 

ఒంటరి జీవితాన్ని సాగిస్తుంది. 
ఆమె చుట్టూ మంచితనం వృత్తాన్ని కనిపిస్తుంది. 
నిగర్వి, మోసం తెలియని, కల్మషం యెరుగని 
ఒక అందమైన వ్యక్తిత్వం ఆమె .... 
పలుకరింపు లో, ఆ చిరునవ్వులో వెచ్చదనం ఉంది.
ఐదో పదిలో పడిన జీవితం ఆమె.

మౌనంగా ఆలకించి, సమయానికి ఆదుకుంటుంది. 
ప్రతి రోజూ అవసరం వున్న ఒక్కరికైనా సహాయపడాలని 
వయసు మీద పడ్డ ముసలి వాళ్ళను, 
తల్లీ, తండ్రీ తెలియని అనాదలను చేరదీస్తుంది. 
ఆమె .... ఒక అరుదైన గొప్ప వ్యక్తి! 
పదాలను పొదుపుగా వాడే ఒక నిశ్శబ్ద కథానాయిక, ఆమె 

ఆమె లక్ష్యం .... బ్రతికి వున్నన్నాళ్ళూ 
ఒక అందమైన ఆత్మలా, స్నేహ పరిమళం పంచే మహిళలా
పొగరు లేని, మోసం తెలియని, 
కల్మషంలేని ఒక ఉన్నత వ్యక్తిత్వం, శక్తి లా ....
ఒక మంచి వ్యక్తిలా, ప్రేమమూర్తిలా .... నివసించాలని 
ఆమె లాంటి స్నేహమయి ని .... వీధి వీధి లోనూ చూడాలని!?

Tuesday, October 15, 2013

పాపం, వన్యప్రస్థానం లో ప్రేమ


ఒక మనిషి మరొక మనిషికి 
నష్టము, కష్టము కలిగించకుండా ఉండేందుకు
కనిపెట్టబడిన పదం .... 
పాపం! 
ఒక సమాజం, ఒక రాష్ట్రం, ఒక దేశం, 
స్వాభిమానము, స్వపరిపాలన, ప్రజాస్వామ్యం అయి ....
వీటన్నింటినీ కాపాడుకోవడానికి 
పోలీసులతో అంతరంగ భద్రత .... 
సైనికులతో సరిహద్దు భద్రత .... 
అనుసందానంగా కొన్ని గూడాచార విబాగాలు!
మరో కోణం లో, మనిషి ఆలోచనల్ని .... 
ఆవేశాన్ని నియమబద్దించేందుకు, 
కొందరు దేవతల రూపాలను కనిపెట్టి,
రకరకాల పేర్లతో పూజించేలా. 
లేకపోతే .... అపరాధ భావనను 
పశ్చాత్తాపం ఆవశ్యకత ను .... నేర్పడం జరిగింది.
ఆ క్షణాల్లో, ప్రేమ కు ముసుగెయ్యడం జరిగింది.
ఇప్పుడు మనం 
ఆ అలక్ష్యం చేసిన ప్రేమను కోరుకుంటున్నాము. 
నిజానికి, 
మది, ఎదల ముసుగులో ఊపిరాడక .... ప్రేమ 
ఎప్పుడో తరలిపోయింది వన్యప్రస్థానానికి.

మారుతున్న జీవితాలు

యౌవ్వనం లో పిల్లల అస్తిత్వం
ఊహలు వురకలు వేసే చైతన్య ఆలోచన
లు
ఒక ఉడుకు మది లక్ష్యం
పసి ఆవేశం అనుకోలేము.
యువత ప్రతి నిర్ణయమూ ఒక తొందరపాటని,
శ్వాస....ను బంధించినట్లు బంధించి, నిబద్దించాలని చూడటం
నిన్నటి కట్టుబాట్ల ఆలోచనల చట్రం లో ....
అది, ఒక అభద్రతాభావన!
అప్పుడు, మోదలౌతుంది.
మమకారం పిడికిలి నుండి
తప్పించుకోవాలనే పెనుగులాట.
ఒక పరిమళం లా,
ఒక భావుకురాలి హృదయం లో కవితలా,
ఒక ఆలోచన, ఒక ఆవేశం రగిలి
కిటికీలు మూసిన తలుపుల ఇంటి ....
పొగ గొట్టం లోంచి వచ్చే పొగలా
స్వేచ్చ ను పొంది, మారుతున్న జీవితాలు.

ఒక నిర్మల నిశీధము లో

ఆత్మకు, 
మది విన్నవించుకుంటుంది. 
మాటలకు అందని 
ఏ దూర గగనానికైనా ఎగిరిపోవచ్చని. 
సమాజమూ, 
కట్టుబాట్లూ చేరలేని ....
చరిత్రకు సన్నిహితం గా,
తెలియని కళల .... అందని జీవనానుభవాల 
అవాస్తవికతలను చెరిపి ....
ముందుకు, 
నీ వైపు ముంచుకు రాబోతున్న .... 
ఆ నిశ్శబ్ద, 
నేపథ్య పంక్తుల, 
ముఖాలను అలక్ష్యం చేస్తూ,  
నీ హృదయావేశం, అత్యుత్తమ దిశ వైపు 
ఈ రాత్రి, నీ నిద్ర లో, 
ఆ నక్షత్రాల సరసకు .... ఎప్పుడైనా

ఒక అందమైన వ్యక్తిత్వం ఆ స్నేహం

ఆమె ఒక స్వేచ్చాజీవి 
ఐదో పదిలో పడిన పిదప కూడా
ఒక అందమైన వ్యక్తిత్వం ఆమె 
నాకు ఆమె అంటే .... ఇష్టం, ఆమె నడవడిక,
హుందాతనం, ఆ నిండైన నమ్మకం 
నాకు ఎప్పుడూ సాదర ఆహ్వానం 
ఆమెను కలవడం నాకు సంతోషం 
చాలా సాధారణం గా సింపుల్ గా ఉంటుంది.
అందరితో కలిసిపోయే స్వభావం ఆమెది. 
వయస్సు, 
ముడతలు కనపడకుండా .... క్రీములు, 
తెల్లని జుట్టు కనబడకుండా .... డై లు వాడని, 
నాచురల్ గా వయసు కనపడాలనే .... 
ఆమె, ఒక మంచి తల్లి! 
ఒక మంచి భార్య! ఒక మంచి స్నేహితురాలు.
ఆమె హృదయం నిరంతరమూ 
ఉట్టిపడే యౌవ్వనం 
ఆమెకు జీవితం అంటే అమితమైన ప్రేమ
ఏబై ఏళ్ళు పైబడ్డాయని అనుకోలేము 
ఆమెను చూసి, 
వయస్సు కాదు, ఆమె కనిపిస్తుంది ఆమెలో. 
ఒక అందమైన మహిళ ....
ఎలాంటి ఆత్మస్తుతి, అహంకారం, 
వంచన, కపటము తెలియని 
ఒక సుందర వ్యక్తిత్వం 
గోరువెచ్చని ఆమె చిరునవ్వు లో

సమాజానికి భారం!


నమ్మకం
అంద విశ్వాసం
యుద్ధ భూమిలో
ప్రతి ఆత్మా
ఒక సైనికుడే!
సమాజం భారం తగ్గించేందుకు
పోరాడుతూ
అపరాధ భావన్ని తుడిచి వేచేందుకు. 

పిల్లలకు
సోదాహరణంగా ....
నేర్పించొచ్చు!
ఏ మత దురభిమానాన్నైనా,
ద్వేషం బీజాలు
కాలిన బూడిద గ్రందాల పై ....
అభిరుచిని పెంచే,
ఒక వ్యర్ధ ప్రయత్నం చెయ్యొచ్చు!

ఒక్కో రోజు,
ఒక్కో మతం పెద్దలు
ప్రపంచాన్ని ....
మతపరంగా విభజించి,
బానిస్త్వం నుంచి
ఆ దేవుడ్నే విడుదల చేసినట్లు, 
అప్పుడు, అప్పుడు మాత్రమే ....
అందరికీ విమోచనం కలిగినట్లు.

Monday, October 14, 2013

ప్రేమలేఖ రాస్తున్నా!ఎన్నినాళ్ళుగానో ప్రయత్నిస్తూ వున్నా 
నా చెలీ! .... నీకో ప్రేమలేఖ రాయాలి అని, 
వృధా పదాలు లేని 
నిండు భావనల ప్రేమతో 
ఎక్కడా లేనట్లు గా
విసుగేసే ప్రాసలు, శ్లేష పదాలు .... వాడకుండా 
నీ హృదయాన్ని చేరాలని ....
కానీ పదాలు తిరగబడుతున్నాయి.
ప్రయత్నించీ రాయలేకపోతున్నాను. 
నీ ఎద మృదు భావనల్ని 
నీ చూపుల అయస్కాంత శక్తి ని, 
నీ మనసు వైశాల్యాన్నీ .... వర్ణించలేక పోతున్నాను.
ఎంతో బాధ, వ్యద
భావనలతో పోరాటం ....
పక్కన నీవు లేక, ఏదో భయం 
ఆలోచనల్లో ఒంటరితనం ....
నాకు నేను సగం పిచ్చివాడ్ని అవుతూ,
పక్కన లేని నీవే నాకు కావాలి అని. 
నీ ప్రేమ కోసమే జీవించాలి అని 
నా జీవన అమూల్యానుభవానివి నీవే అని 
చెప్పి, చూపించాల్సిన అవసరం నాదే అని 
ప్రేమ బాషలో, నీకు మాత్రమే అర్ధం అయ్యేలా ....
విడమర్చేందుకు అక్షరాలు కూర్చుకుంటున్నాను.
అయినా, నా ప్రయత్నం ఫలించను, పదాలు చాలడం లేదు.

నేనే సాక్షి


అయోమయం,
భయం కారణం అయ్యుండొచ్చు!
కొన్ని స్వేదం బొట్లు నుదుటి ని చేరి
నా చుట్టూ ప్రశాంతత చోటుచేసుకుంది.
నిశ్శబ్దం, మది ని ప్రాభావితం చేస్తూ
ఉరుములు పిడుగులు లా
వకీలు నాలుక నుండి జారిపడ్డ పదాలు
నాలో దాచుకోలేని శ్వాస, ఊహకందని భయం
ఊపిరితిత్తుల్లోంచి తప్పించుకుని పోతూ,
నాకే వినపడని .... చెప్పిన సమాధానం
గాలిలో మెలికలు తిరిగి,
చిత్రం .... భిన్నార్ధం వస్తూ,
నిశ్చేష్టుడ్నై మాట రాక బోనులో .... నేను

నేను ఒక నిశ్శబ్ద వైరాగ్యాన్ని


నేను 
ఒక విరిగిన 
నిండీ నిండని పాత్రను 
నేను 
పున్నమి వెన్నెల   
అప్రసన్నత లో పుట్టిన 
ఒక అపనమ్మకం ఔన్నత్యం ను  
నేను 
చూసేవారికి 
ఒక రోగిష్టి రూపాన్ని  
మొండివాడ్ని
నేను
తరరాల 
చెడు మర్యాదల 
కలవరపాటు అభివ్యక్తిత్వం ను
నేను 
చీట్లువేసి, 
పదుగురిలో ఒకడ్ని 
శిక్ష విధించే సాధారణీకరణ 
జ్ఞానశూన్యతకు ఆజ్యం ను
నేను 
ఒక అసాధారణ 
విలక్షణ శాస్త్రవైరుద్యాన్ని 
నేను 
మానసిక వ్యధ తో 
రాలిపోబోతున్న 
క్రుళ్ళి, పుచ్చిన శరీరాన్ని
నేను 
ఒక దయ్యం 
భూతం మారురూపాన్ని 
కనీసం ఆరడుగుల లోతులో 
పూడ్చెయ్యాలనిపించే మరణాన్ని 
నేను 
వైరాగ్యాన్ని
ఖచ్చితంగా 
ఒక అంతిమ పోరాటాన్ని 
నేను 
పాపం పండిన 
పరాకాష్టను 
ఒక స్వరమేళన, ఏకతాళాన్నినీ మది తోడుగా


"దేని గురించి ఆలోచిస్తున్నావు" అన్నావు.
అప్పుడు,
నీవు నా కళ్ళలోకి చూస్తున్నావు ....
"ఎంత సేపో బ్రతకము .... ఆలోచిస్తున్నావు కదూ!?
భయపడుతున్నావు కదూ!?"
అన్నాను. నేను.
నీ కళ్ళలో కొత్తగా బేలతనం,
ఉబికొస్తూ ఆ బుగ్గలపై జారుతున్న .... కన్నీరు
నాలో....నూ అంతర్లీనంగా
చావైనా, ప్రేమైనా ఉపశమనానికి అవసరం
కన్నీరేగా అనిపిస్తూ,

Sunday, October 13, 2013

అసంపూర్ణ జీవితం!

చిన్న మఱక, 
కళంకం,
చీకటి .... అగాధం బ్రతుకు.
అంతరించిపోతే ....
కోల్పోయేందుకు ఏమీ వుండదు. 
ఒక్క గాలి లో ధూళి మినహా,

వెలుగులు మసకేసి

ప్రకాశవంత కాంతిపుంజం వొకటి
సచేతనత్వం అస్థికలశం
పగుళ్ల ద్వారా
వెలికి వచ్చి ....
నాలో వొక ఆంశ లా,
పరిసర వాతావరణం ను ప్రభావితం చేసి
అభినందించేందుకు పరుగెత్తుకొస్తున్నట్లు ....

పశుగ్రాసం మాత్రమే పెరిగే బీడు ....
తెలివితక్కువతనం శరీరం
నిండా గాయాలు,
అహం,
నిజాన్ని ఎదుర్కునే సందర్భాల్లో ....
పెరిగే తడబాటు,
ప్రతి ఆనందం చుక్క కోసం
చెల్లించే మూల్యం .... ఈ ఆకస్మిక కన్నీటి దార

Saturday, October 12, 2013

ఆవేశం!

నన్ను, నేను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తుంటే .... 
అది నీకు, మంచి చెడులపై నీవు వెలుగు ప్రసరిస్తున్నప్పుడు, 
నా వక్రీకృత ఆత్మ యొక్క అక్రమ వ్యతిరేకత లా కనిపిస్తుంది. 

నేను నేనులానే ఉండాలనుకుంటున్నప్పుడు
అది నీకు, నేను చీకటి సమయాల్లో 
హీన, అనైతిక ప్రవర్తన వాంతి చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది.

నీకూ తెలుసు మృదు పదజాలంతో మోహం మత్తును నింపి 
అసామాజిక కవితలు రాస్తూ ఉన్నది నేను కాదు అని. 
ఉన్ని లాంటి మెత్తని పదాల్ని నీలా అందంగా నేను పొదగలేనని.

బాషే కాదని బరితెగించిన పదాలు అంటున్నావు. 
నీలాంటి కుసమాజ సంస్కర్తల కు అవకాశం యివ్వను. 
సంకెళ్ళు వెయ్యడానికి, నా నోటికి .... బట్టముక్క కుక్కనియ్యను.    

నీ వస్తువు వేరు, నా వస్తువు వేరు. మన ఆలోచనలు వేరు వేరు.
ఏ విధంగా చూసినా నీవు నాకు గురువువు కావు .... ఉపదేశించేందుకు
నన్ను మార్చాలని చూసేందుకు నీ తర్కం సరి పోదు.    

ఎందుకో ఈ మధ్య ఆలోచనల్ని దృష్టి కోణాన్ని మార్చుకోమంటున్నావు. 
నన్ను పైకి లేపి నిలబెట్టి, అక్కడే కట్టెయ్యాలని చూస్తున్నావు. 
నా ఉద్దేశపూర్వక ఉపేక్ష గమనించైనా ప్రయత్నం విరమించుకోవచ్చుగా!

నా ఆవేశం రాతలు సరిదిద్దుకుంటే అకాడమీ అవార్డుకు అర్హుడ్నన్నంటున్నావు. 
అక్షరాల గారడీ చేసి పొగడ్తలతో ఆశ పెడుతున్నావు. 
నేను తిరిగిందీ, అనుభూతి చెందిందీ చీకటి జీవితాలనే అని మరిచిపోయి మరీ,.     

కోరని విధంగా జీవిస్తున్న ఆ చీకటి పసి మనసు వేదనలకు 
అక్షరరూపం యివ్వడంలో నా ఆత్మ స్వేచ్చ, నా ఆనందమూ వున్నాయని
నీకు ఎలా అర్ధం అవుతుందో, ఎలా విడమర్చాలో తెలియడం లేదు.

అందుకే మరోసారి చెబుతున్నాను. నీ ప్రయత్నం మానుకో 
నేను ఎప్పుడూ సిద్ధమే! .... అవాస్తవిక, కలల వృక్ష చ్చాయలకు దూరంగా 
స్వేదం, కష్టం, కన్నీరు, ఆకలి, ఆవేశం కవితలు రాయడానికి అని

Friday, October 11, 2013

మనోభావనల్లో మనం


హృదయం అద్దం లో చూస్తున్నా!
..............
రంగుల ఎడారి యాత్రికుల్లా,
స్వచ్ఛంద ఖైదీల్లా,
ఒక స్ఫటికాకార వంతెన పై ....
నడుస్తున్న దేవదూతల్లా,
ప్రతిదీప్తకాంతి దశల్ని లెక్కించే ....
గాందర్వ ఉత్ప్రేక్షకాల్లా నీవూ, నేను

నిర్లిప్తానందవాదం కోట మీంచి ....
దూరంగా నడిచే బావ వీచికల్లా,
స్వచ్చందంగా, ఆ మరపురాని పొరల
రహస్య పరిమళాలను భద్రంగా దాచుకుంటూ,
...............
మనము కాని ఇతరులంటే అర్ధం నరకం అని
నిష్కాపట్యముగా అంగీకరిస్తూ,
ఒక్క, నేనూ మనం అనే స్వర్గం లోనే ఉండాలని కోరుకుంటూ,పరిణామక్రమం లో


యౌవ్వనం ఆనందం రోజుల్లో 
నీ కోసం రాసుకున్నప్రేమాక్షరాలివి. 

ప్రతి అక్షరం 
ఒక అద్భుత భావ రూపం ముక్కై, 
ఆ ముక్కలన్నీ ఒక్కటై కూరి, నా హృదయం అయ్యి, 
జీవితం నాకు నేర్పిన లౌక్యం 
సిగ్గు, బాధ, కోపం, ఆనందం నటనతో .... నీ ప్రశంసలు సంపాదించాలని.
మృదువైన నీ పాదాలు, 
నీవు నడవడం కోసం ఒక కాలిబాటలా, 
నా ఆత్మ ఎర్ర తివాచీ అయి పరుచుకుని 
నీవు జారిపోకుండా అన్ని వైపులా ఒద్దికగా అమరాలని రాసుకున్నాను.

కానీ, ఇప్పుడు .... లేత పూలు నా అక్షరాలు 
ఒక సమాధి పై నిస్సహాయంగా వెదజల్లబడుతున్న కన్నీరయ్యాయి.

ప్రేమను తిరిగి చెల్లించు అనని, అపజయం అనుకోని 
తోడు లేని, ఈ సుదీర్ఘ బాధామయ జీవనం కూడా
గెలుపే అనుకుంటూ, 
ప్రేమ భావనలను అలా పరుస్తూనే, గుసగుసలాడుతూనే ఉన్నాను.
చెల్లాచెదురుగా పరుస్తూ ఆ వడలిన పుష్పాలను, 
ఎవరూ వినని నమ్మని ఈ ప్రేమ భావనల పదాలను. 

Thursday, October 10, 2013

ప్రేమ వృక్షం పువ్వులం


తప్పొప్పుల సరిహద్దులను దాటి, 
మురిపిస్తూ, మెరుస్తున్న
అద్భుత సౌందర్యం .... నా చెలి

చావు పుట్టుకలెరుగని
శ్వాస ను లా ఆమెతో కలిసి
ఆమెకు మాత్రమే వినిపించేలా .... నేను.

వెచ్చదనం, చల్లదనం
విడదీయలేని తడి, పొడీ లక్షణాలు
ఆమె పెదవి అంచుల మీద,
ఆమె స్పర్శ లో అనుభూతులు.

ఏ యుద్ధమూ, ఏ శాంతి ప్రస్తావన
అవసరం లేని, ఎవరూ
దొంగిలించలేని ప్రేమ అది.

పగలు, రాత్రులు .... ఒకేలా ఉండి,
అన్ని వేళలా సీతాకోకచిలుకలు
ఆటలాడే ఆ మనోబృందావనం లో,

ఆ .... సత్య అసత్యాల ఎడారిలో,
ఎప్పుడూ ఎండని ఆ ఒయాసిస్సు
ఆ అన్యోన్యతా సరోవరం, ప్రేమ లో
ఔనని కాదనే మొహమాటాలుండవు.

నా కళ్ళెదురు చంద్రబింబం
ఆమె ముఖం వెలుగులు ....
ప్రేమ, ద్వేషం లు లేని, గుండె వేగం పెంచే
స్వర్గ సౌరభాల పరిమళాలు.

అప్పుడే తెరుచుకుని మూసుకునే కళ్ళ కు
వికశిస్తున్న ఆమె అందం బంధం అయి
విత్తిన మా ప్రేమ వృక్షం పువ్వులమై
పదాలు, అందం ను మించిన .... పరిమళాలం కావాలని.

చందమామా! నువ్విలా?


వెన్నెలలా చొరబడుతున్నావు!
దొంగా! .... ఆ (వెన్నెల)కొవ్వొత్తి వెలుగులు తో
నా చెలిని స్పృశిస్తున్నావు!
అణువణువూ అసూయ గా ఉంది.
రాజువే నీవు, రాత్రివేళ .... ఆ గగనం లో ....
ఓ నెలరేడా!
మా ప్రేమ లో,
ప్రభవించే వెయ్యి చంద్రుడు ల .... సరి
సూర్యోదయం ఉందని మరిచిపోతున్నావు.

Wednesday, October 9, 2013

అన్నీ నేనే అని తెలుసుకున్నాను


నిజం అంటే ఏమిటి అని
తెలుసుకోవాలి అని అనుకున్నాను.
నా చర్యలు, ప్రతిచర్యల అనుభవాలు కలిసిన వాస్తవం 
నేనే సత్యము, నిత్యము
నిజము అని తెలుసుకున్నాను. 

జీవార్ధం కారణం 
తెలుసుకోవాలని అనుకున్నాను. 
మనిషై పుట్టడం
శ్వాసించడము బ్రతకడమూ మాత్రమే కాదు.
మరణించీ జీవించడం లోనే 
జీవితం ఉంది అని తెలుసుకున్నాను. 

పోరాటం, సాహసం గురించి 
తెలుసుకోవాలని అనుకున్నాను.
ఉన్నది ఉన్నట్లుగా కాక 
ఉత్తమంగా మార్చుకునే దిశగా
అనుక్షణం సాహసం ఊపిరై జీవించగలిగితే 
సాధ్యమే అని తెలుసుకున్నాను.

జాలి, దయ, కరుణ గురించి 
తెలుసుకోవాలని అనుకున్నాను.
ఒకరి అవసరాలను అవకాశాలుగా అనుకూలంగా 
మార్చుకోవడం మాత్రం కాదని 
ఆదరించి సహకరించుకోవడం ద్వారా
సాధ్యం అని తెలుసుకున్నాను.

ప్రేమ, అనురాగం గురించి 
తెలుసుకోవాలి అని అనుకున్నాను. 
సాటి మనిషిని ఆదరించడం 
అన్ని ప్రేమ రాగాలలోని ఔన్నత్యాన్ని గుర్తించడం
ప్రకృతి రాగం, ప్రేమను పరిమళించడంలో,
సర్వత్రా వ్యాపించడం లోనూ వుందని తెలుసుకున్నాను.

ఆ దేవుడు, ఈ సృష్టి గురించి 
తెలుసుకోవాలని అనుకున్నాను.
నీరు, అగ్ని, గాలి, 
ఆ ఆకాశం, ఈ నేల కలిసిన పరిపూర్ణత్వమే దైవత్వం .... 
సృష్టి కి మూలం సహనం 
నాలోనే, నేనే ఆ సంపూర్ణ మూర్తినని తెలుసుకున్నాను.


Tuesday, October 8, 2013

తియ్యదనం

నేను, 
సూర్యోదయం నవ్వుకు 
ప్రభావితమైన 
ఒక పొద్దుతిరుగుడు పువ్వు ను. 
ఆ సూర్యకిరణాల వేగుల్ని 
గమనిస్తున్నాను. 
పగ, 
ద్వేషంతో కాదు. 
ప్రేమతో, 
జ్ఞానోదయం, 
జీవనదినయ్యేదెలా అని .... 
మనిషీ! 
పువ్వును నేను 
అడవి గాలి, ముల్లును కాను. 
ఒక తియ్యని నూనెను.

వెన్నెలా, ఈ రేత్తిరి నాతో ....


నీడలు ఏకమైన సమూహం లా, చీకటి చిక్కగా
అందని అందం అలుముకుని
మదిలో .... ఈ రేత్తిరిని ముద్దాడాలని ఉంది.
చీకటి కురుస్తున్న ఆకాశం గొడుగు కింద
మెరుపుల్లా .... నీవు, నేను ఒక వజ్రాల మాలలా
నీ శిరోజాల సుఘందం మోహం 
చూపుల వర్షమై .... నా ఆత్మ లోకి ఇంకి, 
ఎక్కడా వినని అర్ధం ఉన్మత్తతేదో ....
ఆక్షేపణీయ గీతం, ఒక పెద్ద గుసగుస లా ....
ఓ చెలీ "ఉంటావా కలిసి, నాతో కలలో ఈ రాత్తిరి" అంటూ,

Monday, October 7, 2013

విజేతలమే మనం ....

విశ్వసనీయంగా .... నమ్ముతున్నా! 
మనం అనుకుంటే చాలు అని, 
ముఖాన్ని కప్పేసుకున్న 
ముసుగులు తీసేస్తే చాలు అని,  
విశ్వసనీయతకు 
చేరువలో ఉంటే చాలు 
యాంత్రిక విధి విధానాల్ని 
మానేస్తే చాలు అని,
విశ్వసనీయంగా 
మన సామర్ధ్యం  
ఆలోచన, ఆచరణత్వం 
ఆడవలసిన ప్రతి ఆటనూ 
ఆడాల్సిన సమయం లో 
ఆడటం చేస్తే చాలు అని 
నేను 
సంపూర్ణంగా సిద్దం గా ఉన్నా!
కొన్నిసార్లు నాకు నేనై 
నలుగుర్లో నాయకుడ్నయ్యేందుకు,  
కొన్ని సార్లయినా 
మనం ....
అనుకున్నవన్నీ చేయగలిగితే,
ఏదీ పెండింగ్ ఉంచకపోతే, 
విశ్వసనీయంగా మనం 
విజయానికి చేరువలో .... ఉన్నట్లే!

సరసనే నా చెలి .... నన్నాలకిస్తూనిన్నటి రాత్రి
నా చెలి నా సరసనే ఉంది.
నన్ను ఆలకిస్తూ,
నా మాటలు నిజం అని నమ్మి ....
ఇంతకు ముందెన్నడూ
ఎవరూ చూపని ఆసక్తి చూపింది.

ఒకరితో ఒకరు పంచుకున్నాం.
మా జ్ఞాపకాలను, జీవనానుభవాల్ని
మా భిన్న సంస్కృతుల, జాతుల ....
మా మనోగతాలను
ఒంటరిగా ఆమే, నేనూ ఆ నక్షత్రాలు సాక్షిగా.
నిజం గా, నిన్నటి రాత్రి
మా కలయిక ఒక మరిచిపోలేని జ్ఞాపకం

ఆలశ్యం అయ్యిందని
ఎద లోకి ఆహ్వానించాను
సేదదీరుతూ మరిన్ని అనుభవాల్ని
దాచుకునున్న జీవనానుభూతుల్ని 
కొన్ని నమ్మకాల్ని
ఎన్నో అణచివేసుకున్న, అసామాజిక
ఉద్వేగభరిత ఆలోచనల్ని కక్కేసాను.

నిన్నటి రాత్రి,
నా ప్రేయసి నన్ను హృదయం తో ఆలకించింది.
నన్ను, నా మదిమాటల్ని నిజమని నమ్మింది. 
నా సరసన నిలిచి, కలిసి నడిచేందుకు సిద్ధపడింది.
ఇంతకు ముందెన్నడూ
ఎవరూ వినడానికి ఇష్టపడని, ఆలోచించని
తీరని నా మనోభారం .... ఆలకించేందుకు నాకో తోడు దొరికింది!

అర్ధం కాని ఆబ నాలో

నేను,
నిన్ను కోల్పోయాను.
తేనెటీగ,
ఒక పుష్పాన్నీ ....
పుష్పము,
ఒక తేనెటీగ సరసం, ముద్దు
మృదు రెక్కల స్పర్శ ....
కోల్పోయినట్లు.

మార్పు ను శాసించేందుకు

సరైన సమయమే ఇది. 
మరి కొంత కృషి చేసి, 
ముందుకు ముందుకు కదిలేందుకు
నిన్నటి 
నిబద్దతల సంకెళ్ళను 
రాల్చుకుని,  
ఆశ, నమ్మకం చైతన్యాన్ని
స్వాగతించేందుకు .... ఒక కొత్త స్వాతంత్ర్యాన్ని. 
అది మంచో చెడో తెలియకపోయినా,
.........
పోరాడాలి. గెలవాలి.
కూల్చెయ్యాలి. గర్జించాలి 
యౌవ్వనం, అవేశం శరీరం ఊగిపోవాలి. 
మార్పు కోసం, 
అర్ధం కాని, వాడని చాదస్తాలు, 
బానిసత్వపు ఆలోచనలు, 
నీచ, మోస వాగ్దానాల చదలు తలెక్కక ముందే

Sunday, October 6, 2013

అది నీవే .... కాకపోతే ఎందుకిలా?


రోదిస్తున్నా! నేను, ఎందుకిలా
నిన్నొదిలి?
ఎందుకు వెళ్ళలేకపోతున్నాను?
ఎందుకిలా?
నీ గుండె స్పందనలు
నా గుండె కొట్టుకోవడంలో ....
నా కలం కక్కే
ప్రతి సీరా చుక్కలో,
నా ప్రతి భావనలో ....
నీవే ఎందుకు నిరంతరం?
ఔనూ?
నా తల దిండెందుకు తడుస్తుంది.?
కన్నీళ్ళతో
అర్ధరాత్రి వేళల్లో ....
నా నమ్మకము,
నా ప్రేమ నీవు కాకపోతే?
నన్ను వొదలని జ్వరం లా
ఎందుకిలా పట్టుకున్నావు?
అనారోగ్యము, ఒంటరితనానివై,
అది నీవే!
కాకపోతే ....
ప్రేమ అనేది ఒక అబద్దం! .... నిజం!!

జీవించేందుకే .... జీవితం


స్వీకరించాల్సిన ఒక అమూల్య బహుమానము. 
అది, ఒక ప్రేమ భావము.
ఒక ఆటలా, ఒక పాటలా ....
ఒక అవకాశంలా, పొందాల్సిన ఒక అందము. 
ఒక ఆనందం, ఒక మెచ్చుకోలు, 
అంతేకాదు. 
అది, ఒక విప్పాల్సిన రహస్యము, 
పరిష్కారం చూపాల్సిన ఒక చిక్కుముడి. 
ఒక భాదాకరమైన అనుభవము. 
కాలంతో, కన్నీటితో జరుగుతున్న ....
ఒక పోరాటము, ఒక సాహసకృత్యము
మరణించీ జీవించాలనే గమ్యమే లక్ష్యం....గా, 

Saturday, October 5, 2013

అశక్తత


ఆ కళ్ళచుట్టూ చీకటి మేఘాలు
ఆ చేతిని నా చేతిలోకి భద్రంగా తీసుకుని
అనునయించాలనుంది.
నేనున్నా నీకు తోడుగా అని
ఒక మంచి మాటేదైనా చెప్పాలి
చిగురంత వెలుగైనా ఒక్కసారి ఆ ముఖంలో చూడాలి అని 
ఉబికొస్తూ కన్నీరు 
దిగమింగుకున్న మాటలు పెగలని ఏడుపు
తెలుసు నాకు
కానీ .... చెప్పలేను
తను, నన్నూ పిల్లల్నీ వదిలెళ్ళిపోబోతుందని
అశక్తుడ్ని! అయినా చూస్తుండక తప్పని స్థితి 
మరణం ఆప్యాయంగా తనను కౌగిట్లోకి
తీసుకోబోతుందని తెలిసీ .... ఏమీ చెయ్యలేక

Friday, October 4, 2013

గజిబిజి మనోభావనలు


భావనలు, మది ఆలోచనల్లో .... 
ప్రేమ జ్ఞాపకాలను మరిచిపోయే విఫల ప్రయత్నం 
కొన్ని కన్నీటి చుక్కలు వేడిగా 
ముఖంపై రాలి 
నేను కోల్పోయింది 
అమూల్యమని నాకు నేనే చెప్పుకునే ప్రయత్నం

ఒక జీవితకాలం 
వద్దన్నా మరువలేని మనోవేదన
మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు
నిజంగా .... నిన్ను కలిసుండకుండా ఉండుండాల్సిందని. 
జీవితం లోకి నిన్నాహ్వానించకుండా ఉండాల్సిందని. 
బరువు, భారం భావనల్ని 
మోస్తూ నా మదిలోనూ నిస్సత్తువ

కొన్ని మనోభావాలు .... నాలో,
నేనింకా నిన్ను కోల్పోలేదని 
ఇంకొన్ని భావనల .... శూన్యం
నిన్నిక పొందలేదు నా హృదయం 
ఈ జీవిత కాలమూ ఈ భావనల ఒత్తిడి భరిస్తూనే ఉండాలని. 
నా మనోభావన నా కోరిక తెలుసా పిల్లా! .... నీవు తిరిగి రాకూడదు 
నాడు నీవు నాకు కలిసుండకుండా ఉండాల్సింది అని 

నిన్నో మొన్నో జరిగినట్లు


చివరి దశ 
వేరు వేరు ఒంటరిజీవితాలు 
దుర్భరం, అసాధ్యం  
జ్ఞాపకాల భారం మొయ్యడం.
నేను, నిన్ను 
దగ్గరకు లాక్కుని 
పెట్టుకున్న ముద్దు .... ముక్కలై, 
మనం కలిసి ఆఘ్రాణించిన 
క్షణాల 
అణువణువు పులకరింపులు, 
కళ్ళముందు సినిమాలా ఆడుతూ ....
ప్రేమ లొంగిపోవడం లోని, 
గెలుపు ఆనందం ఎంత మధురమో!

నీడ లేని మనుషులు

అంధకారం అలుముకున్న 
ఒక ఆలశ్యపు రాత్రి, 
పేవుమెంట్ మీద 
నడిచేందుకు అడ్డం గా, 
సగం తీరని ఆకలి మంటల అన్నార్థుల, 
నిద్రరాని ఆ నిట్టూర్పుల వెచ్చని గాలులు 
అప్పుడప్పుడు 
గురకలు గొణుగుడులై చెవుల్ని తాకుతూ

ఎందుకో ఒక్క క్షణం 
తటపటాయించి ఆగబోయి, 
మరు క్షణమే ఆగడం తప్పేమో అనిపించింది. 
రాత్రిళ్ళు 
అలా రహదారుల్లో 
డ్రైనేజీ గొట్టాల పరిసరాల్లో 
చెత్త కుండీల పక్కన నిదురించే శాపగ్రస్తులకు  
దూరంగా ఉండాలని గుర్తుకొచ్చి

నా నడక లో 
వేగం పెంచాను ఎందుకైనా మంచిదని, 
రాత్రినీ, ఆగాలనిపించిన ఆలోచనను 
పక్కకు మళ్ళించాలని 
ప్రయత్నించిన 
ఆ ఏడుపులాంటి శబ్దం
వినిపిస్తూనే ఉన్నా 
నేనే తప్పేమో అనిపిస్తూనే ఉన్నా 

నగరం నడిబొడ్డున అలా,
కాలి బాట పక్కన 
షాపుల అరుగుల మీద 
బస్ స్టాండుల్లో 
విడిచేసిన చెప్పుల్లా ఎక్కడ బడితే అక్కడ
అసౌకర్యాల అంచుల పై
ఆవర్తనల గొడుగుకు దూరంగా 
మానవత్వం ఆశ్రయం కోసం అలమటిస్తూ 
నేనెక్కడ దోపిడీ కి గురౌతానోనని భయం నాలో ....

నవ్వుతూ బ్రతకాలి


ఒక 
విరిగిన గుండె కు 
ఎటువంటి పరిష్కారమూ లేదు.

కేవలం, 
నవ్వుతూ బ్రతకడం 
మినహాయించి ....

ఆ బాధ, 
నరక తుల్యం .... 
భారం, శాపం అయినప్పటికీ.

Thursday, October 3, 2013

ఒక పులకరింపు


మంచు తుంపరలు కరగిపోని,
గాలి వేడెక్కని ....
సూర్యోదయం వెచ్చదనం 
శరీరాన్ని తాకని,
నా ప్రేమాహ్వానం
నీవు మన్నించిన క్షణం ....
నీకో ముద్దివ్వాలని ఉవ్విళ్ళూరడం 

చాలినంత


చాలు .... ఈ పగటి వేళ, ఈ ప్రకాశం
అమె తో సంబాషణ, కలిసి నడుస్తున్న అనుభవం.
చాలు .... రాత్రి కి, పై కప్పు లోంచి
గమ్మత్తుగా నవ్వే ఆ నక్షత్రాల మసక మసక వెలుతురు.

నావి పెద్ద పెద్ద ఆశలు కావు. గాలిని బంధించాలని ....
సముద్రానికి శృంఖలాలు వెయ్యాలని,
నాకు, ఆమె ప్రేమ అనుభూతి చాలు.
చాలు, ఆ మోహ....న రాగ సంగీతం నాపైనుంచి వీచడం.