Wednesday, June 29, 2016

ఒక తియ్యని అనుభూతి .... నా సొంతంఏ మాతృమూర్తో మొయ్యలేననుకుని
చెత్తబుట్టలోకి విసిరేసిన పసి ఊపిరి ప్రాణం
అప్పటి వరకూ .... ఒంటరిని నేను
తప్పిపోయి, గమ్యం తెలియని అనాధను

అమ్మే కాదనుకుందన్న బాధ
గుర్తుకొచ్చిన ప్రతిసారీ కళ్ళు నీళ్ళతో నిండిపోయి
అంతా అనిశ్చితి
చుట్టూ మసక మసగ్గా సమాజం

బోరున కురుస్తున్న వర్షంలో మార్గం కనపడని స్థితి
దూరంగా కనిపించావు .... పల్లెటూరి అబ్బాయివి
చీకటి అయోమయం లో కొట్టుకుంటున్న నాకు
ఒక ఆశాదీపం లా

నిన్ను చూస్తూనే భయం వేసింది.
నీవు దగ్గరగా వస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంది.
ఎందరో స్వార్ధ సంకుచిత మనస్కుల్ని చూసుండటం వల్ల
అంతకుముందు

మెల్లగా అనునయంగా, నిష్కల్మషం గా మాట్లాడావు
నీ మాటలు .... నాలో నమ్మకం, ధైర్యాన్ని నింపి
నువ్వందించిన చెయ్యందుకోవాలనిపించేలా
నా హృదయమే నీదైనట్లు ....

ఇప్పుడు, నాకు సమాజము, విషపు జీవులు అంటే
ఎలాంటి భయం లేదు .... ప్రకాశవంతమైన నీ సాహచర్యంలో
నా గమ్యం నాకు స్పష్టంగా కనిపిస్తూ
నా జీవనయానం లో దిక్చూచి దొరికిన అనుభూతి

అభాగ్యత
తడి ఆరిన కన్నీటితో నిచ్చెన, 
అనుభూతులతో ఆనకట్ట .... 
వెయ్యగలిగితే ఎంత బాగుణ్ణు 
నిన్ను వెతుక్కుంటూ స్వర్గానికి రాగలను 

ఏ అనునయవేళో బుజ్జగించి, ముద్దాడి 
నా లోకానికి .... 
ప్రేమ వాసానికి తీసుకురాగలను 

కానీ, 


అనుభూతుల స్మృతులు 
కన్నీరు చారలే అన్నీ 

కాలచక్ర గమనం లో 

నేను దూరంచేసుకున్న రూపం, 
పరిమళాలే గుర్తుకువస్తూ 

చిరునవ్వు, లాలన 
నీ సాహచర్యం, 
నీ సాన్నిహిత్యం లేని జీవితం 
భరించీ జీవించలేని శూన్యంగా మిగిలి 

Tuesday, June 14, 2016

వినిపించుకోదుఎప్పుడూ అంటుంటుందామె

మాట్లాడుకోవడం లో
సామరశ్యం  

మాట్లాడుకుందాం
అని

నిజమే!

ఎన్ని నాళ్ళయ్యాయో 
గొంతుదీరా మాటలాడి .... కోరిక
తీరుతుంది అని .... ఆశ

కానీ, అవిరామం గా 
ఆమె మాట్లాడుతూ

అర్ధం అయ్యేసరికి .... 
ఆలశ్యం అయ్యింది.

వినడం మాత్రమే
నాకు సాధ్యం అని,


Friday, June 10, 2016

గాయపడ్డ గాయం .... నేనునేనే కారణం
ఏడుపుకు 

కనిపించని
రక్త స్రావానికి 

ఎన్నో
మేలుకొనని కలలకు 

నిదురించలేని
నొప్పికి

నేనే
అనుమానం ఆశను 

అధోలోకం
అగాధం ను

నేను బ్రతికిలేను
ప్రేతాన్ని కాను

భావాలకు అందను
పదాల్లో అమరను

మరపురాని
రాయబడని కావ్యం నేను

సమాధానం లేని ప్రశ్ననుచిక్కని చీకటి
కష్టంగా ఉంది శ్వాసించడం
కదలాలని ప్రయత్నించడం
ప్రయత్నించే కొద్దీ
లోపలికి లాక్కునే ఊబి లా
సమశ్యల మయ జీవితం
ఎవ్వరూ
సమశ్యల్లో జీవించలేరు .... భరిస్తూ
మూలుగుతున్నాను.
నేను మూలుగుతున్నట్లు నాకు తెలియదు
కానీ వినిపిస్తుంది.
దూరంగా పారిపోవాలనే .... అభిలాష
నా ప్రయత్నం నిష్ఫలం అని
ఎన్నో ప్రయత్నాల పిదపే
తెలుసుకున్నాను .... చాలా ఆలశ్యంగా
నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.
నా శ్వాసల శబ్దం పెరిగి పెరిగిపోతుంది.
పరిసరాలను ఆవహించుతూ ....
కళ్ళు మూసుకున్నాను.
దొర్లిపోతున్నాను.
నిన్నటి ఆలోచనలు జ్ఞాపకాల్లోకి
అదే నా ఆఖరి శ్వాస అని ....
నాకు తప్ప ప్రతి ఒక్కరికీ తెలిసేవరకూ

వెళ్ళొస్తా

తెల్లని పొగమంచు లోంచి
ఆలాపనలా .... పిలుపు 


రా రమ్మని ....
సమ్మోహితుడ్నై 


వాస్తవంలోంచి
లోతుల్లోకి అగాధాల్లోకి 


కలల్లోకి 

ఎక్కడున్నానో తెలియని
తిరిగి రాలేని .... అథోలోకం అంచు వద్ద 


జారెందుకు సిద్ధం .... గా,

వెళ్ళాలా వద్దా
అందమైన ఆ అంధకారం లోకి అని 


ఊగిసలాడుతూ
ఉత్సుకత ఉద్విగ్నత .... నాలో 


దయచేసి
ఎవ్వరైనా నన్ను లేపుతారేమో 


ప్రయత్నిస్తారేమో
రక్షించేందుకు జారకుండా అని

కేవలం బాటసారిణివిలా కాకమరణం మాత్రమే మిగిలిన దారి అని 
అనుకుంటు వేళ, ఆతని అమూల్యతను గుర్తు చేసి 
ఒక కారణానివయ్యావు. 
మానసికంగా అతను స్థిమితపడటానికి
నీవే ఆతని నవ్వుకు కారణం 
ఆతని జీవితం లో 
రంగురంగుల ఇంద్రధనస్సు ఆశలకు 
ఆ వెలుతురు కు కారణం .... నీవే .... ఓ స్త్రీ
ఇప్పుడు, నీవు తప్ప 
ఏమీ ఎరుగని మనోస్థితి ఆతనిది 
ఎంత ప్రాణాంతకమో 
నీ ఎడబాటును భరించి జీవించడం
దయచేసి ఒక్క జీవిత కాలం ఆగి చూడు 
అతని కోసం .... జీవితం రహదారి లో పరిచయమైన 
ఒక బాటసారిణివి లా మాత్రమే కాక 
వసంతించిన ప్రకృతి పరవశ్యానివై ఆగి చూడు

భవదీయుడుని
నిన్ను సంతోషంగా చూడటం నా అభిమతం అని నీకూ తెలుసు.
నీవు గుర్తించి గమనించనట్లు తల పక్కకు తిప్పుతుంటావు.
నీవు ఎప్పుడూ కననట్లున్నా .... నా విన్నపాలు, మొరలను
కలలా జరిగినా చాలు అని సంభరపడుతుంటానని,

నాకు తెలుసు, నీవు ఉత్తమురాలివి అని, నేను తగను ....
నన్ను మించిన గొప్ప వ్యక్తిత్వాన్నే నీవు పొందగలవు అని
అయినా బతిమాలుకోవాలనిపిస్తుంది, ఎందుకో ....
నీవు ఆనందంగా ఉంటే చాలు ఆనందంగానే ఉండాలి అనిపిస్తూ

నీ ఆనందం కోసం నేను నా ఆనందం కోల్పోవాల్సొచ్చినా సరే
నేను నీ వాడిననుకోవడంలోనే నా ఆనందమంతా ఉంది అనిపిస్తుంది.
ఏ కారణం వల్లనైనా నీవు నన్ను కోరుకోకపోయినా ....
నేను మాత్రం నిన్నిలా ప్రార్ధిస్తూనే ఉండాలనిపిస్తూ,

నా కంటే ఉత్తముడు ఎవరైనా చేరువకావొచ్చు అనిపించినా
ఎందుకో తెలియదు నీ కోసం, నీ ఆనందం కోసం పోరాడాలనుంటుంది.
అందులోనే నా మానసిక శాంతి సంతోషమూ ఉన్నాయనిపిస్తూ ....
నీ మది మాటల్లో నన్ను వినాలనుంటుంది.

నిజం! మనోజ్ఞి .... మానసీ
నీ ఎద స్పందనల కారణాన్నయ్యి
నీ మనోహరుడ్నై, అతి గొప్ప అదృష్టవంతుడ్నై ....
నీ జతను అవ్వాలని, కాలాంతం వరకూ

Saturday, June 4, 2016

స్త్రీ హృదయంబలహీనము
అతి సున్నితము, అంతే పెళుచు
ఆమె హృదయం ....

తన తగిలిన గాయం
పగుళ్ళ బాధను
దిగమింగి .... ఆతని
రహశ్య జీవనపు 
అబద్ధపు అనుభూతుల
సాహచర్యం భారం
ఒక జీవిత కాలం
మోసి

అనభిజ్ఞుఁరాలై
సహనంతో
ప్రేమ మూర్తిమంతమై 
భూమాత లా

Friday, June 3, 2016

నన్ను గురించిన ఆలోచనలేగా అవిసూర్యాస్తమమౌతూనే అలసిన
నీ ఆలోచనలన్నీ ఆశ్చర్యంగా నా చుట్టూ
ఎందుకు ఎలా ఏమి చేస్తున్నానో
నేనెక్కడున్నానో అనే .... అవునా?

పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ
నా కళ్ళను అలుముకున్న బాధను
నీవు పలుకని నీ మౌన రాగాలే
అందుకు కారణం అని నీకు తెలిసి

ఎన్ని సంగతులు ఎన్ని ఆలోచనలు
పెదవుల్ని దాటని ఎన్ని పదాలో
దూరంగా వెళ్ళిపోయిన నీ అసహాయత
ఆ పలుకులు రాని నీ నిర్లిప్తత వెనుక నీకు ఎప్పుడూ ఆశ్చర్యమే సుమా
నన్ను గురించిన ఆలోచనల్లో
అలా ఈదులాడుతూ నేనెక్కడున్నానో అని
నేను ఏమి చేస్తునానో అనే ఆ ఉత్సుకతలో