Friday, September 30, 2016

మృత్యువే నా ప్రేయసి



పడి ఉన్నా అపస్మారకంగా
మరణం ముంగిట్లో
అందాల రాక్షసి కసి ముద్దు
ప్రేమ లో తడిచి ....
పర్యవసానం గురించి
పట్టించుకోలేదేనాడూ
మరణం దుప్పటి చుట్టుకుని
వింత అనూహ్యానందం లో
మునిగి తేలానే కాని ....
అసంపూర్ణుడ్నని తెలిసి పరిపూర్ణత కై
ఎంతగానో సంచరించాను.
అన్వేషించాను సంపూర్ణంగా
చీకటి రాత్రుల ప్రపంచాన్ని
ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని కోరి,
కొసకు నా ప్రేమ నాకు దొరికింది.
ఎందరి నోళ్ళలో నానిన  
ఒక అందాల రాక్షసి ఆమె .... 



నాకు కూడా ఆమె రాక్షసే
ఎందరు పసి భావనలనుకున్నా 
నా మనొభావనల్ని
ఆమెను నేను
దూరంగా ఉంచలేను ఉండలేను
ప్రేమించకుండా ....
కనుకే చంపుకుంటున్నాను
చివరికి, స్వయాన్ని
కొంచెం కొంచెంగా మరణిస్తూ ....
ప్రేమ లోతుల్లోకి జారుతూ
చావుకు దగ్గరౌతూ ....
ఒదిలెయ్యలేని మానసిని
నా ఆశను నేనే కాదనుకుని
మరణం కౌగిట్లోకి
కొంచెం కొంచెంగా జరుగుతూ

Wednesday, September 28, 2016

విధి బలీయం


తచ్చాడుతూ ఉంటే, చీకటి లో
నిస్సహాయుడిని లా ....
స్వయాన్ని కోల్పోయి
ఈదుతూ విరుచుకుపడుతున్న 
జ్ఞాపకాల కెరటాల్లో చిక్కుకుని,
అన్నీ అర్ధరహితంగానే 
కనిపిస్తూ, వింత అనాసక్తత  


మారు వేషం లో
చేదు నొప్పిలా
ప్రేమ రూపం లో తియ్యని బాధ
చేరువైన మరీచుడి లా
చేదు నిజం నీడ 
అనుసరించి వస్తూ తలరాత

Tuesday, September 27, 2016

తెలియదు నీకు .... నిజంగా



ఎవరి జుట్టులోనో
వేళ్ళు దూర్చి
సున్నితంగా
ఆడుకోవాలని, నీవు
పడుతున్న ఉబలాటం   
బుట్టబొమ్మలా
గిర్రున తిరిగి 
ఏ ఊహించని క్షణాల్లో
ఊహ కందని రీతిలో
ఆ ఎవరినో బలంగా
గుండెలకు హత్తుకోవాలనే
నీ ఆలోచనల 
ఆ బలవంతపు
అదిమివేతలో అవగతమౌతూ    


ఘాడంగా
నివురు గప్పిన ప్రేమలో
నీవు, నిండా
మునిగిపోయి ఉన్నావని

పర్వాలేదు అనే అనిపిస్తుంది


నీవు అనే కల కలతై 
మనం అందరమూ
ఒంటరులమే అని అనిపించినా
ఒక్కో సందర్భం లో
ఆత్మవంచన అవహేళనై మిగిలినా  

చరిత్ర అదే అదే మళ్ళీ మళ్ళీ
పునరావృతమై 
బాల్య దశ భారంగా గడిచి
రేపు అనే అనిశ్చితి కళ్ళ ముందు
అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నా

వాయిద్యాలు మూగవోయి
ఫలించని చేతి రాతల
పరామర్శలు
నీ పేరు నీడలో
సమాధి చెయ్యబడినా  



ఎన్నో గడిచిన సంవత్సరాల 
మారని రాలని పొడి కన్నీళ్ళ 
అబద్ధాల కురుక్షేత్రం లో
తొడలు విరిచెయ్యబడినా 
ఒంటరినని మది ఆక్రోసించినా 

అప్పుడే నేల రాలిన అహంకారపు
నా అనంత జ్ఞాపకాల అవశేషాలు 
గుండె ఆకారపు శవపేటికలో
అసంబద్ధ పదజాలమై పేరుకుని
ప్రకోపనలుగా మారిపోతున్నా

నీ పేరు మాత్రం అందంగా రంగుల్లో 
నా పెళుసు మనస్సు పొరలపై 
చిత్రించబడి .... అంతలోనే
అకారణం గా విసిరెయ్యబడ్డ
ఏ ఒంటరి అనాసక్తతో అయ్యి విలపిస్తున్నా

Tuesday, September 20, 2016

ఉదాసీనత



కాళ్ళ క్రింద భూమి
కదిలి కరిగి
కాలానికి సమాంతరంగా 
భయానికీ
చావుకు దూరంగా
పరుగులు తీస్తూ ఉన్నాను.
తప్పించుకునేందుకు,
నీనుంచి
ద్వేషము
అబద్ధం
ప్రేమ జీవితాన్నుంచి
భరించలేననుకుంటూ .... 
కానీ దొరికిపోయాను నీకు. 



నీ ద్వేషానికో ప్రేమకో
ఏరాగానికో మరి
ఎంత వేగం పెంచినా
దూరంగా పోలేకపోయాను.
జీవితం ఒకటుందని
దాన్ని కాపాడుకోవడమూ
నా బాధ్యతే అని మరిచి మరీ ....
నా వెనుక
నా మనో నిర్మాణమంతా
విచ్చిన్నమై
నన్ను అనిశ్చితి పీడకు
సమీపం చేస్తున్నా ....
స్వేచ్చకోసం పోరాటం లా 
నీడలా నా వెనుకే
నా జీవితమూ నా బలహీనతలు 
పరుగులు తీస్తూ 
అకస్మాత్తుగా తొట్రుపడ్డాను.
జారిపోతూ అఘాదాల్లోకి 
పడిపోతూ ప్రేమ లోకి
అందులోనే
స్థిమితపడక తప్పని స్థితి.
జీవించక జీవితాన్ని
జీవిస్తూ ....
ఈ ఉపేక్షాయుత జీవనాన్ని

Monday, September 19, 2016

నీడలో నీడను


నా ఆత్మను కమ్మి 
నా ఆలోచనల్లోంచి తప్పించుకుని 
దూరం గా పారిపోతూ జారిపోయే 
క్రుళ్ళు జిగురులా 
కనిపించిన ప్రతి పదార్ధముపై 
పాచిని ప్రసవించి 
విస్తరిస్తూ 
ఏ సూర్యకిరణాల కాంతి వేడో 
మీదపడి నెమ్మదిగా 
కొంతసేపటికి 
ఆ సూర్యకిరణకాంతే కారణమై 
నీడలకు 
ఆ నీడల్లో నీడ 
నా ఆత్మరాగం 
వినిపించని నిశ్శబ్దం నీడలా మారి 
మిగిలిన ఈ జీవితం 
కేవలం ఏ నీడలానో 
నా అవనతాత్మకు గుర్తుగానో

నేనొక అసంబద్ధతను




చిందరవందర కాని
స్పష్టతను
ఒక ప్రత్యేకతను
పొందే ముందు ....
ఒక సాధారణ ప్రశ్నకు
సమాధానం
చెప్పగలిగుండక తప్పదు  
బడాయికోరునో
బిక్షగాడీనో
ఎవరినీ కాననో ....
తాత్కాలికంగా
ఏ బలవంతపు
నవ్వునో
రొమ్ముటెముకలనుంచి
తలవరకూ
సాగదీసైనా విసిరి ....
అదొక్కటే సాధ్యము
ఏ ప్రశ్నకైనా
ఏ రోగానికైనా
తెలిసిన సమాధానము
తప్పని వైద్యము
అది ఒక సందర్భరహిత
సంక్లిష్టతే అయితే

Monday, September 12, 2016

పెళుసు గుండె




పగిలి ముక్కలై
ముక్కలు చక్కలై చెల్లాచెదురై
దుమ్ముకొట్టుకుపోయిన
హృదయం నాది
అంత సులభం కాదు 
చక్కదిద్దడం 



ఏడ్చినా
కేకలు పెట్టినా పెట్టకపోయినా
పగిలిన హృదయఫలకంపై మచ్చ 
ద్వేషాగ్నిని ప్రేమగా మార్చడం
ఈ హృదయం ముక్కలను
బ్రమ జిగురుతో తిరిగి అతికించడం
అసాధ్యం రసాయనికంగా ....
ఒకప్పుడు
వికసించి పరిమళించిన గులాబీ
ఈ గాజు హృదయం ....
తిరిగి పల్లవించకపోవడం 
ఒక వికటించిన పరిణామం

Saturday, September 10, 2016

ఒంటరి పోరాటం



ఎంతో అమూల్యమైన సమయాన్ని
కోల్పోయాను.
ఊహల పగుళ్ళలో
పగిలిన హృదయపు
కన్నీటి ఉద్విగ్న భావనల్లో

నోరు ఎండిపోయి కళ్ళు
ప్రతి కదలిక .... భారమైనా
ఎలాంటి హానీ జరుగలేదని
నటిస్తూ ముందుకు కదులుతూ
సర్దిచెప్పుకుంటూ ....

కలంతో కాగితం పై నేను
వ్రాసుకునే ప్రతి వాక్యమూ
నలుపు, నీలం రంగు సిరాలో కాక ....
చిద్రమైన ఆత్మ అవశేషాల
రక్తవర్ణ ఆవిష్కారాలు లా 

అప్పుడప్పుడూ చెప్పుకుంటాను.
నాలో నేను .... అనుకుంటూ,
కన్నీళ్ళతో గుండెను
చల్లార్చుకోగలను అని,
రక్తసిక్తపుటాలోచనలతో
పగుళ్ళను పూడ్చుకోగలను అని,

ఎవ్వరూ రాకపోయినా, తోడు
సమశ్యల సుడిగుండం
సామాజం కురుక్షేత్రం లో
కలిసి పోరాడ్డానికి ....
ఒంటరి పోరాటానికి సిద్ధపడి

Thursday, September 8, 2016

నెమ్మదిగా చస్తున్నాను



నీ నవ్వు ఒక పదునైన కత్తి
మెరుపు వేగంతో
నాలొకి లోతుల్లొకి దిగి
రక్తం స్రవిస్తూ ....
నా గుండె అంతర్గతంగా
 
నీ మాటలు గుండు సూదులు
నా చర్మం
ప్రతి కణాన్నీ గుచ్చి
రంద్రాల మయమయ్యి 
ఎర్రగా మారి .... శరీరం

నీ శిరోజాలు బంగారు తీగలు
విస్తరించి .... అన్నివైపులా
సూర్య కిరణాల వేడి నుంచి
వెచ్చదనం నీకిస్తూ 
మండిస్తూ .... నన్ను

చీకటి లా నీ చూపు
దట్టము, శూన్యము నిశ్శబ్దం
అపవిత్ర అసూయ లా
వ్యాపించి, చాపక్రింద నీరులా
అకారణంగా చంపేస్తూ

Wednesday, September 7, 2016

ఇంతనుకోలేదు .... నీ ప్రభావము .... నాపై



నీ నవ్వు,
నీ పద ఉచ్చారణ
నీ మాటల ప్రభావము
ఇంత భారమా!?
పక్కటెముకలను బలంగా
చీల్చిన
ఒత్తిడి తీవ్రత పెరిగి    



గుండెలపై నుంచి
ఊపిరితిత్తులవరకూ వ్యాపించి 
అప్రయత్న అయాచిత నిట్టుర్పుకు
అది కారణం అయ్యి
శ్వ్వాస అందకుండా చేస్తుందని
అనుకోలేదు ఇంతయ్యాక కూడా
నీవు నా జతవౌతావని ....

Tuesday, September 6, 2016

అలజడి, గమ్యం చేరాలని



ఆలోచించడం అంటే ఏమిటో
అంతగా తెలియదు
ఒక్కోసారి అటు ఒక్కోసారి ఇటు
త్రుళ్ళిపడుతూ
అనాలోచితంగానే తడబడి  
పునాదులు కదిలి ఆరంభాన్నీ
అంత్యాన్నీ విస్మరించి
నీ మదిలో విశ్రమించిన విషయంతో సహా
ఒకప్పటి అన్నింటినీ
అస్తిత్వాన్నీ గతినీ మరిచిపోయి
ఉన్న సర్వ జ్ఞానాలనూ కోల్పోయి
అవివేకమే మిగిలి 


చివరికి ఇప్పుడు,
ఒక మరిచిపోదగిన జ్ఞాపకాన్ని లా
దూరం గా ఉన్న ఒడ్డునే చూస్తూ
సముద్రం లోకి జారి,
అస్థిరతపై ఊగుతూ అపస్మారకం గా
అలలపై కదులుతూ ....
ఒక నీటిబొట్టును మించి ఏమీ కానని 
ఓ ప్రత్యేక అస్తిత్వం లేదని 
వాస్తవ అలల ఒత్తిడికి సుదూరాన ఉన్న
ఏ ఒడ్డుకో కొట్టుకుపోయేవరకూ ....
ఒడ్డుకు చేరాక ఎవరో గుర్తించేవరకూ




నీ ప్రేమ కోసం



ఈ జీవితం అవశేషం ను
చెత్త బుట్టలోకి విసిరెయ్యక తప్పదు.
సగం తాగి మిగిలిన ఔషదం బాటిల్
ఒక తినేసిన విస్తరాకు
ఉందటి విలువ లేని 
తిరిగి ఉపయోగించలేని డిస్పోసబుల్
ముక్కలు చెక్కలై చెల్లాచెదురై
కుదురు ఉపశమనం లేని గుండె
మొదలు క్రుళ్ళి ఒంగిపోయిన
చెట్టు శరీరం నరాలు ....
రక్తనాళాలలో వరదలా బాధ
ప్రవహిస్తుంది.
మృత్యుసాగరం గమ్యం వైపు
జీవించడానికి .... ఊపిరి
ఏ మాత్రమూ కీలకం కాదంటూ






Monday, September 5, 2016

నేనొక ప్రేక్షకుడిని



నాకు ఈ జీవితం ఎలా జీవించాలో
ఏమి చెయ్యాలో తెలియడం లేదు
దనార్జనే ద్యేయం గా ఎందరో ....
కొందరేమో పరుల్ని
మోసం చెయ్యాలని చూస్తూ
నేను అలా నడుచుకోలేక
ఎందుకో అలా జీవించాలని కానీ
అలాంటి వాడిని కావాలని కానీ లేక
అద్దం లో నా ప్రతిబింబం
అలా చూడాలని ఉండక 



చాలావరకు అన్నీ చెయ్యలేని
ఏమి కావాలో తెలియని
ఒక అతి క్లిష్టమైన వ్యక్తిత్వం నేను
ఎలాంటి నిర్దిష్ట భావనలు
నిర్ణయించుకోవడాలు లేక 
నా సామర్థ్యమేమిటో తెలియని 
నేను, ఏమి చెయ్యగలనో ....
ఒక గమ్యం, ఒక ఆశ, ఒక కల
ఆత్మ ఆనందం తెలియని నేను
ఒక సామాన్య మానవుడిని  

Sunday, September 4, 2016

నేనూ, నా గతం




నా దృష్టిలో నేనిప్పుడు
ఏ అవహేళన ఆచారంతోనో
చుట్టెయ్యబడిన చేదును
ఏ పుచ్చిన వృక్షం క్రిందో
గాలికి కొట్టుకుంటున్న
ఒంటరి అలజడి
చిరు పసరిక మొక్కను 
ఏ వంగిన పూలరేకుల మీంచో
రాలని ఆవిరైన
వర్షపు నీటి బొట్టును
ఎవరి మాదకద్రవ్యావసరాల
పెరటి మెట్ల క్రిందో గాయపడి
బాధతో మూలుగుతున్న వేశ్యను
ప్రతిదీ ఈ జీవన పుస్తక
అధ్యాయాలే అనుకుని 
చర్మము, ఎముకలు
కోరికల భ్రష్టతతో కూడిన ఒడిదుడుకుల
చిరుజల్లులే జీవనం అని
ఎన్నో పాటించలేని వాగ్దానాల
వాయిదాల విసుగును పంచుతున్న
సోమరి పసితనాన్ని   





నేనేమిటో
నీతో జత కలిసిన
మనమేమిటో తెలుసుకున్న
ఒక తీరని ప్రేమ
తీపి మూలుగును
నేను నీవు కాకపోయినా
అన్ని ప్రమాణికాలు గానూ
నమ్మకమైన సేవకుని
బలహీనపడుతున్న విశ్వాసాన్ని 
నువ్వే నేను అనుకునే
ఒక నమ్మకాన్ని
ఎన్నినాళ్ళు గానో
మనం వెంబడించుతూ వచ్చిన
ఆశలు రాలుతున్న నక్షత్రాలను చూసి 
అన్నీ మరిచిపోయిన నిన్నూ
గతాన్ని
విషాదాన్ని మరిచిపోలేని ....
విషాద చ్ఛాయలను కమ్మేసుకున్న
గతపు వర్తమానాన్ని నేను