Wednesday, May 25, 2016

వేసవి పలుకరింపులువేడికి భారం కోల్పోయిన
వడగాలులు తరుముకొస్తున్నాయి.
ఉమ్మదం
చికాకును
ఒంటికి పులిమేందుకు

నా లో
ఉల్లాసాన్ని ఎగదోస్తూ
నీ చల్లని కనురెప్పల 
దుప్పటి క్రింద
దాసెయ్యొచ్చుగా

భద్రతాభావనను
మనం
కలిసుండని వేళల్లోనూ
నాతో ఉండేలా కాసింత
సహాయం చేసెయ్యొచ్చుగా

నీ గుండె లోతుల్లో
తలదాచుకునేలా
నా ఆత్మకు
ఒక అవకాశం
అధికారం ఇవ్వొచ్చుగా

ఆ వేసవి
ఉమ్మదపు వడగాలుల
పలుకరింపు పరామర్శల్ని
సున్నితం గా
ఊదేసేసి దూరంగా

Friday, May 13, 2016

కలువభామ


ఒడ్డున కూర్చుని
కొలనులోకి చూస్తుంది .... ఆమె
కన్నీటి కొలనులయ్యాయి
ఆమె కళ్ళు

ఎన్నాళ్ళి లా
ఈ ఎదురుచూపుల
ఈ నరకయాతనల
ఆవేదన అని

అప్పుడే
అటుగా వెళుతూ ఉన్న
పిల్లగాలి అల ఒకటి ఆగి
ఆమె భుజాన్ని తట్టింది.

చిరు ఓదార్పు విసురు
స్పర్శతో ....
అతని స్పర్శలా
గోరు వెచ్చదనాన్నిస్తూ

ఔనూ ఎందుకిలా?
ఎందుకు
ఈ ఏకపక్ష మనోభావన
ఈ ప్రేమ

అనాసక్తతను
ఆసక్తి గా
తియ్యని బాధను
తీరని అనుబంధం గా మారుస్తూ 

అది ప్రకృతి పలుకరింపు కాదు


దూది మబ్బు
తొలి ముద్దు లా
మృదువుగా
బుగ్గల్ని తాకిన
తడి ని
ప్రకృతి పలుకరింపు
అనుకునేవు 
అది
అన్యాపదేశంగానైనా 
ఎప్పుడూ చెప్పని
నా చూపు, చేతల్లో
దాచినా దాగని
రాలి తడిమిన
ప్రేమే అది, నీ పట్ల

Tuesday, May 3, 2016

నిన్ను గురించే .... విచారమంతా


విచారంగా ఉంది.
ఉల్లంఘించాల్సొస్తున్నందుకు
బట్టబయలు చెయ్యాల్సొస్తున్నందుకు

కొన్ని నిజాలను, నగ్న సత్యాలను
పాడలేక, నీ అంత మాధుర్యంగా
అతి తియ్యదనాన్ని ....
అసత్యం తెవులును నింపలేక పదాలలో

బాధపడతానేమో కాని
నన్ను అర్ధం చేసుకోలేకపోతున్నావని
అసత్యాలకు తియ్యదనాన్ని పూచి
మధురంగా పాడలేను.

అనూహ్యంగా అనాలోచితంగా
అంతరాంతరాల్లోంచే రావాలి, ఏ భావనైనా 
చిరుహాసంలా పెదవులమీంచి
తృళ్ళిపడి మాత్రం కాదు.


 నా ప్రవర్తనలో నిజాయితీకి ....
నన్ను మన్నించు

ఆ గాయాలు,
నీ మనస్సులో దిగబడుతున్న
ఆ మాటల చురకత్తుల పదునుకు
ఏమీ చెయ్యని నీ అసహన అసహాయతే కారణం

బురద గుంటలో చల్లదనంతో
సంతృప్తి పడే
ఏ పిరికితనాన్ని ప్రశ్నించడమూ నేరం కాదు.

దుఃఖపడుతున్నావా
ధనవంతుడ్ని కాకపోయానే అని ....
ధనం ఉంది, అవసరాలు తీర్చుకునేందుకే
ఆధిపత్యం చెలాయించేందుకు కాదు.

నా విచారం
నన్ను నేను విక్రయించుకోనందుకు కాదు.
నేను విచారిస్తున్నది.
నిజం గురించే, నా బాధంతా నిన్ను గురించే