Saturday, November 18, 2017

నా సంసారం నీవు
నెమలి ఈక పై నున్నని
మృదు ప్రియత్వం
మెరుపువు .... నీవు 


మొక్కజొన్న కండెపై
పసిడి రంగు
అలంకారం .... నీవు 


స్పష్ట నీలి పారదర్శక
నదీ ప్రవాహం
తీరే దాహం .... నీవు 


సాయంత్రపు నీలి ఆకాశం
గాలి తెమ్మెరల
స్వచ్చ శ్వాసవు .... నీవు 


హృదయ భావనలు
నక్షత్రాల వరకూ
వ్యాపించిన శాంతివి .... నీవు 


అలజడి మానసానికి
ఉపశమనాన్నిచ్చే
పవిత్ర నిశ్శబ్దానివి .... నీవు 


ఊహలకందని
అద్భుత సౌందర్య
అయస్కాంతానివి .... నీవు 


నన్ను నేేను
కోల్పోయిన క్షణాల
విజ్ఞతవు .... నీవు 


భయం
అదుపులో ఉంచుకున్న
ఆత్మ స్తైర్యానివి .... నీవు 


నీ ఆఖరి క్షణం వరకు
నా తోడై ఉన్న
నా ప్రాణవాయువు .... నీవు