Wednesday, September 6, 2017

న్యాయంగా ఆలోచిస్తేభావోద్వేగం వూట ఊరి
బొట్లుబొట్లుగా జారుతుంటే
బహుశ
నీ ఉంగరాల జుట్టే
కారణం అనుకున్నా 

చెరువు వైపున
కిటికీలోంచి 
చల్లని గాలితెమ్మెరొకటి 
వెన్ను వద్ద తచ్చాడి
ఒళ్ళు జలదరించేంత వరకు 

నీవు నాదానవు

నీవే, అంతరాంతరాల్లో పెరిగే
భావొద్వేగాల మూలం అని 
పరీశీలించి తెలుసుకున్నా 
ఈ నిగూఢ ఉద్రిక్తతలన్నింటికీ
కేంద్రం నీ కళ్ళు అని 

Friday, September 1, 2017

మోమాటపడని వేళగులాబి అందం
హానికరం
చూపులతో తడిమినా
గుచ్చుకుంటూ
ముల్లు

సహజ రూప
అయస్కాంత గుణం సుమా
ఉద్వేగ అవగాహన
బలహీన నిస్సహాయత
ప్రేరణై నీకు

Thursday, August 31, 2017

నిరర్ధక జీవి
ఎక్కడో శిశువు ఏడుపు
చల్లని రాత్రి.
కటిక చీకటి,
కన్నతల్లి శుభాకాంక్షలు
దూరదేశం లో ఎక్కడో ఉన్న
కానరాని బిడ్డ క్షేమం కోసం

ఎవరికి తండ్రో అతను ....
ఒక అనాద శవం
అక్కడ .... పంచకూలా లో,
నీడ కొల్పోయిన కుటుంబం అబాండం
ఒంటరిగా వదిలెళ్ళాడని
అతనలా వెళ్ళుండాల్సింది కాదని

సంసారం పట్ల బాద్యత ....
బార్యపై ప్రేమ,
ఒక స్త్రీ కోరుకునేది .... అంతే
స్నేహితుల ప్రభావమో కుతూహలమో
ప్రత్యక్ష సాక్షవ్వాలని
తన్నే కోల్పోయిన నిరర్ధకతతను

Friday, August 4, 2017

దోష భావనఏ కాగితంపైనా విదిలించని 
అబద్ధాలే అన్నీ
నిజాయితీని చిందని ఈ సిరాలో ....

సంక్లిష్ట పరిస్థితులు మాత్రం
సూచించబడి .... కొన్ని తప్పులు
కొన్ని కర్మఫల దోషాలుగా

రక్తం రుచి మరిగిన
మనో వికారపు పరివర్తన లా
అస్పష్ట అక్షరదోష ప్రచురణలే అన్నీ

ఈ విపరీత భావనలు ప్రతిబింబిస్తూ 
అక్కడక్కడా .... కొన్ని
పగులు అద్దాల చరిత్ర పుటలు

రెచ్చగొట్టని పెరిగిన అకారణ పగ లా  
సమీపంలో .... చిరునామా లేని 
ఒక అపవిత్ర శిశు సమాధి

Wednesday, August 2, 2017

ఎవరు నాటారో గాని
నా ప్రియ
భావనలను,
జ్ఞాపకాల
గతం లోకి వెళ్ళి 
వెలికి తీసుకొచ్చినట్లు ....
ఉంచిన ....
ప్రతి కళాత్మక
చిత్రభంగిమల్లోనూ 
నీవు మాత్రమే
కనిపిస్తూ   ఐతే
గుర్తించలేని విధంగా 
కాలి బూడిదై
దూళై
మట్టై
ఆత్మ భాగమైన
ముఖాలేవో 
పరామర్శిస్తున్నాయి.
అన్ని ప్రశ్నల సమాధానం
నువ్వే అన్నట్లు

Wednesday, July 19, 2017

కోల్పోయాకే తెలిసిందివయసు మీద పడ్డాకైనా తప్పించుకోలేము .... గతపు పీడలనుంచి అని
పగిలి, విరిగి, నాశనమైన అస్తిత్వం పునాధులపై చదికిలపడాల్సొస్తుందని
కట్టెలపై భగ్గుమని మండాల్సిన
ఒకనాటి ఎండి రాలిన ఆశల కన్నీళ్ళ కలల శరీరావశేషాలపై
ఎంతో పటిష్టంగా నిర్మించుకున్న .... ఊహల సామ్రాజ్యమే
బానిస జీవనంగా అవిష్కారం ఔతుంది పరిణామక్రమంలో అని

ఎన్ని అవరోధాలు ఎన్ని ఎదురుదెబ్బలు ఎన్ని వినాశన చ్చాయలు
గతం లో, ఈ ఎద లో, శూన్యం అనేది లేని ఈ నగరపు ఒంటరితనంలో
ఈ నిరాశ నిస్పృహల్లోంచి నీతో కలిసి .... ఒకప్పటి గతం లో
పంచుకున్న ఆ ఆనందానుభూతుల జ్ఞాపకాల్లోకి జరగక తప్పక
మనము కలిసి గడిపిన నిన్నటి వేళల ఆ ఉన్నత ఆశయాల
ముద్దు ముచ్చట్ల పరిపూర్ణానందం .... విఫలపయత్నమే అని   ఎవరికోసమూ ఆగని కాలగమనంలో పునర్నిర్మాణావశ్యకత పెరిగి
జీవితానుభవసార అవసరాల కిటికీలోంచి చూడటంతో పాటు
నూతన సామాజిక ప్రాపంచిక మార్పుల ఆలోచనల గవాక్షంలోంచి
ప్రతిదీ నెమ్మదిగా సులోచనాలతో చూడటం ఆవశ్యకత అయ్యి
జీవన యానంలో కాలంతో పాటు  తప్పనిసరైన
మార్పు దిశగా పునర్పురోగమనానికి ఉపక్రమించక తప్పదు అని