Tuesday, April 30, 2013

ఎందుకిలా?ఒకే భావం
అదే గజిబిజి ప్రతి ఆరంభం లోనూ
ప్రేమ కాని వస్తువు .... ఏది రాద్దామన్నా పట్టుచిక్కడం లేదు
కలం కత్తి కంటే శక్తివంతమైనది ఐతే
కాగితం నన్ను కొట్టెయ్యాలన్నట్లు చూస్తుంది .... ఎందుకు?
నా భావనలు నా పదాలు తేలికౌతూ మనసుకు దూరంగా జరుగుతున్నాయి ఎందుకు?

కలలు కన్నీరుకన్నీరు, వేధన దాయాలని,
కలలు, భావనలు కనిపించకుండా జీవించాలని ....
ప్రయత్నించేప్పుడు తెలిసింది.
ఇది మాత్రమే నిజమని!
కలలు, కన్నీరు వెలుగునీడలు
గమ్యాలు కొన్నిసార్లు కన్నీటిలొ తడుస్తూ,
అవి ఒకదాన్నొకటి మోసగించుకుంటూ ఉంటాయి అని

నీడ

పిల్లా! 
బలమైన కోరికను అదిమిపెట్టలేక పోతున్నా
నిందల నీడ నీమీద పడొద్దని 
నీ వద్దకు వస్తున్నప్పుడు 
రాత్రిళ్ళప్పుడు, 
కలల రహదారి లో .... ఎవరైనా నన్ను చూసి

అభిరుచి కోల్పోయుంటుంది .... ఆమె!ఆమె ఇక్కడ
నాతో ఉంది.
ఆమె మనసుమాత్రం
ఎక్కడో దూరంగా ....

నిద్దురలో నడుస్తూ
నిద్దురలో మాట్లాడుతూ
ఔనూ
ఇంతకూ ఆమె ఎక్కడున్నట్లు?

అనంతదూరాల్లో
ఎక్కడికో
వెళ్ళిన మనసు
తిరిగొచ్చే ప్రయత్నమా అది!

పుకార్లు కూడా చేరలేని దూరం నుంచి
ఔనూ
అంత దూరం ఎందుకు వెళ్ళాల్సొచ్చింది?
బహుశ .... సామాజిక జీవన ఆసక్తిని కోల్పోయుంటుందా!

Monday, April 29, 2013

ప్రేమను ప్రోగేసుకుంటున్నా


నన్ను నేను
విప్పుకునే ప్రయత్నం .... ఎబ్బెట్టు గా అనిపించింది
సిగ్గు, బిడియం .... నా మీద నాకు అపనమ్మకం
నీవెక్కడ దూరమౌతావో అనే
అనుమానం, చెప్పలేని నిజం!
పిల్లతెమ్మెరలా,
నెమ్మదిగా, నిశ్శబ్దంగా,
ఎప్పట్నుంచో చెప్పలేని ఆపేక్ష .... నీ పై పెంచుకున్న ప్రేమ!

నా మనసు సాక్షికి తెలుసు!
నాతో స్నేహిస్తున్న నీకు తెలుసు.
నా గుండెలో .... ఆత్మ
గోడపై చెక్కిన అక్షరాల భావం నీవని!
మాటల్లో చెప్పలేని అపనమ్మకం, 
అభ్యంతరకర భయం!
అయినా ధైర్యం చేసి ....! ప్రపోస్ చేసా!
అనుమానించినట్లుగానే బెడిసికొట్టింది,
నీ ఉద్దేశ్యం అది కాదని నాకు నీవు దూరమయ్యావు.

అప్పుడు నేను ఒంటరిని!
సరిగ్గా నీవు దూరం అయ్యిన ఏడాది తరువాత
మనసు మళ్ళీ కొత్త గూడును కట్టుకోసాగింది.
మనోభిలాషలా, మనసుగీతం లా
మరో నీవు .... మళ్ళీ
నా జీవితం లోకి
నిశ్శబ్దంగా, నిరాడంబరంగా వచ్చావు,
సిగ్గేస్తుంది. నన్ను నేను దాచేసుకోవాలనిపించింది.
తేనెటీగలా తేనెను ప్రోగేసుకుంటున్నందుకు!

Saturday, April 27, 2013

పగిలిన హృదయం సలుపుతుంది


నా పగిలిన హృదయానికి తెలుసు
ఒంటరితనం వ్యధలో నైరాశ్యం ఏమిటో
ఆలశ్యము చేసే కొద్దీ
అన్నీ కోల్పోవల్సొస్తుందని,
నెమ్మదిగా కోరికలన్నీ .... సిగ్గుపడి
దూరంగా పారిపోతాయని,

ఆనందం, ఆహ్లాదం .... అనుభవం ఆవల
జీవనాన్ని ఆలోచించలేము.
అక్కడ ఏముందో తెలుసుకోవాలనిపించదు.
ఉల్లాసం ప్రభావం .... కొత్త ప్రశ్నలు మొలకెత్తవు.
మనసులో .... లోపల .... నుండి
కనిపించే ఆ ఆనందాన్ని ....
అంతం వరకూ అనుభవించేద్దాం అనిపిస్తుందే తప్ప.

ఒకే జ్ఞాపకం ఎన్నాళ్ళో మదిని సంతృప్తి పరచలేదు.
మసకబారిన మరొ జ్ఞాపకం .... మనం గమనించలేనంత స్విఫ్ట్ గా,
అనుభూతై మదిని ఆక్రమించేస్తుంది.
వార్డ్ రోబ్ లో హేంగర్ కు వేలాడదీసినట్లు,
ప్రతి జ్ఞాపకమూ ఓ నిశ్శబ్ద భావనలా కదులుతూనే ఉంటుంది.
ఒక్క గుండెకు తగిలిన ఒక్క గాయం మాత్రం,
ఎప్పుడూ,
సలుపుతూ బాధను పలుకుతూనే ఉంటుంది.

Tuesday, April 23, 2013

డోంట్ కేర్!ఎవరికీ అర్ధం కాదు.
నీలో నేను చూస్తున్నది కోరుకుంటున్నది ఏమిటో,
ఓ ప్రియా!
ఒకవేళ అర్ధం అయినా, తెలిసి ఉన్నా
నా తల తలలో లేదనుకుంటారు.
నా మనోభావం నిజాన్ని వారు చూడలేరు.
చూడలేరు వారు .... నా అంతరంగాన్ని!
అక్కడి నా అందమైన మరో ప్రపంచాన్ని!
ఔనూ! ఒక చిన్న అనుమానం
నా హృదయం కానీ నా మనసును ప్రేరేపిస్తుందా?
ప్రేరేపిస్తుండొచ్చు!
ప్రతిసారి హృదయ భావన వాస్తవం కానక్కర్లేదని తెలుసు!
ఒక్కటి మాత్రం నిజం! నా ప్రేమ విషయంలో నేను పొరపడ్డం లేదనేది.

ఒకవేళ
నాకు మళ్ళీ ప్రేమించే అవకాశం వొస్తే,
నిర్ణయించుకునేందుకు సమయం దొరికితే
అప్పుడూ కూడా నా నిర్ణయం ఇదే
నా నిన్నటి భావనే .... నా హృదయ స్పందన
నా మనసు ప్రశ్నించలేని నా హృదయం నిర్ణయం.
నా ప్రేమ కు సంబంధించి, తుది నిర్ణయం .... నా హృదయానిదే!

అప్పుడప్పుడూ నాకూ ఎన్నో అనుమానాలొస్తుంటాయి.
వెనుదిరిగి చూడాల్సొస్స్తుంటుంది.
చేసిందే చేస్తూ, చెప్పిందే చెప్పుతూ ....
బొంగరంలా ఒక్కచోటే తిరుగుతుంటాను.
మబ్బుల్లో, ఒక్కోసారి .... మోకాళ్ళలో
నా మెదడు మోకాళ్ళలోనే ఉంది అంటుంటారు స్నేహితులు.
నేలను విడిచిన సాము నేను చెయ్యడం లేదని నాకు మాత్రమే తెలుసు.
అయినా, నా స్నేహితుల దృష్టిలో ప్రేమించిన గుడ్డివాడ్ని నేను.
నిజం!
ఆమె తారసపడ్డాక నా జీవితంలో ఏదో తెలియని నాణ్యత,
నాలో చిత్రమైన మార్పు చైతన్యం,
ఇప్పుడు స్నేహితులేకాదు, చుట్టూ ఉన్న ప్రపంచం నవ్వినా సిగ్గుపడను.

ఔనూ!
నా హృదయం ఏమైనా
నా మనసును ఆజ్ఞాపిస్తుందా!
అవకాశం లేదు.
ఎన్నిసార్లో అనుకున్నది తప్పై బాధపడ్డ క్షణాలూ ఉన్నా,
ఈ విషయంలో
నా ప్రేమ నిర్ణయంలో మాత్రం నేను పొరపడటం లేదన్నది స్పష్టం.

Monday, April 22, 2013

అల్పసంతోషి


నిజంగా, నిజంగా ....
నీకోసమే నేను జీవిస్తున్నది.
ఆ దేవుడికీ తెలుసు నా ఆశ, నా గమ్యం నీవే అని,

నీవు లేని నేను
అసంపూర్ణుడ్ని, అసమర్ధుడ్ని .... అయోగ్యుడ్ని!
నిజం గా .... నన్ను నన్నుగా మార్చగలిగిన ప్రేరణవు .... నీవు!

ఒక ప్రేమానుభూతి, ఒక జీవనానుభూతి పంచుకోవాలనిపించే
సహజీవనానుభూతి .... నీవు నా పక్కన ఉంటే,
తొందరతనం, తప్పులు, సంకుచిత భావాలను .... దూరంగా విసిరెయ్యాలనిపిస్తుంది.

పిల్లా! నీ ఆలోచనల్లోంచి నన్ను విముక్తుడ్ని చెయ్యి
ఊహల రెక్కలు తొడుక్కుని .... నీతో కలిసి
ఆకాశం అంచుల్ని చవి చూసే ప్రేమికుడ్ని ప్రవరాఖ్యుడ్ని కానియ్యి!

నీవు నాకు కావాలి.
నీ సాహచర్యం కావాలి. నా సగభాగం .... నీవు కావాలి.
నిజం! నీవు లేని నేను అసంపూర్ణుడ్ని .... గమ్యం లేని అసమర్ధుడ్ని!

ఏ వికల్ఫమూ లేని నీ ఆకర్షణ
నీ క్రమబద్ద ప్రపంచంలోకి రావాలని ఉంటుంది ఎప్పుడూ.
మనోహరీ .... నీ ఊహల సముద్రంలో అమూల్య సంపదను .... నన్ను కానీ!

నీతో కలిసి జీవిస్తున్ననన్న ఊహ,
ఒక దివ్య ప్రేమానుభూతి!
కుల, జాతి, మత వివక్షతలను దూరంగా విసిరేసిన మహదానుభూతి!

పిల్లా! నాకు నీతో కలిసి జీవనం ప్రయాణం సాగించాలని ఉంది.
రేపటి ఆశల రెక్కలు తొడుక్కుని,
ఊహల స్వర్గం అంచుల్ని తాకుతూ, ఓ అల్పసంతోషి ప్రేమికుడ్ని కావాలని ఉంది!

Sunday, April 21, 2013

నా అస్తిత్వమే నీవు


ఊపిరి తీసుకోవాలనిపించడం లేదు.
కిక్కిరిసిన ఆలోచనలతో మనసు
అన్నీ ట్రాఫిక్ జాము లే!
నా ఊపిరితో సహా .... అన్నీ తీసేసుకో!
నా ఆత్మను ప్రాణాన్ని .... నన్ను నీతో,

నా కళ్ళలోకి చూడు!
కనుబొమ్మ అద్దంలో నీవు మాత్రమే కనిపిస్తావు.
నా ప్రేమవి .... నా హృదయాన్ని దొంగిలించావు కనుక,

నా జీవనసరళిని మార్చేసావు.
నీ ప్రతి కదలిక .... నా ఆలోచనలు నన్ను ప్రాభావితం చేస్తున్నాయి.
నీ సున్నిత స్పర్శ .... నాలో అలజడిని రేపుతుంది.
నన్ను నేను కోల్పోయి .... ఏదో తెలియని వొణుకు నా నిలువెల్లా
నా కాళ్ళు తడబడి
నేను కన్నీళ్ళ పర్యంతం కావడం .... నీ చిరు సరదా!
కాసింత సిగ్గు
ఓ చిరునవ్వు విసిరేసి మాయమైతే చాలు!

నీ ప్రతి ఉశ్వాస
నీ ప్రతి క్రియ నా కళ్ళముందు కళాత్మకంగా 
నా చెవిలో గాలి నాతో గుసగుసలాడుతుంటుంది.
నీ .... ఓ చిన్న ముద్దుకోసం
నా జీవితాన్ని పణంగా పెట్టొచ్చన్నట్లు .....
నిజం పిల్లా! నేను చచ్చిపోతాను.
నీ ప్రేమ పరిధిలొంచి నన్ను దూరం చేస్తే

అందుకే
నన్నొదిలి వెళ్ళకు!
నన్ను నన్నుగా ఒంటరిగా మిగిల్చి,
అప్పుడప్పుడూ ....
ఇలాంటి భావనలే నన్ను కలవరపెడుతూ
నీవు ఎక్కడికి వెళ్ళినా నా భావనలే ....
నా కలలు నిన్ను వెన్నంటి వస్తూనే ఉన్నాయి.
భూగోళం అంచువరకూ,
ఆకాశం ఆరంభం వరకూ,

నిద్దురరాదు! .... కలలోనైనా నిన్ను కలిసేవరకూ,
నీవు ఎదురుగా లేని క్షణాలు
శ్వాసించడం కష్టం!
అందుకే
నీ నీడగా అయినా ఉందామని వొచ్చానని ....
ఒప్పుకుంటున్నాను .... ప్రేమ దేవతా!
నా మనసంతా నీవే, నిన్ను మనసారా ప్రేమిస్తున్నానని,

Saturday, April 20, 2013

జీవనానుభూతి


ఆకుల పచ్చదనం
తెలుపు ఎరుపు రంగు గులాబీలు
చెట్లను చూస్తున్నా!
నాకోసమే
అవి పూస్తున్నాయన్నట్లు .... నాలో ఆలోచనలు!

తెల్లని మేఘ గజగమనాలు
నిశ్చల నీలి ఆకాశం స్థిరావేశం చూస్తున్నా!
ప్రకాశవంతమైన పగళ్ళు .... పునర్జన్మలు
కలల బృందావనాల పరిచయాలు
ఉపశమనం రాత్రిళ్ళను చూస్తున్నా!

రంగురంగుల ఇంద్రధనుస్సు లు
అందం అలంకరించుకున్న 
ఆకాశం ముఖం .... లా
ఆకాశం భూమాత ను
పలుకరిస్తున్నట్లు చూస్తున్నా!

రహదారులపై కదులుతూ
ప్రాణం .... చైతన్యం
అప్పుడప్పుడూ సేదదీరుతూ
చిరునవ్వుల కరచాలనాలు
కుశలమా! అనే పలుకరింపులు

దివినుంచి దిగి వచ్చి
దేవతలు మనుషుల్లో కలిసిపోయినట్లు,
ప్రేమ, పవిత్ర భావనల్ని పూస్తున్నట్లు
ఆ పరిమళాలు "నిన్ను ప్రేమిస్తున్నాను" అని
స్పర్శిస్తున్నట్లు .... అద్భుత భావనలు

పసి పాపల ఏడుపులో వింటున్నాను.
ప్రపంచాన్ని అశ్వాదించాలనే ఆరాటం
చూస్తున్నా!
పాపలు, పిల్లలై, పెద్దలవ్వాలనే
ఆతృతను!

నాకు తెలిసింది కొంతే
కాలంతో పాటు రేపటి పౌరులు 
నా కన్నా ఎక్కువ నేర్చుకుంటారు
అనుభవాల పాటాలు
ప్రకృతి ఉపదేశాలు ఎప్పుడూ ప్రాణికి అందుబాటులోనే ....

ఒక .... మధ్యతరగతి మనిషిని
ఆత్మీయ సహజీవనం చేస్తున్నాను.
ఎంత అద్భుతం ఈ ప్రపంచం!
ఎంత గొప్ప అనుభవం
ఎంత పవిత్ర అవకాశం .... మనిషిగా జన్మించడం అనుకుంటున్నా!

Friday, April 19, 2013

గుండెల్లో నొప్పి .... నీ వల్లే .... ఓ పిల్లా!


దాహం తీరదు.
ఊపిరి ఆడదు.
ఆలోచనల అనంత సంఘర్షణ ....
నొప్పి ... మళ్ళీ మళ్ళీ
అది ఒక విషాదం!
ఒక గుండె బ్రద్దలయ్యి
ముక్కలు ముక్కలౌతున్న భావోద్వేగం .... నొప్పి
గుండెల్ని ఎవరో చీరేసినట్లు ....

నా అడుగులు తడబడటంలేదు.
అలవోకగా విసిరిన .... ఆ జడ
కవ్విస్తూ ఆ నీ కొంటె నవ్వు
నీవు మళ్ళీ నా జీవితంలో కి
తిరిగొస్తావనుకోలేకపోతున్నాను.
పిల్లా! .... నీ జ్ఞాపకాలు
నీవూ నేనూ గోప్యంగా చెప్పుకున్న ముచ్చట్లు ....
వద్దు!
ఎందుకో తెలియట్లేదు
నీ ఆలోచనల్తో కాలం వృధా అవుతుందేమో అనే ....

కిడ్నీకి ఉంది.
గుండెకు ట్రాన్స్ ప్లాంటేషన్
నా నొప్పికి మందు .... ఉందా! ఎవరివద్దైనా అని ఆలోచిస్తున్నా?
నా గుండెపై ఒత్తిడి లేకుండా ....
నాకెందుకో సాధ్యం కావడం లేదు.
నొప్పిని ఒదిలించుకోలేకపోతున్నాను.
నమ్మకం కుదరదం లేదు.
నీ మనోభావనల్ని సరిపడ్డ మందేదైనా దొరుకుతుందా అని ....

నా నిన్నటి గతం
గడిచిపోయిన జీవితం తిరిగి పొందలేను.
చెడు దురాలోచనలకు దూరంగా
ప్మరేభావాన్ని ప్రేమించి పెంచుకుందాం అని,
నిజం!
నా నిన్నటి ప్రియభావమా!
నా ప్రేమకు నీవు అనర్హురాలివి.
ప్రేమ నీకు ఆట నిన్నెరిగిన్నాటి నుంచి చూస్తున్నాను.
నా ఆలోచనల్తో ఆడుకున్నావు.
నీ మాటల మృదుత్వం ఒక మాయ
ఒక తియ్యని మరిచిపోలేని మాధకం
నీవు కనాలనుకున్న కలలెన్నింటి పర్యవసానమో
ఈ క్షణం నా మది ఆలోచనల కుంపటై
ఆవిర్లు కక్కుతూ ఉంది.
ఏదో తీరని దాహం, తియ్యని బాధ
నొప్పి నన్ను చంపేస్తుంది.
తరుణోపాయం నివారణోపాయం కోసం కొట్టుకుంటున్నాను.
నొప్పి నుంచి బయటపడాలని,

ఈ తీవ్రమైన బాధనుంచి దూరం కాలేకే
ఉక్కిరిబిక్కిరి ఔతున్నాను.
తీసెయ్యాలి .... బాధను నానుంచి ఎవరైనా
పిల్లా! నీవైనా సరే ....
నా భావనల్లోంచి నన్నొదిలి పెళ్ళిపోతే చాలు.
వెర్రి వాడ్ని, పిచ్చివాడ్నౌతున్నాను.
నీవు చేసిన గాయమే కారణం పిల్లా!
నీ తలపులు, నీ మాటలు, నీ ఆశలు
నీ కలలన్నీ కుప్ప పోసిన భావనలు
నన్ను వెంటాడుతున్నాయి.
నా గుండె విచ్చిన్నమౌతుంది.
అందుకే .... ఓ ప్రియ భావమా .... పిల్లా! నీవైనా సరే
బాధ తెలియకుండా ఈ నొప్పిని నా నుంచి దూరం చెయ్యవా!

Sunday, April 14, 2013

నేను సర్వసాధ్యుడిని |జీవన ప్రలోభాలకు దూరంగా
చెడు నుంచి మంచిని వడపోసి
గొప్ప జీవన లక్ష్యాల్ని కలలు కని
యాంత్రికంగా జీవించాలనుకోని నాడు
నేనో అసామాన్యుడిని.

పలుకరించిన సలహాను గౌరవించి సమీక్షించి
నా నిర్ణయాలు నేను తీసుకుని
ఇతరుల విజయాన్ని హృదయపూర్వకంగా ప్రసంశించగలిగి
ఆశాభంగంనుంచి అనుభవాన్ని నేర్చుకున్ననాడు
నేనో కారణ జన్ముడిని.

అసాధ్యాల్ని .... చిరునవ్వుతో స్వాగతించి 
నవ్వగలిగి .... శ్రమించేందుకు ప్రయత్నించి
నా వల్ల కాదు అన్నోళ్ళను పట్టించుకోన్నాడు
పోరాట పటిమ పెంచుకుని సాధించగలను అనుకున్న నాడు
నేనో సాధకుడిని.

నా లక్ష్యాలను నేనుగా నిర్ణయించుకుని
నన్ను నేను నూతనంగా, ఉత్తమం గా,
నిస్వార్ధంగా .... ఆవిష్కరించుకుని, అంకిత భావంతొ
నా దారిలో ఇతరులకూ సహాయపడాలనుకున్న నాడు
నేనో సామాజిక తత్పరుడిని. 

ప్రతి ఉదయం తల్లిదండ్రుల్ని, ప్రకృతిని గౌరవించి (పూజించి)
గమ్యం వైపు నా పయనంలో వారి ఆశిస్సుల్ని నమ్మి
జీవితంలో ఒక మహోన్నత స్థానాన్ని చేరగలిగి
నా జీవితాన్నీ నన్నూ ఎందరికో ఆదర్శంగా మలిచిన్నాడు
నేను సర్వసాధ్యుడిని, చరిత్రపురుషుడ్ని!

2013, ఏప్రిల్ 14, ఆదివారం రాత్రి 9.45 గంటలు

Wednesday, April 10, 2013

ఒంటరిగా పుట్టాను .... ఒంటరిని నేను!


నిర్మానుష్యమైన రహదారి లో
ఒంటరిగా నేను .... గమ్యమెటో తెలియటం లేదు
భూమి ఆకాశాలు ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నట్లు .... భావనలు
నేను ఒంటరిని .... ఎందుకని? అని ప్రశ్నల వర్షం!
ఇదే తంతు ..... గత కొన్నేళ్ళుగా
సూర్యుడి తో పోటీ నా పయనం .... మండే ఎండ నా నేస్తం
వడగాలులు వీస్తూ, వెన్నులోంచి చెమటలు చిమ్ముతూ
ఒంటరిగా నేను .... ఒంటరితనం నా చుట్టూ వలయంలా
ఎవరో పిలుస్తున్నట్లు .... నా ఇంటికే నేను వెళుతున్నట్లు
జీవితం ఖర్చు అయిపోయి, బట్టలు చిరిగి
అఘాదాల్లోకి నమ్మకం జారిపోయి
బురదలో బుడతడి లా,
విశ్వాసం కోల్పోయి ....
ఆత్మన్యూనతాబావం .... నేను,
నా గమ్యం రహదారి అంతాన్ని చేరుతున్నా!
నా కెవ్వరూ లేరు .... ప్రేమించేందుకు స్నేహించేందుకు
ఒంటరిగా నేను .... ఒంటరితనం నన్ను మింగేస్తూ
నా భావనల్లో నాకదే పుట్టిల్లు
అంతిమ ధర్మం శ్మశానానికి మరో ఏడాది దగ్గరౌతూ ఉన్నా!

Tuesday, April 9, 2013

అంతే తేడా!


ఎప్పుడూ అంటూ ఉండేవాడ్ని నా ఉద్దేశ్యం వేరని
కానీ అదే నిజం
నా మనోభావాలు నీకెక్కడ కనిపిస్తాయో అని బెట్టు
చాలా కష్టం నీకైనా అర్ధం చేసుకోవడం

నా కళ్ళచుట్టూ ఇప్పటి ఈ నల్లని మరకలు
నిజం! వదులుకోలేకపోయిన అభిమానం గురుతులు.
నొప్పిని, తపనను, తియ్యని బాధను
మందు ఉపశమనంలో ఆనందానికి అడ్డిక్ట్ ను అయ్యి

ఇప్పుడు చెప్పు! నా ఎద మరకలు దాయమంటావా
సరే! నీకు, నీవు పరిచయం చెయ్యబోయే నీ స్నెహితులకు
నీ తల్లిదండ్రులకు, మన ఈ సమాజానికి
నా ఎద భావాలు కనబడకుండా దాయమంటావు .... అంతేగా!

నీ ఆలోచనల్లో, నీ మాటల్లో నేనో గందరగోళాన్ని
అది నిజం కాదని నీకూ తెలుసు
ఆలశ్యం చేసాను .... ఒప్పుకుంటాను.
నేను పచ్చాత్తాపం పడే సమయం దాటిపోయింది

నీవు నన్ను నన్నుగా చేరదియ్యగలిగే స్థితి కాదు నీదిప్పుడు
కొన్ని జీవితాల బాధ్యత నీమీదుందిప్పుడు
నా కథ ఏదో విధంగా ఎలాగూ ముగియబోతుంది.
ముగియనియ్యొచ్చుగా .... వీడ్కోలు చెప్పొచ్చుగా!

నీ స్నేహితుల్తో, నీ సమాజంలో సంతోషంగా సహవసించు
మనస్పూర్తిగా చెబుతున్నా!
వెళ్ళు! నాకు దూరంగా వెళ్ళిపో! 
నేననే వ్యసనపరుడ్ని నీవెరుగని భావదూరాల తీరాలకు వెళ్ళిపో!

నేను ఎప్పుడూ అంటుండేవాడ్ని అదుపుతప్పనని
అది నిజం కాదు!
చేసేప్పుడు నాకు తెలుసు నేను ఏమి చేస్తున్నానో
నీవే నావద్దకు రావాలనే అహంకారం దురబిమానం

ఈ మత్తుకు నేను దేవదాసును
ఈ అలవాటుకు ఓ కారణం చెప్పుకుంటున్నాను
ఆనాడు నా సాహచర్యం నా ప్రేయసికి అవసరం అని తెలిసిన్నాడు
అలక్ష్యం, ఆలశ్యం చేసాను సహచరుడ్నని చెప్పడానికి .... కనుక అని
 
అర్ధం అయ్యి
నిన్ను దూరం చేసుకున్న నాటి నుంచి
భ్రమలో బ్రతుకుతున్నాను
మత్తులో మునిగి నిన్ను ప్రేమించట్లేదనుకుంటూ

నీతో కూర్చుని సిగ్గు విడిచుంటే బాగుండేదని
అప్పుడప్పుడూ మనసు ఎదురుతిరుగుతుంటుంది.
ఆలశ్యం, అలక్ష్యం చేసావు .... లివర్ పాడయ్యేంతగా! ఎందుకూ అని
ఇప్పుడు సమయాన్ని నన్నూ చంపుకుంటున్నాను .... అంతే తేడా!

2013, ఏప్రిల్ 10, బుదవారం ఉదయం 5.40 గంటలు