Tuesday, April 23, 2013

డోంట్ కేర్!



ఎవరికీ అర్ధం కాదు.
నీలో నేను చూస్తున్నది కోరుకుంటున్నది ఏమిటో,
ఓ ప్రియా!
ఒకవేళ అర్ధం అయినా, తెలిసి ఉన్నా
నా తల తలలో లేదనుకుంటారు.
నా మనోభావం నిజాన్ని వారు చూడలేరు.
చూడలేరు వారు .... నా అంతరంగాన్ని!
అక్కడి నా అందమైన మరో ప్రపంచాన్ని!
ఔనూ! ఒక చిన్న అనుమానం
నా హృదయం కానీ నా మనసును ప్రేరేపిస్తుందా?
ప్రేరేపిస్తుండొచ్చు!
ప్రతిసారి హృదయ భావన వాస్తవం కానక్కర్లేదని తెలుసు!
ఒక్కటి మాత్రం నిజం! నా ప్రేమ విషయంలో నేను పొరపడ్డం లేదనేది.

ఒకవేళ
నాకు మళ్ళీ ప్రేమించే అవకాశం వొస్తే,
నిర్ణయించుకునేందుకు సమయం దొరికితే
అప్పుడూ కూడా నా నిర్ణయం ఇదే
నా నిన్నటి భావనే .... నా హృదయ స్పందన
నా మనసు ప్రశ్నించలేని నా హృదయం నిర్ణయం.
నా ప్రేమ కు సంబంధించి, తుది నిర్ణయం .... నా హృదయానిదే!

అప్పుడప్పుడూ నాకూ ఎన్నో అనుమానాలొస్తుంటాయి.
వెనుదిరిగి చూడాల్సొస్స్తుంటుంది.
చేసిందే చేస్తూ, చెప్పిందే చెప్పుతూ ....
బొంగరంలా ఒక్కచోటే తిరుగుతుంటాను.
మబ్బుల్లో, ఒక్కోసారి .... మోకాళ్ళలో
నా మెదడు మోకాళ్ళలోనే ఉంది అంటుంటారు స్నేహితులు.
నేలను విడిచిన సాము నేను చెయ్యడం లేదని నాకు మాత్రమే తెలుసు.
అయినా, నా స్నేహితుల దృష్టిలో ప్రేమించిన గుడ్డివాడ్ని నేను.
నిజం!
ఆమె తారసపడ్డాక నా జీవితంలో ఏదో తెలియని నాణ్యత,
నాలో చిత్రమైన మార్పు చైతన్యం,
ఇప్పుడు స్నేహితులేకాదు, చుట్టూ ఉన్న ప్రపంచం నవ్వినా సిగ్గుపడను.

ఔనూ!
నా హృదయం ఏమైనా
నా మనసును ఆజ్ఞాపిస్తుందా!
అవకాశం లేదు.
ఎన్నిసార్లో అనుకున్నది తప్పై బాధపడ్డ క్షణాలూ ఉన్నా,
ఈ విషయంలో
నా ప్రేమ నిర్ణయంలో మాత్రం నేను పొరపడటం లేదన్నది స్పష్టం.

No comments:

Post a Comment