Monday, April 22, 2013

అల్పసంతోషి


నిజంగా, నిజంగా ....
నీకోసమే నేను జీవిస్తున్నది.
ఆ దేవుడికీ తెలుసు నా ఆశ, నా గమ్యం నీవే అని,

నీవు లేని నేను
అసంపూర్ణుడ్ని, అసమర్ధుడ్ని .... అయోగ్యుడ్ని!
నిజం గా .... నన్ను నన్నుగా మార్చగలిగిన ప్రేరణవు .... నీవు!

ఒక ప్రేమానుభూతి, ఒక జీవనానుభూతి పంచుకోవాలనిపించే
సహజీవనానుభూతి .... నీవు నా పక్కన ఉంటే,
తొందరతనం, తప్పులు, సంకుచిత భావాలను .... దూరంగా విసిరెయ్యాలనిపిస్తుంది.

పిల్లా! నీ ఆలోచనల్లోంచి నన్ను విముక్తుడ్ని చెయ్యి
ఊహల రెక్కలు తొడుక్కుని .... నీతో కలిసి
ఆకాశం అంచుల్ని చవి చూసే ప్రేమికుడ్ని ప్రవరాఖ్యుడ్ని కానియ్యి!

నీవు నాకు కావాలి.
నీ సాహచర్యం కావాలి. నా సగభాగం .... నీవు కావాలి.
నిజం! నీవు లేని నేను అసంపూర్ణుడ్ని .... గమ్యం లేని అసమర్ధుడ్ని!

ఏ వికల్ఫమూ లేని నీ ఆకర్షణ
నీ క్రమబద్ద ప్రపంచంలోకి రావాలని ఉంటుంది ఎప్పుడూ.
మనోహరీ .... నీ ఊహల సముద్రంలో అమూల్య సంపదను .... నన్ను కానీ!

నీతో కలిసి జీవిస్తున్ననన్న ఊహ,
ఒక దివ్య ప్రేమానుభూతి!
కుల, జాతి, మత వివక్షతలను దూరంగా విసిరేసిన మహదానుభూతి!

పిల్లా! నాకు నీతో కలిసి జీవనం ప్రయాణం సాగించాలని ఉంది.
రేపటి ఆశల రెక్కలు తొడుక్కుని,
ఊహల స్వర్గం అంచుల్ని తాకుతూ, ఓ అల్పసంతోషి ప్రేమికుడ్ని కావాలని ఉంది!

No comments:

Post a Comment