Wednesday, March 30, 2016

స్వగతం




అవసరానికి నివాసం ఉండేందుకు
మానవత్వం కానీ
నా హృదయం కానీ
విడిది గృహాలేం కాదు
నా జీవితం ఒక అగ్నిగుండమూ కాదు
వెచ్చదనాన్నిచ్చి ఊరడించడానికి
నా బాహువులు కోటగోడలు కావు
సంరక్షణను సమకూర్చడానికి
అంతరంగంలో చెలరేగే పెనుతుఫానుల్నుంచి
నా హృదయం అయస్కాంతం మీట కాదు.
పొందాలనుకున్నప్పుడల్లా నొక్కేందుకు
ఎన్నాళ్ళని నీ ఈ పశ్చాత్తాపాల భారం మొయ్యగలను.
కాళ్ళు చచ్చుబడి నిలువెల్లా నీరసం
మన ఇరువురి భారం మోయలేక
చిల్లులు పడిన
నా శూన్య హృదయమే సాక్ష్యం
దీనికి సమాధానం నీకు తెలుసు
కానీ నీవు నిర్ణయించవు.
ఆ శూన్యాన్ని నింపడమెలాగో .....
తలుపులు తట్టావని
ఎలా రానివ్వను నిన్ను లోనికి
ద్వారం దగ్గర డోర్ మాట్ లా
వాడుకోవడం న్యాయం కాదు. నేరం
అలా వాడుకుని
మళ్ళీ తట్టి చూస్తున్నావు
అందుకే హృదయద్వారాలు
శాశ్వతంగా మూసుకుపోయాయి.

Tuesday, March 29, 2016

నీ తోడు కావాలి




నేను చీకటిలో ఉన్నాను. 

చూడలేకపోతూ 
నా పదాల్ని ....
నా హృదయపు ఆకాంక్షల్ని .... 

సరిగ్గా అప్పుడే 
కళ్ళు మిరిమిట్లు కొలిపే కాంతిలా .... 
ప్రత్యక్షం నీవు 



నన్ను పోనియ్యండి 
కలలో వచ్చి కలుస్తా తిరిగి అంటూ 

నేను మళ్ళీ చీకటిలోకే
నిద్దురలోకి జారుతూ తిరిగి 

పద పద పద కలిసి ముందుకు



తప్పించుకుని తిరిగి ప్రయోజనం లేదు
ఊహించుకుని
అందరినీ ఇతరులుగా భావించుకుని
అనుమానించి గాయపరుస్తారేమో అని

ప్రత్యామ్నాయముంది మాట్లాడుకోవడంలో 
కలిసి ఎలా కదలాలో
ఏది అవసరమో నిర్ణయించుకుంటే
అవసరాల పరిష్కారాలను సాధించొచ్చు 



ఏక ఫలాపేక్షతో ప్రత్యర్ధుల్లా ప్రతిస్పర్ధలు కావు
స్నేహితుల్లా కలిసి నిర్మించుకుంటే
ఒక కొత్త భవిష్యత్తును
కనీసం వారసులైనా ఫల మనుభవిస్తారు

Monday, March 28, 2016

కాలగతిలో





గ్రహరాసులు మారుతూ
నడుపుతున్న కారులోంచి
వెళుతున్నానని
నేను చెయ్యూపినంత వేగంగా
కదులుతుంది కాలం
నేను
ఆలోచిస్తున్నంతగా
నీ గురించి .... నీవు
దేని గురించీ
ఆరాటపడాల్సిన
అవసరం రారాదనే .... నా ఆశ

Saturday, March 26, 2016

ఏ దేవత చెక్కిన శిల్పమో




అసహాయుడిని కోల్పోయి
ఆశను, కన్నీటిబొట్టును
ఏడుపును ....
అలసిపోయాను.
ఆత్మ మూలాలు చెదలు పట్టిన
అంధకారం అన్నివైపులా చూసి

ఎంత గాఢమైనదో ఈ ప్రేమ
నా కళ్ళముందే
గడ్డకట్టిన
అతిశీతల బాధ
విమోచనము కోసం
వేడుకునేలా చేస్తూ 

 
నా మనోభావనలన్నీ కోల్పోవడానికి
నా అంతరంగంలోని
శూన్యమే కారణం
ఏ దేవతైనా
నా ఆవేదన గమనించి
దయ చూపదా అనిపించేలా

అస్తిత్వాన్ని పీడిస్తున్న బాధ
దాశ్య అశాంతి లక్షణమై
కన్నీరై
కలవరమేదో
ఏమీ అక్కర్లేదన్నట్లు
ఎందుకు జీవిస్తున్నాననిపిసూ

ఓ మానసీ విను
నా ప్రార్ధనను నా మనోవేదనను
గుండె భారమైన
కదల్లేని నా ఎదోద్విగ్నతను
స్వహత్యాసదృశ్యతను
మరణించే ధైర్యం లేకపోయినా

అవ్యవస్థుడ్ని అగమ్యుడ్నై
కొట్టుకుపోతూ అపరాధభావనలో
కానరాని తీరం
అయోమయ తరంగాలలోకి
జారిపోతున్నాను. అనాలోచిత
అవివేక భయం అస్థిరతలోకి

ఐనా ఎందుకో నా అంతరంగం లో
ఇప్పుడు పరిశీలనాత్మక
సంఘర్షణ
అచేతనత్వం నిద్దుర మేల్కొన్న
శిలా చైతన్యం ఏదో
నాకు సహకరించబోతున్నట్లు

అది ప్రేమో ఏమో



నిన్ను నేను కోల్పోయిన ఆలోచనే
నన్ను కృంగదీసి చంపేస్తుంది.
ఎంత దూరంగా ఉన్నా
ఏ కలల్లో, ఏ స్వర్గం లో నివశిస్తూ
విహరిస్తూ ఉన్నా
నీవు నన్నే ఆలోచించాలి

నాకంటే సన్నిహితులు నీకు
ఉండరాదు ఎవ్వరూ
ఉన్నారేమో .... అనిపించినా 
నన్నిక్కడ
జీవత్శవాన్నిలా వొదిలి
అది ప్రాణాంతకమే నాకు

ఎన్నిసార్లు నీవు
ఎన్ని విధాలుగా విడమర్చినా
జరిగింది మాత్రం
అంతా నీవైపునుంచే అని
మన ఇరువురికీ తెలుసు.

ఎప్పుడైనా నా మనసులో
ఏముందో
మన అనుబంధాన్ని
ఎలా నిర్వచిస్తానో
ఏమి చెప్పాలనుకుంటున్నానో
నీవు తెలుసుకోవాలనుకోలేదు. 


నాకేమో చెప్పాలనిలేదు
మనస్కరించడం లేదు ఇప్పుడు
ఎందుకంటే
నీవిప్పుడు నేను గుర్తించుకోదగని
మరొకరివి .... నీ ఇష్టంతో
నాకు మరీ దూరమయ్యి 


నిజం వాస్తవం మాత్రం 
నేన్నిన్ను కోల్పోలేను.
చూడకుండానూ ఉండలేను.
బ్రతకలేను.
నేను కోల్పోగలిగింది, 
ఇప్పటినిన్ను కాదు.
ఒకప్పటి నిన్ను మాత్రమే

నిజంగా నిజమేమిటో 
జరగబోత్రుందేమిటో 
నువ్వెవరివి కాబోతున్నావో
నేడు నేనెరుగకపోయినా
కష్టమే ....  అపరిచితురాలిగా
నిన్ను చూడాల్సిరావడం

ఓ మానసీ 
ఏ విధంగా 
ఆలోచించినా
నెన్నిన్ను కోల్పోలేను.
చూడకుండా ఉండలేను
బ్రతకలేను.

అందుకేనేమో అనుకుంటుంటాను.
నీకైతే సులభమేమో అని 
కాలంతో పాటు కదలడం
మరిచిపోవడం 
మన పసితనం 
పసిడి జ్ఞాపకాలను .... నన్ను

అలా అనుకోవడం
నీకూ సాధ్యమా అని 
అనుకుంటూనే అనిపించడమూ
భారం అనిపిస్తుంది గుండెకు
నిజం చెబుతున్నా
ఒట్టేసి మరీ

కొన్ని నిజాలు
ఇంత వేదనాభరితమూ 
తీపి విషమ అని
జీర్ణించుకోవడం
ఇంత కష్టమా అని 
అనిపిస్తుంటుంది

అయినా నా వరకు నేను
నీకు స్వేచ్చను
ఇచ్చెయ్యాలనే అనుకుంటున్నాను.
నన్ను ఒంటరినిగా
ఉంచుకునేందుకు సంసిద్దుడ్నై 

Thursday, March 24, 2016

విషం కురిసిన రాత్రి



వెన్నెల శర కిరణాలతో చంద్రుడు ఎక్కడో దూరంగా 
మిగిలిన ఆకాశమంతా కారు మబ్బులమయం  
అక్కడక్కడా గుడ్డి వీధి దీపాలు 
నీరసంగా వెలుగుతూ 


ఇక్కడో ధారుణం సాక్షిని 
నిశ్చేష్టుడ్నై నేను
మడుగై దారగా కారుతూ రక్తం ....
లోతుగా నీవు పొడిచిన గుండె గాయం నుంచి 

వడబోసిన ఆలోచనల్లో



ఎప్పుడైనా ఒకవేళ
పిలిచాను అంటే
గాఢనిద్రలో ఉండి మరీ
నిన్ను
అర్ధం చేసుకోవాలి. 



నీవు నా ఆశల ఆలోచనల
పుష్పగుచ్ఛం పరిమళానివి అని
అంధకారం చుట్టూ అలుముకుని
దిక్కుతోచని వేళ
నా కన్నుల కాంతివి అని

చూస్తున్నాను నీ కళ్ళలోకే



చూస్తావేమోనని కళ్ళలోకి
అయోమయంలో పడి
కొట్టుకుపోతున్న నన్ను
ఒడ్డుకు చేర్చేందుకు ....
పరితాపం సంద్రం లో

చూస్తూ ఉన్నాను
నీ కళ్ళలోకి సూటిగా
వాత్సల్యానురాగోదృతుల
వెచ్చదనంలో మండి
ఆవిరై పోతున్న నన్ను
కరిగిపోనివ్వవేమో అని 



నా కళ్ళళోకి సూటిగా
చూస్తావేమో అని
ఎంతో ఆశగా నీ ఆనందొల్లాస
నిశ్చయ సంకల్పాల
భావోద్వేగం లో మునుగుదామని

నీచే ప్రేమించబడదామని
సంరక్షించబడదామని
ఎప్పటికీ
నీ తోడూ నీ నీడ నేనై
నా జతవ్వై
నాతోనే నువ్వుంటావేమో అని

దీపాన్నై



చిలికిన మోహ సంద్రపు 
విషాగ్ని కీలములు వడపోసిన   
ఏ దీపపు కాంతినో అయ్యి 
నీవు నడుస్తున్న 
రహదారిలో వెలుగులు పరిచి 
మార్గదర్శకుడ్ని కావాలనుంది. 
అమృతం పొంగిన హృదయంతో 

Wednesday, March 23, 2016

నీ చూపుల్లోనే .... స్వర్గం



ఎర్ర తివాచీ స్వాగతాలు పరచక్కర్లేదు. 
తెరిచి ఉంచు .... నీ హృదయం తలుపులు 
తాపసినై నివశించేందుకు వస్తాను. వింటాఉ. 
విని తరించాలి. నిన్నూ నీ మది భావనల్ని 
నీ జతనై ఉండిపోవాలి.
నాలాగానే నీవూ శాంతిని 
ప్రశాంతతను కోరుకుంటున్నావని తెలుసు 
  
నీతో జీవించాలనే జీవనావసరం ఏదో 
ఎప్పటినుంచో .... నన్ను ప్రేరేపిస్తుంది. 
ఎప్పటికీ నిన్ను సొంతం చేసుకోవాలని  
నీవే ఉండాలి నా హృదయాంతరాళాలలో అని
అన్ని పరిణామాలకూ సిద్ధమై ....
అది తప్పో ఒప్పో మొండితనమో కానీ
నీ కళ్ళలోనే స్వర్గాన్ని చూడగలననిపిస్తూ  


ఎన్నో తర్జనభర్జనలు మది మధనాల పిదప  
నిర్ధారణైన వాస్తవం ఇది. 
తొందరపాటు ఆకర్షణలో ఏర్పడే విపరీత 
అపస్వరపు పలుకులు అనుకునేవు.  
కానీ, ఏదో పిచ్చి నమ్మకం  
నీవు తప్పక అర్ధం చేసుకుంటావు 
నా మాటల్లోని నిజాయితీని స్వచ్చతను అని 

ఎన్నో అనంత కాలాల నిరీక్షణల ఫలితం 
మన ఈ కలయిక .... నిజం   
నా శాశ్వత అపార తపోఫలం నీవు 
తప్పో ఒప్పో మొండితనమో తెలియదు మరి  
నా గుండెలో మాత్రం నీవే ఉండాలి అని,
నీ సాన్నిహిత్యం లో నీ కళ్ళలో మాత్రమే
స్వర్గాన్ని చూస్తూ నేను కరిగిపోవాలని 

Tuesday, March 22, 2016

ఎంత బాగుణ్ణు!?



హామీలు బాసలు
కృత్రియమైన, నమ్మరాని
శూన్య పదాలు కాకపోతే
ఆచరణీయ వాస్తవాలైతే 

వాగ్దానాల ఉద్దేశ్యం
బద్ధునిఁగాఁజేయడమే అయ్యి
ఒకరి ఆత్మను
ప్రతీక్షణింపచేయకుండా ఉంటే

సాహచర్యం లో తేఁటదనము,
స్వచ్ఛత జ్ఞాపకాలను
మదిపొరలపై
అందంగా చిత్రీకరించడమే అయితే 



ఎన్నో ఆటల అసూయల
గిల్లికజ్జాల పసితనం
గాయాల అనుభూతుల చిహ్నాల
నెమరువేతే అర్ధమై .... అర్ధవంతమైతే

ఆలోచనల అలసటతీర్చడమే
ప్రేమ లక్ష్యమని నమ్మచెప్పడం
అబద్దపు వాగ్దానం
గాలి మబ్బే కుండపోతై కురిస్తే

పరీక్షా ఫలితం



అది ఒక చెడు నిర్ధారణే .... కానీ
వాస్తవం
అది పుట్టకురుపు మాత్రమే కాని
గాఢమైన లక్షణం
ఎంతో విచిలితుడ్ని చేసే
విచారించాల్సిన విషయం 
అది ప్రేమ 



అన్ని వైపులా
ఆ ప్రేమ వేర్లు విస్తరించి
లోతుగా వ్యాపించి
ఆత్మ అంచులవరకూ సాగి
ఎవ్వరూ శస్త్రచికిత్స చెయ్యలేని విధంగా
స్థిరపడి మాడని గాయమై
క్షోభించేలా చేస్తూ

స్వహత్యే మరోసారి



మరి ఒక మరణం అలజడి .... అతని లో
తల ఆలోచనలకు విశ్వాసానికి సూటిగా గురిపెట్టిన
ఆయుధం, ఆమె .... ఆమె పేరు ఆకర్షణ 

అంచనాలు తలక్రిందులని తెలియరాని అయిష్టత  
ఉనికి బయటపడు ఆస్కారం లేని ....
ఏ అవ్యక్త రహశ్య గుహలోకో జారిపోవాలనిపించుతూ  



కోరి తెచ్చుకున్న కెలుక్కున్న గాయం అది.
ఫ్లోర్ పై కారుతున్న ఆ వెచ్చని రక్తం బొట్లతో .... అతనికి
స్వహత్య భయానకమే కానీ అలసట కాదు.

Monday, March 21, 2016

కలం భావం



కవిత్వం జీవితం 
ఒక గొప్ప అనుభూతి కవిత్వం 
ప్రతి ఉదయమూ 
వేకువ వేళ నుంచీ 
శ్వాసించే స్వచ్చమైన గాలి లో
కవిత్వం 
కవిత్వం లోనే మనిషి మనుగడ 
అనునిత్యమూ
సమాజం నిర్వచించని 
ప్రేరణాత్మక 
చైతన్యాల మొలక కవిత్వం

నేనూ కవినే



సంఘటనలు పరిస్థితుల్లో
నిండుగా మునిగి
స్పందించాలనిపించి
మంచి చెడులను విశ్లేషించి

మనోభావనలను 

 
వివరించలేని
స్పష్టీకరించలేని

అందుకు సరైన
అక్షరాలూ పదాలు దొరకక
బాధపడేవాడే మనిషే కవి కదూ

Tuesday, March 15, 2016

దూళిమయమే అంతా



నా కళ్ళలోకి లోతుగా 
నొప్పిపై ముసుగేసుకున్న మందహాసాన్ని చూడు 
ఆ మందహాసం చాటున 
భద్రంగా దాగిఉన్న కన్నీటిని చూడు
నీకు కనిపిస్తున్న ఆ మెరుపు కన్నీటిదని నాకు మాత్రమే తెలుసు 
ఆ నిజం అక్కడ పక్కనే ఉన్నా చూడలేవు నీవు 

నా మనసు చుట్టూ నేను కట్టుకున్న 
ఆ అభిమానం గోడను నీవు చీల్చలేవు 
సామాన్యత నేను మాత్రమే కనిపిస్తుంటాను నీకు 
అంతా సర్ధుమణిగిన సాధారణ స్థితే కనిపిస్తూఉంటుంది. 
గబ్బిలం లా భయం అనే 
బలమైన గోడ అంచుకు తలక్రిందులుగా  వ్రేలాడుతూ 

ఎప్పుడైనా నాకు నీ పిలుపు వినిపిస్తూ ఉంటుంది,
ఆలాపనలా .... భావోదేగుడ్నౌతుంటాను. 
తారతమ్యాల గోడలను బ్రద్దలు చేసేద్దామనిపించేస్తుంటుంది.
గోడ ఇటుకలు కట్టుబాట్లు దూళిగా మారిపోయే 
పిడిగుద్దొకటి గుద్దాలనిపిస్తుంటుంది.
అంతా ఊహే .... అంతా అనుభూతే  
ఎదురుగా నిన్నూ నీ ముఖం లో ఆశ్చర్యాన్ని చూస్తున్నట్లు 

అనూహ్యంగా దూసుకుని వచ్చి 
దగ్గరకు తీసుకుని కళ్ళముందున్న నీ చెయ్యందుకుని 
నేనున్నాననే ఆస్వాసన ఇవ్వగలిగితే నీవు స్వాగతిస్తే .... ఊహ
అలాంటి ఎన్ని వింత ఊహలో కలలో 
ఆ కలల ఊహల్లోంచి ఉలిక్కిపడి 
వాస్తవికతలోకి రాక తప్పేదు .... నిరుత్సాహపడక 

సామాన్యుడ్నై అప్పుడు .... నీ వైపు చూస్తుంటాను. 
ఆ కోరికలు ఆ ఊహలు వాస్తవాలు కావాలని 
గొప్ప గొప్ప పదాల్లోని ఔన్నత్యాన్నిలా 
నన్ను నేను నీ కళ్ళముందు నిలబెట్టుకోవాలని 
నీవు చూడాలి అనుకునే ఈ భావనలు ఈ కోరికలతో  
నా ఆలోచనలకు రెక్కలొచ్చి ఎగరాలనుకుంటాను. 

నీ పరిచయాన్నీ నీతో ఉన్న అనుబంధాన్ని 
నాలో నేను గొణుక్కుని కళ్ళు ఆర్పుతూ బిడియపడుతుంటాను. 
ఆ భావనలతో సంబధం లేనట్లు నీవ్వెళ్ళిపోతుంటావు. 
నీవు తిరిగి రాలేదెందుకు అని 
ఇలా ఎన్ని నాళ్ళుగానో వేచి చూస్తున్నాను
రహదారి లో దూళి లా

Monday, March 14, 2016

ఓ మానవతా వాది




లోతైన
ఆలోచనల్లో
కూరుకుపోయి
ఊపిరాగి
మరణించేంతగా
ఆ ఆలోచనల్లోనే
కొట్టుకుపోయి
ఓ మనిషీ ....
ఎటు
నీ పయనం?
ఆ ఆశయ తోరణాల
మరణమృదంగాల
చరిత్రాక్షర
శిలాపలకాలు
నీ గమ్యమా!?

Saturday, March 12, 2016

ఓ భగవంతుడా



ఓ భగవంతుడా 
ఎలా? 
చంపుకోను 
నన్ను నేను ....
గడిపేందుకు 
రోజంతా 
ఆలోచించరాదని 
నీ గురించి 

ఉద్విగ్నత


నీ దారిలో
ఎదురైన ప్రతి దాన్నీ
మండించి మసి చేస్తున్నావు.

వెలిగి ఆరుతూ
కందిన కాంతి
నీ ముఖంపై ఎర్రగా ఉబ్బుతూ

నీ మాటలు కాల్చేస్తూ
నీ హృదయం గర్జిస్తూ
నువ్వొక దావానలానివి లా

Thursday, March 3, 2016

భూతద్దంలో చూసి


ఆమె అనుకరిస్తూ ఉంది
పదే పదే
తన పాలి  
పగిలిన
భంగిమలను
ఎన్నాళ్ళుగానో
ప్రియుడు
పదిలంగా దాచుకున్న
తన వక్రీకృత జ్ఞాపకాలను