Tuesday, March 22, 2016

ఎంత బాగుణ్ణు!?



హామీలు బాసలు
కృత్రియమైన, నమ్మరాని
శూన్య పదాలు కాకపోతే
ఆచరణీయ వాస్తవాలైతే 

వాగ్దానాల ఉద్దేశ్యం
బద్ధునిఁగాఁజేయడమే అయ్యి
ఒకరి ఆత్మను
ప్రతీక్షణింపచేయకుండా ఉంటే

సాహచర్యం లో తేఁటదనము,
స్వచ్ఛత జ్ఞాపకాలను
మదిపొరలపై
అందంగా చిత్రీకరించడమే అయితే 



ఎన్నో ఆటల అసూయల
గిల్లికజ్జాల పసితనం
గాయాల అనుభూతుల చిహ్నాల
నెమరువేతే అర్ధమై .... అర్ధవంతమైతే

ఆలోచనల అలసటతీర్చడమే
ప్రేమ లక్ష్యమని నమ్మచెప్పడం
అబద్దపు వాగ్దానం
గాలి మబ్బే కుండపోతై కురిస్తే

No comments:

Post a Comment