Sunday, August 31, 2014

ధన్యవాదాలు చెప్పుకోవాలనిపిస్తూ


జీవితాంతం తోడుంటానని మాటిచ్చి స్వల్పకాలమే తోడుండి,
ఒంటరిని చేసి,
కలలా దూరమై
కన్నీళ్ళపర్యంతం చేసిన .... సహచరి,
దూరమైనప్పట్నుంచీ
వెన్ను నొప్పి
గుండెల్లో నొప్పి పెరిగిపోయి
బాధోపశమనం
అరుదుగా పలుకరించే అదృష్టంలా దూరమై
జీవితం పై నమ్మకం కోల్పోయి
నట్టింట్లో, ఒంటరై
రెండుచేతులతో తలను పట్టుకుని
కళ్ళుమూసుకుని తపిస్తూ జీవత్శవం లా జీవించాను.

భవిష్యత్తంతా గతం గానూ ఆశలు, కలలు .... కన్నీళ్ళుగానూ మారి
బాధలు, గాయాలే
వాస్తవాలు వర్తమానాలు అయి వెక్కిరిస్తూ
నిజం కాని
తిరిగిపొందలేని సాహచర్యపు చేదు జ్ఞాపకాల
అనుభూతుల నీడలో
శోకం లో తియ్యదనం అనుభూతిని పొందాలనున్నా
ఆ జ్ఞాపకాలూ మసకేసిపోయి
వర్తమానం, వాస్తవం రూపురేఖలు
మనసు సమ్మతించని స్థితులై
అందిన అవకాశాల ఆసరాగా
జీవన పోరాటం తప్పదనిపించుతూ
భాగ్య, దౌర్భాగ్యాల సమయ నిర్ధారణ చేసే
అదృష్టాన్ని తిట్టుకోవడం తగదనే నిర్దారణకు రాక తప్ప లేదు.


కదులుతున్న కాలం తో పాటు సాహచర్యం పై పెంచుకున్న ఆశలూ
జ్ఞాపకాల మధుర అనుభూతులూ
మసకేసిపోయాయి,
ఆశల ఆకులు రాలిన మోడు లతలా
జీవితం లో కాలం కదలికలు ప్రకృతి మార్పులతో
మళ్ళీ కొత్త ఆలోచనలు,
సరికొత్త ఊహల చిగురులతో
జీవితంలో నూతనత్వం పొందుతున్న వింత అనుభూతి
ఇప్పుడు, మిగిలి ఉన్న జీవితం ....
తిరిగి పొందిన బహుమానం అనిపించుతూ
కాలానికీ ప్రకృతికీ
కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తుంది.
కాలం పందిరికి ఋతువుల ఆసరాతో చిగురుల లతలా ఎగబ్రాకుతుంటే

Saturday, August 23, 2014

భావావేశం


ఎంతో వేగంగా
అది
బాధో, ఆరాటమో, తపనో
ఒక నిశ్శబ్ద ఆలోచన .... లా
గుండె లోతుల్లో
మనసుపొరల్లో వస్తువై,


అది
ఉల్లాసమో,
జలదరింపో
శరీరం ప్రకాశవంతమై
బంగరు పదాలు కొన్ని
అందంగా రూపుదిద్దుకుని
ఒక కవిత లా

జ్ఞాపకాల శరాలు తాకి



నేనొక బందీనయ్యాను.
నా మనసు కారాగారం లోనే ....
ఎప్పుడూ
నన్ను నేను కోల్పోయి
ఏ ఆలోచనల చిట్టడవిలొనో ఇరుక్కుపోయి
బయటపడలేక
తలరాతను రాసిన నేర్పరి ఏ జాలరి
వలలోనో చిక్కుకుపోయాననుకుంటూ ....
మార్గదర్శకం కోసం ఆశగా చూస్తున్నాను.
కాలం కనికరంతోనైనా
బయటపడగలను అనే నమ్మకంతో 



ఎక్కడో దూరంగా నిలబడి
నీవు, నన్ను చూసి నవ్వుతున్నట్లుంటుంది.
వెన్నెలలా మెరుస్తున్నట్లుంటావు.
నీ నీలిరంగు కళ్ళు ....
చేరువకు రమ్మని కవ్విస్తూ ఊరిస్తూ
నా రాత్తిరి ప్రశాంతతను
దూరం చేస్తుంటాయి..
కుక్కల కీచురాళ్ళ కేకల్లా ....
నాటి మన ఏ చిన్న జ్ఞాపకమయినా చాలు ....
ఈ గుండె మరింతగా బ్రద్దలవ్వడానికి

తొలుత సాధారణంలానే అనిపిస్తాయి.
ఆలోచనలు, అనుభుతులు
ఏ కదిలి వెళ్ళి పోయే పిల్ల గాలిలానో
నన్నొదిలి వెళ్ళిపోతున్నట్లు ....
కానీ,
ఆనాటి మన అనురాగ పరిమళాలు
వెళ్ళినంత వేగం గానే వచ్చి
మళ్ళీ చుట్టేసుకుంటున్నాయి.
జ్ఞాపకాలై ....
అవి నా గుండెను బలంగా తాకినప్పుడు
తట్టుకోలేక, నిబ్బరపడలేక  
కాలం సయోద్య కోసం
ఆశగా .... వేచి చూస్తున్నాను..
అయినా నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి.

Sunday, August 17, 2014

నిశ్శబ్ద రోదన



జాగ్రత్తగా భారంపడకుండా దూదిలా
దొర్లుతూ .... ఆమె
ఒకవైపునుంచి రెండోవైపుకు .... నాపైనుంచి

మా ఇద్దరి ఆత్మలూ నర్తిస్తూ
గ్లాసు స్పటికం లోంచి కాంతిపుంజాలు
మోహాతిరేకపు మెరుపుల్లా
పరావర్తనం చెంది
ఆమెలోకి ఇంకిపోతూ
పొర్లుతూ .... అల్లుకుపోయి ఆమె, నేనూ



కలిసి భస్మమైపోయేందుకు సిద్దమై
ఒక్కరుగా చుట్టుకుపోయి
సర్పాల్లా .... భావప్రాప్తిని చెందుతూ

చెయ్యీ చెయ్యీ కలుపుదాం ....



ఎప్పుడో ఒకప్పుడు అవసరాలు తీరని అభాగ్యులమే అందరమూ
పొందలేమని తెలిసీ ఆశ చావక ప్రాదేయపడుతూ .... సహాయం కోసం
సహాయం చెయ్యాల్సిన వారు వారికేమీ పట్టనట్లు
తమ తమ గమ్యాల వైపు కదులుతూ .... కనికరమూ, ప్రేమ
పంచాలనున్నా .... కాలం వృధాకావడం ఇష్టం లేకే
తోటి మనిషికి కనీసం మద్దతు పలకలేనట్లు, సహకారం చెయ్యందించలేనట్లు,
ఎవరి అవసరాలకో ఉపయోగపడటం తమ శక్తికి మించిన పనైనట్లు,
ప్రవర్తిస్తుండటం చూస్తూ ఉంటాము.

నిజంగా ప్రతి ఒక్కరూ సహాయం చెయ్యడమో పొందడమో
ఒక నిర్ణయం తీసుకోక తప్పనిస్థితే ఎదురైతేగానీ ....
తమను తామే అని చెప్పుకోలేని నోరులేని వారి కవచాలుగా
నరకతుల్య జీవనాన్ని గడుపుతున్న జీవితాల చీకటిని తరిమికొట్టే కాంతులుగా
ఈ రోజు చేసే సాయం ముందు తరాల వారసులకు చెందుతాయనుకునైనా
నిలబడమేమో. అనిపిస్తుంది.



నిజం! నీకు నా అవసరం ఉంది. నేను తప్పించుకు తిరుగుతున్నాను.
చెయ్యందించాల్సిన నేను దూరమై ....
ఎవరో నిన్ను .... ఒంటరితనం నుంచి బయటకు లాగి
నీ నిట్టూర్పే నన్ను పరిహాసిస్తున్నట్లనిపిస్తే .... ఎంత బాధో
తోటి మనిషినై నేను చెయ్యాల్సిన, చెయ్యగలిగిన సహాయం
ఎవరో అపరిచితుడు చెయ్యడం, ఎప్పటికీ గుర్తుండిపోయే ....
పరిహసించే అమానవత్వమే

ఒకరికొకరం సహాయం చేసుకుని జీవించాల్సిన స్థితే .... అందరిదీ
ఎవరికో సాయపడటం, నాకు నేను సాయపడటమే, సహకరించుకోవడమే
సహాయం పొందిన కళ్ళలో ఆనందం అద్భుతాలను చూడగలగడం
ఒక మంచి పని చేసిన సంతృప్తి, ఆనందంతో నిద్రించగలగడమూ జీవనవరమే
ఒక ఆరోగ్యకర వరం .... ఎవరికైనా సహాయం చెయ్యాలనే నిండైన ఆలోచన
ఎంత ఆనందమో, ఎంత ఉల్లాసమో ....
గుండె పాడుకునే పాట .... సహకరించుకోవాలనుకోవడమే అయితే

Saturday, August 2, 2014

మనోగతం



నిశ్శబ్దం ద్వారా
వీస్తూ ఉన్న ఆ గాలి
నా స్వరమే

పెదవులు జారి
నేల రాలి దుమ్ముకొట్టుకుపోయి
అలా అస్పష్టం గా ....
వినపడీ వినపడనట్లుగా

అవగతం చేసుకోలేదుగా,
నా మనోగతం .

Friday, August 1, 2014

ప్రకృతి సహజం



ఇష్టాలు, కష్టాలు, బలహీనతలు
శూన్యతను సృష్టిస్తూ ....
ప్రేమ, మనిషిని
ఎప్పుడూ నగ్నంగానే నిలబెడుతుంది.

అంతమాత్రాన
అతను తనను తాను చంపుకోవాల్సిన పని లేదు.
ఒక యువతిపై ప్రేమ, పురుషుడి లో
ప్రకృతి సహజత్వానికీ ప్రతీక .

ఊహల ఆలోచనలు

శరీరం కోల్పోయిన ఆత్మలవి
గాలి తమ్మెరలై
స్పర్శిస్తూ
నిరంతరం,
రహదారుల్లో ....
నేను నడిచేప్పుడు