Sunday, August 31, 2014

ధన్యవాదాలు చెప్పుకోవాలనిపిస్తూ


జీవితాంతం తోడుంటానని మాటిచ్చి స్వల్పకాలమే తోడుండి,
ఒంటరిని చేసి,
కలలా దూరమై
కన్నీళ్ళపర్యంతం చేసిన .... సహచరి,
దూరమైనప్పట్నుంచీ
వెన్ను నొప్పి
గుండెల్లో నొప్పి పెరిగిపోయి
బాధోపశమనం
అరుదుగా పలుకరించే అదృష్టంలా దూరమై
జీవితం పై నమ్మకం కోల్పోయి
నట్టింట్లో, ఒంటరై
రెండుచేతులతో తలను పట్టుకుని
కళ్ళుమూసుకుని తపిస్తూ జీవత్శవం లా జీవించాను.

భవిష్యత్తంతా గతం గానూ ఆశలు, కలలు .... కన్నీళ్ళుగానూ మారి
బాధలు, గాయాలే
వాస్తవాలు వర్తమానాలు అయి వెక్కిరిస్తూ
నిజం కాని
తిరిగిపొందలేని సాహచర్యపు చేదు జ్ఞాపకాల
అనుభూతుల నీడలో
శోకం లో తియ్యదనం అనుభూతిని పొందాలనున్నా
ఆ జ్ఞాపకాలూ మసకేసిపోయి
వర్తమానం, వాస్తవం రూపురేఖలు
మనసు సమ్మతించని స్థితులై
అందిన అవకాశాల ఆసరాగా
జీవన పోరాటం తప్పదనిపించుతూ
భాగ్య, దౌర్భాగ్యాల సమయ నిర్ధారణ చేసే
అదృష్టాన్ని తిట్టుకోవడం తగదనే నిర్దారణకు రాక తప్ప లేదు.


కదులుతున్న కాలం తో పాటు సాహచర్యం పై పెంచుకున్న ఆశలూ
జ్ఞాపకాల మధుర అనుభూతులూ
మసకేసిపోయాయి,
ఆశల ఆకులు రాలిన మోడు లతలా
జీవితం లో కాలం కదలికలు ప్రకృతి మార్పులతో
మళ్ళీ కొత్త ఆలోచనలు,
సరికొత్త ఊహల చిగురులతో
జీవితంలో నూతనత్వం పొందుతున్న వింత అనుభూతి
ఇప్పుడు, మిగిలి ఉన్న జీవితం ....
తిరిగి పొందిన బహుమానం అనిపించుతూ
కాలానికీ ప్రకృతికీ
కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తుంది.
కాలం పందిరికి ఋతువుల ఆసరాతో చిగురుల లతలా ఎగబ్రాకుతుంటే

No comments:

Post a Comment