ప్రేమంటే, ప్రియభావనంటే ఏమిటో తెలుసా?
సిగ్గుకూ, అలుకకు అర్ధం తెలియనంతవరకూ
ఎవరీ ఆనందం కోసమో
నిన్ను నీవు సర్వం కోల్పోనంతవరకూ
ప్రేమానురాగ బంధాల అర్ధం .... తెలుసా నీకు?
ముద్దాడిన పెదవులు గాయపడతాయని
చెల్లించాల్సిన మూల్యం అమితం అని
శూన్యం అయిన హృదయం .... ఒంటరితనం లో
వేదనలో తియ్యదనం వెదుక్కునేంతవరకూ
ప్రియరాగం వెలువెంతో తెలియదని .... తెలుసా నీకు?
శూన్యమైన గుండె పరితపించేవరకూ .... తెలుసా నీకు?
స్మృతుల, ఆలోచనల గతం అనుభూతుల్లో
నిలువెల్లా మునిగి ఊపిరిని కోల్పోయేవరకూ
పెదవులు వెచ్చని కన్నీటిని రుచి చూసాక కానీ
ముద్దు రుచిని కొల్పోయిన నిజం తెలిసిందని,
అగ్నికీలల్లో మండిన గుండె అస్తిత్వం గురించి .... తెలుసా నీకు?
ప్రేమ కోసం కాలంతో పోరాటంలో
మరణించనూలేక జీవించనూలేక
నిద్దురలేని ఎదురుచూపుల నిరీక్షణలో కానీ
అర్ధం కాలేదని .... ప్రేమంటే ప్రియరాగం అంటే అని,
No comments:
Post a Comment