Sunday, September 7, 2014

ఆమె, అతను


అతని చూపుల్లో, అతని మాటల్లో
అతను పెదవులు కదిల్చే విధానం లో
ఏదో ఆకర్షణ
మోహితురాలై .... ఆమె ఆగింది
అతని ప్రయత్నాలు చూసి
అతనిలో సాదించాలనే ఆ పట్టుదలను చూసి
మారాలి మారతాను అని
అతను తనకు తాను చెప్పుకోవడం చూసి
ప్రేమ
మోహ
అస్పష్ట భావనావస్థల్లో
అతను .... ఎలా దగ్గరకు తీసుకుంటాడో
బాహువుల్లోకి అని .... ఊహిస్తూ,
ఆమె ఆగింది.
అతనితో ఆమె వివాహం జరగొచ్చని
ప్రేమ దొరకొచ్చనే
ఆగింది ఆగాలనిపించే
కష్టాలు
గడ్డురోజులు వస్తాయి, పోతాయి అనే
అబౌతికమే మిగిలేది అనే
ఆగింది
ఆలోచిస్తూనే ఉంది
ఆమె ఆగింది .... ఆగుదామనిపించే
ఆమెకు నమ్మకం కుదిరింది.
కోరిక ఫలించింది. 


అతను మారాడు.
మారాక కూడా అతను ఆనందంగానే ఉన్నాడు.
ఇన్నాళ్ళూ ఆమె అతన్ని ప్రేమించింది.
ఇప్పుడు అతనూ ప్రేమిస్తున్నాడు.
ప్రేమ, మోహ భావనలతో
పరిణయ వేళల కోసం 
ఆమె ఆగింది .... ఆగిపోవాలనే
సహధర్మచారిణై మిగిలిపోవాలనే .... అతనితో

No comments:

Post a Comment