అని భయపడకు!
నీకు అర్ధం అయితే చాలనే ....
నీ గురించి అనుకునేవు!? నాగురించి ....
నేనో వెర్రివాడ్ననే,
కలల మేడలు
గాలిలో కట్టుకుంటున్నాననే,
ఎప్పుడైనా
పిచ్చివాడ్నిలా కనిపిస్తుండొచ్చు
మరిచిపో! పట్టించుకోకు .... అంతే!
దూరంగా మాత్రం పారిపోకు
వెళ్ళిపొమ్మని చెప్ప లేను
మన జీవితాల కథ
అనుకోమంటాను కానీ.
నాకు నీపై నమ్మకం
నీ నమ్మకాన్నై, నీ ధైర్యాన్నై
నీ పక్కన .... నీడలానైనా
నిలబడిఉండాలని ఉంటుంది.
వాస్తవ అస్తిత్వాన్నై
నన్ను నన్నుగా
అంగీకరించబడేందుకు వీలుగా.
ఎన్నిసారులో, ఎన్ని విధాలు
మనసువిప్పగలనో
అర్ధం కావడం లేదు .....
అర్ధం కావడం లేదు,
ఎక్కడికి వెళ్ళాలో ....?
నీవు కలిసాక
కళ్ళు తెరిచాక తెలుసుకున్నాను.
నేనూ నా అస్తిత్వం ఏమిటో?
నా గమ్యం ఏమిటో?
నీవు ఎక్కడి నుంచో వచ్చావు
ఇక్కడే నాకు దగ్గరయ్యావు.
బహుశ
నన్నుద్దరించేందుకే అయ్యుంటుంది.
నేను నమ్ముతున్నాను.
నీ సాహచర్యం లో
నా, నీ జీవన
పురోగమనం సాధ్యమని
నా ఈ వింత ఆలోచనల్ని చూసి
వెర్రివాడినని భయపడకు.
నా మాట విను చూడు.
నన్ను నమ్మి చూడు
నా నమ్మకం చత్రం క్రిందకి .... వచ్చి
నన్ను నన్నుగా గుర్తించి,
నమ్ము! నన్ను నన్నుగా .... ఓ చెలీ!
No comments:
Post a Comment