Saturday, September 27, 2014

ముందుకే నడుస్తున్నాననుకుంటూ


నాదొక చిత్రమైన మనస్తత్వం 
నీకు కనపడకుండా
నన్ను నేను దాచుకుంటూ
పైకి నవ్వుకుంటూ
లోలోన ఏడుస్తూ
ఎన్నో పోగొట్టుకుని
ఏమీలేని నిరాశాజీవనం .... జీవిస్తూ

కసి .... ఏదైనా సాదించాలని
నిరూపించుకోవాలని
గడచిన జీవితం లో
గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు లేవని
అశక్తుడ్నయ్యేవరకూ ఏడుస్తూ
రక్తం, చెమట ఓడుస్తూ
జీవించుతూనే మరణిస్తూ 


ఒంటరిగా కూర్చుని
చెప్పుకుంటున్నప్పుడు నాకు నేను
శ్రద్దగా వినేవారు లేరని 
దిగులుపడుతూ,
వాస్తవం మాత్రం జీవితాన్ని పరిపూర్ణంగా
ప్రతి క్షణాన్నీ నూతనం గా
జీవించాలని

ఆకాశాన్ని స్పర్శించాలని
ఊహల రెక్కల్ని విచ్చుకుని
గగనంలో ఎగరాలని ....
సాధారణంగా జీవించాలని ఉండదు.
ప్రతి క్షణాన్నీ తృప్తిగా ఆస్వాదించాలని
అందంగా మార్చుకోవాలని
పరిసరాల్ని, సమాజాన్ని.
సహచరుల భావనల్ని

నూతనత్వం దిశగా
అందరూ ఆశ్చర్యపోయేలా
ప్రకృతి కాలంతో పాటు
మారుతున్న సమాజాన్నీ
మారాల్సిన జీవితాన్నీ
నేర్చుకుని మార్చుకోవాలని 
నేనెలా నేనులా జీవించాలో అని
మనుగడకోసం ఎలా పోరాడాలో అని

సమశ్యల మంటల్లో కాలిపోతున్నప్పుడు
నెర్పరితనాన్ని
వర్షించే రాత్రులకు దూరంగా
పురోగమించడం ఎలాగో అని
నేర్చుకుంటూ
కాలాన్నుంచి పాటాలు నేర్చుకుని
ఆవేశం అగ్నిని రగిలించుకుని 
నిర్ణయాలు తీసుకోవాలని

నాకు నేను సమాధానం చెప్పుకుంటుంటాను
నా దారికి ఎవరూ అడ్డం రాకుండా
ప్రతి క్షణం, ప్రతి గడియ
ప్రతి ఉదయమూ పురోగమనపధం వైపు
కదిలేందుకు, పరుగులు తీసేందుకు
ప్రయత్నిస్తూ చైతన్యం నామదేయంగా
ఉండాలని .... నీ సాహచర్యం సాక్షిగా

No comments:

Post a Comment