విప్పుకుని తీసుకోగలిగినదైతే
నీ బాధ
నీ నొప్పి
నీనుంచి దూరం చేసేందుకు
ఆ నొప్పిని తీసుకుని
నీకు దూరంగా వెళ్ళి
వదిలించుకునేందుకు
దాన్ని
ఏ బండరాయికో బలంగా ముడేసి
ఏ హుస్సేన్ సాగర్ లోనో
ఏ మూసీ మురుగులోకో
విసిరేసి
నిష్క్రమణమయ్యేవరకూ ఉండి
వెనక్కు తిరిగొచ్చి
నీ అందమైన చిరునవ్వుల ఎదురుచూపులను
తలుపులు తెరుస్తూనే
నీ చూపుల్లో నమ్మకాన్ని
అంతా సవ్యమే కదా అన్న భావనను
చూడాలనుంటుంది.
వీలైతే
నిజంగా నేను
నీ నొప్పిని నాతో తీసుకు వెళ్ళగలిగితే
నీ బాధను నీనుంచి దూరం చెయ్యగలిగితే
No comments:
Post a Comment