Tuesday, August 2, 2011

శ్వాసలో శ్వాస

ప్రియా, దగ్గరగా రా,
నీ చెవిలో గుసగుసలాడాలని ఉంది.
మృదుబాషల పద కవిత నీకు మాత్రమే చెప్పాలని ఉంది.
ఇతరులకు వినబడకూడని ప్రేమ కవిత వినిపించాలని ఉంది.

నేను చెప్పాలనుకునేది రహస్యం సొంతం సుమా!
నీకూ నాకూ మాత్రమే తెలవాల్సింది ... తనువు పులకరించాల్సింది,
నీవు నేనై, నీవు నాకు సొంతంగా కావాలి ... ఎంతగానో తెలుసా,
నీ కదలికలో కదలికనై శ్వాసలో శ్వాసనై ... నీ ప్రతి చేష్టా నేనూ చెయ్యాలన్నంత!

మరో రోజు గడిచిపోయిందా!

మరో రోజు గడిచిపోయిందా!
అరిచి అరిచి పక్షులు అలసిపోయాయా!
గాలి అలసిపోయి మంద్రంగా వీస్తుందా!
చీకటి చిక్కనై జీవకృత్యాలు ఆగిపోతున్నాయా!
భూమిని జీవరాసుల్ని చీకటి దారిద్ర్యం నిద్రామయం చేస్తుందా!
పూరేకులు ఆకులు చీకటి స్తబ్దతను చూడలేక ముడుచుకుంటున్నాయా!
అదే సమయంలో ...
జీవితం వడ్డించిన విస్తరికాని బాటసారికి,
ఆహారమూ, సరకులు ఖాళీగా వున్న గుడిసెకు, ...
శ్రమసాగరం ఈది ఒడ్డుకు చేరిన మనిషికి,
బట్టలు చిరిగి మట్టికొట్టుకు పోయి,
అలసట నిస్సత్తువ ఆవహించి నిట్టురుస్తున్న క్షణం,
సిగ్గు చీకటి దరిద్రాన్నీ తరిమెయ్యి ... నీ వంతు సహకారంతో,
అతని జీవితాన్ని పునంప్రారంభించేలా చెయ్యి! ...
పూరేకులు, ఆకుల అతని జీవితంలో దయాకిరణానివై ...

మరో రోజు గడిచిపోయిందా!

మరో రోజు గడిచిపోయిందా!

Friday, July 29, 2011

నీవూ నేనూ ఒక్కటే!

నేను నీతో ఉన్నప్పుడు,
నిత్యత్వము, శాశ్వతము,
అమరత్వం భావన నరాల్లో,
... నా నవనాడుల్లో పొంగుతూ ....

నీ, నా ప్రేమ నిధి,
ధన్యత్వం ... ఆత్మావేశం,
నా ప్రేమ కొలమానం లేని …
ఎప్పటికీ నాకు కూడా అర్ధం కాని మర్మం ...

ఊహించని ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము,
నీ సాన్నిహిత్యంలో, నీ సాహచర్యంలోనే ...
నీ చేతి స్పర్శ లో, ... చూపులో,
నిన్ను అమితంగా ... నా కంటే ప్రియంగా ప్రేమిస్తున్నానని ...

మనం ఒకర్నొకరు వదిలి వెళ్ళేప్పుడు,
"వెళ్ళనా మరి" "సెలవా మరి" అనుకుంటున్నప్పుడల్లా,
వదలలేని ... విడదీయలేని పీడ,
హృదయాంతరాల్ని కలసివేసిన భావన ...

నా ఈ మాటలు హృదయాత్మల ఆకాంక్షలు,
నీ మనోభావనల్లో యిమిడి పోవాలని,
ఎప్పటికీ నీ నమ్మకాన్నీ, స్వేదాన్నీ కావాలని,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిరంతరమూ శుభోదయం సాక్షిగా!.

Tuesday, April 12, 2011

నీవే

నీవే

నిద్దురలో నా చెంత,
జీవనగమనంలో నా వెంట ...
ప్రతి ఉదయం చిరునవ్వుల శుభోదయం ...... నా స్నేహం ......
నా ప్రేమ మౌనరాగం
నా అస్తిత్వం ......
సర్వం ......
నీవే కదా

ఊహల్లో నా హ్రుదయరాణివి ......
నా కంటి వెలుగువి,
నా ఉనికివి ......
నా కాళ్ళక్రింద కదులాడే భూమివి,
నా ప్రాణానివి ......
నే పీల్చే ప్రాణవాయువు గాలివి,
ఏడడుగులు నాతో కలిసి నడవాల్సిన ఆశవి ......
నాఊహల్లో నాతో కలిసి నడుస్తున్న కలవి,
నా జీవన సాఫల్యం ......
నా గమ్యం నీవే కదా

నీవులేని, లేవని క్షణం ......
నేను లేనని మాత్రం తెలుసు
జీవితం ఉందో లేదో తెలియనితనం ......
నాకు ప్రతి క్షణం

నా మనసు నీ చెంత ......
నన్నొదిలి వెళ్ళబోకు నేస్తమా
వెళ్ళాల్సొస్తే నేనూ నీవెంటే ......
మరువబోకు ప్రియతమా
మతిలేని ......
మనసు మాలిన ......
బ్రతుకు బాటసారిని ......
ప్రేమ పూజారిని

Monday, February 28, 2011

ప్రకృతి మాత

కలలు కనే యువతా ... నీకు ఉష్ణబారం తెలుసా ...
తళుకుల, మిణుకుల, మెరుపుల ప్రపంచం పట్టణమే కనిపిస్తుందా ...
కానీ అతని భవితవ్యాన్ని ప్రకృతి మాత్రమే కాపాడుతుంది ... తెలుసుకో
చెట్లు కొట్టడానికి బదులు ...
చెట్లు పెట్టదం నేర్చుకో ...
ప్రకృతి విపత్తును తప్పించుకో ...
నిర్లక్ష్యంతో నీవో కారణం కాకు
నదీ నదాలు పారని నాడు ...
చెట్లు పెరగవు ...
అడివిని నరికి ...
ప్రకృతి మాతను కలవర పెట్టకు
ప్రపంచాన్నెందుకు ఉష్ణ పీడితం చేస్తావు?     

వర్షఋతువు

జోరున వర్షం కురుస్తోంది
చెట్ల కొమ్మల్ని విల్లులా వంచి మరీ
ప్రియురాల్ని ఆత్రంగా ముద్దాడుతున్నట్లు ...
చెట్లు మాత్రం నిలబడే ఉన్నయి
ఈదురు గాలులువీస్తున్నాయి ...
శరీరాలు జల్లుమని ...
నదీతలాలు మాత్రం
పొంగిపొర్లుతున్నాయి
కప్పలు గెంతుతున్నాయి ...
బెకబెకల రొధ ...
పసి పాపలు మాత్రం
నిద్రపోతూనే వున్నారు
రవ్వంత కూడా వినిపించని ...
నిశ్శబ్దం కుహరంలో
గబ్బిలాలు ... పక్షులు మాత్రం
కూస్తూనే వుతున్నాయి
తేనెటీగలు రొధ రొధ గా గాలిలో 
అర్ధం కాని రాగంలో అలజడి చేస్తూ  ...
పూల మొక్కలు మాత్రం
మొలకలెత్తుతున్నాయి
ప్రవాహానికి ఎదురీదుతున్నాయి చేపలు ...
వినిపిస్తుందా మిత్రమా నీకు ఆ సవ్వడి
వర్షఋతువు రాబోతుందని ...
కాలబద్దంగా సద్భావపూరితంగా  ...

Sunday, February 6, 2011

మనసు సంకెళ్ళు

నిశిరాత్రి
భరించలేని నిశ్శబ్దం .... ఒంటరితనం
నివురుగప్పిన నిప్పుల మధ్య
నుశిగా మారిన
మధుర శ్మృతులు ... వదిలివెళ్ళలేను.
నీరసం
సర్వం .... నిర్మానుష్యం
సడలించుకోలేని ... మనసు సంకెళ్ళు!
ఆకాశం మబ్బుల మయం గా ....
మబ్బులు రోధిస్తున్నట్లు .... నన్నోదారుస్తున్నట్లు
ఉపశమనానుభూతి అది!
వర్షించే నీ కన్నులు ఆ మేఘాలైనట్లు
నీ ప్రెమే అలా .... వర్షించుతున్నట్లు
నా పక్కనే నీవు వున్నట్లు .... భ్రమ
అది .... కాలి బూడిదైన వాస్తవం!
ఆ మేఘాల వెనుక .... మిణుకు మిణుకు మని
నన్ను జాలిగా చూస్తున్న ... ఆ నక్షత్రానివి నీవు కాదూ!
మిగిలిన ఈ తోడులేని జీవితం ...
అ సంకల్పం .... ఊహించని నిజం!
ఔనూ! .... నా కళ్ళెందుకు ప్రతి వర్షిస్తున్నాయి?
నా మనస్సెందుకు ఊగిసలాడుతుంది?
నా అభిలాష మాత్రం ....
నీ పక్కనే నా స్థానం అని .... నీ వద్దకు నే చేరాలని!

Saturday, January 15, 2011

నీ హ్రుదయం ... నా ప్రాణం

నాతోనే, నాలోనే, పదిలంగా వుంది నా హ్రుదయం లో... 
నీ హ్రుదయం ... నా ప్రాణం, అది లేని నేను లేను
ఎక్కడ వున్నా, ఏమైనా నీవూ నాతోనే, నా ప్రాణమా ...
ప్రతి క్రియా నీ ప్రేరణే, ప్రియతమా ...
జాతకాలు భూటకాలే, నా నమ్మకం, భవిష్యం మాత్రం ... నీవే ప్రియా!
ఈ ప్రపంచంతో నాకు పని లేదు ... నా అందమైన ప్రపంచానివి
... నీవు ...
వెన్నెల వికశించే చద్రబింబానివి!
ప్రతి ఉదయపు అరుణ చైతన్యానివి ... వెలుగు కాంతి పుంజానివి!!!
ఎవరికీ అంతుబట్టని రహశ్యం వుంది చెప్పనా!
... ప్రియా ...
వేరులో వేరునై, మొగ్గ లో చిరుమొగ్గనై, కొమ్మలో కొమ్మనై ఆకాశమంత ఎదిగిన హ్రుదయ సామ్రాజ్యానికి రాజును ... నెలరాజును నేను ...
ఆత్మకూ, ఆలొచనలకూ, వుహకూ అందనంత ఎత్తులో మనసు దాయలేని నిజం ... అది ...
నక్షత్రాలతో ఆడుకోగలుగుతున్న అద్భ్తతమైన ఆకాశ క్రీడ ... స్వర్గం వాకిట్లో నేను ... ఐనా ...
నీ హ్రుదయం నాతోనే వుంది ... నా హ్రుదయం లో భద్రంగా ...

Friday, January 14, 2011

నగ్న సత్యం ...

అందం, ఆకర్షణ కలకలిసి ...
కవ్వించే అయస్కాంతం ... ప్రేమ!

అప్పుడే కలిపి, వెంటనే విడదీసే లక్షణమే ... ప్రేమ?

ఒకవైపే లాగుతూ ... వొకరినే చూడాలనుకునే ...
మనసు పెనుగులాటకు ... కారణం ప్రేమ?

అనుమానం పిశాచి నిలదీస్తే సమాదానం లేని ...
నిజంగా అది ప్రేమేనా, లేక అనుకోవడంవల్లే అది ప్రేమా అని?

కలిసి ఉన్నారు, కలలు కన్నారు ... జీవిస్తున్నారు కనుక ప్రేమిస్తున్నట్లా ...
లేక ప్రేమ అనే అందమైన బావనను ప్రేమిస్తున్నట్లా?

ప్రేమాన్వేషణలో ... ప్రేమను అర్దం చేసుకునే దిశలో ...
పడుతూ లేస్తూ పరుగెట్టే మనిషి జీవితం లో ...

ఒకే ఒక్క నగ్న సత్యం ...

భగ భగమనే నిప్పుకణికల్లో కాలిన హ్రుదయమే వెలుగులు వెదజల్లుతుందనేది ......
ఆ వెలుగుల కాంతిలో ప్రతిదీ ప్రేమ లా కనిపిస్తుందనేది ......

Wednesday, January 12, 2011

ప్రేమే ప్రియ నేస్తం ...

కొండ త్రాచులా మెలికలు తిరుగుతూ, నది ...
ఒడ్డున, ఆలోచనల అలలు హొరులో ...
ప్రయత్నించినా, మరిచిపోలేని కాదన్న ప్రేమ ...

అవహేళన చేస్తున్న ... బ్రతుకు మరీ బారమైనా, మోస్తున్న భావన
వాగులో దూకితే ... చన్నీళ్ళు ... చల్లగా, నీటిని రాయిలామార్చే
కరుడుగట్టిన చలి ... నీటిలో మునగడం కష్టం ...
ఆ నీరు గాని అంత చల్లగా లేకపోతే, భగ్న ప్రేమను భరించేకన్నా ... సంతోషంగా మరణించొచ్చు!

కానీ చలి కొండచిలువ ... నదిలో ...
ఒళ్ళంతా మెలేసి నలిపేస్తుంది ... అబ్బో! భరించలేని చలి ...

LIFT ... ఇరవై అంతస్తుల ఆశల సౌదం, ఆకాశసౌదం ... అది
భగ్న ప్రేమను భరించేకన్నా ... ఆనందంగా, అక్కడ్నించి దూకెయ్యొచ్చు
ఆకాశసౌదం లాంటి అంచుమీద నిలబడి అందర్నీ తిట్టి, ఎంతగానో ఏడ్చి, పెద్దగా అరిస్తే ... వూరట
... తొంగి చూస్తే ... కళ్ళు తిరిగే అంత ఎత్తు ...

అంత ఎత్తుగా వుండివుండకపోతే ... చచ్చి పొవొచ్చు
కానీ .... ఎలా! ... కళ్ళు తిరిగే అంత ఎత్తునుంచి వచ్చే చావును పలుకరించడమే!
అశక్తత ...

బ్రతక్క తప్పదు! ప్రేమలేమికోసం చావాలనివున్నా ... చావలేని స్థితి ...
బహుశ, జీవితం బ్రతకడానికే నేమో అనిపిస్తూ ఆహ్వానించినట్లు ... మొదటిసారిగా ...

... అరుపులు, రోధనలు ప్రతిరోజూ వినేవుంటావు ప్రియతమా ...
ఇంకా మరణించాలని చూస్తే ...మరీ మొండిమనిషి, పెంకిఘఠం అనుకునే అవకాశం ...
దృష్టి లోపాన్ని దిద్దుకునే మధ్యతరగతి మనిషి మనసుకు ...
ప్రేమే ప్రియ నేస్తం ...

నిజానికి జీవితం ... అందంగా, ఆనందంగా స్వచ్చంగా వుంటూ ...
బ్రతుకు పోరాటంలో మనిషికి మనిషి హస్తం ...
ప్రేమ హస్తమే కానక్కరలేదు స్నేహ హస్తమైనా చాలు ...!!

Friday, January 7, 2011

మేలుకొలుపు

ప్రతి ఉదయం కళ్ళు తెరుస్తూనే ...
తనకు తాను, మనిషి చెప్పుకునే మేలుకొలుపు మాట కర్తవ్యం! ...
అవసరం, అవకాశం, ఘటన ... అన్నీ నిమిత్త మాత్రం ...
క్రియల పర్యవసానం ప్రతిక్రియ ...
సంతోషానికి, బాధకు మూలం! ఎప్పుడో వెళ్ళిపొయిన ... గతం ...
...ఇంకా రాని, వుందో లేదో తెలియని ... రేపు.
కళ్ళ ముందున్నది మాత్రం ప్రస్తుతం ... వాస్తవం ...
సంతోషమా ఇదే నీకు నా స్వాగతం! శుస్వాగతం!!

గెలుపు వోటమి

అవకాశం ... ఆసరా తో సాగే ... పూల పాదు
ఈ... జీవితం ...
పాకే పందిరి గెలుపు ...
పడడం ... పడిలేచి పరుగెడడం ... మనిషి బాల్యం ...
వోటమిని పందిరి పునాధిగా మార్చుకో ...
...పునాధి సమాధి కాదనేది జగమెరిగిన సత్యం ...