Saturday, July 30, 2016

నీవొక రచయితవై



ఎవరైనా
నీ రాతల విలక్షణత ....
ప్రేమలో పడితే
ఆ ప్రేమ
నీ భావనల పట్లే

నీవెలా ఉంటావో
తెలియని మది లో
నీకు పరిపూర్ణత ....
బహుశ
రచనల్లో కళాత్మకతే 

Saturday, July 23, 2016

ప్రాదేయపడక తప్పదు



కత్తుల్లాంటి ఆలోచనలు
వివర్ణమైన నా చర్మాన్ని 
తొలుస్తూ 
రక్తిమవర్ణపు
పదాలు 
ప్రవహిస్తూ ఉన్నాయి.
రక్తం బొట్లు బొట్లుగా
నేల రాలుతూ
నీ ప్రేమ మాదకము 
నా నర నరాల్లో
ఔషధమై ప్రవహిస్తుంది.
జ్ఞాపకాల గతం 
వెంటాడుతూ 
నీ ఎడబాటు భారం 
మొయ్యలేని నా మది
అర్జించుతూ ఉంది.
మోకాళ్ళమీద వాలి,

Sunday, July 17, 2016

ముసలితనం



తోడును కోల్పోయి 
బిడ్డలు కాదనుకున్న

వృద్ధాశ్రమ 
దుఃఖకర ప్రపంచపు 
ఏకాకితనపు 
మనోవేదన

సంకీర్ణత వలయం లో 
అల్లల్లాడి

ఆత్మీయ 
వెచ్చదనం కోసం 
అత్యపేక్ష ....

సాధ్యమా! 
ఓదార్పు 
శిధిల హృదయావరణల్లో

హృదయాక్షరాలు కనుక





నమ్మాలి నన్ను 

చైతన్యం పూచిన
పరిమళమీ జీవితం అని
ఎప్పుడైనా నేను నీతో అంటే 


నా పక్కనే
అప్పుడు
నువ్వుండి ఉంటావనే నిజాన్ని

అస్త్రవిసర్జన చేసి


నిమ్మకుండా ఉండిపోతాము.
అప్పుడప్పుడూ

ఏ కారణం చేతనో
అకారణంగానో
లేక
ఉద్విగ్నభరితులమయ్యో

పోరాడాల్సిన వేళ
ప్రత్యర్ధి మాటల శరాలను
పిడిగుద్దుల్ని ....
దెబ్బల్ని సహిస్తూ

బాధను భరించుతూ
తలొంచుకుని
ఉన్నచోటే బాధలో
తలమునకలా మునిగి

ఆ ఆవేదనకు కారణం
అర్ధం వెదుకుతూ
ఆ వేదనలోని
తియ్యదనం ను ప్రేమిస్తూ

మేలుకొలుపు


ఉదయం నిద్దుర లేస్తూనే 
అలజడి చెందాను. 
నీవు పక్కన లేవని 
ఒకప్పుడు ఉన్నావు అని కాదు 
కానీ 
అంతరంగంలో ఉన్నావు అని 
శాంతంగా నిదురిస్తూ 
చుట్టుకుని .... నన్ను 
అన్ని పక్కలనుంచి నీవు

Thursday, July 14, 2016

కాలచక్రం తిరుగుతూ


జార విడుచుకున్నాను.
చిన్న చిన్న ముక్కల్ని చేసి 
నా తీరని కోరికలను 
నన్నూ
ఎన్నో
ఎన్నో చోట్ల ....
అన్ని స్థలాల 
అన్ని అనుభూతుల అవశేషాల 
జాడలను 
క్రమపద్ధతిలో రాసుకుని మదిలో
ఆ రాతల సారాంశం
అన్ని ప్రకరణల్లోనూ 
నీ హృదయమే ప్రీతిపాత్రం అని ....

పెదవులు దాటీ దాటని పదాలు



రాలుతుంటాయి
నెమ్మది బుజ్జగింపులా,
అప్పుడప్పుడూ
డొంకతిరుగుడుగా,
ఎప్పుడైనా నిశ్శబ్దంగా ....

ఊహించని అతిథిల్లా,
తారాడుతున్నట్లు,
అప్పుడప్పుడూ ఖండనలా,
చర్మాన్ని చీల్చి
ఎముకల్ని తాకుతున్నట్లు,

గూడార్ధాల మయమై,
అప్పుడప్పుడూ
గోరు వెచ్చని
ఉప్పని
కన్నీరు తడై,

ఎప్పుడైనా 
మర్మగర్భంగా,
భయం
గాయం వెనుక
దాక్కున్నట్లు,

కొన్నిసార్లు గుండెల్ని తాకే
ప్రేమ జల్లై
గుసగుసల తడి
తడుపులా
ఆత్మలలో ఇంకి,

అప్పుడప్పుడూ
అర్ధవంతంగా
నమ్మబుద్దౌతూ,
పరిపూర్ణతతో నిండి ....
మళ్ళీ వినాలనిపించేలా