Thursday, May 30, 2013

బాధ నీడలో


ప్రతిరోజూ,
నేను మరణం గురించి ఆలోచిస్తున్నాను.
వ్యాధుల గురించి,
ఆకలి గురించి,
హింస గురించి,
తీవ్రవాదం గురించి,
మూడో ప్రపంచ యుద్ధం గురించి,
ఈ యుగం అంతం గురించి.
నిత్య కాల్పనికతల నుంచి .... మనస్సు ను దూరం మళ్ళించి.
నేను మరణం గురించి ఆలోచిస్తున్నాను.

అగమ్యం!


చెప్పని కోరిక
తెరచాప లేని సముద్రయానం
ముందుకూ వెనకకూ
ఆలోచనల అసంతులనం
ఆరడుగుల భూమి మంజూరు కాని జీవితం లా
భూమిని,
ఒడ్డును వెతుకుతూ .... అగమ్య జీవనయానం!

Wednesday, May 29, 2013

మత్తు వొదలాలి



ఆకులెన్ని ఉన్నా వేరు ఒక్కటే
ఆకులు ఆశలెన్ని రాలినా కొత్త ఆశల చిగురులేస్తుంది
వేరు గమ్యం బలంగా ఉంటే ....
నా యౌవ్వనపు రోజులు
ఆకులు పువ్వులు
ఆరుబయట ఎండలో  పారేసి ....
ఇప్పుడు
నిజం నీడై నేను ఎండిపోతున్నా!

కలిసుందాం!



అర్థం ఉండాలి.
అసూయ, బాధ
మొద్దుబారిన ఆలోచనల .... చిందరవందర జీవితం లో
సహకారం, కృషి
చైతన్యం, సేద్యం 
మార్ఘదర్శకత కావాలి ,,,, సమాజానికి
జ్ఞాని, వివేకి ....
నీవే ఎందుకు కాకూడదు!?
నీవూ నేనూ మనం కలిసి కదులుదాం మరి!

జీవితం .... ముళ్ళూ పూలు



నరకం పైకప్పు పై నడుస్తుండటం 
హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ లో
కారు నడుపడం
కత్తుల బోనులో జీవితం
భయం, అభద్రతాభావం అనుక్షణం
కనులు మూసుకుంటే మాత్రం
కలల బృందావనం .... ఈ ప్రపంచం!

యువత


రాజభవనాల్లో రాజులు
మురుగుగుంటల్లో పసువులు .... పందులు
దొర్లుతూ,
దేశ భవిష్యత్తు ....
అభద్రత లో సామాన్యుడు
నిరీక్షణ లో యువత.
యౌవ్వనంలో వివేకం ఉంది.

Monday, May 27, 2013

తోడు!


దుర్బలత్వం పై
ఎప్పుడు
దౌర్జన్యం, బలాత్కారం .... జరుగుతుందో,
అప్పుడు
మనిషికి
మరో మనిషి .... తోడు అవసరం!

చిత్తం దొరా!


కుర్చీ కింద
చిన్న కుక్క పిల్లలు ....
రెండు
కూర్చుని,
ఆటలు!
తోకలూపుతూ ....
పాదరక్షల్ని కరుస్తూ,

Sunday, May 26, 2013

ప్రకృతి


నేను,
ఒకప్పుడు
ఈ భూమిలో విత్తిన గింజ
మొలక
ఈ గాలి, ఈ నీరు
ఈ సూర్య రశ్మి తాగి
నీడలు
శాఖలు విస్తరిస్తూ .... ఎదగడం చూస్తూ ఉన్నా!

గబ్బిలం


ఒక గబ్బిలము
ఈ వెన్నెల రాత్రి
రేగు పూల మీదుగా ....
మిడిసి పాటు! .... ఎగురుతూ,

పరిణామక్రమం!



పెద్ద పెద్ద చెట్లు, అడవులు
మధ్య లో ....
పాతమట్టి క్రుళ్ళి,
మొగ్గలు ఎదగాలనుకోవడం ....
వికశించి పరిమళించాలనుకోవడం ....
ప్రాకృతం .... ప్రేమ!

పుష్పరాగం!



అడివి పుష్పము లు
పిల్లగాలులకు తలలూపుతూ,
ఆ పుష్పాలరేకుల్లో ....
ఏదో ప్రత్యేకత!
ఓ విలక్షణ సిగ్గుభావన!
అమాయకత్వం కుబుసం విడిచేస్తున్నట్లు,
ఆ లేత లేత అందాలు ....
మృధు పుష్ప రాగాలు! 
వెన్నలా,
వెన్నెల సంభోగం కోసం లా ....

Saturday, May 25, 2013

నిజం!



నీవంటే ఇష్టం!
ప్రేమిస్తున్నా నిన్ను
అనడం
సర్వ సాధారణ విషయం!
కానీ
అనుభవ పూజ్య .... వ్యక్తీకరణ!

Friday, May 24, 2013

ఎండమావుల వేట లో ....



నీవంటే ఇష్టం!
ప్రేమిస్తున్నా నిన్ను
అనడం
సర్వ సాధారణ విషయం!
కానీ
అనుభవ పూజ్య .... వ్యక్తీకరణ!

తిరస్కారం!



అప్పుడు ....
ఒక పురుషుడు, ఒక స్త్రీ
మోహ ప్రభావితులై ....
ఓ శిశువు ప్రసవం!
సమాజం, కట్టుబాట్లు
ప్రసవ ఫలం .... చెత్తబుట్టలోకి విసిరేస్తే,
ఇప్పుడు ....
తిరస్కరించబడిన బిడ్డలకు, అనాధలకు
మద్దతు ఆ పురుషుడు .... ఆ స్త్రీ యే!

కాలచక్రం



రెప్పపాటు కు రెప్పపాటు కు మధ్యలో
మెరుపులా
దొర్లుతూ క్షణాలు
వంకరటింకర గీఁతలా నేను,
నాలో క్షణాల్ని పట్టుకుని
సద్వినియోగం చేసుకునే ఆశ
కాలం మాత్రం
బొట్లు బొట్లుగా జారుతూ
శాశ్వతత్వం లోకి నెమ్మదిగా నన్ను నెట్టేస్తూ,

ఒక ముద్దు!



ముడత పడ్డ శరీరం
ఆకాంక్ష,
స్వర్గం పంపిన,
ఓ చిరు ముద్దు
చిరుగాలై
చెంపను తాకి .... సిగ్గు.

ప్రియా! ప్రియతమా!



నా హృదయం అద్దం లో
ఆకర్షణవు
నా గుండె గోడ మీద వ్రేలాడుతున్న చిత్తరువ్వు,
ప్రియా!
నా, ప్రేమవు
నిన్ను నా ప్రేమబంధంలో కట్టెయ్యాలని ఉంది
పాతాళభైరవిలో లా నేను, ఒక మంత్రగాడిని
తెలుసుకో!
ఈ ప్రేమ మందిరం నుండి తప్పించుకోలేవు ఎప్పటికీ అని!

స్నేహం ఎదురొచ్చి



అనుకోలేదు.
కలలో లానే, ఇలలోనూ నీవు కనిపిస్తావని ....
నా కోసం వొస్తావని,
చిత్రం!
నా ఎదురుగా నీవు!
నీ కళ్ళలోకి చూసాను.
నీవు నా కళ్ళలోకి చూసావు.
గతం జ్ఞాపకాలు .... అద్భుతాలు
పసితనపు అల్లరి, కేరింతలు, కవ్వింతలు, కాల్పనికతలు
ఒక్కసారిగా ఎదురొచ్చి .... సార్ధకం అయిన వింతైన భావన!
వింత పులకరింపు శరీరం లో ....
అనుకోకుండానే త్రుళ్ళి జారింది .... ఒక చిరునవ్వు!

Thursday, May 23, 2013

ఒంటరిని



బార్ లో పాత్ వే
నెమ్మదిగా నడుస్తున్నా
పెదాలకు పెగ్గును తాకిస్తూ
మౌనంగా ఎందరో టేబుళ్ళ కు సర్దుక్కూర్చునున్నారు.
నేను ఒక మూల టేబుల్ వైపు వెళుతున్నా
అర్దనగ్నంగా ఒక శృంగార తార
నాట్యం చేస్తూ ఉంది.
రాకూడని చోటుకు రాలేదు కదా?
రావాలనుకునే వచ్చాను.
ఇక్కడ ఒంటరితనం దొరుకుతుందని అన్నారని?

Wednesday, May 22, 2013

నేను సామాన్యుడ్ని


డబ్బున్నోణ్ణి కాను .... నేను,
రైతు బిడ్డను
నేల నోరెండిన బంజరంత విశాలం
నా గుండె గది
అర్ధం కాని మాటలకు
అంతా అర్ధం అయినట్లు పగలబడి నవ్వలేను
కాలాన్ని నీతో కలిసుండి
మధురంగా
మలుచుకుందుకు ప్రయత్నించగలను
నేను డబ్బున్నోణ్ణి కాను.

ఎవరో మెచ్చుకునేందుకని,
నా స్థోమతును మించి
నీకు ఖరీదైన ....
డైమండ్ నెక్లెస్ ను కొనివ్వలేను.
నా స్వేదంతో చిక్కబడిన
కర్మ ఫలం ఫంట ధాన్యాల్ని
నీ ముంగిట్లో గుమ్మరించగలను,
సినిమాలో లా హీరో ని ....
ఆరడుగుల ఆజానుబాహుడ్ని కాను.
నిన్ను నిండుమనసుతో దగ్గరకు తీసుకుని
ఏ అసౌకర్యం కలక్కుండా చూడగలను .... నేను,
ఎవరో గొప్పగా అనుకోవాలని జీవించలేను.

క్షణ క్షణమూ అపనమ్మకం
అభద్రతాభావం .... నీడై వెంటాడుతున్నట్లు
వెకిలి జోక్స్ తో
నిన్ను నవ్వించాలని చూడను.
నీతో కలిసి
మరిచిపోలేని జ్ఞాపకాల్నీ
సిగ్గుల్ని, చిరునవ్వుల్నీ ప్రోగుచేసుకోగలను..
లాంగ్ డ్రైవ్ లు, విహారయాత్రలు
కలిసి తిప్పేందుకు .... ఓడంత కారు లేదు.
సాయంత్రాలు ఆరు బయట కలిసి కూర్చుని ....
గంటల్ని క్షణాల్లా కరిగించగలను .... నేను,
ఎవర్నో నవ్వించేందుకు విదూషకుడ్ని కాలేను.

అందగాడ్ని కాను.
కురూపిని కాను. మన్మదుడిలా ఉండను.
నీవు ఆనందంగా ఉండేందుకు
నీ మనసెరిగిన మనిషిలా మసలగలను.
నేను పెద్ద కుటుంభం ....
మోతుబరిని కాను .... నేను
నిజం, నమ్మకం, ప్రేమ ముద్దను!
మధురాక్షరాల పద భావాన్ని
నిష్కల్మషత్వం చిరునామా గా
నన్నూ, నిన్నూ వేరుగా చూడలేని సామాన్యుడ్ని .... నేను
అందగాడ్ని, మన్మదుడ్ని కాను.

Tuesday, May 21, 2013

ప్రాకృతం!



ఒక తేనెటీగ,
ఆకస్మిక దాడి
పుష్ఫం ....
కేసరము నుండి పుప్పొడిని త్రుంచి,
తల తో ....
అమృతం నురుగును,
కొంచెం కొంచెంగా తాగడం.

అత్తా కోడలు



రంగు బాగుంది.
క్లాత్ బాగుంది. 
కొత్త డిజైన్ మార్కెట్ లో
తనకు బాగుంటుందని, కొందామని .... కోడలు
వెరైటీలుంటే చూసే ఆలోచన
కొత్త సోకులెందుకని 
చివాట్లు పరుస్తూ .... అత్తగారు,

నాలుగు రోడ్ల కూడళ్ళలో


వేడి, వడగాలుల్ని మోస్తూ,
ఎండలో నిలబడి
సిగ్నల్స్ దగ్గర
ప్రతి వాహనాన్ని పరామర్శిస్తూ ఉన్న
ఆ ఆడపడుచు నవ్వులు
దాహం తీరని
వెచ్చని జ్ఞాపకాల అతుకులు కొన్ని
నొప్పి గా మారి 
అర్ధం కాని ఏదో తియ్యని బాధ నా ఎదలో!

నువ్వు .... నీ అస్తిత్వం!



అమాయకత
క్లుప్తత
నీ ప్రవృత్తి ప్రతిబింబాలు.
ఎటువంటి హింస
బలప్రయోగం, పెనుగులాట లేని
సాంప్రదాయకతే .... నీ ఆస్తి, అస్తిత్వం!

Sunday, May 19, 2013

హృదయంలో ఆశ్రయం ఇవ్వాలనుంది.



కల్మషం లేని పసి మనసు ఆమెది.
నేను ఆమెను చూసాను .... అడవి పువ్వులా ఉంది.
ఆమె నా వైపు చూసింది .... నిండైన అమాయకత్వం ఆమెలో,

నా మనసు కోరిక .... ఆమెను చేరదియ్యాలని. 
దగ్గరకు తీసుకుని, గట్టిగా గుండెలకు హత్తుకుని,
అలాగే ఉండిపోవాలని .... నేనున్నాననే భరోసా ఇవ్వాలని.

నా భావన ఆమెకు అర్ధం అయినట్లుంది. నావంకే చూస్తుంది.
సామాజిక నియమం అనే రేఖ ఒకటుందనే తాత్పర్యం .... ఆ కళ్ళలో
ఎన్నో ఏళ్ళుగా కలిసి జీవిస్తూ కట్టుకున్న సామాజిక .... హద్దులు అవి.

నాకు చేతికందే అంత చేరువలో ఉంది .... ఆమె,
ఆ ఆలోచనలు నా ఆలోచనలకు అందనంత ఎత్తులో, 
ఆవేశం, తెగింపు ఉండీ .... దూరంగా ఉన్నా ఆమెకు.

కొన్ని జీవితాలు అంతే .... ఆమె లా ఆ క్రమశిక్షణ ఆ....శ్రమజీవనమే
వారికి మనం ప్రేమను పంచాలనున్నా .... చేరదీయాలనున్నా,
చేరదియ్యలేము .... ఇవ్వలేము ఆనందాన్ని, హృదయంలో స్థానాన్ని.

Saturday, May 18, 2013

జంతు సమాజం



అవినీతి రాజకీయం
ఒకరు ఇంకొకరి శయనమందిరంలో
నిద్దుర పోతూ
దోచుకునేందుకు ప్రణాళికలు
నేను మాత్రం
స్వీయ సంరక్షణ ప్రయత్నాల్లో మునిగున్నా!

స్వగతం


ఒక్కసరి,
ఒకే ఒక్కసారి ....
నీ కళ్ళలోకి చూసా .... ఎదలోకి దూరిపోయా!
మతిపోయింది. ఆ అమాయకత్వం చూసి ....
కళ్ళు చెదిరి, మతి భ్రమించే అందం నీది!

ఒక్క ముద్దు,
నిన్ను ఒకేవొక్క ముద్దాడాలనిపించింది.
నేను బ్రతుకుతుంది అందుకోసమే అన్నట్లు ....
నీ ముద్దు కోసం మరణించేందుకైనా సిద్దం కావాలని
వెంటిలేటర్ పైనైనా సరే,

ఒక్క స్పర్శ,
నీ మృదు స్పర్శ ను పొందాలని,
నీ సౌందర్యం ....
ఆకర్షణను కాసింత పూసుకుందామని ....
నరకయాతన చిత్రహింసే పరిణామం అని తెలిసినా సరే,

ఒక చిన్న నవ్వు,
నీ నవ్వుల ముత్యాలు ఏరుకుందామని,
నీ నవ్వుల సుఘందాలు ....
పూచుకుందామని, ప్రాణాన్ని పణంగా పెట్టేద్దామని ....
దుమ్ములో దూళిలో దొమ్మీ చెయ్యాల్సొచ్చినా సరే,

పిల్లా!
నీది పదాలతో వర్ణించలేని అందం!
ప్రియసఖీ!
నీవు మధుర మనోజ్ఞ అద్భుత సౌందర్యరాసివి.
ప్రియసహచరీ, మనోహరీ .... నీ సాంగత్యం స్వర్గతుల్యం!

సామాన్యుడ్ని


జీవిస్తున్నాను.
బ్రతుకు బాటలొ భారంగా ....
కాలంతో పాటు కదులుతూ, 
ప్రతి ఉదయమూ లేస్తున్నాను,
కడుపు నిండా తింటున్నాను. .... విశ్రమిస్తున్నాను.
ఎందుకో ....
ఏదో కారణం .... ప్రతి జన్మా కారణ జన్మే అనుకుంటున్నాను.
కానీ
ఆలోచించడం లేదు.
ఏదో అలసట 
తెలుసుకోలేకపోతున్నాను .... ఎటువైపు వెళుతున్నానో
నిజంగా జీవిస్తున్నానా అని,

Wednesday, May 15, 2013

నీతో లేను నేను


దూరం పెరుగుతుంది ఒడ్డుకు
నీకు
దూరంగా నెట్టేస్తుంది కాలం!
ఆకాశాన్నందుకోవాలనుకునే ఆశల అలలు ....
కడలి లో కూలి,
ఎన్ని విరిగిన కలల ఆశల అలలో ....
అవి మన నిస్పృహ ల వృధా ప్రయత్నాలు!

విచిత్రమైన సంకేతాలు
ప్రమాద సూచికల్లా ....
నిర్లిప్తత, సంశయం .... కనురెప్పల మాటున మెరుస్తూ,
ఎరుపు తెలుపు రంగులు .... ఇంద్రధనస్సులు కావవి ....
కరంట్ షాక్ కొట్టినట్లు,
ఒకరినొకరం పరిశీలనగా ....
చూడడం మొదలెట్టిన క్షణాలవి!

నా కనిపించింది.
ఈ సంసారసాగరాన్ని సులభంగానే ఈదగలమని,
ఇద్దరం ఒక్కరుగా కలిసుంటే ....
ఎవరి సలహా సంప్రదింపులు అక్కరలేదని,
కానీ, ఏదో జరిగింది!
మన ప్రమేయం లేకుండానే .... ఎక్కడో,
మనం బ్యాలెన్స్ కోల్పోయాము.

నాకు నీవు
నీకు నేను దూరం అవ్వసాగాము.
ఒకరినొకరం కోల్పోసాగాము.
పెరుగుతున్న ఆ దూరాన్ని గమనించనట్లు,
నీ ప్రేమ స్వచ్చమని నేను,
నా ప్రేమ స్వచ్చమని నీవూ ....
పిచ్చి ఆలోచనలు చేస్తూ వచ్చాము!

నాటి
మన ఏకాంతాలు, జ్ఞాపకాలు ....
ఒకరికై ఒకరు పడిగాపులు కాయటాలు
పువ్వులు, పచ్చదనాలు
కోకిల గానాల్ని ప్రేమించడాలు
ముద్దులు ముచ్చట్లు అరుదవుతూ,
నెమ్మదిగా నెమ్మదిగా దూరం పెరిగింది.

కాలనీలో
మనం ప్రతి నోటా నానిన ఒకనాటి జంట!
చిలకా గోరింకా
ప్రేమ కథ ముగింపు ....
సుఖాంతం కాదని విన్నాము!
ఎడబాటు, ధ్వంసం అవుతుందని తెలిసీ,
నిర్లక్ష్యం చేసాము .... వినోదం గా మిగిలాము.
అందరూ ఆడుకునే ఆట కావొద్దనుకుంటూనే,

ఇప్పుడు
నీ మదిలో నేను లేనని తెలుసు.
నీవూ గ్రహించే ఉంటావు.
ఒకనాటి నా ఎద పులకరింపు వు
నా ఆలోచనల గమ్యం .... నీవు.
నేడు జీవితం ఆశల పోరాటంలో
అలల్లా ఎవరికి ఎవరూ ఏమీ కానట్లు విరిగిపోతున్నాము.

నిష్ఫలం!



అక్షరాలు, పదాలు .... రకరకాల భావనలతో
లక్షల మాలలు కవితలు అల్లినా
ఏ భావనా నిన్ను నా దరి చేర్చదు.
నాకు తెలుసు .... ప్రయత్నించాను కనుక!
ఎన్ని ముత్యాలు ....
ఎన్ని బొట్లు కన్నీరు కార్చినా .... ఫలితముండదు.
ఇది నిజం!
ఒంటరిగా నీకై రోధించి ....
భంగపడ్డ అనుభవం నాది కనుక!

Tuesday, May 14, 2013

ఆకాశం లో హరివిల్లు



వెదజల్లిన
రంగుల శుద్ధ విచ్ఛిన్నకిరణం
ఒక అందమైన మిశ్రణం!
కలగలిపిన కలల
రంగుల రాగం ....
అన్ని ప్రతికూలతల్ని .... గ్రహించి,
కొత్త  ప్రారంభం,
కొత్త బలమై .... వరమౌతుంది.

మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నావు


ఒక వెర్రి మనిషికి
మానసిక శాంతిని చేకూర్చే బాంధవివి
ఆశల మనోశోధనల గమ్యానివి
నీవు ఒక ప్రేమ ముత్యానివి
ఒక ఎద సామ్రాజ్యంలో మొనాలిసవు నీవు
వేసవి ఆకాశంలో ఇంద్రధనస్సువు
అతను కోరుకుంటున్నది
అతని కళ్ళకు నీవో అద్భుత సౌందర్య రాసివని
నీకు అర్ధం కావాలని

కాలం కదులుతూ లొకం పరివర్తన చెందుతూ
ఋతువులు మనో భావనలు మారుతున్నాయి
చిత్రమైన పాఠాలు ఈ జీవితం పరిచయం చేసే అనుభవాలు
సిగ్గులు, చిరునవ్వులు, కన్నీళ్ళు
కలగాపులగంగా ఎవరి వంతు వారికి లా
అతని మనోభిష్టం, కోరిక ఒక్కటే
నీకు తెలియాలి .... అర్ధం కావాలి అని
అతని కళ్ళతో చూస్తే, నీవు .... దివి దిగివచ్చిన అప్సరస,
ఓ అద్భుత సౌందర్య రాసిలా ఉంటావని ....

కాలం తో పాటు రూపురేకల్లోనూ మార్పులు
నీ వయస్సు ఎదుగుదల లా నీవు
అతని దృష్టిలో మరింత అందంగా కనిపిస్తున్నావు.
నీ ముఖంపైన ముడతలు
ఆ కళ్ళకింద చారలు అతన్ని పలుకరిస్తూ,
జీవిస్తున్న నవ్వులు .... కాలం తడుముతున్న అనుభూతులు
మీలో ఆనందం .... కాలం క్రమశిక్షణలా ఎగురుతూ
మీరు ఎప్పుడూ కాలాన్ని వెళ్ళూ అని చెప్పరు.
మీది అమర ప్రేమని కాలానికీ, మీకూ తెలుసు.

నీవు .... అతని  కళ్ళకెప్పుడూ దివ్యానుభవానివే
అందం నీ ఆస్తి .... నీ సౌందర్యం అతన్ని
తడిపేస్తూనే ఉంటుంది.
గడుస్తున్న కాలానికి తెలుసు
నీ అందం ద్విగుణీకృతం అవుతుంది.
కాలం గడిచే కొద్దీ అతని దృష్టిలో అని,
వయస్సు మీదపడే కొద్దీ
మనోహరం నీ రూపం అతని కళ్ళలో అని,

నేను



ఈ దృష్టి ఇంతకు ముందు లేదు ....
చిత్రం! అద్దంలో నాలో .... చూస్తున్నా నాన్నను.
ఈ శరీరం,
ఈ లక్షణాలన్నీ నాయనవే,
స్వర్గానికి వెళుతూ ఇక్కడ తన ప్రతినిధిగా నన్నొదిలెళ్ళినట్లున్నాడు.

Monday, May 13, 2013

పునర్జన్మ!



తులసివంటి మొక్క .... పవిత్ర ప్రేమ అలుముకుని,
నా గుండె మళ్లీ రాగాలాపన చేయసాగింది.
మది, ఎద .... దృష్టి సారించి చూసాయి.
చపలచిత్తుల్ని చెయ్యగల, బహు అరుదైన అందం ఆమెది.
నా ప్రేమకు అదే రుజువు!
చివరికి, నేను మళ్ళీ జన్మించాననేందుకు,

నిద్దురలోనే మనం .... ఇంకా!



నిశ్శబ్దం గా, 
నుదుట చిరు స్వేదం తుడుస్తూ పిల్లగాలి ....
మనం నడుస్తూ,
యేరు ప్రవహిస్తూ ఉంది ....
కప్పేసిన గుర్రపు డెక్కల ఆకుల కింద!

కోల్పోయి .... ప్రేమ



గుడ్డోడిని! .... చూస్తూ ఉన్నా!!
చెవిటోడిని! .... వింటూ ఉన్నా!!
మూగోడిని .... మనసు నొప్పని కబుర్లాడుతూ ఉన్నా!!
నేను,
ప్రేమలో గాయపడి ....
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రేమరోగిని!

దిశ!?



కదులుతూ ఉన్నా!
జీవన సాగరం లో ....
బాధ్యతగా,
కోల్పోయిన కలలు .... చేరాల్సిన తీరం దిశగా,
నిర్విరామంగా .... నమ్మకమే చుక్కాని గా!

చిన్న వివరణ కావాలి!



ఒక్కసారైనా,
కనీసం .... ఒక్కసారైనా ఆశ్చర్య పోయావా!?
ఎంత అందమో .... ఈ జీవితం అని,
ప్రకృతి, కాలం పుస్తకాలయం లో,
చరిత్ర నిండా సమర్ధించుకుంటూ కథలు .... మనది పుణ్య భూమి అని.
మరి,
నేటి దురదృష్టకర సంఘటనలు .... ఈ విధి వ్రాతలు,
ఎవరి జాతకాలు, ఎవరు వారసత్వంగా మిగిల్చారనుకోవాలి!

ఒక ముద్దు!



ముడతలు పడి,
తేలుతూ,
కాల ప్రవాహంలో కొట్టుకొని పోతూ,
ముదుసలి ప్రాణి కి,
స్వర్గం నుంచి వొచ్చిన .... కానుక,
చెంప మీద ముద్దు .... ఒక జ్ఞాపకం సిగ్గు.

ప్రియతమా!



నీకో చిరునవ్వును బహుమతియ్యాలనుంది.
నీ బాధను,
కన్నీళ్ళను తుడిచెయ్యలనుంది .... ప్రియతమా!
ఎంతో జీవితం ఉంది .... నీ ముందు
ఈ అనుబంధం, ఆత్మియతల రక్త పాశాలు ....
ఎలాగూ నీ కాళ్ళకు మెలికలేస్తూనే ఉంటాయి.
అందుకే,
నీ మది జ్ఞాపకాలను సున్నితంగా స్పర్శించు!
తియ్యని మధురిమ, ఎదనిండేలా ....
నీవు మాత్రం సుదీర్ఘంగా శ్వాసించు!

Sunday, May 12, 2013

ప్రేమే సర్వం!



చెయ్యగలిగిందీ
నీ వల్లనయ్యిందే చేస్తావు.
పాడగలిగిందీ
మనసు పల్లవించిన పాటే పాడతావు.
ముందేమి జరుగుతుందో నీకు తెలియదు.
అను క్షణం జీవిస్తూ,
అనుభవిస్తూ నేర్చుకుంటావు ... ఇది మాత్రమే నిజం!

కొత్తగా చూడగలవు.
కొత్త కోణంలో చూపించగలవు.
ఏదో లేనిది కనిపెట్టాననుకుంటేనే పొరపాటు!
ఊహించని పద్దతిలో ప్రజంట్ చేస్తున్నావు .... అంతే!
నీవు మాత్రమే పొదుపరివి కావు.
కాలమే తల్లీ, తండ్రీ .... గురువు
బ్రతకడం నేర్పే నిజం .... ఇది ప్రకృతి సహజం!

నీకు కావలసిందీ,
పొందాలనుకుంటుందీ,
నీకు శూన్యంలా కనిపిస్తున్నదీ,
ప్రేమే! .... నీకు కావలసినది.
విశ్వమంతా ప్రేమ. నీవు కోరుకుంటున్నది ప్రేమ!
నీ మది తపిస్తున్నదీ, నీకు ఊపిరి సలపనిదీ ....
నీకు కావలసింది ప్రేమ .... ప్రేమే నీకు కావలసినది.

ఎవరూ ఎరుగని .... ఏదైనా ఎరిగేందుకు,
నీకు దివ్యజ్ఞానం లేదు.
ఎవరూ చూసి ఉండని ఏదైనా
చూసి ఉండేందుకు నీకు దివ్య దృష్టీ లేదు.
ఎక్కడ ఉన్నా, ఎలా .... ఏ స్థితిలో ఉన్నా,
నీకు సంబధించినదీ, నీవు చెయ్యల్సిందీ అయితేనే
నీకు తెలుస్తుంది. ఇదే నిజం! ఇదే ప్రకృతి సహజం!!

నీకు కావలసింది ప్రేమ!
నీవు పొందాల్సింది ప్రేమ!
నీవు పంచాల్సింది ప్రేమ!
నీ జీవనం ఆద్యంతం నీకు తోడుండాల్సింది ప్రేమ!
నీవు ప్రేమించే ఆమె .... నిన్ను ప్రేమించేలా,
నీ నడవడికను అలవరచుకో!
ఆమే నీవు, నీవే ఆమెలా జీవించేందుకు .... సందేహించకు!

Saturday, May 11, 2013

ప్రేమనై పుట్టాను .... నీ కోసం!


నేను పుట్టింది .... నీ కోసం!
నా ప్రతి శ్వాసా ....
నిజం!
పిల్లా! ....
నిన్ను సంరక్షించుకునేందుకే నేను పుట్టింది. 
అను క్షణం, అనుదినం ....
నిన్ను ప్రేమించేందుకే నేను పుట్టింది!

పిల్లా!
నీవు పుట్టింది నా కోసమే ....
నా స్త్రీవి నీవు, నీ పురుషుడ్ని నేను!
నీ రక్త మాంసాలు, మనసు, ఎద .... నా కోసమే ట్యూన్ చేసినట్లు,
నీవు నా భావానివి, ఉద్వేగానివి!
నాకే ఎంచుకునే అవకాశం ఉంటే ....
ఎంతకైనా తెగిస్తా! నీ ప్రేమను పొందేందుకు!

ఒక్కసారి ఇటురా పిల్లా!  నా ఊహల్ని,
నన్ను నేను విప్పుకునే ఓ చిన్ని అవకాశం .... ఇచ్చి చూడు!
కలల్లోనే ఇరుక్కుపోయాను. కలల్లోనే కలుసుకుంటున్నాను. 
నా కలను నిజాన్ని చెయ్యి!
చాలా కష్టమేమో అనిపిస్తుంది .... నిజం పిల్లా!
నా ఊహలు కలలు వాస్తవం కావడం!
స్వర్గం నుంచి .... నీ చిరునవ్వు స్వాగతం ఎదురవడం
నిజం పిల్లా! .... నిన్ను ప్రేమించేందుకే నేను పుట్టింది.

నిన్నే ప్రేమించాలని మనసు కోరిక
నీ సంతోషాన్ని చూసే ఏ చిన్ని అవకాశాన్నీ .... వొదులుకోవద్దని,
నా ప్రేమ భావనలన్నీ నీపై ఒక్కసారిగా గుమ్మరించి
నీవు ఉక్కిరిబిక్కిరి అయితే చూడాలని .... ఆశతో ....
ప్రేమిస్తూ ఉన్నా! నేను పుట్టింది నీ కోసమే, నీ ప్రేమ కోసమే
పిల్లా! ఇది నిజం! నేను పుట్టింది నిన్ను ప్రేమించేందుకే
నీ సాంగత్యం, ఒక అద్భుత భావం .... ఉద్వేగం నాలో
ప్రతి రోజూ .... ఒక జీవిత కాలం!

Friday, May 10, 2013

ప్రేమాగ్ని!



ప్రేమ మంట
నీటితో చల్లార్చలేని అగ్ని!
మంటలు మండుతూ, రగులుతూ
నాలో లోలో ఆత్మలో ....
కాలుతున్న గందపు చెక్క
నీ ప్రేమ .... కాలుతూ, రగులుతూ
నా ఆత్మలో ....
ప్రేమ అనే కోరిక
బడబాగ్ని అయి,
నా ఆత్మను మండిస్తూ ....
అది చల్లారుతుందని నమ్మకం లేదు.

Thursday, May 9, 2013

నా ప్రేయసి


శరీరమంతా కృత్రిమత
పరిమళాలు పరుచుకుని పరిసరాలు
అది ఒక ప్రేరణ .... ప్రేరితుడ్నౌతున్నా!

మృదు మార్దవం ఆ గళం
సున్నితం ఆ ధ్వని
గుండె ఝలదరిస్తూ ఏవో ప్రేమ భావనలు!

ఆమె లో మాటల కందని ఏదో ఆకర్షణ
మందమారుతం తాకుతున్న అనుభూతి ....
ఆమె, మృదు స్పర్శ ఏదో ఆత్మ ను ముద్దాడినట్లు ....

విశాలమైన ఆ కళ్ళ అయస్కాంతం
మౌనంగా మాటల గుసగుసలాడుతూ .... భావం మాత్రం
నేను నిన్నే ప్రేమిస్తున్నా .... నీ సాహచర్యం కోరుతున్నా అని

2013, మే 10, శుక్రవారం ఉదయం 5.20 గంటలు

అమ్మా!


నేను పడిపోయి
మోకాలు కొట్టుకుపోయినప్పుడు
నీ మది రోధించడం
స్కూల్లో ఆటల్లో గెలిచినప్పుడు
నీవు ఆనందించడం
జారిపడ్డప్పుడు లేపి గుండెలకు హత్తుకోవడం
ప్రతిరోజు నా సంతోషం కోసం
నాతో ఆటలాడటం నాకింకా గుర్తుంది.

గర్బంలో ఘాడనిద్రలో నిదురించే నన్ను
ఈ ప్రపంచం లోకి తెచ్చి
వెలుగును ప్రసాదించి
భవిష్యత్తును అందంగా దిద్ది
నా కష్టంలో స్వేదానివై
నా బాధల కన్నీటివై
నా చిన్న ప్రపంచంలో నేనెరిగిన
తొలి అప్సరసను నిన్నింకా మరిచిపోలేదు.

అమ్మా!
నీ ఆశల
అమృత రూపాన్ని నేను.
నీ ఆశీర్వాదపు పాదు మొక్కను
నీ ప్రార్ధనల పూజల కృషి ఫలితం ....
విజయకేతనం .... నేను!
అమ్మా!
నీ పట్ల నా ప్రేమ
కాలం కొలవలేదు .... ఏ బ్రహ్మా విడమర్చలేడు! .... అమ్మా!


ఎదురుచూపుల నేను


నిద్దుర పో
కలలు కను
నీ కలలో నేను
ఆకాశం అంచు వద్ద
నీ రాక కోసం ఎదురుచూస్తూ .... నేను

నీ
ఆలోచనలో
ఆ ఆరాధనలో
ఆ కను రెప్పల రెపరెప ల
నీడలో
పహారా కాస్తూ ఉన్నా!

పగటి కలలు లో
నేనున్నాననుకునే నమ్మకం
ఆ పెదవంచున
జారే ముత్యాలు నవ్వులు అయి
అందుకునేందుకు అరచేయి చాచి
ఒక మోకాళ్ళమీద కూర్చుని అర్ధిస్తూ ఉన్నా

నీవు రాస్తున్న
కవిత లో
నీ ప్రేమను
అందమైన అబివర్ణను ....
నీ మది భావోద్వేగాన్నీ
నీ ఎద ముంగిట్లో ఎదురుచూస్తూ ఉన్న
సుమ పరిమళాన్ని .... నేనై,

నన్ను వెతుక్కుంటూ
నాతో ఉండేందుకు
నా సాహచర్యం
ప్రేమ భావం పంచుకునేందుకు ....
తిరిగి పంచేందుకు .... వస్తూ ఉన్న
నా ప్రేమ భావనవి నీవు.

నేను
నీ రాక కోసం
స్వర్గం అంచున
ఎదురుచుస్తూ ఉన్నా!.

Wednesday, May 8, 2013

అదే నా జీవ నిలయం .... గృహం


కఠిన, కష్ట, గడుసు, ప్రయాసతో కూడిన
నిరాశామయ అంధకారము
తడి, చెమ్మనైన అర్ద్రత, శీతల ఉదాసీనత .... నా జీవితం

తడిసిన మంచం పై,
నిన్నటి పాత రక్త మాంసాల వాసన
ఈగలకు కూడా అసహ్యం అనిపించే పిసిన వాతావరణం

సగం విరిగి శిధిలావస్థలో ఉన్న ఆ పాత గోడలు,
ఆకుపచ్చని పాకుడు అచ్చు కట్టినట్లు
నిద్దురలోనూ వెంటాడి వికటాట్టహాసం చేసే ఆ పీడకలలు

వికృత, వికార, భయానక ప్రదేశం లా,
ఎండకు దాహార్తితో మాడి చనిపోయిన చేపల వాసన తో
అశుభ్రతే అంతా .... అక్కడ వేలకొద్దీ బొద్దింకలు ముసిరి

బురద పాకుడూ కలిసిన మురికి నీరు
పాచిన మక్కిపోయిన గడ్డి నుండి తీసిన కొవ్వు వలే రుచి అది,
అక్కడ పొయ్యి మీద మాడిన సత్తుగిన్నెలో ఎలుకలు సంశయించే ఆహారం ....

అది నా జీవ నిలయం .... గృహం!

Monday, May 6, 2013

వినిపిస్తూనే ఉన్నాయి నీ రోధనలు .... ఓ ప్రియతమా!


వరద కన్నీరు
ఉబుకుతుంది ఉప్పెనలా నీ కళ్ళలోంచి
చేదుకుందామని అండనై 
చెయ్యందించాలని తపన నాలో
నీవు దూరంగా వెళ్ళిన క్షణం నుంచి
వినిపిస్తూనే ఉన్నాయి నీ రోధనలు
ఆ కన్నీరు రాలుతున్న శబ్దాలు

ఒంటరిగా
చీకటి నిశ్శబ్ద కుహరంలో
ఎవరి చేతో బంధించబడ్డట్లు
నా నుంచి నీవు నీనుంచి నేనూ
ఒకరికొకరం దూరమైన క్షణం నుంచి
ఆ ఏడుపులు నాకు వినిపిస్తూనే ఉన్నాయి
ఆ నిర్వేదం మోడ్రన్ ఆర్ట్ లా కనిపిస్తూనే ఉంది

ఎన్ని లక్షల ముత్యాలో ఆ కన్నీళ్ళు
రాలి చెల్లచెదురౌతూ విసిరేసినట్లు
ఓ ప్రియా నిరాశ చెందకు!
పట్టించుకోకు సమాజాన్ని .... పుకార్లని
నీ గుండె స్రవిస్తుందని తెలుసు
రంగు మారిన నీ కన్నీరు ....
ఆ రక్తపు బొట్లను గమనిస్తూనే ఉన్నాను.

ఒంటరి ఏకాంతంలో మౌనానివి
ఓ నేస్తమా!
బాధల మడుగు ఊబిలో
ఎవరూ లేనట్లు కూరుకుపోతూ
ఆశగా శున్యంలోకి చూస్తున్నావు?
నిజం! మనం ఒకరికొకరం దూరమైన క్షణం నుంచి
వినిపిస్తూనే ఉన్నాయి నీ రోధనలు ....?

2013, మే 06, సోమవారం రాత్రి 9.30 గంటలు.

Friday, May 3, 2013

అవి తియ్యని జ్ఞాపకాలు



అద్భుతం
ఆ ఇంద్రధనస్సు వన్నెలు
మబ్బుల ఊబిలో దిగబడిన మనస్సులో
అవి ఏవో అస్పష్ట వర్ణాలు
వివిధ తరంగదైర్ఘ్యాలు
ఉరుములు, మెరుపులు
తరచుగా కురిసే ఎండా వానా పూలజల్లులు!

Thursday, May 2, 2013

ఎక్కడివీ ప్రేమ భావనలు?


నా ఆత్మాభిమానం లో
లోతుగా గుచ్చుకుని ఉన్న ముల్లు
ఎవరో బయటికి తీసేసినట్లు,
నాలో నేను శూన్యంలా
ఇన్నాళ్ళూ కోల్పోయింది .... దొరికినట్లు,
పక్కన, చేతిలో చెయ్యేసి
ఓ అమృత మూర్తి నడుస్తున్నట్లు
నా ఆత్మను శుద్ది చేసినట్లు ఏవో భావనలు

క్రమం తప్పక
పత్రహరితం, వెలుగులు
చైతన్యం .... అందరికీ అందిస్తున్న
ఆ సూర్యదేవునికి
ఆ పరిపూర్ణ ప్రేమ మూర్తికి నమస్సులు 
ఆలోచించేకొద్దీ .... ఇప్పుడు
నా కల్పనలు భయాల మధ్య
ఖండాంతరాల దూరం కనిపిస్తుంది.
ప్రేమ అనే అనుభూతిని స్పష్టంగా  చూస్తున్నా

నా ఇన్ హిబిషన్స్ అన్నీ
వదిలేసేందుకు సిద్ధం గా ఉన్న క్షణాల్లో
ఇప్పుడు
నా భావోద్వేగాలు
నేను పీల్చుతున్న శ్వాస తో నిండిపోయాయి.
వేదాలు, చరిత్ర నిర్వచించిన
ధర్మ యుద్దాలు ఆత్మ త్యాగాలు
పవిత్ర ధరిత్రి నాదని చెప్పుకున్నా .... ఇన్నాళ్ళూ
ఔనూ ఇప్పుడు ప్రేమ స్వస్థత
ఉపశమనము నేనే ఎందుకు కాకూడదు?

2013, మే 03, శుక్రవారం ఉదయం 7.48 నిమిషాలు

Wednesday, May 1, 2013

నా తలకోసం వచ్చింది!



నిద్రలోంచి లేస్తూనే
వెలితిగా, అతిశయంగా అనిపించింది.
వైద్యుడ్ని పిలిచాను.
స్టెత్ వాడాడు.
నాడి చూసాడు.
నోరు తెరవమన్నాడు.
కళ్ళలోకి చూసాడు.
నాలో అన్ని అనారోగ్య లక్షణాలున్నాయని
అతను చెప్పేవరకూ తెలియదు!
ఏవో పరిక్షలు రాసాడు.
అన్ని టెస్టులు చేయించుకున్నాను.
రిపోర్ట్లొచ్చాయి.
అన్నీ సక్రమమే అని,
రిపోర్టుల్లో ఎక్కడా ఏ లోపమూ లేదు.
నా తల నరాల పరిక్ష మొదలయ్యిందప్పుడు!

నీ ఆత్మ భావాన్ని .... నేను!


స్వేదం కరగడం
విసిరే వర్షంలో తడవడం
కాళ్ళు బురదలో కూరుకుపోతూ లాక్కోవడం నా ఆనందం

సంక్లిష్టత ఉండి, చాకచక్యంగా బయటపడాలనుకునే ఆశావాదం నాది.
ఎవరూ ఇష్టపడని దేన్నో మోసెయ్యాలని ....
ఏదో అద్భుతం నా ద్వారా జరిగిపోవాలని .... ఆశ!

నావి విపరీతపు ఆలోచనలంటుంటారు అందరూ 
చెడు వార్త విన్నప్పుడు నాలో ఉత్సాహం ....
బాధ, విచారం అనుభూతి అనిపించి మాత్రం కాదు.

అది శుభవార్త గా మార్చేందుకు నేనెందుకు కారణం కాకూడదని
అవకాశం చేజిక్కించుకుని సాధించొచ్చుగా అని
నిజం! .... అందుకే వర్షం వర్షిస్తేనే నాకిష్టం!

నీ బాధలు కష్టాలను గుమ్మరించు .... నా ముందు, నా మీద
నాకెంతో ఆనందం .... కష్టాలను ఎదుర్కుని, సహాయం చేసి
నీ కళ్ళల్లో కాంతుల్ని విజయోత్సాహాన్నీ చూడటం!

నాకు .... ఎంతో ఇష్టం! వర్షంలో తడవడం, తల భారం పెంచుకోవడం
తప్పుదారిన ఎవరైనా వెళుతుంటే సరైన దారి చూపించడం
మార్గదర్శకుడ్ని కావడం! మంచి వైపు మార్గం చూపాననే అనుభూతి .... నాకెంతో ఇష్టం!

మొన్నటి మధుర గీతాలు
బాధాతప్త హృదయ రాగాలు
నాకెంతో ఇష్టం! .... కురుస్తున్న కష్టాల్లో మునకెయ్యడం!

చీకటుంటేనే నవ్వాలని
చీకటి నల్లదనాన్ని చెదరగొట్టడంలో
సౌకర్యం ఆనందం ఉందనుకునే వేదాంతం నాది.

నిజం! నాకు చీకటిని చెదరగొట్టే
చిరునవ్వు కాంతిలో మునగడం ....
కష్టాలు బాధలు వర్షంలో తడవడం ఇష్టం!

నా ఆశయాలు నా పోరాటం నా ఆవేశం గురించి
తెలుసుకోవాలని ఉందా! నీలోనే ఉన్నా .... నేస్తమా!
నేను, లోతైన నిరాశావాదానికి ముక్కుతాడేసి స్వారీ చెయ్యాలనుకునే రౌతును.

ఎవరి కష్టాలైనా గుమ్మరించేసుకుని
పోరాడటంలో ఉన్న ఆనందాన్ని చవిచూడాలనుకునే
నీలోని మరో మనిషి అంతర్మధనాన్ని .... నేను.

2013, మే 01, బుదవారం రాత్రి 9.20 గంటలు

జంతువులు తిరగబడితే



మరణం వేడుక
ఊపిరి బిగబట్టి చంపు ఒక రక్త సంప్రదాయం ఆరంభం
మనుషులు జంతువుల మధ్య
మొదటి మొరటు ఘర్షణ
అది ఒక ఆత్మాహుతి విధి తో పోరాటం!

విమర్శ అస్త్రాలు



విమర్శకులు
వేడి వాడి బాణాల విమర్శలు వెదజల్లగా
ఆ వ్యాఖ్యలు సూటిగా ఎదను గాయపర్చి వెంటనే మది రియాక్ట్ కావడం
స్వీయ విశ్వాసం రెచ్చగొట్టబడి .... కోపం!

తర్కభావోద్వేగం!



తర్కము, భావోద్వేగం
పరస్పరం విరుద్ధ ఆవేశాలు కానీ
కలిసి జీవిస్తాయి.
విజయాన్ని నిర్ణయించే మది ఎద మాత్రం
సన్నిహితం గా ఉండీ పోట్లాడుకుంటాయి.