Wednesday, May 8, 2013

అదే నా జీవ నిలయం .... గృహం


కఠిన, కష్ట, గడుసు, ప్రయాసతో కూడిన
నిరాశామయ అంధకారము
తడి, చెమ్మనైన అర్ద్రత, శీతల ఉదాసీనత .... నా జీవితం

తడిసిన మంచం పై,
నిన్నటి పాత రక్త మాంసాల వాసన
ఈగలకు కూడా అసహ్యం అనిపించే పిసిన వాతావరణం

సగం విరిగి శిధిలావస్థలో ఉన్న ఆ పాత గోడలు,
ఆకుపచ్చని పాకుడు అచ్చు కట్టినట్లు
నిద్దురలోనూ వెంటాడి వికటాట్టహాసం చేసే ఆ పీడకలలు

వికృత, వికార, భయానక ప్రదేశం లా,
ఎండకు దాహార్తితో మాడి చనిపోయిన చేపల వాసన తో
అశుభ్రతే అంతా .... అక్కడ వేలకొద్దీ బొద్దింకలు ముసిరి

బురద పాకుడూ కలిసిన మురికి నీరు
పాచిన మక్కిపోయిన గడ్డి నుండి తీసిన కొవ్వు వలే రుచి అది,
అక్కడ పొయ్యి మీద మాడిన సత్తుగిన్నెలో ఎలుకలు సంశయించే ఆహారం ....

అది నా జీవ నిలయం .... గృహం!

No comments:

Post a Comment