Sunday, May 19, 2013

హృదయంలో ఆశ్రయం ఇవ్వాలనుంది.



కల్మషం లేని పసి మనసు ఆమెది.
నేను ఆమెను చూసాను .... అడవి పువ్వులా ఉంది.
ఆమె నా వైపు చూసింది .... నిండైన అమాయకత్వం ఆమెలో,

నా మనసు కోరిక .... ఆమెను చేరదియ్యాలని. 
దగ్గరకు తీసుకుని, గట్టిగా గుండెలకు హత్తుకుని,
అలాగే ఉండిపోవాలని .... నేనున్నాననే భరోసా ఇవ్వాలని.

నా భావన ఆమెకు అర్ధం అయినట్లుంది. నావంకే చూస్తుంది.
సామాజిక నియమం అనే రేఖ ఒకటుందనే తాత్పర్యం .... ఆ కళ్ళలో
ఎన్నో ఏళ్ళుగా కలిసి జీవిస్తూ కట్టుకున్న సామాజిక .... హద్దులు అవి.

నాకు చేతికందే అంత చేరువలో ఉంది .... ఆమె,
ఆ ఆలోచనలు నా ఆలోచనలకు అందనంత ఎత్తులో, 
ఆవేశం, తెగింపు ఉండీ .... దూరంగా ఉన్నా ఆమెకు.

కొన్ని జీవితాలు అంతే .... ఆమె లా ఆ క్రమశిక్షణ ఆ....శ్రమజీవనమే
వారికి మనం ప్రేమను పంచాలనున్నా .... చేరదీయాలనున్నా,
చేరదియ్యలేము .... ఇవ్వలేము ఆనందాన్ని, హృదయంలో స్థానాన్ని.

No comments:

Post a Comment