Tuesday, April 12, 2011

నీవే

నీవే

నిద్దురలో నా చెంత,
జీవనగమనంలో నా వెంట ...
ప్రతి ఉదయం చిరునవ్వుల శుభోదయం ...... నా స్నేహం ......
నా ప్రేమ మౌనరాగం
నా అస్తిత్వం ......
సర్వం ......
నీవే కదా

ఊహల్లో నా హ్రుదయరాణివి ......
నా కంటి వెలుగువి,
నా ఉనికివి ......
నా కాళ్ళక్రింద కదులాడే భూమివి,
నా ప్రాణానివి ......
నే పీల్చే ప్రాణవాయువు గాలివి,
ఏడడుగులు నాతో కలిసి నడవాల్సిన ఆశవి ......
నాఊహల్లో నాతో కలిసి నడుస్తున్న కలవి,
నా జీవన సాఫల్యం ......
నా గమ్యం నీవే కదా

నీవులేని, లేవని క్షణం ......
నేను లేనని మాత్రం తెలుసు
జీవితం ఉందో లేదో తెలియనితనం ......
నాకు ప్రతి క్షణం

నా మనసు నీ చెంత ......
నన్నొదిలి వెళ్ళబోకు నేస్తమా
వెళ్ళాల్సొస్తే నేనూ నీవెంటే ......
మరువబోకు ప్రియతమా
మతిలేని ......
మనసు మాలిన ......
బ్రతుకు బాటసారిని ......
ప్రేమ పూజారిని