Friday, February 28, 2014

ప్రకృతి రాగం




పొరుగున, ఊరు బయట
బంగరు మాగాణి పొలం లో
పంట రోజుల లో
గాలి పాయల బుజ్జగింపు, మురిపాలు
అమ్మవొడిలో లా

ఎదిగిన పంటమొక్కల తలలు
కంకుల్ని నిమురుతూ గాలి
అలలులా వరి పొలం
ఎత్తుపల్లాల నమూనా నేత లా
పంట ఊగుతూ, 



 











ఆ సన్నివేశం, దృశ్యం
కాసింత దూరంగా నిలబడి
తదేకంగా
ఆ అందాల్నే ఆస్వాదిస్తూ
నీవూ నేనూ

ఆకులు రాలే కాలపు
ఆ లేత సున్నిత మందమారుతాల
పరామర్శల స్పర్శలు తాకి
మన హృదయాలు పరవసించి
అది ప్రకృతి రాగం .... మమతానురాగాలాపన

తెలిసింది



 

















మొత్తానికి
నేను అర్హుడినే అని

ఇప్పటివరకూ
నేను చేరని
అందుకోని అదృష్టం
వరాలు ఎన్నో ....

నేను కోరడం
శ్రమించడం మరిచే అని

Wednesday, February 26, 2014

అతి అంతే!?



కోపము,
ఆవేశ, ఉద్వేగం శబ్దము
నరాల గోడలను తాకి
ఆ ప్రతిద్వనులు
తీవ్రమై
బలాత్కరం, బెదరింపులు 

ప్రబలమై
నరాలు బ్రద్దలయ్యేందుకు సిద్ధమైతే
అదే పిచ్చితనము


అడుగు ముందుకు



















సొమ్మసిల్లిన హృదయాలు
విశ్రమిస్తూ,
కలలాంటి గమ్యం వృక్షం
విత్తనం
పండించాలనే ఆశ ....
ధైర్యం, సాహసం, పట్టుదల
స్వీయ నమ్మకం, శక్తిని
ఆత్మ  ద్వారా కూర్చుకుంటూ
భక్తి, శ్రద్దల
స్వేద జలం తో
ప్రకృతి, పంచభూతాల
ప్రేమ నీడలో
వికాసం, కాంతి మార్గం లో
సాహసాలు చేస్తూ,
వైఫల్యం భయం,
విజయం భయం లేకుండా.
ధైర్యం గా నడుస్తూ,
మార్గదర్శకం గా
ఈ జీవనయానం
శాంతియుతంగా.
ఇతరుల కు ఆదర్శం గా
గర్వపడేలా

Saturday, February 22, 2014

కొన్ని వాస్తవాలు జీర్ణం కావు




నేను అనుకోవడం లేదు.
ఎవరో ఏదో అయిపోతారని
నేను చనిపోతే ....
మనసులో మాట చెబుతున్నాను.
ఎందరినో బాధించాను.
తెలిసి కొన్నిసార్లూ, తెలియక కొన్నిసార్లూ
చెప్పిందే చెప్పి,
నేను చూసిన దృష్టితో
సమాజాన్ని చూడమని, ఎందరినో ....
వాస్తవాలు చూపించాలనే ప్రయత్నం .... లో
నన్ను వింటున్నట్లే నటించి
వారి ఆలోచనల్నే వారు అనుసరిస్తారని తెలిసీ,

కొందరు స్నేహితులు .... మాత్రం,
కలిసి తిరిగిన క్షణాల అనుభవాల్ని
నెమరువేసుకుని బాధపడతారు.
స్వచ్చంగానే
కానీ
వాళ్ళూ
కాలం తో పాటు ముందుకు కదులుతారు.
చెప్పకుండా వెళ్ళిపోయానని .....
నేను వంచించానని అనుకుంటూ,

ఆమె బాధపడుతుంది.
ఊహించని స్థితికి ఏడుస్తుంది.
తిట్టుకుంటుంది.
ఎన్నో ప్రమాణాల్ని గాలికి ఒదిలి .... వెళ్ళిపోయానని,
బాధ్యతల భారం మొయాల్సొచ్చిందని.
కానీ
కాలం లేపనం మరుపును తెస్తుంది.
ఆమె నన్ను మరిచిపోతుంది.
మరొకర్ని ఒప్పించాల్సిన అవసరం లేని,
స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని
సంతోషించనూ వచ్చు!
కాలగతిన నేను లేని జీవితాన్ని.

ఔనూ ఎవరికి అవసరం?
ఒక పిరికివాడు,
ఒక సామాన్యుడు,
ఒక నిర్బలుడు,
ఒక ఉద్వేగి .....
నిజంగా ఇలాంటి సాహచర్యం అవసరమా!
ఇతని గురించి ఇంతగా ఆలోచించాలా?
ఇతనుగా ఇతను చేసుకున్నదేగా!
జరగాల్సిందే జరిగింది.
నేను ఎంతగానో ద్వేషించే ఈ నిజం
నిజం! నిజమే
ఈ ఆలోచనల్లో బలం వాస్తవం ఉన్నాయి.

Thursday, February 20, 2014

ఎలా చూస్తే అలా కనిపిస్తుంది ప్రపంచం




వాతావరణం
ఆకుపచ్చగా మారి
ఆ చెట్లు,
ఆ ఎర్రని గులాబీలు
రకరకాల పూల మొక్కలు
అన్నీ నాకోసమే
వర్ధిల్లి
పూస్తున్నట్లు
ఒక చక్కని అనుభూతి అది.

చిరు నలుపును
పులుముకుని
నీలి ఆకాశం లో
కదులుతున్న తెల్లని మేఘాలు
ప్రకాశవంతమైన పగళ్ళు
విశ్రమించేందుకు
పవిత్రమైన చీకటి రాత్రుళ్ళు
ఎంత అద్భుతమైన
పరిణామక్రమం ఇది



 












ఆకాశాన్ని అలంకరిస్తూ ....
జీవ చైతన్యం
ముఖంపై ప్రతిబింబిస్తూ
ఎంత అందంగా
చిత్రంగా
ఆ ఇంద్రధనుస్సు రంగులు ....
ఆ కరచాలనాల
కుశలప్రశ్నల స్నేహాలు
పల్లె పడుచుతనాల
ప్రేమ పలుకరింపులు

తల్లి తండ్రులను మించిన వివేకం
అలవర్చుకునే అవకాశం
పొందగల ఆశ పునాది గా
ఎదిగే పసిపిల్లల కేరింతలు
ఎంత అద్భుత పరిణామం
ఈ ప్రపంచం
మళ్ళీ మళ్ళీ జన్మించి
అనుభూతిని చెందాలనిపిస్తూ
ఎంత గొప్ప అద్భుతం ఆనందం
ఈ జీవితం!

Wednesday, February 19, 2014

చెరగని మచ్చలు లా



 


















కదం తొక్కుతున్న విప్లవ గీతాలై
ప్రకంపనాలు సృష్టిస్తూ
పాడుతున్న
బడుగు
దళిత
వర్గ సాహిత్యం
గీతం
ధ్వని లోతు తో,
తామ్రఫలకాలు పై చెక్కబడినట్లు
లయబద్ధమైన చిత్రాలు .... కొన్ని,
నా మది గోడలపై

Tuesday, February 18, 2014

ఫిర్యాదు



 












ఆలోచించిందే తడవు
నీ గురించి నా హృదయం
ఎందుకో వేగంగా కొట్టుకోవడంలేదు.
ఎప్పటిలాగా ....
నీవు ఎదురుగా కనిపించినంతనే
ముఖాన మబ్బులు కమ్మి
ప్రకాశం దాచబడి.
తళతళ మెరుపులు కనపడటం లేదు .... కళ్ళలో 
నీ పేరు ఎవరైనా ప్రస్తావించినా
వెనుదిరిగి చూడాలనిపించడటం లేదు.
చిరునవ్వు చిగురించడం లేదు.
చాన్నాళ్ళ తరువాత అనుకుంటా
నీ గొంతు ....
నీ ముగ్ద మృధు గాత్రం
సంగీతంలా వినిపించడం లేదు నాకు.
నీ స్పర్శ
నా ఆత్మను నిద్ర లేపడం లేదు.
ఎంతో సామాన్యం గా
సంబధం లేని వారి స్పర్శలా ఉందే కాని,
నా లో లోపల ....
నన్ను ఒదిలి నీవు
దూరంగా వెళ్ళిపోతావనే ఆలోచన
కన్నీళ్ళు తెప్పించడం లేదు
నిన్నటి నిజం .... ప్రేమకు ఏమయ్యిందో
ఇప్పుడే ఎందుకిలా జరుగుతుందో ....
ఎందుకిలా అప్రాకృతికంగా అనిపిస్తుందో ....

Monday, February 17, 2014

అయిష్టం



 













నా భావనలు, నా మానసిక స్థితి
నాకెంతో అయిష్టం!
ముఖ్యంగా
నేను నీ సమీపం లో ఉన్నప్పుడు ....
సరైన మాటలు ....
పెగలని
ఆ తడబాటు
నా ఆలోచనల్లానే, నేనూ అస్తిరంగా అలా
విచలితుడ్నౌతుండటమూ,
నా మీద నాకే అసహ్యం!
నాకు నేను పరధ్యానం లో
ఉన్నాననిపించడం ....
నవ్వుతూ నువ్వు ఎదురుపడిన ప్రతిసారీ
నీ సమక్షం లో
నిలబడలేని ఆ స్థితిని .... ఊహించలేను.
నా గుండె హెచ్చించిన వేగంతో
కొట్టుకోవడం .... భారం గా ఉంటుంది.
అనుకోకుండా,
ఎప్పుడైనా నీ చెయ్యి తగిలితే
విధ్యుత్తు తగిలినట్లు పక్కకు జరిగి
వెర్రిముఖం వేసుకుని
వెంటనే సర్దుకుంటుంటాను.
నా మది, ఎదలకు తెలుసు
అది ద్వేషభావన కాదు, నీ పై ప్రేమ ఆని
ఆ వాస్తవం గుర్తించిన ప్రతిసారీ 
నన్ను నేను ద్వేషించుకుంటుంటాను.

Sunday, February 16, 2014

మనసు విప్పి మాట్లాడుకుందాం!



 

















ఏ ప్రాంతం లో, ఏ సమాజంలో
ఏ కులం మతం లో అయినా ....
తిరిగిన ఏచోట చూసినా
తెలియని ప్రపంచానికీ ఉన్న ప్రపంచానికి
సరిహద్దు ....
ఒక చిరునవ్వు మాత్రమే!
ఎన్నో పేర్లు
ఎన్నో రకాల ముఖాలు
ఎన్నో రకాల హావభావాలు
ఎన్నో రకాల జీవన సరళులు
కానీ,
నిజమైన భావోద్వేగం మాత్రం
అందరిలోనూ ఒకేలా ఉండటం విచిత్రం
ఆ అద్భుతం .... ప్రేమ

ఒక పసి హృదయం నవ్వులో
ఒక ఎదిగిన మనిషి కన్నీళ్ళలో
చూసాను. చూస్తున్నాను.
కల్మషరహిత పరిమళం .... ప్రేమను
అప్పుడప్పుడూ అనిపిస్తుంది
నీలో, నాలో .... ప్రతి ప్రాణిలో
మననందరినీ ఏదో బంధం దారం పెనవేసుకునుందని
ఒకరినొకరం అర్ధం చేసుకునేందుకు
దోహదపడుతుందని
అది ఎంతో సుక్ష్మంగా
గుర్తించలేని చిరుగాలి లా
ఆ గాలికి రగులే చిరు వెచ్చదనం లా
దివ్యమైన ఒక అనుభూతి లా
మానవ జీవన కావ్యపు పల్లవి లా
తొలి రాగ బంధం శ్రావ్యతను వింటున్నట్లుంటుందని.

ప్రతి జీవితం లో ఒక శాసనం అయి
ప్రతి పురుషుడి హృదయం లో ఒక మహరాణి
ప్రతి స్త్రీ హృదయం లో మహరాజు .... అయిన
ఒక ప్రియ భావన ఏదో
మనసు తలుపును తట్టి ....
ఆ అస్తిత్వం
తనను తాను కోల్పోయి
లోతైన సముద్రంలో మునిగిపోవడంలో
భయంకరమైన సునామీ ....
తుఫాను బీభత్సానికి గురి కావడంలో
ఆనందాన్ని ఇష్టపడే
సున్నిత ఉద్వేగ భావనల
సమ్మేళన సమీకరణాల వైశిష్ట్యం .... గురించి
ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుందామా!

మనకు ఎంతో అవసరమైన
ఆ విలక్షణ లక్షణం గురించి
జీవించేందుకు తప్పనిసరి
శ్వాస ను .... ప్రేమ ను గురించి
సాటి మనిషిని పరామర్శించాల్సిన
ఆవశ్యకత .... జీవన విధానం గురించి
ఒక ప్రాణి మరో ప్రాణి పట్ల ప్రదర్శించాల్సిన
నమ్మకం .... విశ్వాసం గురించి
రాగ విపంచి
హృదయ స్పందనలను గురించి
మనసు విప్పి
ఒక్కసారి, మరోసారి మాట్లాడుకుందామా!

పరిశుద్ధత



 














ఈ దృష్టి ఇలాగే ఉంటుందా ఎప్పటికీ
అని .... ఆశ్చర్యం
కొన్ని మసకేసి బైర్లు కమ్మిన క్షణాల
గతం .... ఇంకా మదిలో మెదులుతూనే ఉంది.
నా ప్రపంచం, నా పరిసరాలు
సరైనవే అనే .... నా భావనయ్యుండొచ్చు!
ఇది, కేవలం ఒక కలేనేమో అని ....
నేను చేరలేని ఔన్నత్యం
నక్షత్రం గమ్యం చేరాలనే నా కోరిక
నా ఆశ,
ఒక ఆశయ సాధన
నా జీవనావసరం అనే నమ్మకం కావొచ్చు!
నా ఆశల్ని, ఆశయాల్ని, కలల గమ్యాల్నీ
నీ చిరునవ్వులో,
నీ నల్లని కాటుక కళ్ళలో
శోధిస్తుండటం వల్ల కావొచ్చు.
ఏదో ప్రఘాడమైన నమ్మకం తో .....
ఆనందంతో .... తడిచిన కన్నీళ్ళతో
పరిశుద్ధతను అలవర్చుకుంటున్నప్పుడు ....
అవి బాధాశృవులుగా భావించి
తుడుచుకునే ప్రవృత్తి అలవడితే
అది నిజంగా నా తప్పే
నా పొరపాటే
ఆనందాశృవులే తప్ప
దుఃఖాశృవుల్ని .... కార్చమనుకోవడం!

Saturday, February 15, 2014

అలసించిన మనసు కోరిక



 













గుసగుసలాడుతు గాలి
ఎప్పుడైనా, ఎక్కడైనాప్రతీకారం కోపం మాటలను
దరి రాకుండా చూడగలిగితే బాగుంటుంది.
మనిషిదా నేను చెయ్యగలిగిందొక్కటే
ఎవరైనా, ఎప్పుడైనా
మాటలతో ఆటలు ఆడుతూ ఉంటే
తదేకంగా చూసి ఆశ్చర్యపోతూ ప్రశంసించగలను.
కనీసం మరో సూర్యాస్తమయ వేళనుకుని
హొయలు, వయ్యారం, గడుసుతనం అందం ను
ఆస్వాదిస్తున్న భ్రమ్ను కలిగిస్తూ నటించగలను
శోకం, శ్రమ గాయాలకు ఊరట పొంది
ఎన్నాళ్ళుగానో కుదవబెట్టుకునున్న దీర్ఘకాల కలల
ఆలింగనం చేసుకుంటూ జీవించగలను.
మేఘాలలో తేలి దూరదూర ప్రాంతాలకు కదిలి
అప్పుడప్పుడూ అవసరానికి వర్షిస్తూ
ఆనందిస్తూ
ఎంతో ప్రియంగా
చిత్రమైన భావనల గాలిపాటలు పాడుతూ
నిస్తేజమైన జీవితాల, శూన్యత్వాల్లో చైతన్యాన్ని
నింపుతూ
ఈ సమాజం ఏ ఇబ్బంది కలిగించని విధంగా జీవించాలని

కాదనుకున్నాక కూడా



 


















ఇరు హృదయాలలో ఒక హృదయం లో స్థానం కోల్పోయాక కూడా
ఆ హృదయాల మధ్య దూరం కొలవడం సాధ్యం కాదు.
కారణం, ఆ వ్యక్తుల ఆలోచనా సరళి ....
ఆలోచనలలో దూరం వ్యత్యాసం ఉండటం వల్ల

మనసుది ఒక విచిత్ర స్థితి
ఎప్పుడైనా ఎవరినైనా కావాలనుకుంటే
దగ్గరయ్యేలా దగ్గరగా చూడగలదు .... ఆలోచనల్లో
స్పర్శించనూగలదు .... ఇతరుల మాటల్లో విని.

ఒకరిని మరొకరు తన అనుకునే దాపరికం
ఉంటుంది ప్రతి మది ఎదలో .... రహశ్యాల సొరుగు లో
మరొకర్ని హృదయం లోంచి వెలి వేసినా
ఆ మరొకరి హృదయం సొరుగు లో ఆ ఒకరి స్థానం పదిలమే ....

భ్రమ




 











చిక్కుకున్నది మాత్రం సాలెగూడులో
తేనెతుట్టెలమయ ....
రాజోద్యానవనం లో
అర్ధనిమీలిత నేత్రాల .... నిద్దుర లేచిన
ఒక అడివి పుష్పము పూచిన ....
నవ్వునులా
మమతానురాగాల తేనె జిగురు లో
ఇరుక్కుపోయి .... నేను

ఏదో బాధ,
మరేదో నొప్పి
అసహాయతతో కూడిన ఆవేశం
నిలువెల్లా దహించి వేస్తూ ....
నేను
కనిపిస్తున్నాను .... చూడు
నీ కళ్ళలో ప్రతిబింబిస్తూ
ఒక స్ఫటికాకారంలో

చూడు! ఆ సాగరం లో
ఆ ఎగసిన అల ను
అది పడి లేచే విరామం లో
ఉక్కిరిబిక్కిరి అయిపోయి
సహాయం కోసం,
జీవించడం కోసం ....
తీరానికి ఈదుకెళ్ళుతున్న
అస్పష్ట ఆకారాన్ని .... నన్ను!



 


















కాలచక్రం ఇప్పుడు
నా చీలమండలను
బలంగా పట్టుకుని
నన్ను సముద్రంలోకి లాగుతుంది.
భయం, చీకటి, నిద్ర లకి సంబంధం లేని
అంతులేని ఆకలి లో
పూర్తిగా మునిగి తేలుతున్న .... నన్ను
వర్తమానం కుచేలుడ్ని

Friday, February 14, 2014

మరకలు



 
















గనగనలాడే నిప్పు కణాలపై
బూడిద తడి .... అద్ది,
మది గోడలమీద
ద్వేష, మోహాలు
పచ్చబొట్టు లా చెక్కబడి

పరాజయం పాలైన ఆత్మ నిర్వేదం
ప్రాణం కోల్పోయినంత
విచారం లో
నానబెట్టబడిన
అహంకారం .... నొప్పి, ఆవేశం తడి

తోసెయ్యబడి, అదఃపాతాళానికి .... అస్తిత్వం
ఆ ఎముకలు విరిగిన పగుళ్లు,
ఆ రూపం వెనుక
నీడలా .... వ్యక్తిత్వం
నరకం లోపలికి జారిపోతూ,

తడిసిపోయి, ఆరని .... అంతరాల లో
ఒక మోహం, ఒక ద్వేషం
అమృతం తాగిన రాహు కేతువులై,
మోహ ద్వేషరాగాలు
ఆత్మగౌరవం పై, ఒక చెరగని మరకై మిగిలిపోయి

Thursday, February 13, 2014

బద్దకాన్నొదిలించుకొ....



 















నిద్దుర మత్తు తో
తెరుచుకోనంటూ
మొరాయిస్తున్న కను రెప్పల వెనుక,

ఒక వైపున,
సుతారంగా మందలిస్తూ ....
బాధ్యతల గురుతులు .... భవిష్యత్తు!

మరోవైపున,
బద్దకం పొగమంచు కు ....
కట్టుబడిన జ్ఞాపకాల .... గతం!

నా దృష్టిని వక్రీకరిస్తున్నా
స్వేచ్చ, స్వాతంత్రం, చైతన్య సమీకరణ లతో
పరామర్శిస్తూ .... ప్రేమ, సాహచర్య భావనలతో వర్తమానం






Wednesday, February 12, 2014

పరితాపం




నీ, ఎడమ చేతి ఒత్తిడి
వెచ్చదనం
ఇంకి .... నా హృదయము పై
ఒక వింత పులకరింపు .
నీవు
ఎడమచేతి వాటం మనిషివి ....
అయ్యుండవు.
నిజం మాత్రం
నేను, నీ చేతిని బలంగా
నా గుండెలకు అదిమి పట్టుకునున్నాను.
నీ చేతికీ, నీ మనసుకూ
తెలుస్తూ ఉంటుంది. 


 










నా గుండె కొట్టుకుంటున్న సవ్వడి.
శాశ్వత అనుభూతి కోసం
నా ప్రాణం పడుతున్న పరితపన.

సేదదీర........



 













నిదురిస్తూ, నిద్దుర లోనూ ప్రశాంతతను పొందలేని ....
కష్టాల్లో ఉన్న ఒక సాటి మనిషిని  
పదిలంగా
చేతులతో
తలను చుట్టి
గుండెల్లోకి లాక్కుని
కళ్ళతో కళ్ళలోకి సూటిగా చూసి ....
వెన్నుతట్టి
చేతిలో చెయ్యేసి ....
నమ్మకం కలిగించి....తే
ఆ క్షణం లో
ఆ వ్యక్తి ఎంత నిద్రపోయినా
అంతకు మించిన విశ్రాంతి, ఉపశమనం ..... !


ఆఖరి అవశేషమా!



 

















నీకు నేను కనిపిస్తున్నానా?
నా ఉనికి నీకు ప్రచ్ఛన్నంగా అనిపిస్తుంటుంది
నీ సిరల్లో ఉద్రిక్తత ను
సల సలా కాగుతున్న ఉపద్రవాన్ని
నీ రక్తం వ్యాధిగ్రస్తమై
నీ ప్రాణం విషతుల్యం గా మార్చే లక్షణాన్ని

నమ్మడం ఇష్టం ఉండదు
నిజాన్ని, ఈ జన్మకు అర్ధం పరమార్ధం
ఆవశ్యకతను చూడటం ఇష్టం లేక
కళ్ళను ఎవరికి వారు మూసుకుంటారు.
ఎక్కడో మరో కొత్త ప్రదేశం లో
మరో కొత్త కర్తవ్యంతో మేలుకోగలనని ఆశ తో

ముందు ఒక కన్ను
పిదప రెండో కన్ను మూసుకున్నాక కానీ
ఈ వాస్తవాన్నీ, ఈ కలలు, ఆశలు లేని
ఈ బంజర భూమి జీవితాన్ని
వొదిలి పోలేము.
ఒకప్పుడు పొంగిన పాలతో నిండిన గ్లాసును
పగుళ్ళిచ్చి నిరర్ధకం గా మారాక గానీ

ఓ ప్రాణమా వింటున్నావా?
జీవితం గ్రందాలయం లో
బాధ అనే ఒక పుస్తకాన్ని .... నేను.
ఖాళీ అయిపోయిన అలమారాల్లో
కొనఊపిరితో
పట్టుకుంటే చిరిగిపోయేలా ఉన్న
ఆఖరి అవశేషాన్ని .... నేను.

ఆరంభం లో నేను ఒక్కరినే,
గబ్బిలాలు, కీచురాళ్ళు, తోడేళ్ళు
రక్కసి మూకలకు మార్గదర్శకంగా ఉంటూ
నీ మీద పట్టు సాధించి
నిన్ను ఛిద్రం చేసి
నిరుపయోగమైన నీ పనికిమాలిన శరీరాన్ని
సమాధి స్థితిలోకి లాక్కువెళ్ళేవరకూ

ఎందుకు
ఇది ఇలానే కొనసాగాల్సొస్తుంది,
సమీప ముగింపు కనిపించకుండా,
తెలివితక్కువతనంతో
ఆగ్రహంతో
రోతగా బయటపడాల్సివస్తుందో .... కానీ?
.
జీవనగగనం లో
ఎగిరే స్పూర్తిని కోల్పోయిన
విహంగానివి
గాయపడి
రెక్కలు విరిగి
రాలిపోయినట్లు.

ఎత్తు నుంచి మరికాస్త ఎత్తునుంచి
కలల ప్రపంచం నుంచి .... అఘాధాల్లోకి
వాస్తవ ప్రపంచం లోకి
ఒక్క క్షణం ఆగినట్లు ఆగి పడిపోతున్నట్లు,
మెరుపువంతమైన వేగం తో
నేలను తాకి ద్వంసం అయినట్లు

భయం, పక్షవాతం తో
కుప్పకూలిపోయిన్నట్లు
కదలలేని విసర్జిత పదార్ధాన్ని లా
తృణీకరిస్తావు .... నిన్ను నీవు.
నీ అవమానకర జీవనవాస్తవాన్ని!
ఓ ప్రాణమా! నిన్నే .... వింటున్నావా?

Tuesday, February 11, 2014

కలం కదులుతూ



 







 


మౌనాక్షరాలు కొన్ని ఆమె కలం నుండి దొర్లి
తెల్లకాగితాన్ని పరామర్శిస్తున్నప్పుడు
స్వార్ధపరుడ్ని లా ....
నేను ఆమె తొలి పాటకుడ్ని కావాలనుకుంటుంటాను.
ఆ పదాలు భావనలపై
సర్వ హక్కులూ నావే అన్నట్లు
నా ప్రియ భావనలు, నా అంచనాలు
నా తీపి భ్రమలకు లొంగి .... ఆమె
నా గురించే రాసిన పోస్టింగ్ అనుకుంటాను.

ఆమె కలంలోంచి కాగితం పైకి ప్రవహించే సిరా
నా ఆత్మకు జీవితం లా, ఆ జీవితానికి శ్వాస లా
అనుకున్నట్లు,
ఎంతో సున్నితంగా పరిశీలిస్తుంటాను.
ప్రత్యక్షంగా కానీ పరొక్షంగా కానీ
నా ప్రస్తావన ఎక్కడైనా ఉండుండొచ్చెమో అని.
ఆ అక్షరాలు కదులుతున్నట్లు
కాగితం మించి లేచి
ఎగిరొచ్చి నన్ను పలుకరిస్తున్నట్లు 
ప్రతి పదాన్నీ ఎదలో పొదువుకుంటాను.

ఎప్పుడైనా అక్షరాలలో .... ఆమె,
కుశల పరామర్శలు చదువుతున్నప్పుడు 
ఆమె వ్యక్తిత్వానికీ, కళాతత్వానికీ ఎదురుపడే
ఆ గౌరవప్రద ప్రశంసలు ఒక చక్కని అనుభూతిని కలిగిస్తాయి..
అందుకే, ఆమె భావనలను అక్షీకరించే 
ఆ సిరా అంటే నాకు అంత ప్రేమ
నా ఆలోచనలపై ఆధిపత్యంతో పాటు
అంతర్గత సమాధిస్థితిని నాలో సృష్టించి
నన్ను నియంత్రణ చేసే ఆ స్థితి 
నాకు యిష్టం ....
ఎంతో ఉన్నతం, లోతైన ఆ ప్రశంసాత్మక ఆవేశం ఇష్టం.

నాకు తెలుసు. సులభంగా చెప్పగలను.
ఆమె చేతి ఆయుధం కలం అని.
ఆ కలం విసిరిన అక్షరాల కుట్రకు
నేను లొంగిపోయానని చెబితే అది దారుణమే అవుతుంది..
నిజం మాత్రం
ఆమె ఆలొచనలకు నేను ఆకర్షితుడ్నయ్యాను.
ఆమె ఆలోచనలు నా మది లో నిండిపోయి
మైలురాళ్ళు
పరిపూర్ణ చిత్రాలు గా మారి
దిసా నిర్దేశం చేస్తుంటాయి .... నాకు,
నా జీవన రహదారినిండా అమర్చబడి.



 










ఆమె, ఒక కథ లేక కవిత లేక నవల రాస్తున్నప్పుడు,
ఒక తియ్యని సంగీతం లా
నా తెలివి ని విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు,
ఆ సీరా అభిజ్ఞాత్మకంగా కదిలినట్లు
రా, రమ్మంటూ ఆ పదాలు
ఎంతో మంచివి లా .... ప్రేమ గా బుజ్జగిస్తున్నట్లు,
నా ఎద లోకి దూరి
ఆ సిరా ఎండిపోయినప్పుడు మాత్రం
ఒక అందమైన కళ గా మారిపోతుంటాయి.
ఆమెకు నాకూ మాత్రమే అర్ధం తెలిసే రూపావిష్కరణలు గా మారి.

 


Sunday, February 9, 2014

తొలి అడుగు



 














కప్పుకునున్న చీకటి దుప్పటి
మడతలు విప్పి
కలల్ని భద్రంగా ముడిచి దాచుకుని
ఆవహించిన
పొగమంచు బద్దకం విరిగిపోతూ
మరో ఉదయం
ఆత్మ ఆవిష్కారం
నీడలు, ప్రతిధ్వనులు నిశ్శబ్దంగా సర్దుకుంటూ,

ఆర్బాటం లేకుండా
ఆ తూరుపు .... సుదూరపు కొండల్లోంచి,
చైతన్య కిరణాలు కదిలి వస్తూ,
ఆకుల అంచులపై మెరుస్తూ మంచు బిందువులు
చిరునవ్వుతో పలుకరిస్తూ
పల్లవించి పరిమళించి రాలిపోబోతున్న
ఆ ఎర్రని గులాబీ రేకులు ....
అనిర్వచనీయమైన ఒక అందమైన భావన
జీవన లక్ష్యాన్ని ప్రబోధిస్తూ

కన్నీళ్ళు కారుతున్నాయి. 
ఎద లోతుల్లోంచి .... ఊటై ఊరుతూ
ఆనందం అశృ పొరలు అడ్డొచ్చిన
పరిసరాలు మసకమసగ్గా మారి
ప్రేమ భావనలేవో ప్రబలమౌతూ
రెక్కలు విప్పుకుని
గుండె స్పందనల్ని పొదువుకుని .... ఈ ఆత్మ
ఒక అందమైన సీతాకోకచిలుక లా

హృదయం పూతోట లో .... కలుపు మొక్క



 













నీవు, తల తిప్పి
నన్నే గమనిస్తున్నావని తెలుసు!
నా కదలికల్ని, నా అస్తిత్వాన్నీ
నా ప్రతి లక్షణాన్నీ ప్రశ్నించబోతున్న
ఉత్సుకతను ఆ కళ్ళలో చూసా.
నా లాంటి వ్యక్తిని,
ఒక కలుపు మొక్కను .... ప్రేమిస్తూ కూడా,
కలుషితం కాని ....
మల్లియ స్వచ్చత, పరిమళం ప్రేమ అది.
ఆ రోజును నేను మరిచిపోలేను.
నా మనోఫలకం పై ....
చెరగని శిలాక్షరాల అనుభూతిని చెక్కిన క్షణాల్ని.
నీవు, నాకు మనస్పూర్తిగా దగ్గరయ్యి
నీకు మాత్రమే సాధ్యం అయిన విధంగా
నా చెవిలో మెల్లగా ఊదిన ఆ గుసగుసలు
మరుపుకురావడం లేదు ....
"వెళ్ళొస్తా!" అన్న ఆ జ్ఞాపకం పలుకులు.
తొలిసారి,
కలిగిన తొలి పులకరింపు అది.
నీ స్పర్శ, నీ సాన్నిహిత్యం
నీ మృదు స్వరం
తట్టి, నన్ను చైతన్యవంతం చేసిన క్షణం.
నీ పలుకుల్లో గీర, మార్దవం ను గుర్తించాను.
స్వచ్చము, పరిపూర్ణము
అమిత ప్రేమ నీకు నేనంటే అనిపించింది.
కానీ,
బాధాకరమైన విషయం మాత్రం
నాకు ఆ అనుభూతి ....
అంతకు మునుపెన్నడూ కలగకపోవడం,
అలాంటి ప్రేమ సాధ్యమని .... నేను ఊహించకపోవడం,
నేను ఒక కలుపు మొక్కను
నీకు ఏమీ కానివాడ్ని కావడం వల్ల .....

Thursday, February 6, 2014

రక్తం గడ్డకట్టిన .... క్షణాల్లో





 

















గునపాలు గుచ్చుతున్నట్లై
శరీరం స్పందించని
నొప్పి తెలియని అవస్థ
ఒకటుంటుంది.
అప్పుడు,
అంతా
చల్లదనమూ
మంచుతనమే
రక్తం లో దార్ఢ్యము
నరాలను విశ్చిన్నం చేసి
ప్రతి పగులులోంచి
రక్తం బదులు రసి స్రవించి
శాశ్వత నిద్రలోకి జారుకునే సమయం
ఒకటొస్తుంది.
తెరలు తెరలుగా
వెంటవెంటనే
మూర్చావస్థ లోకి జారిపోతూ,
ఏ పరామర్శల
స్పర్సల
కిరణాల
వెచ్చదనమూ పొందలేక
మానవ తత్వం చల్లబడి,
మనిషి ప్రాణం
పంచభూతాల్లో కలిసిపోతూ .....

అది ప్రేమేనేమో ....?




 












నిదురించాలనే విఫల ప్రయత్నం ....
నిశ్చల సమాధి లో తపస్వి లా,
నీ ఎద లో,
నిదురెరుగని ఆ నిశ్శబ్ద స్మశానం లో,
పరావర్తనం చెందని ....
ఆ కాంతి రహిత ప్రస్థానం లో,
అల్లుకునున్న ఆ చీకటి పొగమంచు ముసుగులో,
నిద్దురలో .... 


 










ఎవరో .... గీసి సృష్టించిన రూపాన్ని లా,
పూసిన చిత్రవిచిత్ర రంగుల కలయికను లా,
ఆ నక్షత్ర కిరణాల వడపోసిన కాంతిని లా,
వెండి వెన్నెల మెరుగుని లా కావాలని,
సుగంద పుష్ప వృక్ష విశేష లతనులా,
బూడిద రంగు సంరక్షణ కవచంను లా ....
ఏ జీవన అర్హ అనర్హాలను విశ్లేషించని,
కేవలం నీ గురించిన భావనలతోనే అల్లుకునున్న
అనురాగ సారం ను లా, నీ నీడనులా,
నీవు, నన్నూ ....
నా లోని ప్రకాశకతత్వం ను కప్పేసినట్లు,
విచక్షణా జ్ఞానం ను కోల్పోయి ....
నా ప్రాణం, ఆత్మ, ఆలోచనల పరిబ్రమణం
నీ చుట్టే కావడం ను, ఆకర్షణే అని అనుకోలేమేమో?

Monday, February 3, 2014

రేపు



నేను .... ఎవరినో, ఏమౌతానో తెలియదు.
ఖచ్చితంగా  చెప్పలేను ....
నా నిన్నటి చరిత్ర ఏమయ్యుంటుందో అని
రేపు ఏమి కావాలని అనుకుంటున్నానో
ఎవరిలా మిగలాలనుకుంటున్నానో,
ఎవరిలా కాగలనో అని,


సూక్ష్మంగా చెప్పాలంటే
నేను, నేనులా తీర్చిదిద్దబడిన ఒక సందిగ్ధతను.
అలా అని నాకు ఎవరి మీదా కోపం లేదు.
ఇది ఆక్షేపణ కాదు.
నేనిలా ఉన్నానని, ఎలా అవ్వాలో అని.

నేనెవరినో ....?



 









ఒకసారి
నీ గుండె చుట్టూ
వృత్తం గీసి .... చూడు!
నేను ఎవరినో? ఉండేదెక్కడో?
నీకే తెలుస్తుంది.

నేనొక సామాన్యుడ్ని! ప్రేమికుడ్ని అని,
నిదురిస్తుంది మాత్రం,
నీవు గీసిన
ఆ వృత్తం మధ్యలో ....
నీ గుండెలోనే అని.

Sunday, February 2, 2014

నీతో కలిసి ఎగిరిపోవాలనుంటుంది.




నీవు పక్కన ఉన్నప్పుడు ఎందుకో తెలియదు
ఒక లక్ష్యం, ఆలోచన లేని దురుసు యౌవ్వనాన్నై ఉండాలనుంటుంది.
రాత్రిళ్ళు స్పీడుగా డ్రైవ్ చెయ్యాలనుంటుంది.
గచ్చిబౌలీ, మాదాపూర్, కావూరీహిల్స్, పంజాగుట్ట, ప్రకాష్ నగర్ ....
ఫ్లై ఓవర్ల మీదుగా ఎగిరి,
కారు కిటికీలు క్రిందకు దించి, మ్యూసిక్ వాల్యూం పెంచి,
నీతో బుద్ద పౌర్ణిమా, నెక్లెస్ రోడ్లమీద గడపాలనుంటుంది.
టాంక్ బండ్ వైపు వెళ్ళి అక్కడ, ఆ బుద్దుడ్ని చూస్తూ ....
కొబ్బరి బొండాలు కొట్టించుకుని తాగుతూ .... తెల్లవార్లూ అలా, 



 










విలాస, విహార యాత్రలకని తిరిగి, ఆక్కడి వసతి గృహాల్లో
అనియంత్రితం గా కాలం గడిపేయాలనుంటుంది.
వస్తు ప్రదర్శన శాలల్లో .... నాకు ఇష్టం లేని
నీకెంతో ఇష్టమైన వస్తువుల్ని గుర్తించి అవి కొంటున్నప్పుడు
ఆ ఆనందం, ఆ ఆశ్చర్యం .... ఆ అద్భుతమైన మెరుపు
నీ ముఖం లో, నీ కళ్ళలో ప్రతిబింబిస్తున్నప్పుడు ....
ఆ మెరుపు కాంతుల్ని, నీ జీవితం తో ముడివేసుకునున్న
నా జీవితం అదృష్టాన్నీ ఆస్వాదించాలని ఉంటుంది.



 









నిన్నూ, పిల్లల్నీ తెల్లవారుజాము రెండు గంటలకే నిద్ర లేపి,
మీరు తయారయ్యేలోపు క్యారియర లో అన్నీసర్దుకుని,
కారు నడిపి, మీరందరూ కారు లో నిద్ర పోతే,
నాలుగున్నర గంటల అవిరామ జర్నీ పిదప మిమ్మల్ని నిద్ర లేపి
మిమ్మల్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచుతూ, నాగార్జున సాగర వద్ద ....
మీతో కలిసి సూర్యోదయం వేళ ను చూసి ఆనందించాలని,
ఎత్తిపోతల వద్ద .... పిల్లల ఆనందం కేరింతల్ని చూసి
పిదప అందరికీ ఇష్టమైన చేపల కూర కలిసి తినాలని ఉంటుంది.



 










ఎప్పటికప్పుడు నీవు ఆశ్చర్యపోయేట్లు ఏదో ఒకటి చెయ్యాలని ....
నీకూ, పిల్లలకూ జీవితం మీద ఉత్సాహం, ఆసక్తిని పెంచాలనుంటుంది.
ఈ ఆలోచన ఖర్చుతో కూడుకున్నదే అయినా,
అందులో ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమీ  లేకపోయినా ....
మన బంధం, మన అన్యోన్యత పరిపక్వమయినదే అయినా
ఎందుకో డబ్బు మీద మమకారాన్ని పెంచుకోవాలనుండదు.
మనుష్యులు మమతల స్థానం వస్తుతుల్యం చెయ్యాలనుండదు. 


Saturday, February 1, 2014

సమాజం లో



ఆశించేందుకు ఏముంటుంది!?
మునిగిపోతుందని తెలిసీ
చేస్తున్న
పడవ ప్రయాణం,
జీవన సాగర యానం లో ....
తెడ్లతోఁఅనుభవం లేని
సామాజిక అధ్యయనం లేని మనిషి
పడవను నడుపుతూ,
సారద్యం వహిస్తూ ....
తెడ్లను వాడటం తెలిసీ
సామాజిక అధ్యయనం చేసీ
దూరంగా కూర్చునుండే మనుషులతో ....
కలిసి ప్రయాణం చెయ్యాల్సొస్తే 


ఆశించేందుకు ఏముందని?!

చిత్రం!


అది నాకు ఒక తాజా అనుభూతి.
ఒక కొత్త అనుభవం!
ఆ సూర్యుడు ప్రకాశవంతంగా
కిరణాలు ప్రసరిస్తూ,
ఉదయపు మంచులో ఆ కిరణాలు
తళతళ మెరుస్తూ,
గడ్డిలో గిరగిరా తిరిగిన .... నీవూ నేనూ
ఆ తళతళల్ని పులుముకుంటూ ....
ఊహల రెక్కలమర్చుకుని .... మనం
ఆ నీలి ఆకాశం లోకి ఎగిరి, మేఘాలపై పచార్లు చేసి ....
అక్కడ్నుంచి లోతైన సముద్రం లోకి దూకి,
నీలిరంగును పులుముకోవడము,
ఊరుబయట పొలం లో విప్ప చెట్టుకింద
మనం కూర్చునున్నప్పుడు ....
గడ్డి ఆరగిస్తూ ఆలమందలు 
అప్పుడప్పుడూ "అంబా!" అని అరుస్తున్నట్లు,
కొమ్మలు, ఆకుల్లోంచి వడపోసినట్లు
రాలుతున్న కొన్ని సూర్యుని కాంతి కిరణాల్ని మనం
ఒక సీసాలో పట్టుకుని బంధించినట్లు,


 










నిజం! ఎంత అందమైన దృశ్యం .... ఈ ఊహ, నా మదిలో
గోరువెచ్చని గాలి నిన్నూ నన్నూ తాకినట్లు
మన బాహ్య ఆత్మలను గిలిగింతలు పెట్టినట్లు
నీవు పక్కనున్నావన్న భావనే చాలు!
అది ఒక నూతనానుభవం. ఒక చిత్రమైన అనుభూతి!

మనం


మానవులం మనం ....
ఆ గ్రహాలు, నక్షత్రాల్లా
ఎవరో విసిరేసినట్లు
మన మధ్య లక్షల కిలోమీటర్ల దూరం
........................
మనం, ఎవరికి వారు ఒంటరులం.
అయినా, సాటి మనిషిని, మించి ఎదగాలని,
అందరినీ మించి వెలిగిపోవాలనుకునే
ఆవేశ, ఆలోచనాపరులం.



 














ప్రకృతి పరిహసిస్తున్నా
చావే సమీపించి నవ్వుకుంటున్నా
అలక్షించే మనీ(మను)షులం
మనం .... అవిశ్రమ మరమాంత్రికులం

నరక జీవనం




ప్రతి ప్రాణికి, జీవితం లో ఒక సమయం వస్తుంది
అప్పుడు, ఏదీ ముఖ్యం కాదు అనిపించడం తో పాటు
దృష్టి లోపము, అస్పష్టతే అంతా
అయోమయం చీకట్లు చుట్టూ ముసిరి,
ప్రేమ, కరుణ పారిపోయి,
ద్వేషం, భయం, స్వార్ధం శాసనం చేస్తాయి.

అసహాయ .... నిర్లిప్త, అపనమ్మకం,
అయుక్తం, ఊపిరాడనితనము ....
పిచ్చితనము బారం తో .....
మది, ఎదల మధ్య సంయమనం లోపించే,
అవాంచనీయ పరిస్థితి ఒకటి వస్తుంది.



 












ఆనందము, భయంతో దాక్కుని
బాధ, దుఃఖం, ఉన్మాదాలు పేట్రేగి ....
ముచ్చెమటలు పోసిన ఆ క్షణం లో
మనిషి, జీవమున్న శవమే! చావును స్వాగతిస్తూ,