Wednesday, February 12, 2014

ఆఖరి అవశేషమా!



 

















నీకు నేను కనిపిస్తున్నానా?
నా ఉనికి నీకు ప్రచ్ఛన్నంగా అనిపిస్తుంటుంది
నీ సిరల్లో ఉద్రిక్తత ను
సల సలా కాగుతున్న ఉపద్రవాన్ని
నీ రక్తం వ్యాధిగ్రస్తమై
నీ ప్రాణం విషతుల్యం గా మార్చే లక్షణాన్ని

నమ్మడం ఇష్టం ఉండదు
నిజాన్ని, ఈ జన్మకు అర్ధం పరమార్ధం
ఆవశ్యకతను చూడటం ఇష్టం లేక
కళ్ళను ఎవరికి వారు మూసుకుంటారు.
ఎక్కడో మరో కొత్త ప్రదేశం లో
మరో కొత్త కర్తవ్యంతో మేలుకోగలనని ఆశ తో

ముందు ఒక కన్ను
పిదప రెండో కన్ను మూసుకున్నాక కానీ
ఈ వాస్తవాన్నీ, ఈ కలలు, ఆశలు లేని
ఈ బంజర భూమి జీవితాన్ని
వొదిలి పోలేము.
ఒకప్పుడు పొంగిన పాలతో నిండిన గ్లాసును
పగుళ్ళిచ్చి నిరర్ధకం గా మారాక గానీ

ఓ ప్రాణమా వింటున్నావా?
జీవితం గ్రందాలయం లో
బాధ అనే ఒక పుస్తకాన్ని .... నేను.
ఖాళీ అయిపోయిన అలమారాల్లో
కొనఊపిరితో
పట్టుకుంటే చిరిగిపోయేలా ఉన్న
ఆఖరి అవశేషాన్ని .... నేను.

ఆరంభం లో నేను ఒక్కరినే,
గబ్బిలాలు, కీచురాళ్ళు, తోడేళ్ళు
రక్కసి మూకలకు మార్గదర్శకంగా ఉంటూ
నీ మీద పట్టు సాధించి
నిన్ను ఛిద్రం చేసి
నిరుపయోగమైన నీ పనికిమాలిన శరీరాన్ని
సమాధి స్థితిలోకి లాక్కువెళ్ళేవరకూ

ఎందుకు
ఇది ఇలానే కొనసాగాల్సొస్తుంది,
సమీప ముగింపు కనిపించకుండా,
తెలివితక్కువతనంతో
ఆగ్రహంతో
రోతగా బయటపడాల్సివస్తుందో .... కానీ?
.
జీవనగగనం లో
ఎగిరే స్పూర్తిని కోల్పోయిన
విహంగానివి
గాయపడి
రెక్కలు విరిగి
రాలిపోయినట్లు.

ఎత్తు నుంచి మరికాస్త ఎత్తునుంచి
కలల ప్రపంచం నుంచి .... అఘాధాల్లోకి
వాస్తవ ప్రపంచం లోకి
ఒక్క క్షణం ఆగినట్లు ఆగి పడిపోతున్నట్లు,
మెరుపువంతమైన వేగం తో
నేలను తాకి ద్వంసం అయినట్లు

భయం, పక్షవాతం తో
కుప్పకూలిపోయిన్నట్లు
కదలలేని విసర్జిత పదార్ధాన్ని లా
తృణీకరిస్తావు .... నిన్ను నీవు.
నీ అవమానకర జీవనవాస్తవాన్ని!
ఓ ప్రాణమా! నిన్నే .... వింటున్నావా?

No comments:

Post a Comment