Thursday, February 6, 2014

రక్తం గడ్డకట్టిన .... క్షణాల్లో





 

















గునపాలు గుచ్చుతున్నట్లై
శరీరం స్పందించని
నొప్పి తెలియని అవస్థ
ఒకటుంటుంది.
అప్పుడు,
అంతా
చల్లదనమూ
మంచుతనమే
రక్తం లో దార్ఢ్యము
నరాలను విశ్చిన్నం చేసి
ప్రతి పగులులోంచి
రక్తం బదులు రసి స్రవించి
శాశ్వత నిద్రలోకి జారుకునే సమయం
ఒకటొస్తుంది.
తెరలు తెరలుగా
వెంటవెంటనే
మూర్చావస్థ లోకి జారిపోతూ,
ఏ పరామర్శల
స్పర్సల
కిరణాల
వెచ్చదనమూ పొందలేక
మానవ తత్వం చల్లబడి,
మనిషి ప్రాణం
పంచభూతాల్లో కలిసిపోతూ .....

6 comments:

  1. అవును ఆ సమయం వచ్చేలోగా మానవత్వానికి పట్టం కట్టటమే మనిషి చేయాల్సింది, అంతేనా మాస్టారూ.
    సర్, కఠోర సత్యాన్ని కళ్ళముందుంచారు.

    ReplyDelete
    Replies
    1. అవును ఆ సమయం వచ్చేలోగా మానవత్వానికి పట్టం కట్టటమే మనిషి చేయాల్సింది, అంతేనా మాస్టారూ.
      సర్, కఠోర సత్యాన్ని కళ్ళముందుంచారు.
      జీవితాన్ని అతిగా ప్రేమించే మనిషి చావును తప్పించుకోవాలని చేసే ప్రయత్నం పెనుగులాట అతన్ని తీవ్ర క్షోభ ఒత్తిడికి లోను చేసి చావు ఎంత భయానకమో అనిపిస్తుంది.
      ధన్యవాదాలు మెరాజ్ గారు!

      Delete
  2. అవును మీరజ్ గారన్నట్లు మనం మరణించేలోపు మానవత్వ విలువలను తెలుసుకోవాలి , చంద్రగారు అంతిమ పోరాటం గూర్చి కళ్ళకు కట్టినట్లు వివరించారు.

    ReplyDelete
    Replies
    1. అవును మీరజ్ గారన్నట్లు మనిషి మరణించేలోపు మానవత్వ విలువలను తెలుసుకోవాలి,
      చంద్రగారు అంతిమ పోరాటం గూర్చి కళ్ళకు కట్టినట్లు వివరించారు.
      బాగుంది ఏకీభావన స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం

      Delete
  3. ఏ పరామర్శల
    స్పర్సల
    కిరణాల
    వెచ్చదనమూ పొందలేక
    మానవ తత్వం చల్లబడి,
    మనిషి ప్రాణం
    పంచభూతాల్లో కలిసిపోతూ .....chaalaa baagundi vemula Chandra gaaru.

    ReplyDelete
    Replies
    1. ఏ పరామర్శల
      స్పర్సల
      కిరణాల
      వెచ్చదనమూ పొందలేక
      మానవ తత్వం చల్లబడి,
      మనిషి ప్రాణం
      పంచభూతాల్లో కలిసిపోతూ .....

      చాలా బాగుంది వేముల చంద్ర గారు.

      చాలా బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు కార్తీక్(ఎగిసే అలలు) గారు! శుభ ఉషోదయం

      Delete