Thursday, February 20, 2014

ఎలా చూస్తే అలా కనిపిస్తుంది ప్రపంచం




వాతావరణం
ఆకుపచ్చగా మారి
ఆ చెట్లు,
ఆ ఎర్రని గులాబీలు
రకరకాల పూల మొక్కలు
అన్నీ నాకోసమే
వర్ధిల్లి
పూస్తున్నట్లు
ఒక చక్కని అనుభూతి అది.

చిరు నలుపును
పులుముకుని
నీలి ఆకాశం లో
కదులుతున్న తెల్లని మేఘాలు
ప్రకాశవంతమైన పగళ్ళు
విశ్రమించేందుకు
పవిత్రమైన చీకటి రాత్రుళ్ళు
ఎంత అద్భుతమైన
పరిణామక్రమం ఇది



 












ఆకాశాన్ని అలంకరిస్తూ ....
జీవ చైతన్యం
ముఖంపై ప్రతిబింబిస్తూ
ఎంత అందంగా
చిత్రంగా
ఆ ఇంద్రధనుస్సు రంగులు ....
ఆ కరచాలనాల
కుశలప్రశ్నల స్నేహాలు
పల్లె పడుచుతనాల
ప్రేమ పలుకరింపులు

తల్లి తండ్రులను మించిన వివేకం
అలవర్చుకునే అవకాశం
పొందగల ఆశ పునాది గా
ఎదిగే పసిపిల్లల కేరింతలు
ఎంత అద్భుత పరిణామం
ఈ ప్రపంచం
మళ్ళీ మళ్ళీ జన్మించి
అనుభూతిని చెందాలనిపిస్తూ
ఎంత గొప్ప అద్భుతం ఆనందం
ఈ జీవితం!

6 comments:

  1. చైతన్యవంతమైన ప్రకృతిని అద్భుతంగా సాక్షాత్కరింప చేసారు చంద్రగారు.చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. చైతన్యవంతమైన ప్రకృతిని అద్భుతంగా సాక్షాత్కరింప చేసారు చంద్రగారు.
      చాలా బాగుంది.
      చాలా బాగుంది స్పందన స్నేహ ఆత్మీయ అభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete
  2. అహ్లాదకరమైన పూలపరిమళభరితం.....మీ కవిత

    ReplyDelete
    Replies
    1. అహ్లాదకరమైన పూలపరిమళభరితం ..... మీ కవిత
      ఆహ్లాదిన్నిచ్చే అందమైన స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete
  3. ఓ సున్నిత హృదయంతో చూడగలిగితే పూల పరిమళం,సోయగం కనిపిస్తుంది.
    అందమైన ప్రక్రుతి అక్షరాలతో అలంకరించుకొని కనిపిస్తుంది దొస్త్.

    ReplyDelete
  4. ఓ సున్నిత హృదయంతో చూడగలిగితే పూల పరిమళం, సోయగం కనిపిస్తుంది కవితలో.
    అందమైన ప్రకృతి అక్షరాలతో అలంకరించుకొని సేదదీర్చుతున్నట్లు కనిపిస్తుంది నేస్తమా.
    ఒక చక్కని పరిమళ సోయగం లా స్పందన స్నేహ ఆత్మీయాభినందన
    ధన్యమనోభివాదాలు ఫాతిమా గారు!!

    ReplyDelete