Monday, February 3, 2014

రేపు



నేను .... ఎవరినో, ఏమౌతానో తెలియదు.
ఖచ్చితంగా  చెప్పలేను ....
నా నిన్నటి చరిత్ర ఏమయ్యుంటుందో అని
రేపు ఏమి కావాలని అనుకుంటున్నానో
ఎవరిలా మిగలాలనుకుంటున్నానో,
ఎవరిలా కాగలనో అని,


సూక్ష్మంగా చెప్పాలంటే
నేను, నేనులా తీర్చిదిద్దబడిన ఒక సందిగ్ధతను.
అలా అని నాకు ఎవరి మీదా కోపం లేదు.
ఇది ఆక్షేపణ కాదు.
నేనిలా ఉన్నానని, ఎలా అవ్వాలో అని.

6 comments:

  1. పరిమళించే సమాజములో...వాడని మల్లెవు అవుతావు,
    కరుడు కట్టిన సమాజానికి ఎత్తిన కత్తివి అవుతావు.
    విద్యావంతుడివయితే రెంటికీ భేదం తెలుసుకుంటావు.

    ReplyDelete
    Replies
    1. "పరిమళించే సమాజములో.... వాడని మల్లెపూవు వు అవుతావు,
      కరుడు కట్టిన సమాజం భయపడే ఎత్తిన కత్తివి అవుతావు.
      విద్యావంతుడివి అయ్యి పువ్వుకూ ముల్లుకూ ఉన్న భేదం తెలుసుకుంటావు."
      ఒక చక్కని ఆకాంక్ష లా ప్రతి పసి హృదయాన్నీ ఆశీర్వదిస్తున్నట్లుంది స్పందన
      ధన్యవాదాలు మెరాజ్ గారు!

      Delete
  2. భావి తరానికి బాట అవుతావురా కన్నా..

    ReplyDelete
    Replies
    1. "భావి తరానికి బాట అవుతావురా కన్నా.."
      బ్లాగు కు స్వాగతం హిమజ ప్రసాద్ గారు
      ఒక మంచి స్పందన బాగుంది అభినందన
      ధన్యవాదాలు హిమజ ప్రసాద్ గారు! శుభోదయం!!

      Delete
  3. మంచి సంస్కారమున్న వాడివవ్వు చిట్టి తండ్రీ.......రేపటి సమాజంలో.

    ReplyDelete
    Replies
    1. మంచి సంస్కారమున్న వాడివవ్వు చిట్టి తండ్రీ.......రేపటి సమాజంలో.
      ఒక చక్కని ఆశీర్వాదం స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete