Sunday, February 2, 2014

నీతో కలిసి ఎగిరిపోవాలనుంటుంది.




నీవు పక్కన ఉన్నప్పుడు ఎందుకో తెలియదు
ఒక లక్ష్యం, ఆలోచన లేని దురుసు యౌవ్వనాన్నై ఉండాలనుంటుంది.
రాత్రిళ్ళు స్పీడుగా డ్రైవ్ చెయ్యాలనుంటుంది.
గచ్చిబౌలీ, మాదాపూర్, కావూరీహిల్స్, పంజాగుట్ట, ప్రకాష్ నగర్ ....
ఫ్లై ఓవర్ల మీదుగా ఎగిరి,
కారు కిటికీలు క్రిందకు దించి, మ్యూసిక్ వాల్యూం పెంచి,
నీతో బుద్ద పౌర్ణిమా, నెక్లెస్ రోడ్లమీద గడపాలనుంటుంది.
టాంక్ బండ్ వైపు వెళ్ళి అక్కడ, ఆ బుద్దుడ్ని చూస్తూ ....
కొబ్బరి బొండాలు కొట్టించుకుని తాగుతూ .... తెల్లవార్లూ అలా, 



 










విలాస, విహార యాత్రలకని తిరిగి, ఆక్కడి వసతి గృహాల్లో
అనియంత్రితం గా కాలం గడిపేయాలనుంటుంది.
వస్తు ప్రదర్శన శాలల్లో .... నాకు ఇష్టం లేని
నీకెంతో ఇష్టమైన వస్తువుల్ని గుర్తించి అవి కొంటున్నప్పుడు
ఆ ఆనందం, ఆ ఆశ్చర్యం .... ఆ అద్భుతమైన మెరుపు
నీ ముఖం లో, నీ కళ్ళలో ప్రతిబింబిస్తున్నప్పుడు ....
ఆ మెరుపు కాంతుల్ని, నీ జీవితం తో ముడివేసుకునున్న
నా జీవితం అదృష్టాన్నీ ఆస్వాదించాలని ఉంటుంది.



 









నిన్నూ, పిల్లల్నీ తెల్లవారుజాము రెండు గంటలకే నిద్ర లేపి,
మీరు తయారయ్యేలోపు క్యారియర లో అన్నీసర్దుకుని,
కారు నడిపి, మీరందరూ కారు లో నిద్ర పోతే,
నాలుగున్నర గంటల అవిరామ జర్నీ పిదప మిమ్మల్ని నిద్ర లేపి
మిమ్మల్ని సంబ్రమాశ్చర్యాలలో ముంచుతూ, నాగార్జున సాగర వద్ద ....
మీతో కలిసి సూర్యోదయం వేళ ను చూసి ఆనందించాలని,
ఎత్తిపోతల వద్ద .... పిల్లల ఆనందం కేరింతల్ని చూసి
పిదప అందరికీ ఇష్టమైన చేపల కూర కలిసి తినాలని ఉంటుంది.



 










ఎప్పటికప్పుడు నీవు ఆశ్చర్యపోయేట్లు ఏదో ఒకటి చెయ్యాలని ....
నీకూ, పిల్లలకూ జీవితం మీద ఉత్సాహం, ఆసక్తిని పెంచాలనుంటుంది.
ఈ ఆలోచన ఖర్చుతో కూడుకున్నదే అయినా,
అందులో ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమీ  లేకపోయినా ....
మన బంధం, మన అన్యోన్యత పరిపక్వమయినదే అయినా
ఎందుకో డబ్బు మీద మమకారాన్ని పెంచుకోవాలనుండదు.
మనుష్యులు మమతల స్థానం వస్తుతుల్యం చెయ్యాలనుండదు. 


8 comments:

  1. జీవితపు మధురాను భూతుల్నీ
    చిన్ని చిన్ని స్వీట్ నథింగ్స్ లోనే
    దగ్గరితనపు అలౌకికానందం దాగి ఉందనీ
    ఇష్టమైన వారి ఇష్టానికి
    మన ఇష్టాన్నీ జోడించి
    కష్టమైనా కరెన్సీ అయినా
    బంధానికే ప్రిఫరెన్సు ఇచ్చి
    ఆశల్ని అనుభూతులతో
    పెంచుకుని పంచుకున్న తీరు
    బాగుంది చంద్ర గారు..

    ReplyDelete
    Replies
    1. "జీవితపు మధురాను భూతులు చిన్ని చిన్ని స్వీట్ నథింగ్స్ లోనే
      దగ్గరితనపు అలౌకికానందం దాగి ఉందనీ
      ఇష్టమైన వారి ఇష్టానికి మన ఇష్టాన్నీ జోడించి
      కష్టమైనా కరెన్సీ అయినా
      బంధానికే ప్రిఫరెన్సు ఇచ్చి
      ఆశల్ని అనుభూతులతో పెంచుకుని పంచుకున్న తీరు బాగుంది చంద్ర గారు.." 

      స్త్రీ పురుషుల సాంసారిక సంబంధాలలో తరచుగా వచ్చే ఫ్రిక్షన్ కు మూల కారణం డబ్బుకు మనిషికన్నా ప్రధాన్యత ఇవ్వడమే. అది ఒక మారక ద్రవ్యం మాత్రమే అని మనిషి విలువ చాలా ఎక్కువని చెప్పాలనే తపన లోంచి వచ్చిన భావన ఇది. ఒక చిన్న వ్యాసం లా రాద్దామని మొదలెట్టి చివరికి కవితగా మలిచాను.

      మీ స్పందనలో ఆత్మీయతను చూస్తున్నాను. ధన్యవాదాలు జానీ పాషా గారు!

      Delete
  2. చంద్ర గారూ...
    మేమేదో చంద్రుడికి కొన్ని నూలుపోగుల్లా
    మీ కవితాక్షరాలకి హారతి పట్టే ప్రయత్నం చేస్తూ
    వెన్నెల్ని ఆస్వాదిస్తున్నాం
    హ హ మీరు మా పదాల్ని మాకే మళ్ళీ వినిపిస్తూ
    వాటి పట్ల మీకున్న వాత్సల్యతను
    మాతో పంచుకునే వైనం లో ఎంత ఆప్యాయతుందో!!!!!
    మీ రాతల్లో మా పదాల్ని చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో!!!
    మీ ప్రతీ ప్రతిస్పందనకీ అభినందనలు చంద్ర గారు...

    ReplyDelete
    Replies
    1. మీరు మా పదాల్ని మాకే మళ్ళీ వినిపిస్తూ
      వాటి పట్ల మీకున్న వాత్సల్యతను
      మాతో పంచుకునే వైనం లో ఎంత ఆప్యాయతుందో!

      మనిషి అరవై లో అడుగు పెట్టాక మళ్ళీ బాల్యదశకు వచ్చినట్లంటారు .... బాల్యదశలో పిల్లలు పెద్దవాళ్ళ మాటల్ని తిరిగి వారికే అప్పచెప్పి వారి ప్రేమకు పాత్రులవుతారు. మీ ప్రేమను పొందాలని అలాంటి ప్రయత్నమే ఇది జానీ గారు! శుభోదయం!!

      Delete
  3. చంద్ర గారూ...
    మేమేదో చంద్రుడికి కొన్ని నూలుపోగుల్లా
    మీ కవితాక్షరాలకి హారతి పట్టే ప్రయత్నం చేస్తూ
    వెన్నెల్ని ఆస్వాదిస్తున్నాం
    హ హ మీరు మా పదాల్ని మాకే మళ్ళీ వినిపిస్తూ
    వాటి పట్ల మీకున్న వాత్సల్యతను
    మాతో పంచుకునే వైనం లో ఎంత ఆప్యాయతుందో!!!!!
    మీ రాతల్లో మా పదాల్ని చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో!!!
    మీ ప్రతీ ప్రతిస్పందనకీ అభినందనలు చంద్ర గారు...

    ReplyDelete
    Replies
    1. మీ రాతల్లో మా పదాల్ని చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో ....
      (అద్దంలో మమ్మల్ని మేము చూసుకున్న అనుభూతి లా ....)
      ఒక చక్కని ప్రశంస జానీ పాషా గారు! మీ పదాలు మీకు అద్భుతంగా కనిపించడం పారదర్శకత కు నేను కాస్త ఫౌడర్లు సెంట్లు పూస్తున్నానని .... పరోక్ష్ భావన
      నమస్సులు జానీ గారు!

      Delete
  4. కొన్ని సున్నిత మనస్కులకు మాత్రమే సాద్యమయ్యే పనులు మా చంద్రా సర్ కవితల్లో కనిపిస్తాయి.
    అనితర సాద్యమైన ఆత్మీయ బంధాలవి.
    మా జానీ చెప్పినట్లు మీ విష్లేషణలో మా పదాలు అందాన్నిస్తాయి.

    ReplyDelete
    Replies
    1. కొందరు సున్నిత మనస్కులకు మాత్రమే సాద్యమయ్యే నడవడులు, పనులు మా నేస్తం కవితల్లో కనిపిస్తాయి.
      అనితర సాద్యమైన ఆత్మీయ బంధాలవి.

      మా జానీ చెప్పినట్లు మీ విష్లేషణలో మా పదాలు అందాన్నిస్తాయి.

      ఒక మనిషి మరో మనిషిలోని ఉన్నత భావనల్ని మాత్రమే చూడటం ఆ మనిషి మంచితనం. మంచిని మాత్రమే కోరుకునేది స్నేహం.
      మంచి స్నేహ హస్తాల్ని పొందిన అదృష్టం నాది.

      మీ స్పందన లో గొప్ప ప్రోత్సాహం ఉంటుందెప్పుడూ మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete