Friday, February 14, 2014

మరకలు



 
















గనగనలాడే నిప్పు కణాలపై
బూడిద తడి .... అద్ది,
మది గోడలమీద
ద్వేష, మోహాలు
పచ్చబొట్టు లా చెక్కబడి

పరాజయం పాలైన ఆత్మ నిర్వేదం
ప్రాణం కోల్పోయినంత
విచారం లో
నానబెట్టబడిన
అహంకారం .... నొప్పి, ఆవేశం తడి

తోసెయ్యబడి, అదఃపాతాళానికి .... అస్తిత్వం
ఆ ఎముకలు విరిగిన పగుళ్లు,
ఆ రూపం వెనుక
నీడలా .... వ్యక్తిత్వం
నరకం లోపలికి జారిపోతూ,

తడిసిపోయి, ఆరని .... అంతరాల లో
ఒక మోహం, ఒక ద్వేషం
అమృతం తాగిన రాహు కేతువులై,
మోహ ద్వేషరాగాలు
ఆత్మగౌరవం పై, ఒక చెరగని మరకై మిగిలిపోయి

6 comments:

  1. Mee kavita chaalaa baagundi,vemula chandra gaaroo:-):-)

    ReplyDelete
    Replies
    1. మీ కవిత చాలా బాగుంది, వేముల చంద్ర గారూ:-):-)
      చక్కని ప్రోత్సాహక అభినందన స్పందన
      ధన్యవాదాలు కార్తీక్(ఎగిసే అలలు) గారు!

      Delete
  2. భావావేశ వర్ణన బాగు బాగు.

    ReplyDelete
    Replies
    1. భావావేశ వర్ణన బాగు బాగు.
      బాగుందని అభినందన స్నేహ ప్రోత్సాహక స్పందన
      _/\_లు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete
  3. అమృతం దేవతలు తాగారంటారు , కానీ నేటి సామాజిక పరిస్థితులు చూస్తుంటే రాహుకేతువులే తాగాయేమో అనిపిస్తోంది. చంద్రగారు వాస్తవం బాగా చూపించారు.

    ReplyDelete
    Replies
    1. అమృతం దేవతలు తాగారంటారు, కానీ నేటి సామాజిక పరిస్థితులు చూస్తుంటే రాహుకేతువులే తాగాయేమో అనిపిస్తోంది.
      చంద్రగారు వాస్తవం బాగా చూపించారు.
      చక్కని స్నేహాభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete