Sunday, February 9, 2014

హృదయం పూతోట లో .... కలుపు మొక్క



 













నీవు, తల తిప్పి
నన్నే గమనిస్తున్నావని తెలుసు!
నా కదలికల్ని, నా అస్తిత్వాన్నీ
నా ప్రతి లక్షణాన్నీ ప్రశ్నించబోతున్న
ఉత్సుకతను ఆ కళ్ళలో చూసా.
నా లాంటి వ్యక్తిని,
ఒక కలుపు మొక్కను .... ప్రేమిస్తూ కూడా,
కలుషితం కాని ....
మల్లియ స్వచ్చత, పరిమళం ప్రేమ అది.
ఆ రోజును నేను మరిచిపోలేను.
నా మనోఫలకం పై ....
చెరగని శిలాక్షరాల అనుభూతిని చెక్కిన క్షణాల్ని.
నీవు, నాకు మనస్పూర్తిగా దగ్గరయ్యి
నీకు మాత్రమే సాధ్యం అయిన విధంగా
నా చెవిలో మెల్లగా ఊదిన ఆ గుసగుసలు
మరుపుకురావడం లేదు ....
"వెళ్ళొస్తా!" అన్న ఆ జ్ఞాపకం పలుకులు.
తొలిసారి,
కలిగిన తొలి పులకరింపు అది.
నీ స్పర్శ, నీ సాన్నిహిత్యం
నీ మృదు స్వరం
తట్టి, నన్ను చైతన్యవంతం చేసిన క్షణం.
నీ పలుకుల్లో గీర, మార్దవం ను గుర్తించాను.
స్వచ్చము, పరిపూర్ణము
అమిత ప్రేమ నీకు నేనంటే అనిపించింది.
కానీ,
బాధాకరమైన విషయం మాత్రం
నాకు ఆ అనుభూతి ....
అంతకు మునుపెన్నడూ కలగకపోవడం,
అలాంటి ప్రేమ సాధ్యమని .... నేను ఊహించకపోవడం,
నేను ఒక కలుపు మొక్కను
నీకు ఏమీ కానివాడ్ని కావడం వల్ల .....

4 comments:

  1. నీకు ఏమీ కానివాడ్ని కావడం వల్ల ...

    నీకు ఏమీ కాని వాణ్ణిగా మిగలటం వల్ల...

    బాగుంది సర్...

    ReplyDelete
    Replies
    1. నీకు ఏమీ కానివాడ్ని కావడం వల్ల ...
      నీకు ఏమీ కాని వాణ్ణిగా మిగలటం వల్ల...
      బాగుంది సర్...
      బాగుంది స్పందన స్నేహ ఆత్మీయాభినందన
      ధన్యవాదాలు ఎన్ ఎం రావు బండి గారు! శుభోదయం!!

      Delete
  2. ప్రేమలో స్వచ్ఛతని స్వచ్ఛమైన పదాలతో కూర్చిన వలపు ఉద్యానవనంలా ఉంది సర్. ఎందుకో నాకు కలుపు మొక్క కనిపించలేదు. అంత స్వచ్ఛంగా రాశారు. ఏమీ కాకపోవడం వల్ల కలుపు మొక్కనే అని అనిపించినా... మనసు తులసీదళమేనేమో... కదా. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రేమలో స్వచ్ఛతని స్వచ్ఛమైన పదాలతో కూర్చిన వలపు ఉద్యానవనంలా ఉంది సర్. ఎందుకో నాకు కలుపు మొక్క కనిపించలేదు. అంత స్వచ్ఛంగా రాశారు. ఏమీ కాకపోవడం వల్ల కలుపు మొక్కనే అని అనిపించినా.... మనసు తులసీదళమేనేమో .... కదా బాగుంది.
      ఒక చక్కని స్నేహ ప్రోత్సాహక అబినందన ఈ స్పందన
      ధన్యాభివాదాలు సతీష్ కొత్తూరి గారు! శుభసాయంత్రం!!

      Delete