Sunday, February 16, 2014

పరిశుద్ధత



 














ఈ దృష్టి ఇలాగే ఉంటుందా ఎప్పటికీ
అని .... ఆశ్చర్యం
కొన్ని మసకేసి బైర్లు కమ్మిన క్షణాల
గతం .... ఇంకా మదిలో మెదులుతూనే ఉంది.
నా ప్రపంచం, నా పరిసరాలు
సరైనవే అనే .... నా భావనయ్యుండొచ్చు!
ఇది, కేవలం ఒక కలేనేమో అని ....
నేను చేరలేని ఔన్నత్యం
నక్షత్రం గమ్యం చేరాలనే నా కోరిక
నా ఆశ,
ఒక ఆశయ సాధన
నా జీవనావసరం అనే నమ్మకం కావొచ్చు!
నా ఆశల్ని, ఆశయాల్ని, కలల గమ్యాల్నీ
నీ చిరునవ్వులో,
నీ నల్లని కాటుక కళ్ళలో
శోధిస్తుండటం వల్ల కావొచ్చు.
ఏదో ప్రఘాడమైన నమ్మకం తో .....
ఆనందంతో .... తడిచిన కన్నీళ్ళతో
పరిశుద్ధతను అలవర్చుకుంటున్నప్పుడు ....
అవి బాధాశృవులుగా భావించి
తుడుచుకునే ప్రవృత్తి అలవడితే
అది నిజంగా నా తప్పే
నా పొరపాటే
ఆనందాశృవులే తప్ప
దుఃఖాశృవుల్ని .... కార్చమనుకోవడం!

6 comments:

  1. అశ్రువు ,ఓదార్పునే కాదు, ఆత్మవిమర్శను కూడా ఇస్తుంది,
    కన్నేళ్ళు రాకపోవటం కూడా దురదృష్టం,
    ఏదో...తెలీని వేదన కనిపిస్తుంది కవితలో,....బాగుంది సర్.

    ReplyDelete
    Replies
    1. అశ్రువు ,ఓదార్పునే కాదు, ఆత్మవిమర్శను కూడా ఇస్తుంది,
      కన్నేళ్ళు రాకపోవటం దురదృష్టం,
      ఏదో .... తెలీని వేదన కనిపిస్తుంది కవితలో,....
      బాగుంది సర్.
      చాలా బాగుంది పరామర్శ స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభారుణోదయం!!

      Delete
  2. గుండె మంటలు ఆర్పేవే కన్నీళ్ళు.....అవే లేకపోతే ఎలా !!!

    ReplyDelete
    Replies
    1. గుండె మంటలు ఆర్పేవే కన్నీళ్ళు .... అవే లేకపోతే ఎలా!!!
      గుండె కిటికీ కళ్ళు గుండె పలికేది కన్నీళ్ళతోనే .... పొంగిపొర్లే ఆనందాన్నైనా విషాదాన్నైనా పలికేది .... కన్నీళ్ళ తోనే .... వాటి ప్రాముఖ్యతను తగ్గించలేము
      చక్కని స్పందన .... సూచన
      నమస్సులు పద్మార్పిత గారు!

      Delete
  3. అప్రయత్నంగా వచ్చే అశృవులు ఏవైనా ,అన్నిటికీ మంచి విలువలు ఉంటాయి... చంద్రగారు బాగుంది.

    ReplyDelete
    Replies
    1. అప్రయత్నంగా వచ్చే అశృవులు ఏవైనా, అందులో స్వచ్చత ఉంటుంది...
      చంద్రగారు బాగుంది.
      బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete