Saturday, February 1, 2014

మనం


మానవులం మనం ....
ఆ గ్రహాలు, నక్షత్రాల్లా
ఎవరో విసిరేసినట్లు
మన మధ్య లక్షల కిలోమీటర్ల దూరం
........................
మనం, ఎవరికి వారు ఒంటరులం.
అయినా, సాటి మనిషిని, మించి ఎదగాలని,
అందరినీ మించి వెలిగిపోవాలనుకునే
ఆవేశ, ఆలోచనాపరులం.



 














ప్రకృతి పరిహసిస్తున్నా
చావే సమీపించి నవ్వుకుంటున్నా
అలక్షించే మనీ(మను)షులం
మనం .... అవిశ్రమ మరమాంత్రికులం

2 comments:

  1. సునిశిత భావాలు నశించి యంత్రాలుగా మారిపోయి యాంత్రికజీవనంలో పడి మానవులు మరమనుషులైపోయారు..చంద్రగారు వాస్తవాన్ని చక్కగా వివరించారు.

    ReplyDelete
    Replies
    1. "సునిశిత భావాలు నశించి యంత్రాలుగా మారిపోయి, యాంత్రికజీవనంలో పడి మానవులు .... మరమనుషులైపోయారు..
      చంద్రగారు వాస్తవాన్ని చక్కగా వివరించారు."

      ఏకీభావన చక్కని విశ్లేషణాత్మకత స్పందన ....
      నమస్సులు శ్రీదేవీ!

      Delete