Thursday, December 31, 2015

ఆనందమే ఉద్దేశ్యం అయితెఅక్కడే 
నీ పక్కనే అవిగో గులాబీలు 
సంపెంగల సువాసనలు గమనించు 

ఇప్పుడు అవి 
ఆలశ్యం కాలానికి 
వడలి రాలిపోతున్నాయి 

ఔనూ! 
ఎందుకు ఆ ఎదురుచూపులు? 
అవి వడలి రాలిపోయేవరకూ 

నీ ఆశలు ఆశయాలు 
లక్ష్య సాధనల వేళ తగునా ఈ కాలయాపన 
అడుగు ముందుకే వేస్తూ ఆలోచించు 

మించిపోయిందేమీ లేదు. 
ఇప్పటికైనా
నీలో పురోగమించే ఆలోచనంటూ ఉంటే 

పశ్చాత్తాపం 
ఎప్పుడైనా పడొచ్చు 

మంచిని శాంతిని పంచుకుందాం


సరైన సమయం
శాంతి ఆనందం ఆహ్లాదం
ఆశలు ప్రేమ పంచుకునేందుకు
ప్రతి సంవత్సరమూ వస్తూనే ఉంటుంది.
నూతనం గా
ప్రేమ పరిమళాలను
వెదజల్లుతూ పరిసరాల్లో

మనం ప్రశాంతంగా ఉండాలి.
మరొకరికి పంచేందుకు శాంతిని
ఈ సాయంత్రం మనం
కొన్ని కొత్త జీవమున్న
ఆలోచనలను సంకల్పాలను 
వినూత్నంగా పదాల్లో పేర్చి
కలిసి పాడుకోవాలి.


కట్టుబడి ఉండి కొన్ని గమ్యాలకు
అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో
గతం నిట్టూర్పులు
సర్ధుమణిగిన నిశ్శబ్దం
ఆహ్వానాలు అందరి అభీష్టాలు
కొత్త వాగ్దానాలను నెరవేర్చుకునేలా

కొత్త కొత్త రంగుల ఆశల దుస్తులు తొడుక్కుని
ప్రతి సారిలానే ఇప్పుడూ వస్తుంది
ఆలోచనల ఆశయాల పరిమళాలను వెదజల్లుతూ
మనుగడకు అందమైన మార్గాలున్నాయని
ఆశీర్వదిస్తూ కొత్త సంవత్సరం
ఆకాంక్షలు పంచుకుందుకు మన ముందుకు.

Wednesday, December 30, 2015

అన్నానా నీతోఎప్పుడైనా ఈ మధ్య 
అన్నానా నీతో నీవంటే ఎంతో ప్రేమ అని 
అన్నానా నీతో నిన్ను మించి ఎవరూ లేరు అని 
జతగా నీవు ఉంటే 
అంతా ఆనందమే అని 
అన్నానా నీతో నా బాధలన్నీ మటుమాయం అని 
నా కష్టాలన్నీ దూరమౌతాయి అని 
ఆ సూర్యుడి కాంతి
ఎంత ప్రేరణాత్మకమైనా 
నిద్దుర లేస్తూనే 
ఆశను విడనాడలేము అని
సౌకర్యాన్ని కోరుకోకుండా ఉండలేము అని
అన్నానా నీతో ఓ మానసీ 
చిరునవ్వువై నిండిపొమ్మని 
ఆ నవ్వు పూ పరిమళాల బృందావనం 
మన జీవితాలు అయ్యేలా 
అన్నానా నీతో కష్టాలన్నీ దూరమై 
నాలో అంతా నీవై నిండిపొమ్మని 
అన్నానా నీతో ఏనాడూ నిర్వచించబడని ఔన్నత్యం 
ప్రేమ హంసలు మనం కావాలి అని
ప్రేమ ప్రతినిధులం మనమే లా 
రోజూ ముగుస్తూ ఒకరికి ఒకరు కృతజ్ఞతలు 
ధన్యవాదాలు చెప్పుకుందాము అని
సంసారమూ సూర్యుడు లా జీవించుదాము అని

Tuesday, December 29, 2015

అది ప్రేమేఅది ప్రేమే 
మోకాళ్ళమీద 
కూర్చుండేలా చేసి నన్ను  
మార్చేసి 
అమాయకుడిని
అనాసక్తుడిని 
పిచ్చివాడిని
మానుపడని 
రోగగ్రస్తుడ్ని చేసి 
చిద్విలాసం చేస్తూ 

బూడిదే అంతా


బూడిదలోంచి
వచ్చి
బూడిదయ్యేందుకు
తిరిగి
వెళ్ళేలోపు 
మధ్యలో
కొన్ని పగళ్ళు
కొన్ని రాత్రిళ్ళు
సాహచర్యం
ముడులేసుకుని
ఒకరికి ఒకరని
ఇక్కడే కూర్చుని
పక్కపక్కనే
కాలి బూడిదై

Monday, December 28, 2015

చిత్రం, జీవితంచిత్రమైన ఆట
ఒక వింత
నాటకం
జీవితం

అప్పుడప్పుడూ
ఓడి
ఎప్పుడైనా
గెలుస్తూ

కళ్ళముందు
ఏదో ఆశ
ఒక కల
ఒక గమ్యం 


పడినా
లేచి కదులుతూ
జీవితం
రహదారిలో

రేపులో
గమ్యాన్ని చూస్తూ

ఓడినా గెలిచినా
ఎవరో ఉన్నారు
వెనుక అని
సంరక్షించేందుకు 

గెలిచినప్పుడు
అందరికీ
కృతజ్ఞతలు
భాగస్వాములనుకుని 

ఓడినప్పుడు
మరో ప్రయత్నం
అదృష్టం తోడు
ఆకాంక్షిస్తూ

Friday, December 25, 2015

దిగ్భ్రాంతి


చాన్నాళ్ళే పట్టింది. 
నాకు 
ప్రత్యక్షతను 
గ్రహించేందుకు 

అవి, నీ కళ్ళు కావని 
కేవలం ఆకాశంలోనే 
ఉంటాయి. 
నక్షత్రాలు అని

Thursday, December 24, 2015

శూన్యరాగం


స్పష్టంగా చెబుతున్నాయి.
ఆమె ఎంతగానో దాచేయాలని ప్రయత్నిస్తున్న
సంగతులను ఒక కథ లా ఆమె కళ్ళు
ఆమె ఆశించింది అతి స్వల్పమే
కానీ, అభిమానం సహా కోల్పోయి
అలక్ష్యం చెయ్యబడింది మాత్రం అనల్పం అని

ఎప్పుడూ ఆమె ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.
ఆ గుండె రోధిస్తున్నా
బయటికి కనబడనియ్యదు.
సమీపంలో నేనున్నంతవరకూ
ఆ పిదపే నిశ్శబ్దం లో బుగ్గలపైకి జారే కన్నీళ్ళతో
మోసపుచ్చుకుంటుంటుంది తనను తాను.


ఎన్నో సార్లు ఆలోచిస్తూ అనుకుంటుంటాను.
నేను ఓడిపోయానేమోనని
గుర్తుంచుకోని నా కర్తవ్య నిర్వహణలో ....
ప్రేమ పరిపక్వతే లేన్నాడు నేను
అర్ధమానవుడ్నైతే, ఆమె మాత్రం
శూన్య అస్తిత్వురాలౌతుందని ఊహించక

Wednesday, December 23, 2015

అందమైన ఊహధనురాకారములో వంగి 
నమస్కరించి  
మేఘాల్లోంచి భూమ్మీదకు 
విహరిస్తూ వచ్చి 
సళిపిన  
చల్లదనం గాలుల 
పరావర్తనం చెందిన 
హృదయం ఆకారం 
నీవై  
ఆ హృదయం చుట్టూ ఉండే 
వెలుగు 
నిర్మలత్వం 
నేనై 

రూపు దిద్దుకున్న 
ఇరు హంసలమై   
కాలం సాగరం లో 
ఈదుతూ నిశ్శబ్దంగా 
ఎంత అద్భుతమో మనం 

అద్భుతం, ఆమె


ఏ అద్భుతాన్నో చూసినట్లు
నిన్నే చూస్తూ
ఎవరు ఉన్నా
గమనించినా లెక్కచెయ్యని
అలజడిచెందీ అరవని
కోపగించుకోని సౌందర్యం ఆమె

నీవు అద్భుతానివి కావని
నీవే చెప్పినా
నమ్మని .... అతిగా నవ్వని
ఒక మానసి ఆమె
అందుకు కారణం
ఒకవేళ, ఆమే అయినా

నీన్ను నీవు ప్రేమించడానికి
వేరేదో కారణం .... విపరీత పదోచ్ఛారణ
ఆమె నోటి వెంట
మరోసారి వినాలి అనే
అమరత్వద్భుతానుభూతి పొందే
కుతూహలం లో నీవున్నప్పుడు

భిన్నంగా మనంవేరు వేరు రంగుల 
దుస్తుల ముసుగులు 
శరీరాలు తొడుక్కుని .... అందులో
ఆత్మలను దాచుకుని 

వేరు వేరుగా ఉద్దేశ్యాలు
మనోభావనల 
శాసనాల మాటలను 
వెదజల్లుతూ .... ఒకేలా

ప్రేక్షకులు పర్యాటకులలా కాక
గోడకు తగిలించబడిన 
ఫొటో ఫ్రేం లో బంధించబడిన 
ఛాయా చిత్రాల్లా 

ముగింపు సాఫల్యం వరకూ 
ఉందో లేదో తెలియని 
శాశ్వతత్వం 
దిశగా ప్రయాణిస్తూ .... మనం

Sunday, December 20, 2015

నా జీవన సంజీవని .... నీవు


హిమవన్నగమూ సాగరమూ నావే అయితే
వాటిపై అంతటా నీ పేరే రాసేస్తాను.
ఆ ఆకాశం అసూయపడేలా, నీకు తెలిసేలా.
నేను నిన్నే చూస్తున్నానని
డబ్బుతో కొనలేని అమూల్య సంపదే నావద్దుంటే
దాన్నంతా అమ్మేస్తాను.
ఒకే ఒక్క అవకాశం పొందేందుకు
పిల్లా! ఉన్నదంతా గుమ్మరించేస్తా
నీ ప్రేమను పొందేందుకు, నీతో కలిసి జీవించేందుకు

నష్టపోను. అమిత సంపన్నుడ్నే అవుతాను.
నిన్ను కేంద్రబిందువుగా నిర్మించి నూతన ప్రపంచం
నీకు చూపించుకుంటాను.
తెలుసో లేదో నీకు .... నీవు నన్నెంత ప్రభావితం చేసావో
నా నవనాడులనూ శ్వాసనూ ఎంతగా ఊపేసావో
ఓ పిల్లా! నీకు నా ప్రేమను పరిచయం చేయ్యాలి.
స్వర్గం ఈవైపున, ఇక్కడ నీ మనోసౌందర్యం వైశాల్యం
ఎవరికీ తెలియదు .... నీ వ్యక్తిత్వ వైశిష్ట్యత ఏమిటో

నిజం చెబుతున్నాను. నాలో వింత నమ్మకం 
నీళ్ళమీద నడవగలనని, ఆకాశంలోకి ఎగరగలనని
నాకు మాత్రమే తెలుసు .... కారణం నువ్వని
ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఒక అద్భుతాన్ని, గొప్ప ప్రేమ రూపాన్ని 
నిన్ను నాకోసం సృష్టించాడని
నీ ప్రేమను పొంది, నీ ప్రేమ సామ్రాజ్యానికి .... ఏదైనా చేసి
సామ్రాట్టునయ్యే అవకాశం కల్పించి

నేనిలా మారిన క్షణం నుంచీ అనుకుంటున్నాను.
ముఖ్యమైన సంగతొకటి నీతో చెప్పాలి
నిన్ను భయపెట్టేవేవీ కావు నా ఆశలు కోరికలు అని
సూక్ష్మంగా సున్నితం గా నీతో చెప్పాలని
నీ నోట వినాలనీ ఉంది
నాలా నీవూ నన్ను ప్రేమిస్తున్నావు అని
పిల్లా! ఈ శరీరం కంపిస్తుంది.
నా శ్వాస వేగంగా కొట్టుకుంటుంది.
ఈ స్థితి లో ఔషధం సంజీవిని నీ ప్రేమే అని

Saturday, December 19, 2015

నువ్వూ నేనూ ఒకటే


నిద్దుర పోలేకపోతున్నాను ఎందుకో
నా ఆలోచనల్లో
మదిలో ఆత్మబంధువు ఆశవై అంతా నీవే
నేను భయవిహ్వలుడ్ని కాకుండా
నాలో స్థిరత్వం
సంతులనం కారణం నువ్వు
కానీ నువ్వు ప్రేమించడం లేదు .... నన్ను

నీకూ నిద్దుర లేదు. నిద్దుర రాదు.
నీ మనసంతా అతనే
నీ సమయం తినేస్తూ, ఆలోచనలల్లో నిండి
నీ ప్రేరణ సంతులనము సాధ్యం
అతని సామీప్యం లోనే
కానీ అతని ప్రేమవు నీవు కావు.


చిత్రం విధాత నిర్ణయం అనుకుందామా
ఒకే సమశ్య లో ఇద్దరం
రెండు భిన్నమైన స్థితుల్లో సృష్టించబడి
పూరించలేని ఏదో శూన్యం ....
వింత వింత ప్రశ్నల అనిశ్చితిలోంచొచ్చిన
మరో వింత సమాధానం ....
నీ సౌఖ్యమే నా కోరిక అని

నువ్వూ నేనూ ఒక్కటికారాదనే

Wednesday, December 16, 2015

మంటలు చెలరేగుతూ


లీలగా గుర్తుంది 
నీవు చెయ్యందిస్తున్నట్లు 
నేను జారిపోతున్నట్లు 
లోతు తెలియని అగాధం, 
అథోలోకం, నరకంలోకి.............
నన్ను తిరిగి కనుగొనేప్పటికే
సర్వం కోల్పోయి 

అందానికే అందం నీవు


నువ్వింత అందంగా ఉన్నావని వర్ణించలేను.
ఆ దైవమే పంపినట్లున్నాడు.
అందుకే.... నాకిలా అనిపిస్తూ కనిపిస్తుంది. .
నీవంటే నాకు ఇంత ఇష్టం ఎంతో ప్రేమ లా
ఈ ప్రపంచమంతా ఒక నందనవనంలా

ఎంతో పవిత్రమూ అంతే సత్యమూ అయిన
నాలో ఉన్న .... నన్ను, ప్రేమను గుర్తించాను.
అప్పుడే ఒట్టేసి అనుకున్నాను.
ఆ ప్రేమంతా నీకు మాత్రమే సొంతం కావాలని
కలలోనూ నిన్ను కలవాలి, కలిసే ఉండిపోవాలని

నీతో "నిన్ను ప్రేమిస్తున్నాను" అని
ఎంతో ప్రత్యేకం గా చెప్పాలనిపిస్తుంటుంది. ఎందుకో ....
ఈ జీవితాన్నంతా నీతోనే గడపెయ్యాలని,
ఒక అందమైన పారిజాతం నువ్వైతే
నీ ప్రేమ పరిమళాలన్నీ నావే కావాలనిపిస్తుంది.

నాలో కలిగిన ఈ వింత భావనలంత అందంగా
నిన్ను ఘాడంగా ప్రేమించాలని ఉంటుంది.
ఆ భావనలంత పవిత్రం గానూ .... మది మూలల్లో
ఓ వింత కోరిక .... నీ ఆలోచనల్లో తేలుతూ
సంగీతాన్నీ, అందమైన నీ నవ్వును ఆస్వాదించాలి అని


నిన్నే ప్రేమిస్తున్నాను .... నీవు మాత్రమే ప్రత్యేకం
అనుక్షణమూ నిన్నే ఆలోచిస్తున్నాను
ఓ సౌందర్యరాసీ .... అందం పరిబాష, అందం నీవై
ఆ దైవం కావాలనే పంపిన దేవతవు, ప్రాణం నీవు
నా అంతరంగంను గమనించు .... మన్నించేందుకు

Tuesday, December 15, 2015

నువ్వంటే పిచ్చిఅప్పుడప్పుడూ నన్ను పిచ్చివాడ్ని చేస్తూ 
కొన్నిసార్లేమో నీ ప్రేమలో పడేలా చేస్తూ 
ఉండే లక్షణాలను ఎక్కువ చేస్తూ ఉండే 
నువ్వంటే నాకు ఎంతో ఇష్టం 

నిజం పిల్లా, నా ఆలోచనల్లోంచి 
నా అనుభూతుల్లోంచి .... నిన్ను 
దూరంగా నెట్టెయ్యలేని బలహీనత నాది 
తప్పదనేది సామాజిక నిర్ణయమైనా 

నాకు తెలుసు 
మనం కలిసి జీవించడం సాధ్యం కాదని 
కనీసం ఈ కట్టుబాట్ల తాళ్ళనైనా తెంచి మనం 
ఆ కృషి చేసిన తృప్తినైనా పొందుదాము. 

మన ఇద్దరి కోరికా ఒక్కటే 
మనం ఏది చెయ్యొచ్చో 
ఏది చెయ్యరాదో 
ఎవరో చెప్పే అవకాశాన్నెవరికీ ఇవ్వరాదనే 
  
నా ఎన్నో యేళ్ళ కోరిక 
సాధ్యమైనంత కాలం నీతో కలిసి ఉండాలని 
నిన్ను ఎంతో ఘాడంగా ప్రేమిస్తున్నానని అందులో 
కాసింత పిచ్చీ ఉందని నీకు తెలియాలనే 

Monday, December 14, 2015

నమ్మకమూ ఒక ఆశేఆ నమ్మకంతోనే ప్రయత్నిస్తున్నాను.
నీకు చేరువ కావాలని
ఆలోచిస్తున్న కొద్దీ అనుమానం నొప్పి
నిజం గా తొందరపడిపోతున్నానేమో అని
నీ ప్రేమలో పడిపోయి
నీ అంతరంగం లో నా పట్ల
నీ మనొభావనను అర్ధం చేసుకోకుండానే

నేను ప్రేమ ను నమ్ముతాను.
నిన్నూ నమ్ముతాను .... కానీ నువ్వే
నా హృదయం నీవైపు మొగ్గేలా ప్రవర్తిస్తున్నావు.
అది నీవైపే మొగ్గుతుంది.
దాన్ని ముక్కలు చెయ్యవని నమ్మకం తో
శాంతి సంతోషాలను నమ్ముతున్నాను.
మంచే జరుగుతుందనే నమ్మకం ఆశతో 


ఈ జీవన ప్రయాణ యానంలో
నా దృష్టంతా నీ నడవడి పైనే 
నీవేమి ఆలోచిస్తున్నావో అని
ఆశ్చర్యపోతూ .... నిజంగా
ప్రేమలో పడటం నీకు ఇష్టమేనా ....
శాంతి సంతోషాలను నీవూ కలకంటున్నావా
నిన్ను నమ్ముకున్న నన్ను లా అని

Saturday, December 12, 2015

కాలాకే మెరుగు బంగారానికిఒక చీమను నలిపేసినట్లు నలిపేస్తుంది
ప్రేమ అన్నావు.
మార్చుతుంది నన్ను, నా జీవన సరళిని 
నా ఆత్మాభిమానాన్ని అన్నావు.
అలా అని నాకు తెలియదు అన్నావు.

నన్ను బ్రమ లో ఉంచుతుంది అన్నావు.
సృష్టి లో ఉన్న అందం ఆనందమంతా 
పొందబోతున్న భావననే నాముందుంచుతుంది. 
ఒక్క క్షణమైనా ఆగి ప్రశాంతంగా
నిజమా అని ఆలోచించనివ్వదన్నావు.

బ్రహ్మాండమంత ఆనందం అనుభూతులు  
కొన్ని క్షణాల్లోనే ముందుండడం .... 
నిజమా .... సాధ్యమా? ఎలా?? అన్నావు. 
ఇంద్రియజాలంలో పడి
పరిపూర్ణులు కారెవ్వరూ అని .... అన్నావు 

మరి ఎందుకో .... నాకు మాత్రం 
నలిగిపోవడంలో సారముందనిపిస్తుంది.
ఒకరు మరొకరిలో 
మమైకం కావడం లోనే 
పరిపూర్ణత అర్ధం ఉందేమో అనిపిస్తూ

ఒక ఊహేనా???


మబ్బులు లేని నీలి ఆకాశం
నిజాలను మాత్రమే పలికే
భయం ఎరుగని
కన్నీళ్ళు జారని
నొప్పి తెలియని
స్థిరచిత్తత .... ఒక ఊహేనా???

ప్రతిదీ అద్భుతమే అనిపించుతూ
అభిమానించి
ఆరాదించబడే
ఒక ఆదర్శ వ్యక్తిత్వం
ఒక అనుభూతులమయ గృహం జీవితం
అందమైన .... ఒక ఊహేనా???


అనుకోకతప్పదా!?
ఇదంతా కలేనని
అందమైన ఆవేశం ఊహేనని!?

Friday, December 11, 2015

నువ్వుంటే చాలు .... తోడుఒంటరితనం ఎప్పుడూ నా నేస్తమే అయినా 
ఈ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాను 
ఎందరో అన్నారు. ఇంకా అనుకుంటున్నారు. 
పిచ్చోడు అని 
అంధుఁడు అని 
నీ చూపు కోసం అన్నీ ఒదులుకున్నాను అని 
నేనెలా అంధుఁడినో అనేదో తర్కనీయాంశం

ఒక్కటి మాత్రం నిజం 
నిజంగా నేను తప్పు చేస్తున్నాననుకుని 
ప్రయత్నించినా 
నా మదిలోంచి నిన్ను తీసెయ్యలేను. 
ఒక్క నీ తోడు చాలు 
సభ్య సమాజాన్నీ సర్వాన్నీ 
అలక్ష్యం చెయ్యగలనేమో కానీ నిన్ను కాదు

నీవు ఎవరివో నీ చరిత్ర ఏమిటో 
ఎక్కడినుంచి వచ్చావో 
ఏమి చేస్తుంటావో 
తెలుసుకోవాలనే కోరిక 
పట్టింపు లేదు 
కేవలం నన్ను నన్నుగా నీవు ప్రేమించితే చాలు 

నీ ప్రతి మాటలో నీ ప్రతి ఆచరణలోని 
ప్రతి చిన్న విషయమూ 
నా అంతరంగం లో నా ఆలోచనలానే అనిపిస్తూ
మనం ఒకరొకరి కోసమే పుట్టామనే నా మనోభావన
ఇన్నాళ్ళూ దాచాను కానీ .... ఇప్పుడు 
నా కళ్ళలోకి నీవు సూటిగా చూసినప్పుడు. 
నా ప్రవర్తనలో బయటపడటం నాకే తెలిసిపోతుంది. 

శూన్యమే అంతాఆమె శూన్యం లా ఉండిపోయింది.
ఉలుకూ పలుకూ లేని అచేతనావస్థలోకి జారి 
అతను లేకపోవడంతో
ఇన్నాళ్ళూ ఆ హృదయం కొట్టుకుంది
కేవలం అతని కోసమే ....
అతని సాహచర్యం లోనే కలలన్నీ కన్నది.

ఆమె అతన్ని ఘాడంగా ప్రేమించింది. 
కానీ ఇప్పుడు
అతను లేని జీవితం జీవించాల్సిన స్థితి.
కానీ ఎలాగా .... ఎలాగో తెలియదు
ఏనాడూ ఆలోచించని స్థితి
కలనైనా ఊహించని దుర్భర స్థితి 


అంతా అతనే అనుకుని సర్వం సమర్పించింది.
ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు.
ఆమె విలపిస్తుంది. బండరాళ్ళు కరిగేలా
కలలన్నీ కరిగిపోయి అన్యాయం ఐపోయి
అతను లేని కల కనాలని ప్రయత్నించి
కల కనాల్సిన స్పందనలేమీ రాక

ఆమె హృదయం కొట్టుకోవడం మానింది.
ఇప్పుడు కలలు కనలేకపోతుంది.
రోదించాలని ప్రయత్నించింది.
అంతా అనిశ్చితి.
కన్నీళ్ళు రావడం లేదు
స్వయాన్నీ సర్వాన్నీ కోల్పోయినట్లు

Thursday, December 10, 2015

కోమాలోకి
సుమారు 
ఎనిమిది మాసాలయ్యింది అని
నేను కోమాలోకి జారిపోయి 
కోమాలోంచి ఇప్పుడే బయటపడ్డానని 
ఎవరో అంటున్నారు. 

అంతకు ముందు 
ఒక మధ్యాహ్నం వేళ 
అలసిపోయి నీరసంతో 
అకస్మాతుగా నా మానసి పడిపోయింది. 
జారిపోయింది నిద్దురలోకి 

అప్పుడే అన్నారు ఎవరో 
నాకెంతో బాధనిపించేలా 
ఈ రోజు సాయంత్రానికి కోలుకోకపోతే 
అప్పుడు బంధువులకు చెబుదాం 
లేవదని అనుకుంటున్నారు.

నేను మాత్రం 
అలిసిపోయుంటావు విశ్రమించు మానసా! 
ఆరోగ్యంగా నిద్దుర లేద్దువు 
విశ్రమించు కానీ 
తిరిగి రావడం మానకేం అన్నాను. 

కానీ మానసి వెళ్ళిపోయింది. 
గుర్తుకొస్తూనే మళ్ళీ అంధకారం అయోమయం 
లీలగా ఎవరో ఏదో అంటున్నారు.
మళ్ళీ కోమాలోకి జారుతున్నాను అని 
కష్టం జారితే తిరిగి కోలుకోవడం అని 

నువ్వొంటరివే


నీ కాళ్ళమీద నీవు నిలబడి
భావనల్లో రోదిస్తూ
ఎవ్వరూ జత లేని
ఏకాకి భావన
అంతరంగమంతా నిండిపోతే

ప్రేమించబడాలనీ
స్థిమితపడాలనే మనోభావన 
ఆనందంగా ఉండి
స్వేచ్చను పొందాలని
నిజంగా ఎప్పుడైనా అనిపించితే ఎప్పుడైనా ఆపుకోలేని కన్నీరు
నీ ముఖంపై చారల్ని చేసి
ఈ ప్రపంచం లో నీకంటూ
ఓ స్థానం ఉందని అనిపించకపోతే
నిజం గా .... నువ్వొంటరివే

Wednesday, December 9, 2015

జీవించి ఉండనట్లేఒంటరిగా నిలబడి ....
ఇంకా
నిజాలు లా నిలబడుంటే
ఆశ, అసూయలు
ఒంటరినై
వాటినే చూస్తూ

నేనూ అనే
అవ్యవస్థిత అస్తిత్వం
ఏనాడూ పుట్టి ఉండనట్లుగా

పుట్టుక చావులు
చైతన్యం శిలాతత్వాలను చూస్తూ
ఒంటరిగా ఏడుస్తూ ఆ ఒక్క ఒంటరి కన్నీటిబొట్టూ
జార్చుకుని
ఒంటరిగానే మరణిస్తూ

Tuesday, December 8, 2015

ఎన్నాళ్ళనిఉపయుక్తం కాదు 
అన్నింటికీ సమాధానం కాలమే అని 
ఎదురుచూస్తూ ఉండటం 
మారుతుందని మారేవరకూ జీవితం  

ఏ పందిరి ఆసరాగానో 
పాకుతున్న లతను, అది పూర్తిగా పాకే వరకూ
చూపులు మరల్చకుండా 
కూర్చుని దానివంకే చూస్తూ ఉండటంలా 

జీవితం లో ఎన్నో ఆశలు ఆశయాలు గొప్ప గొప్ప కలలు 
ఎవరో తోడు వస్తారని .... ఆలశ్యం చేసినా 
సోమరివై అలక్ష్యం చేసినా
వాటిని సాదించి పొంది గమ్యం చేరే అవకాశం లేదు.

అలానే చూస్తూ ఉంటే కాలచక్రమూ ఆగదు ఎవరికోసం 
జీవితం ఎంతో కష్టమనే అనిపిస్తుంది. 
అంతే సులభతరం అవ్వాలంటే 
భారంగా తీసుకోరాదు .... ఆనందిస్తూ అనుభూతి చెందాలే కాని


సమాధానం లేని ప్రశ్నంటూ ఏదీ లేదు 
ప్రయత్నిస్తే చాలు .... చిరునవ్వులు చిందిస్తూ అన్ని వేళలా 
ఆగకుండా సాగాలి ..... జీవనారంభం తొలి అడుగులా 
ప్రతి అడుగూ ఉత్సుకతతో ముందుకు వేస్తూ .... 

Monday, December 7, 2015

తరచి చూస్తే


నీ ఆవేదన నీ తపన నీ ఆవేశం నీదే ....
ఎలాంటి అనుమానమూ లేదు .... నీవు కష్టాల్లోనే ఉన్నావు
కాలం నీపట్లే కటినంగా ప్రవర్తిస్తుంది .... నిజమే
కొన్ని నిజాలు ఎంత భయానకం గా ఉంటాయో ....
కాస్త బావిలోంచి బయటికి వచ్చి చూస్తే తెలుస్తుంది.
నీకో గూడుంది .... ఉండేందుకు, అపసవ్య నిద్ర కాదు నీది
ఎందరితోనో పోలిస్తే నీవూ ఎంతో కొంత ఉన్నవాడివే
కష్టజీవివే కాని అని .... అనిపిస్తూ

ఎన్ని వేలమంది మరణిస్తున్నారో ప్రతి రోజూ
నీలా ఒంటరీ కాని కనీసం సంఘజీవీ కాలేని వారు
నీ సమశ్యల్లో కేవలం ఝటిలత్వమే ఉంది కానీ వారి ప్రపంచంలో
వారి జీవితాలే వారికి ఝటిల సమశ్య, అతి పెద్ద శిక్ష
వారికే తెలుసు దారిద్ర్యం ఆకలి లోతులు
నైరాశ్యము దిక్కులేని దయారహిత జీవితం అర్ధం 
ఎండిన పడీదుల్లాంటి ఎముకల పోగులు .... వారు
ఆరక్షణ మార్గదర్శకులు లేని ఎవరో విసిరేసిన వీధి బిడ్డలు

ఆకలి తీరడం కోసం చెత్తకుండీల్లోలో చిరిగిన వ్యవస్థ లో
వృధా ఆహారపదార్ధాల వెదుకులాటలో
స్వచ్చభారత్ నిర్మాణానికి దోహదపడుతూ కుక్కల్లా కొందరు
మాదక ద్రవ్య వర్తక యాజమాన్య అత్యాశలకు బలిపశువులౌతూ
దారిద్ర్యం నుంచి మాదకద్రవ్యాల వైపు ఈడ్చబడి
కారాగృహాల్లో శిక్షలనుభవిస్తూ
మానవత్వం మమకారం అర్ధం తెలియని మృగాలై .... మరి కొందరు


నీకున్నవి కష్టలూ బాధ్యతలే ..... నీకు కావల్సింది
కాసింత ధైర్యం నీపై నీకు నమ్మకము
కృషి చేసి నిరీక్షించే ఓర్పూ మాత్రమే
వారి జీవితాలతో పోల్చుకుంటే
ఆ వీధి అనామక అనాశ్రిత బిడ్డల స్థితి తో చూస్తే
అంత భారమైనదీ నిరాశాపూర్వకమైనదేమీ కాదు నీ జీవితం

Sunday, December 6, 2015

నువ్వుంటే చాలుమసకేసిపోయి 
రాలిపోయిన 
ఆ నక్షత్రాలను
ఎందుకు పట్టించుకోవాలి? 
నాకంటూ నీవుంటే 

నీ ప్రతి చూపూ 
ఒక పరామర్శై 
జతగా, మార్గదర్శివై
ఉద్యానవన పరిమళ 
ఉద్విగ్నభావనవై నువ్వుంటే  

ఇకనైనా ఆలోచించాలి 
భవిషత్తును గురించి 
గతాన్ని మరిచిపోయి 
తొలి ప్రేమవు కాకున్నా  
తుది ప్రేమవు నీవే కనుక 

నేను తెచ్చిన బహుమానం 
ఈ ప్రేమను నీవందుకోవాలి. 
సహచరివై నువ్వుంటూ
అంతకన్నా కోరుకునేది   
ఇంకేదీ లేదనుకుని 

ఈ సృష్టి, ఈ భూమి 
ఆ ఆకాశం ఆ నక్షత్రాలు 
తారలు ఉన్నంతకాలం 
నా ప్రేమసామ్రాజ్యం 
పట్టపు రాణివి నీవనుకుని

Thursday, December 3, 2015

తపిస్తూ


మునిగి నిండా పేదరికం పీడకలల,
బాధల లోతుల్లోకి
నేర్చుకున్న పాటాలు, అనుభవం
అణగద్రొక్కబడిన నొప్పిలోంచి
తల చిట్టిలిన అనిశ్చితి లోంచి
కూరుకుపోయి ఒంటరి రాత్రుల్లోకి
అర్ధం కాని వింత నిశ్శబ్దం పలుకుల
రహశ్యాల లోతుల్లోకి జారిపోయి
...................


అయోమయం చీకటి నేలమాళిగ లో
నాలుక పిడచకట్టుకుపోయి, అంతలోనే
వెలుతురు నదిలా, అదో ఆశ
వద్దనుకుంటూనే కదిలి, తేలి
ఏ వైపుకో కొట్టుకుపోగలుగుతూ
వెలుతురు కనిపించి, శబ్దాలు వినిపించి
బలహీనతో ఆశో ఈదుతూ ....
ఉత్సుకంగా గమ్యం ఉదారత వైపు