Saturday, December 26, 2020

ఎక్కడ చూసినా ....

 


 

 

 

 

 

 

అనుకుని మాత్రం కాదు
ఒకరు యింకొకరు కలిసి
బ్రతకాలి
కలకాలం అని
కలిసి ఎదగాలి అని
ఒకరు ఇంకొకరం లా అని
కాదు ....
ఒదార్చు ఉద్దేశ్యం
ఒకరి హృదయాన్ని యింకొకరు   
జీవన సఫలత సరళత
ఆత్మల రూపావిష్కరణకై
పాత్రల పోషణ కాదు ....
పొందాలేదీ అని కాదు
అతిగా ....
కానీ
రాని నిద్దుర అసహనం
నిండిన
నిట్టూర్పుల భారం తడిచిన
దుప్పటి ఆచ్ఛాదనలో ....








Wednesday, April 1, 2020

భావ....శాస్త్రం





నాక్కావలసింది
నే పరిగణించేది .... 


చంద్రుడిని
ముద్దాడాలని
ఎగసే
తరంగం
పూర్ణత కాదు 


ఆ చంద్రుడు
ముద్దాడాలనుకునే
పూర్ణత
ఈ రక్తం లో
ఈ శరీరం లో 


ఈ శరీరం రాసిన
కవిత్వం అది 


కాగితం కలం
సిరా అక్కర్లేని
అదే కవిత్వం
నా భావ....శాస్త్రంలో

అగమ్యుడ్ని




ఇక్కడివాడినే

కానీ

పర్యాటకుడ్నిలా
తిరుగుతున్నాను

ఏది ఎక్కడో
దేన్ని ఎలా చేరాలో
తెలుసుకోవాలనుంది .... 
స్థానికుల్ని అడిగి

నిజానికి
నన్ను నేను
పారేసుకున్నాను

ఇక్కడే ఎక్కడో

ఎక్కడో
ఏ తెలియనిచోట

తెలుసుకుని
వీలైతే
పొందుదాము అని

Saturday, March 21, 2020

ముందుకే





గాలి శ్వాస .... వెచ్చగా
కఠినంగా కర్కశంగా తాకుతూ ఉంది
అలసి ఆవిర్లు కక్కుతూ ఉన్న .... ముఖాన్ని

గాలి గంభిరంగా అంటూ ఉంది
నువ్వైపొయావు అని ....
కానీ
నేను మాత్రం నడుస్తూనే ఉన్నా
ఊగుతూ,
కాళ్ళీడుచుకొంటూ,
నీరసంగా
గాలిని వెక్కిరిస్తున్నట్లు

కాలంతోపాటు తప్పదెవరికీ
ముందుకు జరక్కపొతే
వెనక్కు జరుగుతున్నట్లే .... అని

Monday, March 2, 2020

కారణం నీవే




నా నిద్దురలేమికి, మెలుకువలో ఉండీ
నా ఊపిరి భారమవడానికి ....
తెలుసా నీకు .... కారణం నీవే అని

విచ్చలవిడిగా వెదజల్లాలి పదాలు ....
కాగితం పై అనిపించే ఆవేశావస్థ నాది

రక్తం నిండిన సిరా పారిన భావనలో
విషమిశ్రిత వికట విసర్జనలో .... అవి

ఆలోచించలేని మనస్థితి నాది 

 

బహుశ నా మది ఆలోచనలన్నీ
నీవై నిండిపోవడం వల్ల అయ్యుండొచ్చు

ఎలానో ఎందుకో తెలియని అయోమయావస్థ
ఎంతో అవసరం అయిన వేళ అని తెలిసీ
ఆలోచనల్లో మాత్రమే ఎదురయ్యే మానసీ
.
ఇంతకూ
నీకు తెలుసా .... కారణం నీవే అని
నీవే నా ఈ రాతల భావనల లోతువు అని

Monday, January 27, 2020

ఊపిరి




నీవు
నేను మర్చిపోవాలన్నా
మరిచిపోని
నా ప్రతి అణువువూ
శ్వాసవూ
ఇప్పుడు .... 



నీకు దూరంగా
వెళ్ళిపోవాలనిపించడం
నాకు
నా నుంచి
దూరంగా
పారిపోవాలనిపించడం
ఎంత
దుస్సాహసం



Friday, January 17, 2020

పరిభ్రమణ




ఒణుకేస్తుంది, తీవ్రంగా 
చలి ముదిరో 
భయంతో వొళ్ళు
ఝలధరించో ....
ఆశ్చర్యం ....!
ఈ మధ్య
నీ పరిసరాల్లో
ఎందుకు
ఈ పరిభ్రమణ అని



నా ఆలోచనలు పరిసరాల్లో 
నా నెమ్మది ప్రవృత్తిలో
చలి వొణుకు ....
పక్కన దుడుకు
వెచ్చదనం ధైర్యం
ఆవశ్యమనేమో 
బహుశ .... నీవు
దూరమెళ్ళిపోతావనేమో