Monday, November 30, 2015

ఇంత మక్కువెందుకో .... నాకునాకు ఇంత ఇష్టమా అని 
చాలా ఆలశ్యంగానే తెలుసుకున్నాను. 
పగిలి, విరిగి, తెగి చితికిన 
పద పెళుసు వాక్యాల 
బలహీన స్వరాలు కవితలవ్వడం పై
ఇంత ప్రేమా నాకని ఆశ్చర్యం వేస్తుంది.

అవే పదాలలోని .... అక్షరాల అస్తిత్వం, 
ఆ ఔన్నత్యం  
ఆ స్వచ్చ సత్యత 
ఆ నిరాడంభరత 
ప్రణమించాలనిపించేలా ఉంటూ

రాయబడుతున్న కవితల్లో మాత్రం
కారణ స్థిరతత్వ సంహారమే లక్ష్యం అన్నట్లు 
పిచ్చి తలలలోనుండి 
తప్పించుకునే ప్రయత్నం యుద్ధం లో 
గాయపడిన అక్షరాలు క్షతగాత్ర సైనికుల్లా  

అక్షర ఇటుకలు సమృద్ధిగా పేర్చి 
సందిగ్ద మనోభావనలతో
బలవంతపు పదాలల్లి రాయబడుతున్న 
ఏ వస్తురహిత సాహిత్యం పట్లనో  
ఇంత మక్కువెందుకో .... నాకు

Sunday, November 29, 2015

సరళయానం


అనాలోచిత జీవనసరళి నడవడిక తో 
ఒకప్పుడు .... ఒంటరి రహదారుల్లో
ఎవరూ లేక నాతో
నా ప్రేమను, నా ఆనందం అనుభూతుల్నీ
పంచుకునే జత గా
అంతా అసంతృప్తి అసంతులనమే ....
అప్పుడే నువ్వొచ్చి కలిసావు.
మార్గం చూపించేందుకే అన్నట్లు 
ఒక మార్గదర్శకురాలివై
ఒక తోడు లా .... జీవ రహదారి అంతం వరకూ
ఒక సమాలోచన, వెలుతురు .... విజ్ఞతలా


అనిశ్చయాంశాల యౌవ్వనం అయోమయం
అయినా అన్ని అంశాలూ దూరమైపోతూ
నీవు సమీపంలో ఉంటే
జీవితానికి ఎంతో మూల్యత ఉందనిపిస్తుంది
అవకాశం ఉన్న అన్ని వేళల్లోనూ
నిన్నే చూడాలనిపిస్తూ.
నీ చిరునవ్వు లోనే నా ఆనందమంతా అనే
పొందాలనుకుంటున్నాను .... నిన్ను
నా జీవన భాగస్వామివి గా
నా మనోసామ్రాజ్ఞివిగా నా విజ్ఞతవు గా 

Friday, November 27, 2015

గుర్తున్నానా మానసీనీతో కలిసున్నప్పట్నుంచి చూస్తే 
ఎన్ని యేళ్ళు గడిచాయో నేటికి 
ఎప్పుడూ 
నా హృది లో 
నా ఆలొచనల్లోనే ఉండే నిన్ను 

ఆలోచిస్తుంటే అనిపిస్తుంది. 
ఆశ్చర్యంవేస్తుంది. 
అప్పుడప్పుడూ 
నాలానే నీవూనా అని 
నన్ను గురించే ఆలోచిస్తుంటావా అని 

నిజం మానసీ ఎంత ఆశ్చర్యమో 
ఎంత వింత సందేహమో 
నిజంగా నీవు
నన్ను తలచుకుంటుంటావా అని 
లేక నీ ఆలోచనల్లో 
నేనో మరిచిపోయిన చరిత్రనా అని 

ప్రతిరాత్రీ నిదురించుతూ నిన్నే 
కంటూ ఉంటాను .... కలలో 
ఒకప్పటి మసకేసిపోయిన 
అలికేసినట్లున్న
మన మధురజ్ఞాపకాలను స్పర్శిస్తూ.


నిద్దుర లేచి పక్కన నువ్వులేవే అని 
దిగాలుపడుతూ ఉంటాను. ఆశ్చర్యపడుతూ ఉంటాను. 
మానసి ....నువ్వెప్పుడైనా కల కంటుంటావా నన్నని
నీ కలల నెలరేడునా .... లేక 
ఏ చెరిపేసుకున్న జ్ఞాపకాన్నా అని 

గడియలు, రోజులు .... వత్సరాలెన్ని గడిచినా
నీ, నా జ్ఞాపకాలు మాత్రం 
అలానే నాతోనే పల్లవిస్తూ 
పరిమళిస్తూ కొన్ని మసకేసిపోతూ 
కాలం చెరపలేని మార్చలేని అనుభూతులౌతూ 

అప్పుడప్పుడూ నిన్ను గురించే ఆనుకుంటాను. 
ఎన్నిసార్లో అలా .... మానసీ 
ఆశ్చర్యపోతూ ఉండటం .
నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను .... నీవూనా అని 
ఎప్పుడైనా ఆలోచిస్తావా నన్నను ఆకాంక్షతో

Wednesday, November 25, 2015

భయంరాత్తిరిని చూసి భయపడను.
ప్రతి ఉదయమూ
సూర్యోదయం అవుతున్నంతవరకూ
రాత్రి లేని పగలూ లేదని తెలిసి

సమాధులు చూసి భయపడను.
జీవించి ఉన్నంత కాలమూ
పడమరను సమీపించాల్సొచ్చినా
జతవై నవ్వుతూ నీవు నాతో ఉంటే అంధకారం చీకటంటేనే భయం ....
వెలుతురు అగమ్యం జీవితమైన క్షణాల్లో  
అది పగలైనా రాత్రైనా
మంచే అయినా .... జతగా నీవు లేకపోతే

Tuesday, November 24, 2015

కరుణైనా కన్నీరైనాఎంత శక్తివంతమో 
కనులు 

ఏ స్త్రీ కైనా 

ఒక్క చూపు చాలు 

అన్యోన్యత, అంతరంగం 
తెలిపి .... 


మాటలు, అస్తిత్వం 
కోల్పోయే స్థితి 
ఉత్పన్నమయ్యేందుకు

Saturday, November 21, 2015

అమానుషత్వం చెరలో


నిశ్శబ్దం నిండిపోయిన ఓ శీతల రాత్రి .... క్షణాలు 
మంచుకొండల మధ్య అర్ధ ప్రాణంతో
చల్ల గాలి కి ఒణుకుతూ గడ్డకట్టుకుపోయిన శరీరం

ఎవరి ఉశ్వాస నిశ్వాసలు వారికే వినిపిస్తూ
నా వరకూ నేను చుట్టూ చూసే ప్రయత్నం చేసినా
చూపుకేమీ అంద లేదు .... అంధకారం తప్ప

మంచు గడ్డల్లో గడ్డ లా మారిపోక తప్పనిసరి స్థితేమో
శూన్యం చుట్టుముట్టిన మౌనాంధకారమే
అస్సహాయత ఒంటరితనమే ఎటుచూసినా

కొండల్లో కొండలా మంచులా గడ్డకట్టుకుపోవడానికి
అంగుళాలదూరంలోనే ఉన్నామని అర్ధం అయినా 
పరిణామక్రమం అగంతక ఆలోచనల్ని మార్చలేని అశక్తత ఇప్పుడు నేను కళ్ళతో చూడగలిగింది చాలా తక్కువ
భారంగానైనా నడవాలి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటూ 
బయటపడాలి .... ప్రాణాల్ని నిలుపుకోవాలనే తపన

అగంతకుల చెర చిత్రవధలతో స్పర్శను కోల్పోయిన
సహకరించని అవయవాఉ .... అనాలోచితంగానే
మంచు తేలిన తటాకం వైపు నడుస్తున్నాను.

అప్పుడే చూసుకున్నాను స్వయాన్ని .... దూరం గా చావును
సాగదీస్తూ ఉన్న నా పరిగణాన్ని వారి మూలుగుల్ని వింటూ,
ఆలోచిస్తూ మానవ పరిణామ క్రమాన్ని .... ఆవేదన తో

Friday, November 20, 2015

అ న్యాయంనలిపేసే చేతుల్లోని 
పరిమళం
రాజకీయపుటెత్తుల్లో సామాన్యుడు
మనుగడకై పోరాడుతూ
పరిణమించి
ఒక అందమైన పుష్పం లా

ఏదీ నాది కాదుప్రతిదీ అవసరం అని
అనుకోను .... ఇకపై
ఏదీ నాదని
ఇళ్ళూ, స్తలాలు
డబ్బు, సౌకర్యాలు
మూల్యతలు
సొంతం కానక్కర్లేదు.
ఆకలి తీరితే చాలు
చుట్టూ నిశ్శబ్దం పరుచుకుని
అద్దంలో ప్రతిబింబం
రోజు రోజుకూ మసకేసినా,

నాకు నీవు నీకు నేనూ
ఎప్పుడూ సొంతం కాలేదు.
కనీసం ఎప్పుడూ
నా, నీ పిల్లలు అనుకోలేదు.
మన అని,
అన్నీ అంతే
కాలం కరుగుతూ
జ్ఞాపకాలుగా మారిపోతూ
ఆ జ్ఞాపకాలే
చాలు అనుకుంటే చాలు.

చివరికి మిగిలేది మాత్రం
పదరూపం లో
అందంగా
అక్షరదోషం లేని భావనలేనేమో
ఈ మృదుస్పర్శలు
ఈ మౌనం వినడాలు
ఈ రంగులద్దిన పెయింటింగ్సూ
అనాలోచితంగా మనస్సును
పారవేసుకోవడాలు 
నిట్టూర్పుల్లేకుండా
త్యాగాలు చేయడాలు

Thursday, November 19, 2015

ఈదాలి తప్పదుతెల తెలవారుతూ ఉంది.
నీ కళ్ళు కొలనులో ఈదుతూ
నా గుండెలపై ఆని
నీ ఆలోచనలు
చూపులు ఎక్కడో ఉన్నాయి
నా మేలుకొలుపు వినేందుకు

లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోవడాలు
కలవాల్సిన కళ్ళు
శూన్యంలోకి చూస్తూ
తలుపులు తెరుచుకున్నాయి
గుండెలమీంచి
నీ తల పక్కకు జరుతూ

నీవు దగ్గరకు అతుక్కు పోతూ
అనూహ్యం గా మళ్ళీ
లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోవడాలు
గాడమైన నీ శ్వాస శ్వాసకూ మధ్య
లొపలికీ బయటకూ
నా పేదవంచులపైకి జారుతూ కరుణ

లబ్ డబ్ లబ్ డబ్ శబ్దాలు రాలుతూ
నేనూ నీతో పాటు
దుఃఖసాగరం లోకి జారుతూ
కాలికి కాలం
చేతికి నోరూ అందని
మధ్య తరగతి సంసారం సాగిస్తూ మనం

గుర్తుంచుకుంటానువెన్నెల విరబూసిన, రాత్తిరిని
వెలిగిపోతున్న పూర్ణ చంద్రుడిని  
ఇలాగే గుర్తుంచుకుంటాను.
నీ కనుబొమ్మల్లోంచి చూస్తూ

ఈ ఉత్తేజపరిచే క్షణాలను
నాలో ప్రారంభమైన
ఈ ఉత్కంటభరిత అంతర్కెరటాలను
తుడిచి ముందుకు కదులుతూ

సూక్ష్మానుభూతి నొప్పిని 
దరికి రానివ్వకుండా
ఒక్క ఆనందోద్వేగ
జ్ఞాపకాలను మాత్రమే మిగుల్చుకుని

నీ నా సంబంధిత క్షణాలనూ
నిన్ను మరువరాదని
గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను.
నీ దయాగుణాన్ని నీ ప్రేమను 

కేవలం గ్రహించేందుకు
మాత్రమే కాదు
నీవు నా ఆత్మను స్పర్శిస్తున్నట్లు
అనుభూతిని పొందేందుకు

ముగింపు లేని ఆనందాన్ని పొంది
నీ జ్ఞాపకాలను వెంటేసుకుని
జీవితం ముగిసాకా కుడా జతగా పొందాలని 
ఏదో ఒకలా కాక, నా ప్రేమవు లా

Tuesday, November 17, 2015

గొణుగుడుమళ్ళీ అదే వాగాడంబర 
అస్తిత్వం

అనుకుంటూ
గొణుక్కుంటూ

నాలో నేను
సంతోషంగా లేనని

అంతస్తు అంతరాలే 
కారణం కాదు

సర్వమూ

నేను, నా ఇష్టాలూ 
నా వ్యక్తిత్వం

నేనంటే నాకయిష్టమని 
లోలో గొణుక్కుంటూ

అసహజ ఆలోచనలు
కదలికలతో

వద్దు, కాదు కూడదని
అసంతోషం గా

నన్నేనోడించుకుంటూ

Sunday, November 15, 2015

ఎవరో పిలుస్తూ ....కోల్పొయి శూన్యం లో .... నేను
క్రిందకు చూస్తున్నాను.
అడుగందని నరకం అగాధంలోకి
జీవకణ మరణం లోకి
వ్రేలాడుతూ

నా కాళ్ళ క్రింద వంతెన
సగం దాటి .... అప్పుడే
నన్ను నేను కోల్పోయింది.
ముందుకెలా వెళ్ళాలో
తెలియదు.

గురుత్వాకర్షణకు
వ్యతిరేకం గా
కదులుతున్నాను .... నేను
వేస్తున్న ప్రతి అడుగు లోనూ
తెగింపుంది.

అగాధాల్లొంచి
నా పేరును ఎవరో
అరుస్తున్నారు .... బిగ్గరగా
నేను పారిపోతున్నాను అని,
జీవితం పిలుస్తూ, నన్ను

Saturday, November 14, 2015

ఆమె భూమితల్లి


ఏడుస్తుంది.
నేల బిడ్డలు
రైతు కూలీల కోసం

ఎండిపోయిన
ఆమె ఏడుపు లో
దయా జలాశయాలు .... 


శోకగ్రస్త నిట్టూర్పులు
రొమ్ముల ఎగసిపాటు
ఆమె ఆవేదన లో

అమృతమూర్తిత్వం
ఒక వృక్షం
ఆమె

వృక్షం లా
కొమ్మల కదలికలతో
గాలులు విసురుతూ

మందమారుతాల
ఓదార్పు మాటలు
చెవిలో వింటున్నట్లు

నొప్పి నుంచి
ఉపశమనం పొందుతూ
రేపును చూస్తున్నట్లు

Thursday, November 12, 2015

ప్రియమానసీ


నిన్ను కలిసిన తొలినాటి నుంచే
ఈ వింత భావన నాలో
ఊహల్లో .... గాలిలో నడుస్తూ ఉన్నాను.
ఆలశ్యంగా అయినా ఒప్పుకుంటున్నాను.
అది యాదృచ్ఛికం కాదు ....
అన్ని సందర్భాల్లోనూ
నీవైపు ఆకర్షితుడ్నౌతున్నాను అని.

ఊరంతా అనుకుంటుంటున్నారు.
ఓ మానసీ .... ఇంతందంగా ఉన్నావు.
నీ మనసు నీ లో లేదు అని
నాకెందుకో మరి మరోలా అనిపిస్తుంది.
నా కళ్ళకు నీ కళ్ళలో నక్షత్రాలు, తారలు
ఆనందం విరబూసిన ఆకాశం కనిపిస్తుంది.
కలిసి జత రమ్మంటే మన్నిస్తావు అనిపిస్తూ ....

నీవైపే తూగుతూ వేగంగా కొట్టుకుంటుంది.
నా హృదయం తనదైన చక్షువులతో నిన్నే చూస్తూ
నీవే తన ఆశలు, కలల గమ్యం లా
తలుపులు తెరిచి
నిన్నే స్వాగతిస్తూ .... నిజం మానసీ
అది ప్రేమ తప్ప మరేమీ కాదు
ఓ మానసీ! ఒట్టేసి చెబుతున్నాను .... ఇదే నిజమని

వింత అబద్రతాభావం తగదని ఆనుకుంటూనే
నీవెక్కడ చెడుగా అనుకుంటావో అని ....
తొందరపాటు .... నా మనస్తత్వం కాదు కానీ
ఎందుకో నీవు ఎదురుపడిన వేళల్లో
నిన్ను ఒదిలి తిరిగి వెళ్ళాల్సొచ్చినప్పుడు మాత్రం
వెళుతూ వెళుతూ వెనుదిరిగి
మళ్ళీ ఒకసారి చూద్దాం అనిపించడం నిజం

ఈ ఉద్దేశ్యాలు నా ఈ మనోభావనలు అన్నీ
నీపై బలమైన ముద్ర వేద్దామని మాత్రం కాదు
అంత సులభమనీ అనుకోను.
ప్రేమ, ఒక అమూల్య బహుమానం అని
ఎదురుపడినప్పుడు తిరస్కరించరాదనే ....
ఈ తపనంతా. ఎక్కడ చేజార్చుకుంటానో
అమూల్య బహుమానమైన నిన్ను అనే ....

ఒక అనిశ్చితి, ప్రేమఎవరికీ ఇంతవరకూ
అర్ధం కాలేదు
ప్రేమ ఏమిటో

సాంద్రతతో కూడిన
ప్రేమ
ఎంత బలాన్నిస్తుందో

అది
గుండెను ఎంతగా
ఒత్తిడికి లోను చేస్తుందో

అది
ఎప్పూడూ ఒక భావనే
నిర్ధారణ కాదు. 


ఆపుకోలేని ఆవేశం ను
ఆపుకునే ప్రయత్నం
ప్రేమ.

అసాధ్యం
ప్రేమను సమాధి
చేసి ఉంచగలననుకోవడం.

చివరికి
జ్ఞానోదయం
మాత్రమే మిగులుతుంది.

లోలోపల నిన్ను తినేసి
అబద్రతతో కూడిన
అరుపులు, కేకల పిచ్చివాడిని చేసి

తీరని దాహం ప్రేమ


ఆమెకు ఒక అస్తిత్వం
ఉనికి లేనట్లు ....
అతను, ఆమె గుణ, ధర్మ, లక్షణ,
స్వభావాలన్నింటినీ
కలిపి తాగాడు.
..........
అయినా అసంతృప్తి 
ఇప్పుడు
అతనికి మళ్ళీ దాహంగా ఉంది.
భావించాలి.
ప్రేమ లో ఇది ఒక పాఠం అని

Wednesday, November 11, 2015

శేషం


చలిమంటలు
మొదలవకుండానే
ఆత్మ
అంతర్భాగంలో
తొందరపడి
చెలరేగిన
అగ్ని
జ్వాలలలో
మాడి
బూడిదైన
ప్రేమ,
ఆకాంక్షలతో పాటు
ఆరిన మంటలు
నివురు
కప్పేసినా
చల్లదనం సోకి
గడ్డకట్టి 
మంచుగడ్డై
ఒణుకుతున్న
హృదయారణం 

Tuesday, November 10, 2015

అంధకారం కరిగిపోక తప్పదు


ఎందుకు ఎందుకు భయపడాలి?
నేనేకాకిని ఒంటరిని కానప్పుడు?
జరగబోయేదేదీ తెలియకపోయినా
జీవించడం పోరాటమే అయినా

ఇప్పటివరకూ .... నాకు తెలుసు
నేను కాలం కొండను డీకొట్టి
పోరాడుతున్నాను అని
అనుక్షణమూ నమ్మకమే ఊపిరిగా

చివరికి అంధకారం లోంచి ఆరు బయటికి
వెలుగులోకి రాగలిగాను ....
పట్టపగలు .... అంతా వెలుగుమయం
ప్రేమే నన్ను కాపాడింది ఇన్ని నాళ్ళూ

ఇక పునరారంభం నా చేతిలోనే ఉంది
నీ జతనై నీడనై నీ భాగస్వామి గా
కష్టాల్లో సుఖాల్లో 
నీ చెయ్యందుకుని అడుగులో అడుగులేసేందుకు  


పురోగమనపధం వైపు కదిలేందుకు 
నాకు తెలుసు .... గమనం సుసాధ్యం కాదని
సమశ్యల హర్డిల్స్ దాటడం కష్టసాధ్యం అని
కానీ, పక్కన ఊపిరివై నువ్వున్న బలముంది.

తలొచక్కర్లేదు ఇకపై నిలబడే ఉంటాను
ఎప్పటికీ నేను .... ప్రేమ శిలా ఫలకం పై 
నీ ప్రేముందనే దృడ నమ్మకం మీద .... 
ప్రేమేగా నువ్వాశించేది నేనివ్వగలిగింది

ప్రేమలో పడితే


ఎవరినైనా నీవు ప్రేమించితే
ఏమైనా చెయ్యాలనుకుంటావు.
ఎంతకైనా తెగించాలనుకుంటావు.
అది భేషజమూ అనర్ధకారమే అయినా సరే

చంద్రుడ్ని కోసుకొస్తానంటావు
సూర్యుడ్ని కనబడకుండా చేస్తానంటావు
నిజాలకు వాస్తవాలకు దూరంగా
అబద్దాలలో జీవిస్తుంటావు.

ఎవరినైనా ఘాడంగా ప్రేమిస్తే
ఎన్నో పిచ్చి నమ్మకాలతో .... నిజంగానే
గగనం లో ఎగురుతున్నట్లు 
వింత వింత కలలు కంటుంటావు.

నీకు తెలియని నిజం
నీ ఒంటరి రాత్రుల విరహపు
గడియలు ఇక మొదలుకాబోతున్నాయని 
నీకు తెలియకపోవడమే 


అంతరాంతరాల్లో అంటుతావు
ప్రేమ విత్తుని
ఒక పాదును .... చుట్టూ
బలమైన పెన్సింగ్ కడుతుంది, మనసు

ఎవరినైనా నీవు కోరుకుంటే
తప్పనిసరి జీవనావసరం అనుకుంటే 
అది ప్రేమే అనిపిస్తుంది .... ప్రేమిస్తావు.
అన్నీ కోల్పోవడానికి సిద్దపడతావు.

రేపును గురించిన ఆలోచన ఉండదు
నిన్ను నీవు కోల్పోవడానికీ సిద్దమౌతావు.
ఆ సూర్యుడివి నీవే నంటూ 
చంద్రుడివై వెన్నెల వెదజల్లాలనుకుంటావు.

ప్రేమలో పడితే .... యువతా!

Sunday, November 8, 2015

నూతన అస్తిత్వం


రక్తరాగం లా
లేదు ....
ఎంతో వెచ్చగా ఉంది,
ప్రేమ ఇక్కడ

ఎప్పుడో, ఏనాడో
మనం రాసుకున్న
ప్రేమ లేఖలన్నింటినీ
నదిలోకి జారవిడిచి 

ఆకాంక్షించాను.
జ్ఞాపకాలన్నీ మునిగి
ఇసుకలో
కలిసిపోవాలని

ఆశ్చర్యపోయాను.
ఐనా, నాకు నా
జ్ఞాపకాల ప్రతి ఊసూ
ఎలా గుర్తుకువస్తున్నాయో అని

నేనూ, ఆమె
మృతులం కాదు అనిపిస్తుంది.
నేనో
నూతన అస్తిత్వాన్ననిపిస్తూ,

ఈ గాయం ను
హృదయం ను 
జీవనది అంతర్భాగం లో
బద్రంగా దాచుకుని

ఆమె, ఒక దేవత


ఆమె శరీరం ఇక ఆమెది కాదు
నేను నిత్యమూ పూజలు జరిపే
హృదయాలయం
నా చేతులతో స్పర్శించి
అబిషేకించిన
ఆత్మీయ ఆవేశం
ఆరాద్యబంధమై అల్లుకుని
ఆమె దయాదాక్షిణ్యాలపై
నా జీవితం ఆధారపడ్డట్లుండి

నేను ఆమె కళ్ళలోకి ఎప్పుడైనా
తదేకంగా
చూస్తూ ఉన్నప్పుడు ఏర్పడే 
ఆ భావ రాగ అసంతులనం
దుమ్ము, బురద కొట్టుకుపోయిన
నా అనాగరికత ఔషధమై
ఆమె హృదయస్పందనలను
క్రమబద్దీకరించినప్పుడు
ఆమె తనను కోల్పోయి
ఒక దేవతలా నన్ను కరుణిస్తూ

Saturday, November 7, 2015

నిన్న రాత్రిటాంక్ బండ్ పై
బల్లమీద
ఒంటరిగా
బుద్దుడ్ని చూస్తూ
కూర్చుని,
వింటున్నాను.

అడుగుల శబ్దాలను
కొన్ని సామాన్యంగా
కొన్ని వేగంగా
కొన్ని నెమ్మదిగా
తెలియని
గమ్యం వైపు

ప్రతి శబ్దం లోనూ
ఏదో తొందర
మబ్బులు కమ్ముకొస్తున్నట్లు
అకారణమని అనుకోలేకే.
ఆశ్చర్యపోతూ
ఆలోచిస్తూ ఉన్నాను.

మది పావురంకాసింత
స్వేచ్చను
ప్రసాదించు.
బంధించకు
మది ని

కట్టుబాట్ల
తాళ్ళ  
ముడులు
సడలించు
ఎగరనీ

పంజరం
తలుపులు
తెరిచి ....
ఊహల
గగనం లోకి ఒంటరి
బాటసారి
పయనమే
అయినా
సరే

ఆరంభించి
ఆలోచించనీ
స్థిమితం
ఎక్కడ
దొరుకుతుందో అని

Friday, November 6, 2015

నేనో తాపసిని


నేను నిన్ను ప్రేమించాను.
నీవు తిరస్కరించావు.
నాకింకా గుర్తుంది .... నీవన్నావు.
"ఎప్పటికీ నా జీవన భాగస్వామిగా
అంగీకరించలేను .... నిన్ను" అని
నేను పెట్టుకున్న .... ఎన్నో ఆశలు
కన్న ఎన్నో కలలు, కూలి
జీవితం ఇలా సాగక తప్పదనిపించి .
గుండె బ్రద్దలయ్యింది.
అవకాశం లేదని స్పష్టంగా తెలిసి

గుండెల్లో లోపల ఎక్కడో అజ్ఞాతంగా
ఏదో గుచ్చుకున్న బాధ .... ఎప్పుడూ
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన
రాలేదు కానీ,
ప్రేమించి భంగపడిన తియ్యని బాధ
భరిస్తూనే జీవించక తప్పని స్థితి
అప్పుడే నిర్ణయించుకున్నాను.
జరిగిపోయినదంతా గతం అని
గతం గతించిందని
నాకు నేను చెప్పుకుంటూ జీవించాలని 

ఏ కోణం లోంచి ఆలోచించినా
నీ నిర్ణయం సబబే అనిపించేది.
నీవు నాతో అన్నావు మరిచిపోయుంటావు.
"నేను నీకోసం పుట్టలేదని
నీ తల్లిదండ్రుల దృష్టి లో
నేను నీకు తగినవాడిని కాదని"
మనం ఒక్కటైనా
మన దాంపత్య జీవితం
సరళంగా, ఆనందంగా, ఆదర్శవంతంగా
జరిగే అవకాశం లేదు అని 


అప్పుడు నేను ఎంతగానో గాయపడ్డాను.
ఆ మాటల్లో విని అనాసక్తిని
కానీ తరువాత వెనుదిరిగి ఆలోచించాను.
అప్పుడు ఆ సంఘటన అప్రస్తుతం
మరిచిపోవాల్సిన గతం లా అనిపించింది.
అంతేకాదు
అనుకోకుండా రేపు ఎప్పుడైనా
ఏ టాంక్ బండ్ మీదో
నీవు నాకు ఎదురుపడినా
ఒకప్పుడు నేను ఎంతో ఇష్టపడిన నీ ముఖం
తెలియని ముఖం అన్నట్లుండేంతగా

మనం అందరమూ అనుకుంటున్న
ఈ ప్రేమ, ఈ హృదయబంధం
ఏ అద్భుతమూ ఆనందమూ కాదు
అప్పుడప్పుడూ అది మానసిక అశాంతిని
కన్నీళ్ళనే మిగులుస్తూ ....
నేను అన్నీ భరించే జీవిస్తున్నాను
హృదయం పగిలినా కూడగట్టుకుని
ముందుకే కదులుతున్నాను.
మళ్ళీ ప్రేమను కనుగొనగలననీ 
ఆనందాన్ని తిరిగి పొందగలననే 

ఆనాడు నీవు నా ప్రేమను నన్నూ
దూరంగా విసిరేసి
చాలా మంచిపనే చేసావు.
నీ నిర్ణయం ఎంతో ఉత్తమమైనదే
నీకూ నాకూ కూడా
బహుశ ప్రేమను పొందేఉంటావు
ప్రేమను కనుగొనాలని కోరుకుంటున్నాను 
ఆనందాన్ని, ఆత్మసహచరుడ్నీ పొందాలని
నిజం మానసీ .... నీకు
కొన్ని వేల లక్షల కృతజ్ఞతలు
నీ జ్ఞాపకాల పూతోటలో విరిసిన
పరిమళాలింకా మిగిల్చుంచినందుకు

Wednesday, November 4, 2015

వీడ్కోలు చెప్పాల్సొచ్చి


ఎంతో జాగ్రత్తగా
తొట్రుపడకుండా
నడుస్తూ
అతి కష్టం మీద
నవ్వులు
వెదజల్లుతూ
ధైర్యంగా ఉన్నట్లు 


భయం
కనిపించనీయకుండా 
నల్ల కళ్ళద్దాలతో
కప్పుకుని
కళ్ళను
విఫల ప్రయత్నం
పెల్లుబికుబికొస్తున్న
కన్నీటినాపుకుంటూ

నీ మదిలో ఉంటే చాలని


త్వరలోనే ముగిసినా
జీవితం
నీ మదిలో
ఉండిపోవాలని ఆశ

ఒకవేళ
నేను వెళ్ళిపోయినా
ఈ లోకాన్ని ఒదిలి ....
దూరంగా 


మరిచిపోతుంది
ఈ లోకం
అయినా,
గుర్తుంచుకోబడాలని ఉంది.

నిన్ను కలిసి
నీకు మనసిచ్చిన
చరిత్రాక్షరాన్నో
జ్ఞాపకాన్నో అయి

Tuesday, November 3, 2015

నీవే నా అన్నీను


నీవే
నా ఉదయానివి
అస్తమయానివి, నేను
ఎంతో ఇష్టంగా పాడుకునే పాటవి
రాసుకునే భావానివి
కావ్యానివి.
నీవే .... నా అన్నీను

నీవే
నా కళ్ళలో మెరుపు
ఆ మెరుపు వెలుగువి
నా ప్రకాశం
నేను, నా సొంతం అని
చెప్పుకోవాలనిపించే
ఏకతత్వానివి

నీవే
నా పలుకువి
గొంతు ఆవేశానివి
నా వినికిడివి
నా అంతరాత్మవి
ఊహించేలపోతూ
నీవు లేని జీవనం 


నీవే
నా కలల గమ్యానివి
నా హృదయాన్ని నేను
అనుసరించేందుకూ
మన మధ్య బలపడిన
హృదయానుబంధం
కారణానివి

నీవే
నా మధ్యాహ్నానివి
నా అనుక్షణపు ఆలోచనవి
నేను పలికే
తియ్యని, సున్నిత
మృధు పద బాష్యానివి

నీవే
నేను కోల్పోయిన
నిద్దుర రాత్రివి
నీవే నా ఆత్మవి
అస్తిత్వాన్ని కోల్పోయిన
నా ఆవేశం అర్ధానివి

నీవే
నా హృదయానివి స్పందనవి
ప్రతిరోజూ ఆ దేవుడికి
కృతజ్ఞతలు చెప్పుకుని
ప్రేమను తపించడానికి
కారణానివి

నీవే
నా నిత్య దినచర్యవు
నా ప్రతి రాత్రివి
పోట్లాడకుండానూ
దగ్గరకు తీసుకోకుండానూ
ఉండలేని నా మానసివి

Sunday, November 1, 2015

ఎప్పుడూ


నా కోసం జీవించు
కొత్త ఉదయం లో ఉన్నాను, చూడు
కోకిల పాటలో, విను
వీచే చల్లని గాలినై
నిన్ను స్పర్శిస్తున్న నన్ను

మార్గం చూపించే
వెలుగునై ఉన్నాను
సుర్యాస్తమాన్నై
ఇంద్రధనస్సునై
వర్షాన్నై, వాస్తవాన్నై ఉన్నాను.


చూడు ముందుకు, అనుసరించు
పొందు నన్ను
నీ కలల గమ్యాన్నై నీ ముందున్నాను
జీవించు జీవితాన్ని
నీతోనే ఉంటాన్నేను.