Thursday, February 28, 2013

ఆలశ్యం!అయోమయం .... చీకటి, నిరాశ
నిస్పృహల .... ఆలోచనల వేడి గాలులు
నా మనసు గుండా ప్రవహిస్తున్నాయి.
ఆకశ్మిక ఆక్రమణ ఏదో .... నాపై
నాలో .... ఏదో అలజడి, అస్థిమితం,
శాంతి లేని .... ఆవేశం బ్రద్దలైన భావాలు

నా భావాలు .... నియంత్రించేందుకు
నేను చేసే ప్రతి ప్రయత్నమూ విఫలమై
అలివికాని ఆవేశం అలసత్వం .... నాలో
నాలో నెలువెల్లా కంపన లై, ఆక్రోశం
జీవితంపై నియంత్రణ కోల్పోయి 
మరణించినా బావుండుననే భావన .... నాలో

అందకారం, నీరసం .... ఆవేశం, ఆక్రోశం
చుట్టూ కమ్ముకుపోయి భూమి బ్రద్దలైన ....
ఆలోచనల గాలులు .... మనసును
కాల్చేస్తున్నాయి .... లావాలా,
ఆకశ్మిక ఆక్రమణ ఏదో .... జరగబోతున్న
సూచనల్తో కసి, నిస్సహాయత .... కమ్ముకుంటున్నాయి.
చేతకాని, భరించాల్సిన .... శాంతి లేని బ్రతుకులో

నిజం!
ఆలశ్యం చేసాను ....
ఒక జీవిత కాలం
గాలి తో వర్షమూ వస్తుందని .... తెలుసుకునేందుకు

Wednesday, February 27, 2013

నీ .... శ్రద్ధ!పొడుగైన ఆఫీస్ కారిడార్
లో
నేను కదులుతున్నప్పుడు
నీలో
ఉత్సాహాన్నీ దాయని పలుకరింపు
చిరునవ్వునూ చూసా
నా పిలుపుకోసమే ఎదురు చూస్తున్న
ఉద్విగ్నత నీ నడవడికలో 
ఎన్నో
వేల పదాల్లో
చెప్పలేని భావన, ఆదరణ
నా చూపుల్తో .... నేను
నీ ముందు పరిచినప్పుడు
ఎరుపెక్కే నీ బుగ్గల
దాయలేని బిడియాన్ని చూసాను.
అనుకోకుండా ఎప్పుడైనా
నా చెయ్యి తగిలి
నేను సారీ అని చెప్పాలని
నీవైపు చూసినప్పుడు
నీవు
అదేం చిత్రమో
ఒక పాఠశాల అమ్మాయివి
ప్రైవేట్ రంగ సంస్థ
లో
క్షణమైనా తీరికలేని
ఎంతో ఒత్తిడి
ఎంతో బరువు
ఎన్నో బాధ్యతల్ని మోస్తున్న
యువతివి నీవేనా అనిపిస్తుంది,
.... నీలో
ఒక స్కూల్ అమ్మాయిని చూసినప్పుడు,
బహుశ
నేను
నీ పక్కన ఉన్నప్పుడే అనుకుంటా ....
నీలో ఈ పరిణామాలు
మరి
చెప్పొచ్చుగా! ఒప్పుకోవచ్చుగా!
విలక్షణం
నీ దృష్టిలో నేనంటే శ్రద్ద అని,
ఎంత పెంకితనం
ఎంత మొండితనం ఉన్నా
మనసు మాత్రం
నా తోడును
నా సాహచర్యాన్నీ కోరుకుంటుంది అని

ఎవరో వస్తారనిఎక్కడో దూరంగా
మిణుకుమిణుకు మంటూ
నిస్సహాయపు నవ్వు
నిర్లిప్తతను చీల్చుతూ
చిరు ప్రకాశాన్ని వెదజల్లుతుంది.
నా మది మాత్రం
నీవు రావాలి అని
నా కోసమైనా వస్తావని
నా నమ్మకం బ్రద్దలు కాకముందే
ఒక్కసారి వచ్చి
మళ్ళీ వెళ్ళినా సరే అని

మబ్బులు పట్టిన రోజు
చెట్ల కొమ్మల్లొంచి
బిడియపడుతూ తొంగిచూసి
పలుకరించే సూర్యుడిలా
నాతో ఉండేందుకు
వచ్చేందుకు
తటపటాయింపు మొహమాటం
పడతావేమో అనే
కొమ్మలు ఆకులు నరికేసుకుని
ఒంటరిగానే ఉంటున్నా

సామాజానికి వెయ్యి కళ్ళు
తప్పించుకోలేననిపిస్తుంది
నా భావనల్లోంచి నీ రూపాన్ని
పసికట్టేస్తుందేమో అని
ఎందుకో భయమేస్తుంది
బలహీనత నిలువెల్లా నాలో
నీరసం నిస్సత్తువ .... నీవు లేకే
చెట్లు, మొగ్గ ఉంటేనే
గాలయినా వీచేది.
పండైనా బలంగా ....
కొమ్మంచుకు వ్రేలాడేది.

పరిశీలనగా చూస్తున్నాను
గాలి వీస్తున్నట్లే ఉంటుంది
నీవు అందుబాటులో ఉండి
పలుకరిస్తున్న క్షణాల్లో ....
అయినా .... అప్పుడప్పుడూ అనిపిస్తుంది
నిజంగా నీవొస్తున్నావా అని
తప్పుడు కాంతి .... బూడిద కాదుకదా నా ఆశ అని
నా ఎండిన కళ్ళు
నా పగుళ్ల పెదవులు
రాతి గోడలు, కొండ రాళ్ళ మధ్య .... జీవనం
నాగరికత తెలియని నా కోసం
వచ్చి వెనుదిరుగుతావేమో అని

దృఢమైన ....
పారదర్శక
థర్మోప్లాస్టిక్ టోపీ వంటి ....
జీవితంలో కాంతిని వెదజల్లావు.
అయినా,
నీ తోడు లేక
ఎండకు ఎండిపోతూ
వానకు తడుస్తూ
నా ప్రేమ లేని జీవితం
సున్నితత్వం కోల్పోయింది.
ఇన్నేళ్ళుగా ఎదురుచూసా!
బాధతో తపిస్తూ
ఎదురుచూస్తూనే ఉన్నా .... నీవు లేవనే

ప్రేమ!ఒక సమయంలోనో
ఒక స్థలంలోనో .... ఎప్పుడు ఎక్కడ
ఎలా పుడుతుందో తెలియనిదే ..... నిజమైన ప్రేమ
అనుకోకుండా జరిగే ఒక అద్భుత భావన,
ఆకశ్మిక హృదయ స్పందన,
గుండెల్లో మెరిసే ఒక మెరుపు,
కొన్ని క్షణాల పాటు భయంతో గుండెలు వణకడం .... ప్రేమ.

ఉదాసీనత!ప్రేమ కానిది
ద్వేషించడమే .... కానక్కర లేదు.
కళ కానిది
వికృత్వంలోనే .... కనిపించక్కర లేదు.
విశ్వాసం లేనిది
నాస్తికత్వమే .... అయ్యుండక్కర లేదు.
జీవిత వ్యతిరేకత్వం
మరణమే .... అనుకోనక్కర లేదు.
నిజానికి వీటన్నింటికీ
కారణం ఉదాసీనతే అని నమ్ముతున్నా!

గృహం!

మనం ఇద్దరం
గృహం లేదు .... మనకి
గొడుగు ఉంది
గొడుగు చూరు కింద ....
ఇద్దరు వ్యక్తుల జీవనం ....
గూడుంది.
నిజానికి మనం ఒక గృహం!

Tuesday, February 26, 2013

అనుకోవచ్చేమో!


ఆత్మ సహచరులు ఆలోచనని
తొలి చూపు ప్రేమని.
నమ్మాలేని మనోస్థితికి .... తర్కానికి
ప్రత్యామ్నాయ తర్కాన్ని ఆలోచిస్తున్నా! 
ఇలానూ అనుకోవచ్చుగా అని,

అదృష్టవంతులు కొందరికి .... జీవితంలో ....
అనుకోకుండా ఎవరినైనా ఎదురుపడి వారిలో ప్రత్యేకత కనిపిస్తే,
వారే ఖచ్చితంగా .... సరైన తోడు తనకు అని అనిపిస్తే  ....
అలా అనిపించడానికి
ఆ వ్యక్తి పరిపూర్ణతో నీ పరిపూర్ణతో కారణం అనుకోకపోతే
.......
ఇద్దరి లోపాల్లో సామరశ్యత ఉండి
కలిపి ఏర్పాటు చేయబడ్డట్టు
ఒక విధంగా, ఆ లోపాలను సాహచర్యంలో
పూరించుకునే అవకాశం ఉన్నట్లు
కనిపించడం కారణం .... అనుకోవచ్చేమో!
రెండు వేర్వేరు జీవులు వారి వారి అస్తిత్వాలను కాపాడుకుంటూ
కలిసి తిరుగు అమరిక అని .... అనుకోవచ్చేమో!

సమాజాన్ని పీల్చెయ్యకు .... తోడై ఉండు!కాలాన్ని
జీవితాన్నీ ఖర్చు చేస్తున్నావు.
ఖరీదైన కల్పనల కలలు కంటూ,

ఆ కలల్లోంచి
ఆ అద్భుత కల్పనల్లోంచి
వాస్తవం లోకి వెనక్కొచ్చెయ్యి!

నడమంత్రపు సిరి రావాలని
శీతల యంత్రాల గదుల్లో
కాలం గడిపెయ్యాలని ఆశిస్తున్నావు.

కృత్రిమ
యాంత్రిక జీవనం
చూసేందుకే భవ్యంగా ఉండేది.

నిజం నేస్తమా
ఆ వాతావరణం నీపై
చాలా ఎక్కువ వత్తిడిని పెంచేస్తుంది.

నీ వ్యక్తిత్వం
నీ మనోభావన ల్ని
పతనం దిశగా నడిపిస్తుంది.

కష్టపడకుండా వచ్చిందేదీ
నీతో ఉండదు.
అదృష్టమైనా అనుభూతైనా,

ఆ కల్పనల్లొంచి
ఆ కలల్లోంచి
బయటకు రావడం తప్పేమీ కాదు.

నీతి
నిజాయితీ అవుతుంది
నీ పేదరికం వాటా .... నీవు స్వీకరించు! 

నీకంటూ
నీదనే చరిత్రను
మంచి పేరును సాధించు! 

కలుపు మొకాల నుంచి
పంట మొక్కలకు
భూమి సారం లా ....

సమాజాన్ని పీల్చేసే
స్వార్ధం నుంచి
శ్రమ జీవికి ఫలితం దక్కేలా జీవించు!

అనుభూతులు


పురోగమించు
భయపడిపోయి
వెనుకకు చూసేందుకు వెనకాడకు!
పరిశీలించు
నిలబడిపోయి
ఆలసించి కాలాన్ని గడిపెయ్యొద్దు!
ఆలోచనల
పరిపక్వత
వివేకం చేరువలోనే గమ్యం!
భూమి నీరు
గాలి ఆకాశం
అగ్ని అన్నీ స్పష్టంగానే ఉన్నాయి.
వయసుతో
ఆవేశంతో పాటు
శిదిలమౌతున్న నీ అస్తిత్వం తప్ప,
వీస్తున్న
ఆ గాలి
చేస్తున్న ఊళల శబ్దాలు,
నీ
నిన్నటి వ్యర్ధాలు
మరుపురాని తీపి జ్ఞాపకాలు.
అక్కడ,
మది పొరల్లో
ఏముందో నీకూ తెలుసు.
చెడు కాని
కాలాన్ని తినేసే
మధుర అనుభవాలు .... కొన్ని అని,
చూడొచ్చు
ప్రేరణ కోసం
గతం జ్ఞాపకాల బాండాగారాన్ని,
చూడొచ్చు
వెలుతుల్ని
కొత్త అనుభవాల్తో నింపేందుకు
నిన్న
నీడ కల అయి
పాత రోజులు అందంగా మధురంగా,
అమాయకత్వం
పొట్టిలాగుల్లో
అరమరికల్లేకుండా ఆడిన రోజులు
ఆటల
పర్యవసానాలు
గెలుపోటముల మూతి విరుపులు.
చెరువులో
ఈతలు
కోతి కొమ్మచ్చి కాళ్ళు బెణకటాలు.
జీవితం
నల్ల పలకపై తెల్లక్షరాలు
భవిష్యత్తును సాధన చేసేందుకు ఇందనాలు.

Monday, February 25, 2013

కవితమోహ మనోహర రూపమా
ప్రియా!
నా కవితల అంతరార్ధం నీవు
నీ అందం సౌందర్యం
నా కలం అంచుపై ఊరే అక్షరం

నా గుండె లోపల,
స్పందన ....
వినిపించే నీ గుసగుసలు
భావ పద రూపం .... పరిమళం
జాలువారుతున్న ....
నా కవిత

ప్రేమ ద్వేషంనీవు ద్వేషిస్తున్నా
నేను నీ ప్రేమలో .... మునిగిపోయా!
నా హృదయం
నీ భావనలతో
కిక్కిరిసి పోయింది.
నీవే కావాలని తపిస్తుంది.
నిన్ను నా బాహువుల్లోకి తీసుకోవాలని,

ప్రేమ ద్వేషాన్ని
ఆలింగనం చేసుకున్నప్పుడు
ద్వేషం ఏమౌతుందో తెలుసుకోవాలని,
నీవు ద్వేషిస్తున్నా ....
నేను నీ ప్రేమలో .... మునిగిపోయా!

నీవు ద్వేషిస్తున్నా
నేను నిన్ను ప్రేమిస్తున్నా
నా మనసంతా,
నీ ఆలోచనల సంఘర్షణలే!
.... భావారణ్యమయ్యింది మది.
నీ సాహచర్యం తోడు కావాలని
నీ కరుణను పొంది,
నిన్ను నా బాహువులతో బంధించేదెలా అని ....

ప్రేమ ద్వేషాన్ని
ఆలింగనం చేసినప్పుడు,
ప్రేమ వెలుగు విజయోత్సాహాన్ని చూడాలని ....
నీవు ద్వేషిస్తున్నా,
నేను నిన్ను ప్రేమిస్తున్నా!
Sunday, February 24, 2013

యుగయుగాల ప్రణయం .... ఈ సంసారంఒంటరిని నేను అనుకోవడం
ఒక మింగుడుపడని భావన!
ఒంటరిగా ఉన్న ప్రతిసారీ
మది రోధిస్తూనే ఉంది.
ఒంటరితనానికి
ఓ భాష్యాన్నివ్వాలని
ఒక తోడు
ఒక ఏకాంతం కాని
అర్ధాన్ని వెదకాలని ....
మది పరితపిస్తూనే ఉంది
ఔనూ!
ఒంటరినేగా .... నేను
ఈ లోకంలోకి వచ్చినప్పుడు,
ఈ లోకము నుంచి నిష్క్రమించేప్పుడు,
మరి,
ఈ పరితపన ఎందుకు

నేను
నేడు రాయనుకునేది
రాయి కాదని .... తెలుసు
తెలుసు .... నిన్నటి నీరు, నిన్నటి ఇసుక .... సమ్మేళనం అని,
కొన్ని లక్షల సంవత్సరాల కలయికల ... పరిణామం అని,
నా తోడును ....
నిన్ను,
కటిక చీకటిలో అయినా .... గుర్తించగలను.
గుర్తించగలను. .... కదులుతున్న చైతన్యాన్ని
కుళాయిల్లోంచి ఉరికొచ్చే .... నీళ్ళ శబ్దం
నీ కాలి అందెల సవ్వడిని ....
నేనీ జగతిలో పడిన నాడే
నీవూ పుడతావని తెలుసు!
గతజన్మ సుకృతం .... కర్మల
సమాధి మీంచి
తలుపుల ద్వారా మొలకెత్తుతావు అని

ఒంటరిగానే నేను
గుండెను సమాధానపరుచుకుంటాను.
పసితనపు ఎదుగుదల ....
ఎముకలు, మాంసం .... గట్టిపడి,
రేపు వైపు పగిలిపోవడం
వయసు రావడం ....
రెక్కలు అమర్చుకుని .... ఊహలు ఎగరడం,
మందహాసాన్ని ధరించి
సొగసరివి నీవు ....
నా ప్రపంచంలోకి రావడం
కాలమహిమ అనుకోలేను.
ఒంటరిని నేనీ జగతిలో అని .... తెలుసు!
తెలుసు .... ఏదో ఒక రోజు చనిపోతానని,
జీవితం .... ఈ ఘనమైన శిల
ఇసుక నీరు కలిసిన
ఎన్నో జన్మల సాహచర్యం అని,
యుగయుగాల ప్రణయ రాగం .... బంధం అని,Saturday, February 23, 2013

ప్రశ్నార్ధకం ....?నీ సాన్నిహిత్యం
నన్ను బలహీనుడ్ని చేస్తుంది,
అడుగు ముందుకు పడదు
నాకు నేనే ఒక ఆశ్చర్యం కలిగించే అంశాన్నౌతాను.
ఎందుకో తెలియదు.
విశ్వసనీయత మాత్రమే నాలో .... బలం గా
నీ మార్గం
నీ జాడ లో తచ్చాడ్తుంటాను
నా ఆలోచనలన్నీ నీ చుట్టే తిరుగుతూ
ఒక వట్టి మాయ ....
మది, ఎద .... ప్రేమ అన్నట్లు .... ప్రశ్నలా?

అది నీవే!ఓ చిన్న కవితను అల్లాలనిపించింది
ఊహల తోట లో .... ఒంటరిలా
నా ఆలోచనలు పచార్లు చేస్తున్నాను.

అనుకోకుండా

చల్లని మృదువైన లేత గాలి తెంపరొకటి
నా ఆలోచనల్ని ప్రభావితం చేస్తూ వీచింది.
నా మది నా నియంత్రణలో లేకుండా చేస్తూ

ఆ చిరు గాలుల సున్నిత తరంగాలు లో,
ఏవో తియ్యని సువాసనలు తేలుతూ వచ్చాయి.

నా ఆత్మ సందడి చేసింది.
ఆ పరిమళాల్ని వెంటేసుకొచ్చింది నీవే అని గ్రహించి

Friday, February 22, 2013

నేస్తమా!నీ కోసం
సమాజం కోసం
దేశం కోసం .... జీవించు!
మరణాన్ని శాసించాలని చూడకు!
అందుకే
సంగీతం .... స్వర మధురిమ .... భావమై జీవించు!
మరణం నిర్వచించని,
తప్పని ఒక పరిణామం అని తెలుసుకో!

ఎవర్ని నమ్మాలి!వేసవి పచ్చదనం
ఎండమావుల్లో తీరిన దాహం
తీరని రక్త దాహం .... ఉగ్రవాదం
ఉగ్రవాదం గుండెల్లో నిండుతుందనుకునే దయ కనికరం
నేతి బిరకాయలో నెయ్యుందనుకునే ....
సామాన్యుడి నమ్మకం .... కల
అయితే,  
లబ్ది పొందేందుకు .... గొంతుక్కూర్చునున్న నక్కలవిగో
ఔనూ
ఉగ్రవాదానికి
రాజకీయం తో చుట్టరికం ఏమిటో ....
ఒకరికొకరు ఆతిధ్యాలిచ్చుకుంటుంటారు ....
ఒకరు అపహరించి .... బేరసారాలాడేందుకు
ఒకరు జైల్లో సకల సౌకర్యాలూ కూర్చి .... మరీ
ఎందుకో?

విశ్వాసం!ఎంతో సులభం
నీవూ నేనూ అలలం
ఒంటరులం అని అనుకోవడం!

కానీ,

మనం
కలిసి ఒక మహా సమూహం
సముద్రం అని మరుస్తున్నాం!

శాంతి కపోతం!


ఆకులు రాలుతున్నాయి.
కొత్త చిగుర్లేసేందుకు ....
ప్రకృతి సిద్దమౌతుంది!
పాత బడి వృద్దాప్యం
అలసత్వం లో .... ప్రజాస్వామ్యం!
ఎక్కడో దూరంగా
మేఘాల మధ్య
కనుమరుగవుతుంది సామరశ్యం ..... శాంతి కపోతం!

ధైర్యం అవసరం!రణరంగం
యుద్ధం అవసరం!
సిద్దంగా ఉండాలి.
తప్పదు.
ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు,
.... కాపాడుకునేందుకు,
ఒక విద్వంసకత్వాన్ని ఎదిరించేందుకు,
యుద్ధం
రణం అవసరమే!
అందరినీ మ్రింగెయ్యాలని చూసే ....
మహమ్మారిని ఎదుర్కునేందుకు,

కాని
ఎందుకో
నాకు మాత్రం
తళతళా మెరిసే పదునైన ....
కత్తి మొనంటే అయిష్టం!
వడిగా గాలిని చీల్చుకుని ....
గుండెల్లోకి దూరే బుల్లెట్ట్ అంటే అయిష్టం!
ఎవరో గుర్తుంచుకోవాలనే ....
కీర్తి కండూతి అంటేనూ అయిష్టం!
ఒక్క
ప్రాణాన్ని కాపాడుకునే,
ధైర్యం లక్షణం .... అంటే మాత్రం అపరిమితమైన ప్రేమ!

మనిషీ జీవించాలి నీవు!నర్తించాలి నీవు!
ఉగ్రవాదం ....
పాశవికత రొమ్ముల మీద,
న్యాయం రాజ్యాంగం
రక్షక వ్యవస్థ నిర్వీర్యమయ్యాయని ....
నర్తించాలి నీవు!

ప్రేమించాలి నీవు!
సామాన్యుడి అమాయకత్వం ....
చిరు ఆశల్ని,
కన్నబిడ్డడ్ని చూసుకుని గర్వపడేందుకు
ఎర్ర బస్సుల్లో .... పడి పడి వచ్చి ....
క్షతగాత్రులుగా మిగిలిన మానవత్వాన్ని
ప్రేమించాలి నీవు!

గానం చేయాలి నీవు!
పల్లె వాతావరణాన్ని ....
జానపదాల్ని,
ఒక్కరికి కష్టం వస్తే ....
మేమున్నామంటూ కదిలొచ్చే,
సంస్కారాన్ని, భూతలస్వర్గాన్నీ ....
గానం చేయాలి నీవు!


Thursday, February 21, 2013

ఆమె కు నేను జాబిల్లి


నా ప్రేమ, నా జీవితం ఆమె
ఆమె లేని జీవితం ఊహించలేని వాస్తవం
శ్వాసించలేను
అనుక్షణం నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉంటాను
ఆమెను నేను దూరం చేసుకోవడం లేదుగా అని
ఆమె లేని నా జీవితం వట్టి అబద్దపు మూట
గంటక్రితం ఆమె కాన్సర్ మహమ్మారికి బలయ్యింది
గడియే కావొచ్చు .... ఆమె జీవించి లేని సంసారంలో 
ఎలా జీవించి ఉన్నానా అని ఓ శేష ప్రశ్న
ఇప్పుడు
నా కదలికలు కృష్ణమ్మ వైపు
కృష్ణమ్మకు నా బలహీనత తెలుసు
నా ప్రేమను నాకు చూపిస్తుందేమో అని ....
ప్రియమైన నా సహచరిని
ఇన్నాళ్ళుగా నాతో .....
ఈ భూమ్మీద గాలిని, నీటిని .... పంచభూతాల్నీ
బంధాల్నీ బాధల్ని, సంతోషాల్నీ
కలిసి పంచుకున్న ప్రాణం, నా భాగస్వామిని
నా కన్నీటిని తుడిచే ఓ మనోహర ఆత్మీయతను
కలుపుతుందేమో అని .... నన్ను తనవద్దకు చేరుస్తుందేమో అని
కృష్ణమ్మ ఒడిలో తలదాచుకుని
ఓదార్పు పొందేందుకు
కృష్ణమ్మ వడిలో .... రాలిన మట్టి గడ్డలా కరిగిపోతూ .... ఉద్వేగం నాలో,

విన్నపం


నేను నీతో ఉన్నప్పుడు
ఉత్సాహం ఊపిరై .... గాల్లో తేలిపోతున్నట్లు
భావనల్లో కొట్టుకుపోతున్నట్లు,
ఉదయం సాయంత్రమై గడియలు క్షణాలై
అసూయతో ఆ ప్రకృతే
కాల చక్రాన్ని గిరగిరా తిప్పేస్తున్నట్లు అనిపిస్తుంది.
నా కౌగిట్లో నీవు ఉన్నప్పుడు
అభద్రతాభావం చెందొద్దని చెప్పాలనిపిస్తుంది.
నీకు నా తోడు .... అవసరం ఎంతో
నా గుండెకు నీ ప్రేమా లాలన అవసరం అంతే!
గాందర్వం లా నా చెవిలో
మధురం గా నీ ముచ్చట్లు గుసగుసలు
వింటూనే వుండాలనిపిస్తూ .... తనివితీరదు
ఆలశ్యం తగదని ....
అందుకే,
నీ కళ్ళలోకి సూటిగా చూసి .... నన్ను నేను సర్దుకుని,
నవ్వు నిజాయితీ మీద నిలబడి .... మరీ,
నీ ఇష్టమే నా ఇష్టమూ .... కలిసి జీవిద్దాం! సరేనా అన్నది.
నీవు సరే అన్నావు. అప్పుడే మనం
గాలి దూరనంత ఘాడంగా బలంగా దగ్గరయ్యింది!
నిజం!
నీతో కలిసి ఉండటాన్ని
కలిసి సహచరించడాన్ని
శ్వాసించడం కన్నా
జీవించడం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నానని
మరోసారి విన్నవిస్తున్నా!

Wednesday, February 20, 2013

దారి కొత్తది .... కఠినం జీవితం!ఎంతో కష్టం
ఒడిదుడుకుల మయం .... జీవితం!
వర్తమానాన్ని
రేపును తినెయ్యాలని సూస్తున్న జ్ఞాపకాలను
మదిలోంచి తుడిచెయ్యాలనుకుంటున్నాను
నిన్నటి వరకూ
నడిచొచ్చిన
రహదారి
అంత సంతృప్తిగా లేదు.
ముళ్ళూ, రాళ్ళమయమై ....
తాత్సారం చెయ్యాలనుకోవడం లేదు.
సందేహాల్లేవు.
కాలంతో పోటీపడి కదలాలి.
సంశయం ....
సందేహం బ్రేకులు వెయ్యొద్దు! 
ఎలాగో తెలియదు.
నేను .... డ్రైవర్ని కాను.
జీవించేందుకు
ముందుకు కదలడం ....
అనివార్యం అని మాత్రం తెలుసు.
నిన్నటి ఆలోచనల్ని,
నిన్నటి ఆవేశాన్ని,
నిన్నటి దారుల్ని ....
వాస్తవికతతో సంతులనం చేసుకుని,
కదలక తప్పదు.
దారి కొత్తదే అయినా ....
నడవడం అలవాటౌతుంది.
సర్దుకుని నడుస్తాను.
సర్దుకుపోతాను అని కాదు
కొత్తదారిలో .....
చైతన్యం సౌజన్యం నన్ను కౌగిలించుకుని
స్వాగతించేందుకు ....
దారి కొత్తది.
నడక కొత్తదే .... అయినా
తమాయించుకుని నిలిచేందుకు ....
అడుగు ముందుకేస్తున్నాను.

వింత కోరిక!సుతిమెత్తని
సున్నిత హృదయం
పరిపూర్ణ ప్రేమ .... ఆమెది.
లయబద్దంగా కొట్టుకుంటూ .... గుండె
అద్భుతం లా మెరుస్తూ .... కళ్ళు

ఆమెలో చైతన్యం
ఆమెలో అగ్ని .... ప్రకాశవంతమై
తేనె వంటి తియ్యని ప్రేమ ఏదో
ఆమె లో .... నేను లా .... అన్నీ కుదించి ఉన్న
ఓ సౌందర్య దేవత కనిపిస్తుంది!

నా గుండె ను తాకిన భావం ఆమె,
నాకు ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ .... ఐనా,
ఆమెతో సంభాషిస్తున్నంతసేపూ
తియ్యని పదాలు ముద్దగా వస్తుంటాయి
వివరించలేని ఏవో శృంగారపు ఆలోచనలు పల్లవిస్తుంటాయి.

ఆమె ప్రతి మాట, ప్రతి కదలిక
ఆమె నవ్వుతూ ....
ఆమె తోనే మాట్లాడుతూ, ముచ్చట్లాడుతూ
ఉండాలని, ఉండిపోవాలనిపిస్తూ ....
ఆమె నిండుతనం నాకు స్ఫూర్తినిస్తుంది.

చంద్రుడు విశ్రమించి సూర్యోదయం అన్నట్లు
కల నుండి మేల్కొనే సమయం లో
ఆమె కలలో నేను, ఆమె కోసం .... మేలుకొని
బెడ్ కాఫీతో ఆమె .... నా పక్కన ఉండి
తియ్యని ప్రత్యేక బహుమానం ఒకటి అందిస్తూ .... నేనని!

Monday, February 18, 2013

నరకం సరిహద్దుల్లో ....


ఇక్కడ, అక్కడ
హృదయంలో, ఆత్మలో
ఆలోచనల్లో,
చర్మంలో, ఎముకల్లో ....
ఏదో జరుగుతుంది కానీ అర్ధం కావడం లేదు.

కుడివైపున, ఎడమవైపున ....
గుండె రక్తాన్ని స్రవించేవరకూ,
శరీరం ఎముకలు చిద్రం అయ్యేవరకూ,
బరించలేని బాధ కన్నీరై ఉబికొచ్చేంతవరకూ,
ఏదో జరుగుతుందని తెలుసు కానీ అర్ధం కావడం లేదు.

బడిలో, గుడిలో
బజార్లో, ఇంటిలో
తలలో, గుండెలో
ఆలోచనల్లో, ఆత్మలో
ఏదో జరుగుతూనే ఉంది అయినా అర్ధం కావడం లేదు.

కలల్లో, నిద్రలో
బాత్రూంలో, ఒంటరితనంలో
మంజీరా జలంలో, నా గదిలో
నా ఇంటిలో, నా మంచంపై, నా ఏకాంతంలో
నా ప్రతి గంట, ప్రతి క్షణమూ .... జీవితంలో
ఏదో జరుగుతుంది అది ఏమిటో తెలియటం లేదు.

కోపం తో, ద్వేషం తో
గాయం తో, అత్యాశ తో
బాధ తో, న్యూనతాభావం తో
దిగులు తో, అయోమయం తో
నాలో ఏదో కలవరం కానీ అది ఏమిటో తెలియటం లేదు.

సంసారమూ, స్నేహితులూ
ప్రపంచమూ ....
నేను ప్రేమించిన మనుషులూ
అంతా ఒక్కటయ్యారు
నా చుట్టూ చేరి నాపై కుట్ర పన్నుతున్నారు.
ఏదో జరుగుతుందని తెలుసు .... అది ఏమిటో తెలియటం లేదు.

నొప్పి, బాధ .... కణకణాన్నీ తడుముతున్నాయి.
నాలో స్థిరబుద్ధిలేకుండా చేస్తున్నాయి.
మాత్రలు వేసుకోకుండా ఉండలేకపోతున్నాను!
సిరలు దమనులు మత్తు మాదకద్రవ్యాలతో నింపుకోవాలి.
ఏదో జరుగుతూనే ఉంది అయినా అర్ధం కావడం లేదు.

నిద్రలో, మత్తులో, కాల్పనిక స్వర్గంలో ....
వెలుతురు తెలియని అయోమయంలోకి వెళ్ళిపోతున్నా!
అయినా నాకు తెలుసు.
నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని
ఎప్పటికీ తెలుసుకోలేనని .... భరించలేని నొప్పికి కారణాన్ని!
అందుకే,
ఏ వెలుగో నా నొప్పికి నాకు ముగింపు చెప్పే క్షణం కోసం .... ఎదురుచూస్తున్నా!

Sunday, February 17, 2013

ఆలోచించు నేస్తం!

చంద్రశేఖర్ వేములపల్లి || ఆలోచించు నేస్తం! ||

కనిపిస్తూనే ఉంది
మనిషి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాడని
ఇకపై మూర్ఖత్వం దాచనక్కర్లేదని
ఎంత మూర్ఖుడైనా బహిరంగంగా తిరగొచ్చు
ఇక్కడ ఎవరూ ఎవర్నీ పట్టించుకోరు.
మెదడులన్నీ ట్రంకుపెట్టలయ్యాయి.
ఖజానాను నింపడానికే పనికొస్తున్నాయి.
మానవత్వం బురుజులు
రక్షణ గోడ కందకాల్లోకి జారిపోయింది.
మేదావులనబడేవారంతా విదూషకులై ....
డాలర్ల కోసం నగ్నంగా నర్తిస్తున్నారు.

చరిత్రను తిరగేసి చూస్తే
గుర్తుకొచ్చే వ్యక్తిత్వాలు ఎన్నో!
మరణించాక కూడా జీవించిన
మానవతావాదులు వారు.
మరణం కన్నా జీవనం పొడుగని
ఖచ్చితంగా చెప్పుతున్నట్లు ....
దాఖలాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడేమో
నిరక్ష్యపు నిర్లజ్జా వ్యవస్తలా ....
ఏదో జరిగే ఉంటుంది అన్నట్లు అంతా వేగం
అనుకరణ .... అవకాశం కోసం ఆత్మవంచనలు

అందుకే అనిపిస్తుంది
పారిపోవడం పట్టనట్లుండటం .... తప్పని
ఆలోచించే మనుషుల్ని అధికారంలోకి తెచ్చి
అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమయ్యిందని
ఆలోచించి, శాసించగలిగిన
యోగ్యత ఎక్కడుందో అన్వేషించాల్సిన క్షణాలివి అని
ఇప్పటినుంచైనా వ్యక్తుల్లో వ్యవస్తలో
ఆలోచనల్ని పునరుద్ధరించేందుకు కృషి చేద్దామని.

2013, ఫిబ్రవరి 17, ఆదివారం సాయంత్రం 4.10 గంటలు

Saturday, February 16, 2013

పోగొట్టుకోను ఏమైనా ఉంటేగా .... నా వద్ద


పిల్లా!
డబ్బు అక్కర్లేదు ....
అక్కర్లేదు ....
ఏ అనుకోని అదృష్టం, కీర్తి
బ్రతకడానిక్కావలసినంత
దనవంతుడ్ని ....
పోరీ ....
నీ, నా అవసరాలు తీర్చగలను.
ప్రియా!
సిగ్గును విడిచెయ్యి!
తలుపులు మూసెయ్యి!
తలపుల్లో ఉన్నానని తెలుసు ....
బిడియమెందుకు బయటపడేందుకు?
పడిపోవడానికి .... భయపడను!
భయపడను ....
తోడుండటానికి,
ధైర్యం కలిగించడానికి ....
నా కళ్ళలొంచి
నీలోకి చూడు ....
పిల్లా!
పొరపాటున .... నన్ను
పడెయ్యాలని చూడకు!
నా అంత నేను పడిపోయేందుకు సిద్దం.
ఒడిదుడుకుల జీవితం
పరిస్థితుల ప్రభావం
పిచ్చివాళ్ళ సముదాయం లో
ప్రేమికుడ్ని ఒకడ్ని .... నేను.
పోగొట్టుకునేందుకు విడిగా .... నా వద్దేం లేవు.
పోగొట్టుకుంటాననే భయం లేదు.
అతిగా మునుపెవర్నీ ప్రేమించలేదు ....
పోరీ!
దోచుకునేందుకు నా వద్ద .....
విలువైనదేదీ లేదు.
ప్రియా!
అర్ధం అయ్యేలా చెప్పాలనుంది.
నా వేదాంతాన్ని....
ఎలా చెప్పాలో తెలియడం లేదు.
అర్ధం అయితే ఆనందిస్తావని తెలుసు.
అనుభవానికొస్తే అమరానుభవం పొందుతావని తెలుసు.
అందుకే చెబుతున్నా ....
పిల్లా!
సిగ్గు వలువల్ని విడిచెయ్యి
తలపుల తలుపులు తెరిచి
ఈ రాత్తిరి .... నాతో 
లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దాం రా!
పోగొట్టుకునేందుకు ఎమీ లేనప్పుడు ఉన్న
ఆనందం మాధుర్యమేంటో
రుచి చూపిస్తా!
ప్రియా!
మనం బ్రతకడానికి చాలినంత ఉంది నా వద్ద
తోటలో సుముల్లాస పరిమళాలమై బ్రతికేద్దాం రా!

Friday, February 15, 2013

తెలుసు నాకు


నా ప్రేయసి నాతో అంది
ఎదురుగా కూర్చుని .... నేను
ఆమె కళ్ళలోకి చూసినప్పుడు
"నీవు గొప్ప జ్ఞానిని
నీలో దివ్య తేజస్సుంది!" అని
ఆలోచిస్తే ....
ఎంతో బాధగా ఉంటుంది.
నేను జ్ఞానిని అని తెలుసుకోవడానికి
ఎంత పెద్ద మూల్యాన్ని
చెల్లించాల్సొచ్చిందో పరిగణలోకి తీసుకుంటే,
ఒక పది గ్రాముల
వివేకం, పరిజ్ఞానం కోసం పరితపన
ఎన్నెన్ని అనుభవరాహిత్య
పొరపాట్లకు కారణమో అని ఆలోచిస్తే
నాకు తెలుసు
తొలి అనుభవం .... ప్రేమ కోసం ,
నేను అక్కడా విఫలమయ్యాను
తొలిసారి తొలకరి భావనలు
ఆనందం, ఉల్లాసం, విడదీయలేని సంభావనలు
తెలుసుకునేసరికి ఆలశ్యం అయ్యింది.
వాస్తవిక సముద్రేక ప్రేమికుడ్నై
ప్రేమను బహుమానంగా పొందాను.
నాకు తెలుసు
మరణం ముగింపని
జీవితంపై దాని ప్రభావం
నా దృష్టిలో అది ఏమిటో
అది నా దాకా వస్తే ఏమౌతుందో అని
ప్రమాదాలకు దగ్గరగా మెదిలి తెలుసుకున్నాను.
గర్వం, అభిమానం, హోదా
జీవితంలో వాటి స్థానం,
ఆపేక్షలు ఆశయాలు ఆవేశాలు
సెగలు నానుంచి వెదజల్లుతూ ఉన్నా ....
సూచన లేని వినయంలా, 
ఒక రోజు పంచభూతాల్లో ఒకటైన భూమి ....
ఆరడుగుల స్థలంతో .... ఎదురుచూస్తుండటం నిజం! 

గుండెను తవ్వుతున్నాప్రేమను వెలికి తియ్యాలని,
ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం
ప్రపంచానికి .... నీకు తెలియాలని,
నేను గుండెను తవ్వుతున్నాను.
మనసు సున్నిత భావాల్ని వెలికితియ్యాలని
ప్రేమను తవ్వడం లేదు .... ప్రేమ కోసం కాదు
నమ్మకాన్ని ఋజువర్తనాన్ని వెలికితియ్యాలని
నీవు నన్ను ప్రేమించక్కర్లేదు!
నేను మాత్రం .....
గుండెను దున్ని సేద్యం చేసిన ఫలం ప్రేమను
స్వేచ్చగా ఎగరేస్తున్నాను.
ప్రేయసీ .... సాహసం చెయ్యక్కర్లేదు.
రెక్కలుంటే చాలు .... ఊహల్లో ఎగిరెళ్ళిపోడానికి
పిల్లా .... నేను గుండెను తవ్వుతున్నాను.
స్వచ్చత కోసం, మల్లె తెల్లదనం కోసం.
ఉచితంగా ఇస్తున్నాను .... తెల్ల పావురాన్నై ఎగిరొస్తున్నాను.
పోరీ .... నేను గుండెను తవ్వుతున్నాను.
సమర్పణాభావం మేలిమి బంగారం లాంతి
మనసెక్కడైనా దొరుకుతుందేమో అని
పొందేందుకు ఉండాల్సిన అర్హత .... నమ్మకం సంపూర్ణతలే
ఇవ్వగలననుకుంటేనే తీసుకో
పిల్లా .... పోరీ .... ప్రేయసీ ..... ప్రయత్నించు!
భలే చౌక బేరం .... నా ప్రేమ
నేను గుండెను తవ్వుతున్నాను.
స్వేదంతో శరీరం పరిమళాలు .... వెదజల్లుతూ
ప్రేమ మూల బీజం అదేనని .... విన్నవిస్తూ,
నిశ్శబ్దంగా .... నేను గుండెను తవ్వుతున్నాను.
శోధిస్తున్నాను. ప్రేమ మర్మం నేనే .... తెలుసుకోవాలని.

Thursday, February 14, 2013

నా కల, నా ప్రేమ

నా కల, నా ప్రేమ

ఆమె ....
నా ప్రేయసి
నా ప్రేమ.
నా కల,
నా కోసం
దివి నుండి దిగివచ్చిన
అప్సరస.
నిండు చందమామ
వెన్నెలలా
హృదయమంతా ఆ రూపమే
ఆమెకు దూరం
ఆలోచనే .... మనోభారం
నా ప్రతి పిలుపు
ప్రశ్నైతే
సమాధానం ఆమె.
నాతోనే ఆమె!
నా మదిలోనే
అనవరతము.
ఉదయం మంచు...లో
తడిసేవరకూ,
సూర్యుని చైతన్య రధం ....
బంగారు కిరణాల
వెచ్చదనం తగిలేవరకూ,
ఆమె, ఉండేది నాతోనే ....
నా ఆలోచనల్లోనే .....

నా మనసంతా నీవే!

(ప్రేమికుల దినోత్సవ శుభ సందర్భంగా)

ఆ మన్మథుడు
గురితప్పని దయలేని పుష్ప బాణం
గుండెను చీల్చేసింది
నా కళ్ళముందు నీవు మాత్రమే
నీ రూపమే కనిపిస్తుంది

స్వచ్చమైన
పాల వంటి మనసు
ప్రేమ విషం కలిసి కలుషితం అయ్యింది.
నీవు మాత్రమే కావాలని .... నీ హృదయంలో మాత్రమే
చోటు కావాలని మారాం చేస్తుంది.

ప్రేమ
ప్రత్యామ్నాయం
బహుమానం
ఒక ముద్దు అందుకోవాలని ఉంది
బదులుగా ఒక ముద్దు బదులియ్యాలని ఉంది

నేను అబద్దం ఆడటం లేదు.
అసహనంగా ఉన్నాను.
మన్మధుడి సుమబాణం ....
తాకిన క్షణం నుంచి,
నా మనసంతా నీవే .... నిన్నే ప్రేమిస్తున్నా!

అంతరంగం నన్ను
కుదుటబడనీయడం లేదు.
అంగీకారమా నీకు .... అని,
నా బహుమానాన్ని అందుకునేందుకు .....
బహుమానంగా .... ఓ ముద్దిచ్చేందుకు సిద్దమేనా అని,

నా కోసం వేచిచూస్తున్న నెచ్చెలి


పగటి ప్రతికూలతలకు విరామన్నిస్తూ ....
అప్పుడే
నడుం వాల్చి .... వెల్లికిలా
ముంచుకొస్తున్న నిద్ర ....
కళ్ళు మూతలు పడుతూ
ఎలాంటి హెచ్చరికలు లేకుండా కమ్ముకుపోతూ

నిద్దుర పిదప .... లోపల
నా కలల జీవితం .... అక్కడ,
స్వాగతం అంటూ ఎదురుచూస్తూ .... నీవు
అక్కడే పరిచయం .... తొలిచూపు అయస్కాతం
నా ప్రేమ .... నా ఆత్మ సహచరి .... మన కలయిక

చేతులు కట్టుకుని
రెక్కలు విప్పుకుని నీతో కలిసి గడిపిన
ముచ్చట్ల మురిపాల మధుర క్షణాలు
నా హృదయం తెరపై కదులుతూ
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మధుర దృశ్యాలు

దివ్య మధురానుభవాల్ని .... సొంతం చేసి
నీ కళ్ళ మెరుపు చూడాలని
నీతో సహచరించాలని .... కలల్లో మాత్రమే కాదు
వాస్తవంలో ..... సంసారంలో
నీవు నా ముంగిట ముగ్గులల్లు గృహలక్ష్మి కావాలని .... ఆశ.

అకస్మాతుగా ....
ఏ అలికిడో, ఏ పిలుపో, ఏ విశ్పోటమో ....
కలలోంచి నన్ను మేల్కొలిపిన క్షణాలు .... గుర్తుకొస్తూ 
అప్రయత్నంగా జారే కన్నీటి బొట్టు
బుగ్గలమించి .... రాతి గుండె మీద పడి బళ్ళుమనే శబ్దం .... అది

ఆ క్షణం నుంచి అసహనం
మెలుకువగా నే ఉండాలని .....
అలజడి, హైపర్టెన్షన్ ..... శరీరాన్ని కుదిపేస్తుంది.
నా గుండె .... ఎందుకో, తియ్యని బాధను,
తన పతనాన్ని తాను ..... కొనితెచ్చుకుంటున్నట్లనిపిస్తుంది.

ఔనూ! కలలోనే .... ఎందుకు?
ఇలలోనూ నేను, నీతో కలిసి జీవించొచ్చుగా!?
మన ఆలోచనలను సంతులనం చేసుకుని,
ఆర్ధిక స్వావలంబనం, నిండు జీవితం .... దిశ గా,
ఒక్కరుగా కలిసి జీవించొచ్చుగా .... అనిపిస్తుంది అప్పుడప్పుడూ

నా అంతరంగ లో ..... లోలోపల మాత్రం,
ఇంకా నా కలలు, ఎప్పటిలానే ....
అక్కడ, నీవు నాకోసం నిరీక్షిస్తుండటం
జారిపోయే కరిగిపోయే కల
ఇప్పటికీ ఓ కన్నీటి చుక్కై రాలుతుండటం .... నిజం!

కొన్ని నిజాలు అంతే!
ప్రియురాలి మనసులో ఉండడానికి
కలల్లో జీవితంలో .... సాహచర్యం సౌఖ్యం
సరిహద్దుల్ని తట్టడానికి .... కాళ్ళమీద నిలబడ్డానికి,
నీ ప్రేమను ఆశ్వాదించి, స్వర్గాన్ని స్వాగతించడానికి
నా మనసు చేసే ప్రయత్నం తపస్సు పేరే .... పురోగమనం!

Tuesday, February 12, 2013

పెదాలు దాటి రాని మాటలు


నా హృదయం
రోదిస్తుందని తెలుసు
నీవు ఎదురుగా లేవని
నీతో పంచుకోవాల్సిన ఎన్నో భావాలు
ఇంకా మిగిలే ఉన్నాయని

నీవు
నన్ను హింసిస్తున్నావు
నీ జ్ఞాపకాలతో గతం
మధురోహల మత్తు
నా నర నరాల్లో
దిగమింగుకోలేకపోతున్న ఊసులు

వయసు మీదపడుతూ
జీవితం సారం
అనుభవాలు ఇటుక రాళ్ళు
ఒకదానిపై ఒకటిగా పేరుకుపోతూ
భావోద్రేకపు పలుకులు కొన్ని
పెదాలపైనే మిగిలిపోతున్నాయి

జీవితం ఇంతేనా
అంతా మనోభావం .... ఒక ప్రేమేనా
ఒక అబద్దం ఒక అస్పష్టతేనా
ఒక అయోమయమేనా అని .... అడగాలి
అర్ధం తెలుసుకోవాలి అని
అక్షరాలు కొన్ని .....
అంతరంగలోనే ఆవిరైపోతున్నాయి

నేను భవిష్యత్తు వైపు
నిన్నను మించిన పురోగతి .... రేపు వైపు
కదుల్తూనే ఉన్నా!
నా హృదయం మాత్రం నిన్నలోనే
ఇప్పటికీ నీ ప్రేమ భావనల్లోనే
మధుర స్మృతుల్లోనే ..... రోదిస్తూనే
కన్నీటి ప్రతిబింబాలు .... భావాలు కొన్ని
మనసు గోడల్లోనే ఇంకిపోతున్నాయి!

Monday, February 11, 2013

మానవాళిని ప్రేమిస్తున్నా!


ఒక నమ్మకం!
ఒక కలిసి ప్రయాణించడం!
అపాయం చెయ్యని రాచపుండు .... దుర్గుణం!
కాలాన్ని తినేస్తూ .... కాలుడ్ని పరామర్శిస్తూ,
ఒదలరాని,
ఒదలలేని,
అనుసరించాల్సిన .... అమూల్య భావం!
ఉచితంగానే పొందేది.
అయినా,
కొనలేనిది.
విలువ కట్టలేనిది.
నా లాంటి,
నీలాంటి,
మనలాంటి .... ఎందరో
సముద్రాలు దాటి,
గగనసీమల్లో ప్రయాణించొచ్చి .... వెతుక్కునేది,
ఉచితమని మాత్రం కాదు.
మనసు పడి, 
ఇష్టపడి పొందాలనుకునే బహుమతి!
ఎందరి కళ్ళో పడి పొందాలనుకునే ఒక ప్రియ పోటీ భావం!
నేను పుట్టింది మాత్రం ....
అరుదైన ఆ ప్రేమ కోసమే!
ఎంత మూల్యాన్నైనా చెల్లించాలని ....
మనసు ఆరడిని దాచుకుని,
నా కళ్ళుంది. ఆ ప్రేమను చూడటానికే ....
ఆ ప్రేమ తోడుగా ....
దేశాంతరాలు తిరిగి రావాలని, 
ప్రేమంటే ఇదీ అని ....
ప్రపంచమంతా వెలుగెత్తి చెప్పాలని 
ఉరకలేసే ఉత్సాహం ....
ఉరుముతున్న ఆవేశం ....
ఆ ప్రేమ కోసమే .... నేను వేచి చూస్తుంది.
ఆ ప్రేమ కోసమే .... నేను వెదుకుతుంది.
ఆ ప్రేమ నా ప్రేమ
ఒక నమ్మకం ....
ఒక ఆరాటం!
ఒక ఆవేశం!
ఒక కలిసి ప్రయాణించడం ....
అపాయం చెయ్యని ....
ఒక చిత్రమైన వ్యాది .... దుర్గుణం!
తెలిసే,
ప్రేమిస్తున్నాను.
ప్రేమను ....
సాహచర్యాన్ని,
స్నేహ సుమ పరిమళాల్ని,
భావ సుమ సుఘందాలు పలువురికీ పంచాలని.

Wednesday, February 6, 2013

వేచి చూస్తుంది మృత్యువుచలనం లేని,
తెలియని,
నమ్మకం లేని
సంకేతం .... వేచి చూస్తుంది.
గౌరవ,
భయాందోళన,
అద్భుతం ....
ఒక జీవితం ....
అంతం కాబోతుందన్నట్లు.

లక్ష్యరహిత,
ఆశయరహిత,
కనికరము లేని ....
తప్పు మార్గం .... నడిచిన,
నిన్నటి స్వార్థపూరిత,
క్రూర ....
నిజాయితీ
గతం ఒకటి
ముగింపు ముంగిట్లో కొట్టుకోవడం

మీదపడి
కబళించాలని కమ్ముకొస్తున్న
మృత్యుసంకేతం కై
వేచి చూస్తూ ....
ఒక జీవితం
ముగింపు
మూలం చూస్తూ
కార్చుతున్న కన్నీళ్లు
చారలు .... గతం 
అకృత్యపు మనసు ఫలకంపై వెక్కిరిస్తూ

నొప్పిలేని,
ఆకర్షణీయం కాని,
అనామకుడి
మరణం ....
భవిష్యత్తు పై
ఆశ,
సున్నిత,
గౌరవప్రద
జీవితం ఆశించని దౌర్భాగ్యపు జీవితం

నీచ,
అస్థిమిత,
అసభ్య
దృష్టి కోణం గమ్యమై
అసహ్యమైన,
వికర్షణాత్మక,
క్రూరమైన
ముగింపు మృత్యువు
వేచి చూసి కాటేసిన నిజం
మున్సిపాలిటీ బండిలో సగటు మనిషి శవం!

Tuesday, February 5, 2013

ప్రేమ గాధభగ భగ మని చప్పుళ్ళు చేస్తూ,
అగ్ని .... జ్వాలలు,
మంటలు,
నీటితో చల్లార్చటం సాధ్యం కాని .... జ్వాలలు
మండుతూ,
మండిస్తూ,
కాల్చేస్తూ .... నా ఆత్మను,

మండే నిప్పు .... నీ ప్రేమ!
దహిస్తూ,
నా ఆత్మను ....
నా మనసు కోరికకు .... ప్రతిక్రియ
ద్వేషాగ్ని ....
నా అత్మను దహించేస్తూ,
చల్లదనం .... ఆరడం సంభవం కాదు అన్నట్లు,

ఒక అగ్ని,
ఒక జ్వాల,
ఒక మంట,
నీరు చల్లార్చలేని జ్వలనం(లావా లాంటి అని)
నా ఆత్మ ను కలచివేస్తూ,
కాల్చేస్తూ మరో .... ప్రణయ కావ్యం!

Monday, February 4, 2013

నా జీవితాన్ని స్పర్శిస్తావేమో అనిఒక మృదు సంతకం
ఒక చిహ్నం
హృదయాన్ని తట్టే లోతయిన ముద్ర ....
నిన్నే గుర్తుంచుకునేలా,
నీ గురించి మధుర భావనలు .... ఆలోచించేలా
నీ నవ్వు,
నీ తీపి వ్యక్తీకరణ,
మాధుర్యాన్ని తలచుకుంటుండేలా ....
నీవు నా జీవితాన్ని స్పర్శిస్తావేమో అని .... ఆశ!

ఒక వెచ్చని శాసనం ....
నీ వివేకం,
నా నడవడిక, ఆనందాన్ని .... నిర్దేశిస్తూ
నీ శ్రద్ధ .... నా జీవితంలో ప్రతిబింబించే,
స్పష్టమైన వివరణై ....
ఎప్పటికీ గుర్తుండిపోయేలా
ఆబగా, ఆతురతతో
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న
సమయం ఇదే అన్నంతగా
ఒక తీపి నిజానివై నీవు నన్ను తడిమేస్తావేమోఅని .... ఆశ!

ఒక ప్రేరణవై ....
జీవన దిక్చూచివై .... వెలుగువై
నీ ప్రేమకు బానిసను కాక తప్పని నమ్మకం
నీ చేతల్లో, నీ చూపుల్లో చూడటం
కల్పన కాని వాస్తవం
నా ఆశై,
నీ స్పర్శతో నీ జీవితం
నీ మనోభావనల్లో
నేనో ప్రత్యేక స్థానం .... పొంది
నీ  సంతోషానికి కారణం నేను కావల్సిరావాలని ..,. ఆశ!

Sunday, February 3, 2013

జీవితం కటినం

జీవితం కటినం

జీవించడం కష్టం అని చెప్పను.
కష్టసాధ్యం!
మనం నడుచుకుని,
మనం చూసే సజీవ సరళి అది.

సమశ్యలు, ప్రశ్నల వలయం జీవనం!
జీవితాన్ని వంతెనగా మార్చి,
ఆ వంతెన మించి
ఆవలి ఒడ్డును చేరే ప్రక్రియ జీవనం!

ప్రశ్నల సమాధానాలు
సమశ్యల పరిష్కారాలు ....
శ్రమిస్తేనే,
ఆలోచనల మాధ్యమంగానే సాధ్యం!

కష్టంలోనే ....
కష్ట సాధ్యంలోనే .... ఆనందం!
సోమరితనం, దాటేసేతనం .... ఫలాలనివ్వదు.
విజ్ఞులు చెప్పింది ఇదే .... జీవితాన్ని పరిపూర్ణంగా జీవించూ అనే,

జీవితం సులభం అని కాదు.
సులభం ఎప్పటికీ కాదు ....
సోమరితనాన్ని స్వాగతించడం,
సులభం కావాలని ఆశించడం .... మనల్ని మనం మోసగించుకోవడమే!

జీవించేందుకు పోరాడక తప్పదు.చేదు నిజం!
భయంకరము హానికరమైన సమాజంలో నేను
దిక్కులు ఆలోచిస్తూ,
చలికి ఒణుకుతూ,
నిలబడి ....
ఈ కాలంలో పుట్టల్సిన వాడివి కావు!
బంగారంలాంటి మనసు నీది!
అమ్మ మాటలు .... అమ్మలెప్పుడూ అంతే!

చిక్కని చీకటి,
కళ్ళుచించుకున్నా కనపడని
ప్రమాదకరమైన అర్ధరాత్రి!
నన్ను దూరంగా ఒదిలి వెళ్ళమనకు!
.....నా అభ్యర్ధన.
నాకు భయం లేదు.
నేను స్వేచ్చకోసం పోరాడతాను.
.....నా బింకపు మాటలు.

అకస్మాత్తుగా ఇలా ఒంటిమీది బట్టల్తో
.... ఇంట్లొంచి వెళ్ళమంటున్నావు!
మళ్ళీ ఆలోచించు!
నా గురించి కాదు, మీ గురించి ఆలోచించండి!
నా జీవితం ఎలా జీవించాలో నాకు తెలుసు.
పుట్టినప్పుడే
బ్రతకడం ఎలాగో నేర్చుకున్నాను.
చేపకు ఈదడం నేర్పక్కర్లేదు.

ఉగ్రవాదం వేరు,
క్రాంతి పదం, విప్లవవాదం వేరు!
నా భుజాల్లో శక్తికి కొదవ లేదు.
నా ఆలొచనల్ని,
నా నమ్మకాల్ని కాపాడుకోగలను.
నా నమ్మకం నాది!
పోరాడగలనని, విజయించగలనని .....
తెలుసు .... జీవించేందుకు పోరాడక తప్పదు అని.


నిర్నిబంధ ప్రేమ!మనసుభావనలు
మాటల్లో చెప్పక్కర్లేదు.
ఏ ప్రమాణాలు అవసరం లేదు.
సున్నిత దృష్టి కోణం ప్రేమ .... ఉంటే చాలు.
ఒక్కరుగా కలిసి
ఒక్కరై జీవిస్తూ,
ఒకే ఆశ, ఆశయం జీవనమై ....
కలలు .... కలిసి కంటూ,
బౌతికంగా ....
వ్యక్తులు ఇద్దరైనా
ఒకే ఆలోచనై,
ఒకే ఆత్మ, హృదయం లా ఉంటూ,
చచ్చేంతవరకూ చేతిలో చెయ్యి ....
చచ్చాక స్వర్గంలో తోడు
మళ్ళీ జన్ముంటే
బేషరతు సమర్పణాభావం .... ప్రేముంటే

అది నిర్నిబంధ ప్రేమ!