Wednesday, February 27, 2013

ఎవరో వస్తారని



ఎక్కడో దూరంగా
మిణుకుమిణుకు మంటూ
నిస్సహాయపు నవ్వు
నిర్లిప్తతను చీల్చుతూ
చిరు ప్రకాశాన్ని వెదజల్లుతుంది.
నా మది మాత్రం
నీవు రావాలి అని
నా కోసమైనా వస్తావని
నా నమ్మకం బ్రద్దలు కాకముందే
ఒక్కసారి వచ్చి
మళ్ళీ వెళ్ళినా సరే అని

మబ్బులు పట్టిన రోజు
చెట్ల కొమ్మల్లొంచి
బిడియపడుతూ తొంగిచూసి
పలుకరించే సూర్యుడిలా
నాతో ఉండేందుకు
వచ్చేందుకు
తటపటాయింపు మొహమాటం
పడతావేమో అనే
కొమ్మలు ఆకులు నరికేసుకుని
ఒంటరిగానే ఉంటున్నా

సామాజానికి వెయ్యి కళ్ళు
తప్పించుకోలేననిపిస్తుంది
నా భావనల్లోంచి నీ రూపాన్ని
పసికట్టేస్తుందేమో అని
ఎందుకో భయమేస్తుంది
బలహీనత నిలువెల్లా నాలో
నీరసం నిస్సత్తువ .... నీవు లేకే
చెట్లు, మొగ్గ ఉంటేనే
గాలయినా వీచేది.
పండైనా బలంగా ....
కొమ్మంచుకు వ్రేలాడేది.

పరిశీలనగా చూస్తున్నాను
గాలి వీస్తున్నట్లే ఉంటుంది
నీవు అందుబాటులో ఉండి
పలుకరిస్తున్న క్షణాల్లో ....
అయినా .... అప్పుడప్పుడూ అనిపిస్తుంది
నిజంగా నీవొస్తున్నావా అని
తప్పుడు కాంతి .... బూడిద కాదుకదా నా ఆశ అని
నా ఎండిన కళ్ళు
నా పగుళ్ల పెదవులు
రాతి గోడలు, కొండ రాళ్ళ మధ్య .... జీవనం
నాగరికత తెలియని నా కోసం
వచ్చి వెనుదిరుగుతావేమో అని

దృఢమైన ....
పారదర్శక
థర్మోప్లాస్టిక్ టోపీ వంటి ....
జీవితంలో కాంతిని వెదజల్లావు.
అయినా,
నీ తోడు లేక
ఎండకు ఎండిపోతూ
వానకు తడుస్తూ
నా ప్రేమ లేని జీవితం
సున్నితత్వం కోల్పోయింది.
ఇన్నేళ్ళుగా ఎదురుచూసా!
బాధతో తపిస్తూ
ఎదురుచూస్తూనే ఉన్నా .... నీవు లేవనే

No comments:

Post a Comment