Wednesday, February 20, 2013

దారి కొత్తది .... కఠినం జీవితం!



ఎంతో కష్టం
ఒడిదుడుకుల మయం .... జీవితం!
వర్తమానాన్ని
రేపును తినెయ్యాలని సూస్తున్న జ్ఞాపకాలను
మదిలోంచి తుడిచెయ్యాలనుకుంటున్నాను
నిన్నటి వరకూ
నడిచొచ్చిన
రహదారి
అంత సంతృప్తిగా లేదు.
ముళ్ళూ, రాళ్ళమయమై ....
తాత్సారం చెయ్యాలనుకోవడం లేదు.
సందేహాల్లేవు.
కాలంతో పోటీపడి కదలాలి.
సంశయం ....
సందేహం బ్రేకులు వెయ్యొద్దు! 
ఎలాగో తెలియదు.
నేను .... డ్రైవర్ని కాను.
జీవించేందుకు
ముందుకు కదలడం ....
అనివార్యం అని మాత్రం తెలుసు.
నిన్నటి ఆలోచనల్ని,
నిన్నటి ఆవేశాన్ని,
నిన్నటి దారుల్ని ....
వాస్తవికతతో సంతులనం చేసుకుని,
కదలక తప్పదు.
దారి కొత్తదే అయినా ....
నడవడం అలవాటౌతుంది.
సర్దుకుని నడుస్తాను.
సర్దుకుపోతాను అని కాదు
కొత్తదారిలో .....
చైతన్యం సౌజన్యం నన్ను కౌగిలించుకుని
స్వాగతించేందుకు ....
దారి కొత్తది.
నడక కొత్తదే .... అయినా
తమాయించుకుని నిలిచేందుకు ....
అడుగు ముందుకేస్తున్నాను.

No comments:

Post a Comment