Tuesday, February 26, 2013

సమాజాన్ని పీల్చెయ్యకు .... తోడై ఉండు!



కాలాన్ని
జీవితాన్నీ ఖర్చు చేస్తున్నావు.
ఖరీదైన కల్పనల కలలు కంటూ,

ఆ కలల్లోంచి
ఆ అద్భుత కల్పనల్లోంచి
వాస్తవం లోకి వెనక్కొచ్చెయ్యి!

నడమంత్రపు సిరి రావాలని
శీతల యంత్రాల గదుల్లో
కాలం గడిపెయ్యాలని ఆశిస్తున్నావు.

కృత్రిమ
యాంత్రిక జీవనం
చూసేందుకే భవ్యంగా ఉండేది.

నిజం నేస్తమా
ఆ వాతావరణం నీపై
చాలా ఎక్కువ వత్తిడిని పెంచేస్తుంది.

నీ వ్యక్తిత్వం
నీ మనోభావన ల్ని
పతనం దిశగా నడిపిస్తుంది.

కష్టపడకుండా వచ్చిందేదీ
నీతో ఉండదు.
అదృష్టమైనా అనుభూతైనా,

ఆ కల్పనల్లొంచి
ఆ కలల్లోంచి
బయటకు రావడం తప్పేమీ కాదు.

నీతి
నిజాయితీ అవుతుంది
నీ పేదరికం వాటా .... నీవు స్వీకరించు! 

నీకంటూ
నీదనే చరిత్రను
మంచి పేరును సాధించు! 

కలుపు మొకాల నుంచి
పంట మొక్కలకు
భూమి సారం లా ....

సమాజాన్ని పీల్చేసే
స్వార్ధం నుంచి
శ్రమ జీవికి ఫలితం దక్కేలా జీవించు!

No comments:

Post a Comment