Tuesday, February 26, 2013

అనుకోవచ్చేమో!


ఆత్మ సహచరులు ఆలోచనని
తొలి చూపు ప్రేమని.
నమ్మాలేని మనోస్థితికి .... తర్కానికి
ప్రత్యామ్నాయ తర్కాన్ని ఆలోచిస్తున్నా! 
ఇలానూ అనుకోవచ్చుగా అని,

అదృష్టవంతులు కొందరికి .... జీవితంలో ....
అనుకోకుండా ఎవరినైనా ఎదురుపడి వారిలో ప్రత్యేకత కనిపిస్తే,
వారే ఖచ్చితంగా .... సరైన తోడు తనకు అని అనిపిస్తే  ....
అలా అనిపించడానికి
ఆ వ్యక్తి పరిపూర్ణతో నీ పరిపూర్ణతో కారణం అనుకోకపోతే
.......
ఇద్దరి లోపాల్లో సామరశ్యత ఉండి
కలిపి ఏర్పాటు చేయబడ్డట్టు
ఒక విధంగా, ఆ లోపాలను సాహచర్యంలో
పూరించుకునే అవకాశం ఉన్నట్లు
కనిపించడం కారణం .... అనుకోవచ్చేమో!
రెండు వేర్వేరు జీవులు వారి వారి అస్తిత్వాలను కాపాడుకుంటూ
కలిసి తిరుగు అమరిక అని .... అనుకోవచ్చేమో!

No comments:

Post a Comment