Friday, February 15, 2013

గుండెను తవ్వుతున్నా



ప్రేమను వెలికి తియ్యాలని,
ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం
ప్రపంచానికి .... నీకు తెలియాలని,
నేను గుండెను తవ్వుతున్నాను.
మనసు సున్నిత భావాల్ని వెలికితియ్యాలని
ప్రేమను తవ్వడం లేదు .... ప్రేమ కోసం కాదు
నమ్మకాన్ని ఋజువర్తనాన్ని వెలికితియ్యాలని
నీవు నన్ను ప్రేమించక్కర్లేదు!
నేను మాత్రం .....
గుండెను దున్ని సేద్యం చేసిన ఫలం ప్రేమను
స్వేచ్చగా ఎగరేస్తున్నాను.
ప్రేయసీ .... సాహసం చెయ్యక్కర్లేదు.
రెక్కలుంటే చాలు .... ఊహల్లో ఎగిరెళ్ళిపోడానికి
పిల్లా .... నేను గుండెను తవ్వుతున్నాను.
స్వచ్చత కోసం, మల్లె తెల్లదనం కోసం.
ఉచితంగా ఇస్తున్నాను .... తెల్ల పావురాన్నై ఎగిరొస్తున్నాను.
పోరీ .... నేను గుండెను తవ్వుతున్నాను.
సమర్పణాభావం మేలిమి బంగారం లాంతి
మనసెక్కడైనా దొరుకుతుందేమో అని
పొందేందుకు ఉండాల్సిన అర్హత .... నమ్మకం సంపూర్ణతలే
ఇవ్వగలననుకుంటేనే తీసుకో
పిల్లా .... పోరీ .... ప్రేయసీ ..... ప్రయత్నించు!
భలే చౌక బేరం .... నా ప్రేమ
నేను గుండెను తవ్వుతున్నాను.
స్వేదంతో శరీరం పరిమళాలు .... వెదజల్లుతూ
ప్రేమ మూల బీజం అదేనని .... విన్నవిస్తూ,
నిశ్శబ్దంగా .... నేను గుండెను తవ్వుతున్నాను.
శోధిస్తున్నాను. ప్రేమ మర్మం నేనే .... తెలుసుకోవాలని.

No comments:

Post a Comment