Wednesday, April 30, 2014

అరణ్యరోధన





కాసింత దురంగా, లేడి కూన .... పచ్చదనం లో
గెంతులాడుతూ, నిశ్శబ్దం .... అక్కడ
కొలను నీరు నిలకడ గా ....
జరగబోతున్న దారుణం కు సూచన గా

ఆకశ్మికంగా సూదుల్లాంటి
చూపులు శరాలేవో దూసుకొచ్చి తెంచినట్లు
తెగిన చిన్న కొమ్మ
చిరు రెమ్మ కొలనులోకి జారి .... అరణ్య న్యాయమో ఏమో

దాహం మరిచి బిక్కబోయిన ప్రాణం
లేడి పలాయనం .... పులి ఆహారం
కొలనులో నీరు మాత్రం క్షణాల కదలిక పిదప
ఏమీ ఎరగనట్లు .... నిండుగా అద్దంలా నిశ్శబ్దం గా

Monday, April 28, 2014

శ్రామికుడు




కాలుతూ
అక్కడ
పరిసరాలు కాంతివంతమౌతూ 
అతనిలో
అణువు అణువులో కరిగి ఇందనమౌతున్న అనుభూతి
అతను
ఒక మండుతున్న
కొవ్వొత్తి 

ఊపిరి ఆడడం లేదు .... ఎందుకో




సరసన నీవు లేవు అను నిరాశ నిద్దుర కోల్పోయిన .... అస్తిత్వం
పాతాళం ఊబిలో పెనుగులాట
సముద్రగర్భం లో
ఊపిరాడని ఒత్తిడి .... సరిగ్గా శ్వాస ఆడని స్థితి

ఆరాటం ఎంత పడినా, పోరాటం ఎంత చేసినా
అలవికాని
ఇప్పుడో ఎప్పుడో
ఓటమిపాలు కాక తప్పని, లొంగుబాటు సంశయము

అక్కడైనా, ఎక్కడైనా
నా మది చీకటి నైరాశ్యాన్ని చిద్రం చేయగల
ఒకే ఒక్క కాంతి కిరణం
నీవు సమీపంలో ఉన్నావనే భావన పోరాటం కొనసాగింపు

ఉపరితలం సమీపంలోనే అని
తెలిపి నంత బలం .... నీ సాన్నిహిత్యం
నిన్ను చూడబోతున్న ఆశ
శ్వాస మరింతగా బిగబట్టగలిగే పెనుగులాట

కొన్ని క్షణాలైనా నిన్ను చూడగలగడం
శ్వాస కోసం ఉపరితలం కు చేరి శ్వాసించి
పోరాడేందుకు తిరిగి సముద్రగర్భం లోకి రాగలగడమే
నీ ఆలోచనలతో సాగడం .... ఒత్తిడి ని ఎదుర్కునే నిబ్బరాన్ని పొందడమే

నీ చిరునవ్వు రూపం లీలగానైనా .... ఊహల్లో లేకపోతే
సముద్రం లోతుల్లో, శూన్యత అట్టడుగు న
ప్రాణవాయువును, నీ ప్రేమ ఆక్సీజన్ ను కోల్పోయిన
ఒంటరిని అనే భావన .... అయోమయం నీడలు నన్ను మింగెయ్యడమే

Saturday, April 26, 2014

వెన్నెల వేళ




ఎటుచూసినా
అందం, పరిమళం
మనోహరం గా
ఉంది
ప్రకృతి

విచారమేమో
నా మది
గోడలపై
చెరగని
సిరాలా

నీవు
తోడుగా
లేవనే
జ్ఞాపకాలు
అతుక్కుపోయి

ఇప్పుడు
నువ్వు ....
ఇంత అందం గా
మునుపెన్నడూ
లేవు.

నాకు
మళ్ళీ
ఇలాంటి సందర్బం
ఎప్పటికీ
ఎదురు కాదేమో ....

కాలం
నువ్విక్కడ 
మరి కాసేపు
ఆగేలా ఆగితే
ఎంత బాగుణ్ణో

అస్తిమితత నాలో














ఈ మధ్య
పెద్ద పెద్ద మాటలు
అతి వినయ పద అస్రముల విసురులు .... 
ఎందుకో
సంక్షిప్త క్లుప్త 
పదాలతో సరిపెట్టగలనని తెలిసీ

లోలోపల
నాలో అంతర్లీనంగా నన్ను వేదిస్తూ 
ఈ సంక్లిష్ట రూప ప్రశ్నల శరాలు .... 
ఎందుకో
రాయబోయే ప్రశ్నకు రాబోయే 
సమాధానం ముందుగానే తెలిసీ

పెదవులు త్రుళ్ళుతూ
ఈ ప్రత్యక్ష పరోక్ష ప్రకోపనలు
అక్షర అరుపుల శబ్దవిన్యాసాలు చేస్తుంది .... 
ఎందుకో
చిన్ని చిరునవ్వుతో మనోగతం 
అవగతం చెయ్యగలనని తెలిసీ

ఎందుకో
ఈ అస్తిమితత లాంటి 
అసహనపు 
తొందరపాటు లక్షణాలు ఎన్నో నాలో

ఎక్కడున్నావో అని




నిన్ను పిలుస్తున్నాను.
గాలిలోకి, శున్యంలోకి నీ నామాన్ని ఊదుతున్నాను.
కళ్ళలోకి
నా గుండె లోతుల్లోకి
నన్నులోకి తదేకంగా చూసుకుంటున్నాను.

నటరాజులా నర్తిస్తూ అక్కడ నీవున్నావేమో అని
నీవు నన్ను స్పర్శిస్తున్నట్లుంది.
చెమటగందం వాసనేదో ....
నీవు సమీపం లో ఉన్నట్లు .... నీ కురుల వాసనలవిగో!
చిత్రమైన అనుభూతిలోకి జారిపోతున్నాను.

నన్ను నిన్నులోకి లాగేసుకుంటూ
నిన్ను లోని
నా గుండెలోకి దూరి, రక్త కణాల్లో .... అలజడి వై, ఓ చెలీ
న్యాయమా నీకిది!
గాలిలోనూ శూన్యంలోనూ నిన్నే పిలుస్తున్నాను
ఎక్కడున్నావో అని.

ముగ్ద మందారం




ఉదయాన్నే స్నేహితురాలి పిలుపు. "లాస్యా! కవిత వాళ్ళింట్లో ఫంక్షన్ కు వెళ్ళొద్దామా! నేనొస్తున్నాను. సిద్దంగా ఉండు" అని,
తప్పకుండా వెళ్ళాలి. పొరపాటున కూడా ఆలశ్యం చేయరాదు .... అతను అక్కడే ఉంటాడు. తప్పకుండా కనిపిస్తాడు. వస్తాడు ఫంక్షన్ కు అనుకుంది.
తన హృదయం దొంగిలించి, కలల్లో మాత్రమె వచ్చి పలుకరించి కవ్వించి మాయమయ్యే మనోహర్. కవితకు కజిన్. అతని చేత క్షమార్పణలు చెప్పించుకోవాలి ఎట్టిపరిస్థితి లోనూ .... అనుకుంది.

ఆమె వ్యక్తిత్వం లోని సత్యబామ లో గర్వం .... ఆ భావన. అందరిలాంటి అమ్మాయి కాను తను అని, బాపు గీసిన బొమ్మ అందం తను అని.
తను, తన అనుకున్న మనిషి తననే సర్వస్వం అనుకోక తప్పని ఆకర్షణా శక్తి తనది అనే స్నేహితురాళ్ళ మాటలు గుర్తు కొచ్చాయి.

నవ్వుకుంది. ఏదో అద్భుతం జరుగుతుంది. తప్పదు. ఆతను ఎంతడివాడైనా ఎదురుపడక తప్పదు. తనను అంగీకరించక తప్పదు అనుకుంది. దొంగిలించిన హృదయానికి ప్రత్యామ్నాయం గా తన హృదయాన్ని మూల్యంగా చెల్లించుకోక తప్పదు. అతను ఎదురుపడతాడు. కాసేపు బెట్టు చేసినా పిదప తనచుట్టే తిరగక తప్పదు. తన సొంతం అవ్వక .... తప్పదు అనుకుంది.

స్నేహితురాలి కారు లో ఎఫ్ ఎం రేడియోలొంచి మాంద్రంగా లలిత సంగీతం వినిపిస్తుంది.
వానిటీ బాగ్ లోని అద్దం లో తనను తాను మరోసారి చూసుకుంది లాస్య.
సాధారణం కన్నా బాగున్నాననిపించింది. సర్వం సానుకూలంగానే జరుతుంది అనే అనుభూతి ఆలోచనల మేఘాలు .... అర్ధం కాని స్థితి చుట్టూ.

తెలియని తడబాటు ....

తడబడుతూనే ఫంక్షన్ జరుగుతున్న హాల్ లోకి అడుగుపెట్టింది లాస్య. కవిత ఎదురొచ్చింది. హాలంతా హడావుడీ. అతిదులు బందుమిత్రులతో హాలంతా సందడి సందడిగా ఉంది.
స్నేహితురాళ్ళ పలుకరింపులు దెప్పిపొడుపులను సమాధానం ఇస్తూ అన్యాపదేశం గా హాలంతా కలియ చూసింది.

దూరం గా మనోహర్ ....
అతన్ని చూస్తూనే లాస్య గుండె వేగంగా కొట్టుకుంది.

అతను ఆమెను చూస్తూనే ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు అడుగు ముందుకేసాడు.

ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా. కనుల చాలనం చేసాడు. ఏదో అన్నాడు. సరిగ్గా వినిపించలేదు.

లాస్య మనసు గాలిలో తేలుతూ పోగొట్టుకున్న హృదయమే పలుకరించిన భావన .... "కుశలమా లాస్యా!" అని పిలిచినట్లై,

లాస్య మనసు మొగ్గై ఆమె పెదవులు ముడుచుకుపోయాయి. మాట్లాడలేకపోయింది. ఆ పలకని పలుకుల భావనల్ని స్వాగతిస్తున్నట్లు అతని కళ్ళు గుసగుసలాడాయి .... ఆమెతో జీవన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు,

లాస్య మనసు గాలిలో తేలి, గాలిమబ్బులేవో చెల్లాచెదురవుతున్నట్లు అనిపించింది ఆ క్షణం లో
ఎంత మనోహరమో కదా .... జీవితం అని .... అర్ధం చేసుకునే మనసు తోడుంటే అని.

Thursday, April 24, 2014

ఒక సామాన్యుడ్ని




 









ఎంతవరకూ విచ్చిన్నం చెయ్యొచ్చో
పరిశీలించి చూస్తున్నట్లుంది.
పదాలు
భావాలను అసంబద్దంగా రాసి,
కూడికలు
తీసివేతల గణాంకాలు వేసి,
సెకన్లు
నిముషాలు,
గడియలను ఒలిచి,
గతించిన
అనర్ధపు ఆలోచనల
అవిరామ హస్తాలు
ప్రతిదీ కదిలిస్తుంటే ....
గుండె వేగంగా కొట్టుకుంటున్నా
మంచు దట్టంగా కురుస్తున్నా
సంబందం లేనట్లు
టివీ లో
చూడని చానల్స్ ను
మారుస్తూ
ఎర్రబడ్డ కళ్ళతో .... నేను.

Wednesday, April 23, 2014

రాణివాసం




లోలో అనుకూల భావనలు
అంతా సవ్యంగానే జరుగుతుంది
సర్ధుకుందుకు సమయం అవసరం అని
కలలో .... అతని బాహువుల్లో
అనుకుంటూ
ఎలాంటి హానీ జరగదు అని

కానీ
లోలో ఎక్కడో ఏదో
గాయం సలుపుతున్న భావన
చీకటి వృత్తం లా మారి సుడులు తిరుగుతున్న
నొప్పి
అసూయ, వింత ఆరాటం

అతనికి కనపడనీయకుండా
పడుతున్న జాగ్రత్త
స్వేచ్చను పొందేందుకు చేసే ప్రయత్నం
అతని సమీపం లో
కలల కౌగిలిలో ఆమె పొందుతున్న
చిత్రమైన అనుభూతి 




ఆ అనుభూతి ప్రభావాన్ని
తప్పు అర్ధం తీసుకోరాదని
వీలైనంత తొందరగా
మది మురికిని శుభ్రం చేసుకోవాలని
ప్రేమ భావనలను 
వీలైనంతగా తగ్గించుకోవాలనే ప్రయత్నం

చిత్రం! జీవితం
నొప్పి, బాధలమయం
బాధలో తియ్యదనం వెదుక్కోవడం
మరొక్కసారి
మోస, న్యాయ మీమాంస లో
మనసును పిచ్చిదాన్ని గా మార్చుకోవడం

Tuesday, April 22, 2014

కన్నుల బాసలేమంటున్నాయో?




రాత్తిరివేళ, 
తెల్లని పిండారబోసిన ఆ వెన్నెల కాంతి లో
డాబా పై, పడకమంచం మీద నిదురిస్తూ .... అతను.

మూసుకునున్న 
అతని కనురెప్పల వైపే తదేకం గా చూస్తూ .... ఆమె
పగలు పడిన కష్టాన్ని మరిచిపోవడం .... అలవాటై 

అతని ముఖం లో .... ఆమెకు
ప్రశాంతత, నిర్మలత్వం .... ఏదో అందం
వైశిష్ట్యం కనిపిస్తున్నాయి.

ఆమెకు తెలుసు,
నిద్రలేస్తూ చూస్తూనే .... 
తనను ద్వేషవాక్కులతో బాధిస్తాడని.

అయినా, 
అతనంటే అపరిమిత ప్రేమ .... 

అలా నిద్రపోతూ ఉన్న వేళల్లో 
మూసుకునున్న ఆ కనురెప్పల్ని చూస్తూ ఆనందిస్తూ
ఎంతో పవిత్రము, నిర్మలము, మధురము తమ ప్రేమ అనుకుంటూ 



కాలం ఎవరి కోసమూ ఆగదని తెలుసు .... 
సూర్యోదయం అవుతుందని, అతను నిద్దుర లేస్తాడని తెలుసు 

అబద్దాలు చెప్పడానికే జీవిస్తున్నట్లు 
ఒక అబద్దపు జీవనారంభం అవుతుందని తెలుసు

కానీ .... 
వద్దు, కాదు అనుకోలేదు. 

విశ్రమిమించే వేళ ఆమె కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది 
ఆతని ముఖం లో అమాయకత్వం, నిద్దురలో ఆ ప్రశాంతత 
ఏ లాంటి కలలు కంటూ ఉన్నాడో ..... తనతో అనుకునే నమ్మకం

ఉదయం, మేల్కొంటూనే 
అతను ఎలాగూ బెదిరిస్తాడు హింసిస్తాడని తెలిసు! 
అయినా, నిదురించే వేళలో నిద్దురలో 
అతనిది నిర్మలమైన ప్రేమ అని, ఆ ఆశే బంధమైన ప్రాకృతం .... ఆమె

Sunday, April 20, 2014

రైతు కూలీకి .... కోపం వస్తే?




ఒళ్ళు దాచుకోలేదు ఏనాడూ .... రైతు కూలీని. 
శ్రమించాను. సేద్యం చేసాను 
ఆఖరి చెమటబొట్టు ఆవిరయ్యేవరకూ 
.........
మనిషిగా జీవించేందుకే, 
...........
నీరసం ఫలితం అయి
అడ్డం తిరగాలనిపించి
నిలదీసాను. కష్టానికి ఫలితం యిమ్మని. 
..........
బయటకు గెంటాడు. 
కొట్టించాడు. 
...........
నేనూ కొట్టాను. 
తల చిట్లింది. 
..........
పాపం! 
ఎండెరుగని ప్రాణం నొప్పిని తట్టుకోలేక .... 
అతను దొర
............
ఇప్పుడు, తప్పు చేసాననే బాధ 
నాలో .... 
నేను చేసింది తప్పేమో అనే నేర భావన, 

Saturday, April 19, 2014

విన్నవించుకుంటున్నా నీకే .... ఓ ప్రియా!





మన్నించకు .... నన్ను
బంధించు!
మరణం సంకెళ్ళతో .... నా ఆత్మను,
పీల్చేసెయ్యి .... ఊపిరితిత్తుల లోని ప్రాణవాయువును
వేగం గా
ఎలాంటి ప్రతిఘటనకు అవకాశం లేకుండా

ఈ గుండె
రక్తనాళాలను కత్తిరించు
నా మనసు భావనల ఆటుపోటుల
విపరీత స్పందనలను
చంపెయ్యి .... ఆపేసి,
మంచునూ మండించే ఈ ప్రేమ జ్వాలలను.
 
ఏదైనా దుర్మార్గం
ఏదైనా చెడును చేసెయ్యి .... ఓ ప్రియా!
విన్నవించుకుంటున్నా నీకే
నన్ను పూర్తిగా
తీసేసుకోమ్మని
నా హృదయం లోతుల నేలమళిగల్లోంచి



ఈ తపనలు
ఈ మోహ రాగ అభిరుచులను
కడిగి, తుడిచి .... ఆరవెయ్యి
కామం ఆలోచనలను బూడిదలా కాల్చి
పూర్తిగా నన్ను ఖాళీ చేసేసి
అగ్నిపునీతుడ్ని చెయ్యి .... ఓ ప్రియా!

Friday, April 18, 2014

మరణమూ .... పరిణామ క్రమంలో భాగమే!?


















అది నేనే కావొచ్చు! 
మరణించాక నా కోసం నీవు 
కన్నీళ్ళు వృధా చెసుకోవద్దు! 
అగ్ని లో అస్తిత్వం కోల్పోబోతున్న నేను 
నిన్ను చూడలేను. 
నిన్ను వినలేను. 
ఉపయోగంలేని, 
ఆశించని లక్షణాల
అతి ప్రవర్తనతో కాలాన్ని కలుషితం చేసుకోకు!? 
నీ ముందు రోజుల గురించి ఆలోచించుకో!

సమీపం లో, అందుబాటులో 
నేను లేనప్పుడు, 
సేద్యం జరగకపోవడం సరి కాదు.
కాలంతో పాటు 
సృష్టీ, మార్పూ సహజంగానే జరగాలి 
పూలు వికశించి పరిమళిస్తు, 
ఋతువులు సజావుగా వస్తూ .... ఉండాలి.
ఎవరు గతించినా 
పక్షులు చెట్లకు గూళ్ళు కట్టి 
పక్షి పిల్లల ఆహారం కోసం 
గగనం లో విహరించడం మానవన్నది నిజం.

వలసపక్షులు 
ఎక్కడో పుట్టి, మరెక్కడో జీవిస్తున్నట్లు 
రాలిన ఆకులు 
నేలను సారవంతం చేస్తున్నట్లు
కైలాసం నుండి జారి 
దరిత్రిని పావనం చేస్తూ, 
కొండలు, లోయలు, అరణ్యాల్లో పారి నదులు 
తమ కదలికలతో
భువిని సశ్యశ్యామలం చేసి,
రైతు కూలి స్వేదంను .... కలుపుకుని 
సముద్రం దిశగా సాగుతుండటం చూడు! 

ఊరవతల అడవుల్లో 
క్రూర మృగాల అరుపులు ఏడుపులు 
వినిపించే వేళ లో.
చీకటి చుట్టు ముట్టి 
మనిషి కాల్పనిక జగత్తులో విహారించి
ఆరంభమయ్యే సృష్టి కార్యం 
సహజీవన ధర్మాన్ని గుర్తుచేస్తూ
చలికాలం లో 
ఒక పురుషుడు 
ఒక స్త్రీ జీవన సాంగత్యం కోసం 
తనలోని బ్రహ్మ తలపెట్టిన సృష్టి కార్యం 
నిర్వహణ పరిణామ క్రమమే మరో జన్మ

కాలము, ప్రకృతి .... కదులుతూ, మారుతూ 
వయసొచ్చి నేను మరణించొచ్చు. కానీ  
ఈ సీతాకోక చిలుకలు, తేనెటీగలు 
ఇక్కడే ఉంటాయి.
వేసవి లో వృక్షాలు ఫలాలు కాస్తూ 
ఎడారులలో వర్షాలు కురుస్తూ 
ఈ సృష్టికార్యం ఇలా జరుగుతూనే ఉంటుంది.
ఆలోచిస్తే అర్ధం అవుతుంది. 
కాలగతిన నేను 
ఒక మరిచిపోదగిన అస్తిత్వాన్ని మాత్రమే అని
రేపటి రోజు ఒక కొత్త ఆలోచన ఆవిర్భావానికీ 
ఒక కొత్త జీవం, అస్తిత్వ అవకాశానికీ కారణాన్ని మాత్రమే అని

Thursday, April 17, 2014

ఎడారి వాన చినుకు











అవిగో .... బంజరు పడీదులు
వెచ్చని గాలి, పచ్చని 
పూచిన పత్రహరితం 
గడ్డిపూల పానుపు పలుకరింపులు 
చూడగలిగిన కళ్ళకు కనిపిస్తుంది 
ఆ ప్రేమ పూలవనం

అదుగో .... ఆ తేయాకు తోటల 
తాజా పరిమళాలలో 
నిన్ను కన్న భూమి తల్లి కన్నుల కలలలో
వింత కాల్పనిక జానపద శ్రావ్య రాగం 
ప్రకృతి ఆలాపనలవిగో 

నీకు నీవు చీకటిమయం అవుతున్నావు 
నీ చూపుల వెదుకులాటంతా 
అనాశక్తత, నిరాశ 
నిట్టుర్పుల నీడలలోనే 
అమావాశ్య రాత్తిరి అంధకారం లోనే 

కానీ, ఈ భూప్రపంచం లో ఒక ప్రదేశం .... నీ ఇల్లు
అక్కడ ప్రేమ, శాంతి, సహనం 
నీ జీవన తపోదనం 
ఎడారి సరోవరం ఉంది చూడు
అది నీ చెలి సాహచర్యం వొడిలోనే 

Wednesday, April 16, 2014

జ్ఞాపకాల రాతల్లో మనం

















రేత్తిరంతా 
ఆరు బయట 
వెన్నెల లో వాలు కుర్చీలో 
వాలి
నీవు మరిచిన 
మన సాన్నిహిత్యం
జ్ఞాపకాలు 
మది పొరల్లో రాసుకుంటూ ....
తెలుసా! 
నరాల లో రక్తోదృతిని, 
తగ్గించుకోగలిగానని 
ఆ విధంగా 
నిజాయితీగా ఉండగలిగానని 

కాలం ఇరుసులో ఇందనాణువులం




అక్షరాలు, వర్ణాలు ఎన్నో 
నేలమీద పేరుకుని ఉన్నా .... 
పట్టించుకోని
మౌనం మాత్రమే నివశిస్తూ
ఎవరూ లేరన్నట్లు .... 
ఇక్కడ
ప్రతి ఉదయమూ పాచిముఖం 
పడకమంచం ను పలుకరిస్తూ 
పడక కాఫీ 
కొద్ది సేపట్లో
గూళ్ళు జారే బరువులు 
భుజానేసుకుని
పాటశాలకు బార్లు తీరే 
పసి పావురాల బై బై లు
గోడమీద గడియారం ముల్లుల్లా .... 
యదావిది 
కాలాతీతం కాని ఆహారం కోసం 
వాకిట్లో కుక్కపిల్ల చేసే ఆర్బాటమూ 
ఒక్క ప్రశ్నించడం మాత్రమే తెలియని .... 
జగతి లో


జవితం ఒక యంత్రం! 
సమాజం ఒక యంత్రాలయం

Tuesday, April 15, 2014

అనూహ్య ఆశయం




సరైన సమయమే అని
సన్నద్ధుడ్ని అవుతున్నాను.
సూటిగా
ఈ చెట్లూ, పుట్టల మధ్య గా
తూరుపు దిశగా కదలాలని 
కొండవతల పొద్దు 
ప్రకాశం వెదజల్లుతూ ప్రపంచాన్ని
తొంగిచూసే వేళ కావొస్తుంది
ఆ వెలుగు, ఆ ప్రకాశం లో
ఒక అణువునై ఉండిపోవామని
మనసు ఉవ్వీళ్ళూరుతుంది.

కనిపించీ కనిపించని
సుప్రభాత వేళ 
అన్నీ నేను లా
ఆ వింత, వినూత్న, అనూహ్య ప్రదేశం లో
కాలానికి మాత్రమే తెలిసిన
ఆ గ్రహ ఉపరితలం పై
అందం, ఆహ్లాదం
ఆరోగ్యాన్ని ప్రతిష్టిద్దామని
ఆ విచ్చుకున్న ఆకాశం
ద్వారాలు తెరుచుకుని
అందానికే అందమైన నిర్వచనం
అయస్కాంత శక్తిని పొందుదామని

ముందుగా ఈ సమాజం
నన్ను అర్ధం చేసుకుంటే బాగుణ్ణు.
నాకు సమాజం అంటే ఇష్టం
విపరీత గౌరవం! 
కానీ,
ఈ సమాజం గోడలే .... ఇప్పుడు
నా చుట్టూ ప్రాకారాలై
నా మదిలో చీకట్లు కమ్ముకుంటున్నాయి.
కేవలం
నేను తనను 
అపరిమితం గా
జీవితానికన్నా ఎక్కువగా
ప్రేమిస్తున్నానని తెలియపర్చాలని ఉంది.



నాకు, కొంత వెసులుబాటు
ఉద్యానవనం వాతావరణం
శ్వాసించేందుకు స్వేచ్చ కావాలి.
ఊరూరా తిరిగి
కనిపించని పిచ్చివాదన అస్పష్టతల
అయోమయాన్ని ఎదుర్కొని
చీకటి వెలుగుల సరిహద్దుల్లో
తప్పును
ఒప్పు కాకుండా వెలుగులు ప్రసరిస్తూ
బాధ, గాయాలను మానిపే
ఔషదాన్ని కావాలని .... ఉంది.
అందరూ ఆశించే అందం
ఆహ్లాదాన్ని కావాలనే ఆకాంక్ష ఉంది.


Monday, April 14, 2014

నా అను బంధం



















అప్పుడప్పుడూ 
ఎంతో సుతారంగా, సున్నితంగా 
నిన్ను దగ్గరకు తీసుకుంటాను. 
ముద్దాడాలనిపించి,
నీవు సిగ్గుపడతావు. 
ఊపిరాడని కొన్ని సందర్భాల్లో 
నీవు ఉక్కిరిబిక్కిరై బాధపడి
భయానక భావనల చీకటి 
పూర్తిగా నీలోకి వ్యాపించి
నిన్ను చుట్టుముట్టినప్పుడు 
నీవు, 
బాధను దరించిన వన్య స్త్రీ లా 
దిగులుకూడును తింటున్నట్లు ఉంటావు. 
అలాంటప్పుడు ఎప్పుడైనా 
ముద్దాడినా, దగ్గరకు తీసుకున్నా 
చెమట ఉప్పదనమో 
రక్తం జిగురుదనమో రుచి అయ్యి 
నీ ముఖాన్ని సున్నితంగా 
నా అరచేతుల్తో పొదువుకుని తడిమి 
నీలోని విచారాన్ని పారద్రోలాలనిపిస్తుంటే
నా అనుబంధాన్ని ఏమంటారో .... మరి?

ఇది అబద్దం అయితే ఎంత బాగుణ్ణు
















ఒక కవిత రాసేందుకు ఉపక్రమించాను 
నీ హృదయానికి హత్తుకుపోయేలా 
గాలికి కూడా చోటు దొరకనంత ఘాడంగా 
చేరువవ్వాలని 

కానీ, 

దూరం మరీ విశాలమయ్యింది. 
నిజం .... నీ కళ్ళు అంత లోతనుకోలేదు. 
స్పర్శించాలనే ఆశ ఆశగానే మిగిలి నిన్ను చేరలేక, 
నా లోకి లాక్కోలేక .... అపరిష్కృతం గానే మిగిలిపోయి 

సహజం















పూలపానుపుపై 
నా తలలో నా ఆలోచనల్లో నన్ను నిలదీస్తూ 
కొంటెగా .... నవ్వులు రువ్వుతుంది నీ రూపమే
నిద్దుర నాకు తోడు రానంటుంది ....
......,
ఎందుకో అనిపిస్తుంది 
నీవు, స్థిమితంగా కూర్చుని,
నా హృదయం తో ....
ఆటాడుకుంటూ ఉన్నావేమో అని. 
ఆ ప్రభావమే నన్నిలా తపించేలా చేస్తుంది అని. 
తెలుసుగా చెలీ .... అది న్యాయం కాదు.

కేవలం 
ఒక ఆటే ప్రేమ అని .... అనుకోలేను.
చిలికి చిలికి జల్లు గాలివానైనట్లు
ప్రేమ జూదం 
ఆకర్షణల పాచికల ఆటలో .... నన్నోడి 
అధర్మంగా నీకు దాసుడ్ని అయ్యానని.
అలా ఆలోచిస్తే చాలా కష్టం గా ఉంటుంది. 
అయినా, 
నిజం గా నా ఓటమి 
నిన్ను సంతోషంగా ఉంచగలిగితే 
ఆ ఆనందం చాలదూ .... ఈ జీవన సాఫల్యానికి

నేను కలలు కన్నది నిన్నే
నిజం చెబుతున్నా! 
నీ ప్రేమ లేని అస్తిత్వం .... లేదు నాకు. 
నీలోనే నివశిస్తూ 
నిన్నే నేను కలలు కంటుంది,
నేను పూజిస్తుంది, 
జీవిస్తుంది, 
నిన్ను ప్రాప్తించుకునేందుకే .... అని నీకు తెలుసు!

ఒంటి స్తంభము మేడలో .... 
ఒంటరిగా ముస్తాబించుకుని
మేనువాల్చినా  
ఎందుకో నిద్దుర రాదు. 
టేప్ రికార్డర్ లొంచి మంద్రం గా వడపోసినట్లు 
ఒకప్పటి ప్రేమ జంట, మనం .... చెట్టాపట్టాలేస్తూ 
పాడుకున్న పాటల సంగీతం వినిపిస్తూ
ఆ నిన్నటి నిజం 
తుడిచెయ్యలేని గతం 
జ్ఞాపకం హృదయాన్ని స్పృశిస్తుంటే

నా జీవన ప్రశాంతతను నిన్నను ..... నిన్ను,
మరిచిపోలేకపోతున్నాను!? 
ప్రేమకు అర్ధం తెలిపి, 
బాష్యం చెప్పింది నీవే అన్న నిజాన్ని. 
జీవించడానికి .... ఒక ఆశవై, ఒక నమ్మకానివై
అనిశ్చితి, అపనమ్మకం గడియల్లో ....
నిర్వీర్యుడ్నైన క్షణాల్లో ....
ధైర్యానివై,
పురోగమించేందుకు తోడుగా నిలబడ్డ నీ కోసం
కలలో ఎదురుచూడటం
సహజమే కదూ!
ఈ జీవనంలో, పూజ, గమ్యం నీవు కావడం!

Sunday, April 13, 2014

అతను, ఒక కవి




అక్షర ఖడ్గాలు
అనూహ్య
వైవిధ్య భరిత 
అద్భుత పద శరాలు
హిమవన్నఘాన్ని మించిన
ఆదర్శభావనలు
వెన్నుతడుతూ
కళ్ళముందు
మెరిసి మాయమైపోతుంటాయి.

అప్పుడప్పుడూ
విప్లవ
భావనల స్వేదం తో మది
నేల తడిసి
ఉత్తుత్తి వాగ్దానాలు .... అపనమ్మకాల
ఎదురుదెబ్బలు తాకిడికి
మట్టిలో రాలిన మాణిక్యాల కోసం
మోకాళ్ళమీద కూర్చుని
వెదుక్కున్నా .... అన్నీ అవశేషాలే

కాలి
కమిలిపోయిన ఆ ఆదర్శాలు
ఆ చవకబారు మాటల
చైతన్యమెరుగని బండరాళ్ళు
కొన్ని ....
మది గోడకు కొట్టుకుని
చెలరేగే .... సంఘర్షణ ల
ఆదర్శపుటాలోచనల
రతనాలు కనుగొనాలనే .... ఆశ

అతనిలోని ఆవేశం .... భావన
ఒక అందమైన వచనం గానో
ఏదైనా
ఉత్ప్రేక్ష, ఉపమాలంకారం గానో కనబడగానే
అది ఒక ప్రేరణ అయి
ఆ క్షణం లో
బంగారు పడీదుల్లో
అమృతం కురిసి
ఆది దేవతను కలిసిన ఆనందం .... అతనిలో 



   
అతనిది అంతం లేని
వెదుకులాటే ఎప్పుడూ
ఏ వనం లో నైనా
ఏ పడీదులో నైనా
కార్యరూపం దాల్చని, కాల్చలేని
పిచ్చి బంగారం
ఆచరణ యోగ్యం కాని
ఆదర్శాల కలలను కని దాచుకోవాలని
మది బీరువాలో బంధించుంచుకోవాలనుంటుంది.
   
సామాన్యుడి భావనలు కొన్ని
అప్పుడప్పుడూ, సామాన్య అక్షర
పద కావ్య రూపాలై
అతని మదిలో
మెరుపులా మెరిసి
విముక్తికై ప్రాకులాడి, అంతలోనే
ప్రాముఖ్యతను కోల్పోయి
ఓడిపోతుంటాయి
మదిలో ఒంటరి మరణం మరణిస్తుంటాయి.

సామాన్యత



 















ప్రతిఒక్కరికీ తప్పదు.
ప్రస్థానించక
నలిగి
మసకేసి
ప్రకృతిలో కలిసిపోక

నేను మాత్రం,
మౌనంగా
అనుభూతి చెందుతూ ....
సామాన్యత వైశిష్ట్యత
అనుభవాలు క్రమబద్దీకరిస్తూ

ఆమె, అతని ప్రాణం




ఏదో కావాలని,
ఎంతో చెప్పాలని ఉంటుంది
కానీ
అర్ధవంతమైన పదాలు గుర్తుకు రావు.
మనోభావనలను ఆమెకు
కనులారా చూపాలని ఉంటుంది.
క్షణం క్షణం
ఆమెతో గడిపినంతసేపూ
ఆ క్షణాలన్నీ అమూల్యమే,
కానీ
మాటలు రావు.
మనసు తత్తరపడుతుంది.
ఏమీ చెయ్యలేని స్థితి.
అతని అంచనా ..... 


మనఃస్థితి మాత్రం
"ఆమెకు తెలిసేలా
ప్రేమించగలుగుతున్నానా!" అనే

ఆమె, అతని మనోహరిణి
అతనికి అన్నీ .... ఇంకా ఎన్నో
అతను జీవిస్తుందే
ఆమె కోసమే అన్నంతగా.
అతని కోరిక, ఆమె చొరవ,
చేరువ .... సమర్పణాభావన
ఆ కురుల సుఘంద పరిమళాలు
పరిసరాలలో వ్యాపించి
తడబాటుకు కారణం కావాలని
ఆ మాయలో పడిపోవడంలోని
ఆనందం పొందాలని




ఎప్పుడైనా ఆమె,
ఒక్క మాట .... అంటే వినాలని
"నీతో నే ఉంటాను.
మన ప్రేమ బలపడేంత
సాన్నిహిత్యం వరమిస్తాను" అని,
....................
ప్రేమ వాగ్దానం చేసేందుకు .... సిద్దం గా,
"ప్రతి రోజూ నిన్ను ....
మరింతగా ప్రేమిస్తాను."
"నువ్వే నా ప్రాణం .... నీవే నా అన్నీ"
"నేను జీవిస్తుందే నీ కోసం!"
"నీ ముఖాన ఆ ప్రకాశం, ఆ చైతన్యం
ఆ పరిమళం, కాలాంతం వరకూ
నా సొంతం కావాలి" అనాలని.

Thursday, April 10, 2014

ఉత్కంట




సముద్రుడి ఆశయం నెరవేరి 
ఆకాశం ను అందుకున్న 
అనుభూతి లాంటి లక్షణం 
సరిహద్దుల్లో 
ఊపిరి బిగబట్టించే అస్పష్ట క్షణం

పాటశాల రోజుల్లొకి 
బాల్యావస్థలోకి జరుగుతూ
శిదిలావస్థ లో ఉండీ, సాహసించమని 
దోబూచులాడుతూ పురికొల్పే 
క్షణాల జ్ఞాపకం

వయసు మీదపడుతూ
అనుభవాల గుట్టలు పేర్చుకుని 
నూతన ఆశలు, గమ్యాలు, ఆశయాలతో 
తెలియని భవిష్యత్తులోకి 
చొచ్చుకుపోవాలనిపించే పట్టుదల

ఆ అవకాశం ఆశ 
ఊపిరి బిగబట్టించుతూ
ఆకాశాన్ని ముద్దాడాలనే సంకల్పం అంచులో .... 
చైతన్యం పల్లవిస్తున్న .... చూపు లక్ష్యం
ఆ సప్త సముద్రాల సరిహద్దుల్లో .....

అంటే .... తెలుసుకుందామని?




ఆమె అంటే నాకు, నేనంటే ఆమెకు
అంకిత భావము
దీనినేనా ప్రేమ అని అంటారు?
ప్రేమ అంటే ....
ఒకరు ఇంకొకరికి చెప్పే పదం మాత్రమా ....?
సమర్పణా భావం, బహుమానమా?
ఈ భావనకు అర్ధం ఉందా?
పరిమాణం లో ప్రేమ పెద్దదా? చిన్నదా?
ప్రేమను చూడగలిగి, నిర్వచించగలమా?
ఉదహరించి వివరించగలమా?



ప్రేమ ఒక పేరా!?
ఒక అర్ధమా!?
ఒక గుణమా!?
ఒక లక్షణమా!?
ప్రేమ అనే అనుభూతిని పొందగలిగేది
ఒక సున్నితమైన ముద్దులోనేనా?
ఒక సుకుమార మృధుస్పర్శలోనేనా?
ఎవరిని ఇంకెవరితోనూ పోల్చుకుందుకు
ఇష్టపడమో ఆ ఇష్ట భావమేనా?
నిజం గా, అనురాగ బంధం
ప్రేమ, అంటే ఏమిటో తెలుసుకుందామని ....!?

మబ్బే మసకేసింది




అయోమయం, అస్పష్టతల నిశ్శబ్దం
నన్ను చుట్టేసినప్పుడు ....
చిత్రంగా
అది నా చెలి ఆత్మేమో అనే అనుభూతే
కలుగుతూ ఉంటుంది మదిలో.
పొగబారిన
మనో అనుభూతుల కోరికల
తడి మాటలు అవగతం కాక
బహుశ అవి .... చెలి గుసగుసలే అని
సరిపెట్టుకుంటుంది హృదయం




శరీరాన్ని అంటిపెట్టుకునున్న వస్త్రం లా ....
తియ్యని తమకమేదో
బద్దకం ముసుగేసుకుని
హృదయాంతరాలాలలో
సున్నిత లక్షణమై ....
ప్రేమగా రూపాంతరం చెంది, అంతలోనే
తెలియని కారణం గా మారి
హృదయం వొణికి .... ఆ కన్నీరు
ఒలికిన కావ్య అణువులు .... ఈ అక్షరాలు.

ఒక అపస్మారకం నుంచి స్మారకం లోకి
చిక్కని నిద్రలోంచి మేలుకువ లోకి
ప్రతి రోజూ ప్రాతఃసంధ్య వేళ
మసకేసిపోయిన
అనుభూతుల ఊహల లోకి
జారి, లోతుల్ని తొంగి చూసుకుని,
మది అద్దం పై పేరుకుపోయిన
ఆ అస్పష్టత మంచును తుడుచుకుని
ఎప్పుడో నాలో పూచిన .... చెలి నవ్వు
జ్ఞాపకం ను వెదుక్కుంటూ,




అది ఒక మోసపూరిత నవ్వు అని
ఏనాడూ అనుకోలేను.
భావోద్వేగాలతో నేను మోసపోయి
అనియంతృడ్నై, ఒత్తిడికి లోనై
ఆ హృదయ స్పందన కన్నీరు
ముఖం పై ఉప్పు చారికై
తలతిప్పుకుని సరిదిద్దుకునే సమయం ....
ప్రయత్నం చేసే లోపు ....
చెలిని కోల్పోయిన వాస్తవం బాధ .... నీడై వెంటాడి

Wednesday, April 9, 2014

వర్షపునీటి బొట్లు





 









ప్రేమిస్తున్నాయేమో అనిపిస్తుంది.
ఆడుకోవాలని ఆరాటపడి,
వర్షపునీటి బొట్లు కొన్ని ....
నీ ముఖంపై నర్తిస్తూ
ప్రేమోద్వేగ సమయాల్లో
నా వేళ్ళ కదలికల లా 




చినుకు, చినుకూ పెరిగి
ఒక్కో చినుకై రాలి
కొంటెగా
బుగ్గపై సొట్టలను చేరి ....
తియ్యని పెదవుల సరిహద్దుల్లో
ఆనందం అమృతమేదో కురిసినట్లు

Tuesday, April 8, 2014

కోరిక



 

















నీతో మాటలాడాలని
భాషలేని
మధుర భావనలను .... మనసుతో
ఎవ్వరూ అర్ధం చేసుకోలేని 
విషయాలను
ఎన్నింటినో
గుసగుసలాడాలని .... చెవిలో

జీవితాల కధ




 











ఊహలు అల్లుకుపోయిన అక్షరాలు,
పదాలు, వాఖ్యాలై
వయ్యారంగా
ర్యాంప్ పై .... పైకీ క్రిందకూ కదులుతూ
నడుస్తూ ఉన్న సిరా
పాళీ నోటి మూలల్లోంచి
మనో భావనై రూపు దిద్దుకుని ....
చిత్రం! 
నేను పొందిన
ఆ ఆనందం, ఆ అనుభవం
నాలోనికే యింకుతూ
ఎన్నాళ్ళనుంచి తింటూ ఉన్నానో
నేను
ఈ జీవితాల కధను, కవిత్వాన్ని



Monday, April 7, 2014

కలే నిజమై




ఆనందం మధుకము,
ఎంత తియ్యని రుచి
ఆకాశం నుంచి
రతీ మన్మధులు వెదజల్లిన
పుష్ప పవిత్ర రసం
అమృతం 
ఒక సన్నని, సున్నిత బంధమై
మనసుల్ని, చూపుల్నీ ....
కలిపి ఒకచోట
ఖండించి వేరు చేసి ఒకచోట
ద్వేషం గుండెలు చీల్చి,
అహం
కుత్తుకను తెంపి,
ఎదలో మది ఒత్తిడి ప్రతిధ్వనై
ఎదల విశ్వసనీయత ఆధారంగా
మరణ పంజరం
కలలా, గమ్యంలా 



బంగరు ధనస్సు ముక్కలై
పొందిన విజయోత్సాహం, బహుమానం .... ప్రేమ

Sunday, April 6, 2014

ఆత్మబంధువు




ఆ పరామర్శ .... ఒక మౌని పలుకరింపు
ఆ నవ్వు .... గద్గదికంగా గుండెతో నవ్వినట్లు
అతి సున్నితమైన ఆలోచనలు అవి
ఎంతో నిర్మలము
స్వచ్చము, దివ్యమైన ముఖం ....
ఒక చిత్రమైన అనుభవం అతను.

ఏ పని కైనా ఉపక్రమించినప్పుడు,
అవసరం ఏర్పడి, అడగాలనిపించినప్పుడు
అంతగా బ్రతిమాలాడాలా అని .... సిగ్గుపడుతూ అతను
చెయ్యందించి, సహకరించుతూ
ఆ అవసరం ప్రాముఖ్యతను తగ్గిస్తున్నప్పుడు
హిమాలయం అంత ఎత్తు ఆదర్శం అతను.




ఒక్కోసారి
నామమాత్రపు అవసరమే అయినా
నేనున్నాను అంటూ నిలబడి
సామాన్యుడిలా, ఎంతో సామాన్యంగా
సమశ్య తనదే అన్నట్లు పోరాడుతున్నప్పుడు
ఒక నమ్మకమైన ఆత్మ బంధువు అతను

నిజం! నిజంగా ....
ఎంత గర్వం అనిపిస్తుందో
అతని లాంటి నిగర్వి ని తెలిసిఉండటము


Saturday, April 5, 2014

నీవూ నేను




నా హృదయం అద్దంలోకి చూస్తూ
విశ్లేషించుకుంటున్నాను.
విజనప్రదేశములో వెదజల్లిన అందం
స్వచ్ఛంద ఖైదీ ని .... నేను,
స్వర్గ భోగాలకై శ్రమిస్తున్నాను అని

దూరంగా పొగమంచులా ముసురుకునున్న
విపరీత లక్షణాలు .... నా ఊహలు, కోరికలు అని
దేవత ఎవరో
ఎత్తుమించి క్రిందకు నేలమీదకు దిగుతూ
నా వైపే నవ్వుకుంటూ వస్తూ .... నన్నుద్దరిస్తుందని

ఒకవేళ నేను, ఆశ ఉండి .... అనుభవేచ్చలేని
మానసిక స్థితి నుండి బయటపడగలిగితే .... నిజంగా,
నా స్వీయ సృష్టి త్రిశంకు భావనల
తపోధనం .,... మరుపురాని
ఆ అద్భుత పరిమళాల్ని కాపాడుకోగలిగితే

నరకమూ, పాతాళమూ
మనకు సంబంధించినవి కావు, లేవనుకునే
చిత్తశుద్ధి ఉంటే ....
నిజంగానే ఒప్పుకుంటాను.
మనం జీవించేదీ, మనం ఉన్నదే .... స్వర్గం అని

పరిమళం



 











అతనిది
మంచి మనస్తత్వం
లేదా
చెడు మనస్తత్వం

తేడా ఏమిటి?
అతనే లేకపోతే

అతను
బలహీనుడు
లేదా
ఎంతో సమర్ధుడు

తేడాఉందా?
అతనే మరణిస్తే 

కాలయాపన తగునా
ఆలోచనలతో
పోయేవరకూ
ప్రేమించేందుకు.

నేను

















కొరుక్కుతినాలనిపించి
స్వయంగా దాచేసుకోవాలనిపించే అందాన్ని కావాలని
తినదగిన పదార్ధం రుచిని కావాలని ....

నేను

ఆకలి తీర్చగలిగిన .... ఏ రకంగా, ఎవరికైనా ఉపయోగపడగలిగిన
వేడి గా, రుచిగా సుచిగా ఉండి
ఆర్చుకుని, ఊరించేంత ఆరోగ్యకరమైన ఆశను కావాలని ....
నేను 

అందుబాటులో ఉండి, ఎవరూ గమనించరాదని
సామాన్యుడు .... తన పిడికిట్లో దాచుకోవాలనిపించే
స్వార్ధానికి అంకురాన్ని కావాలని ....
నేను

గాయపడి నలిపేయబడి డస్ట్ బిన్ లోకి విసిరేయబడి 
ఒక వృధా పదార్ధాన్ని కారాదని
అలసిన జీవితం లో .... అందమైన అనుభూతిని అయినా చాలని .....
నేను