Sunday, April 13, 2014

అతను, ఒక కవి




అక్షర ఖడ్గాలు
అనూహ్య
వైవిధ్య భరిత 
అద్భుత పద శరాలు
హిమవన్నఘాన్ని మించిన
ఆదర్శభావనలు
వెన్నుతడుతూ
కళ్ళముందు
మెరిసి మాయమైపోతుంటాయి.

అప్పుడప్పుడూ
విప్లవ
భావనల స్వేదం తో మది
నేల తడిసి
ఉత్తుత్తి వాగ్దానాలు .... అపనమ్మకాల
ఎదురుదెబ్బలు తాకిడికి
మట్టిలో రాలిన మాణిక్యాల కోసం
మోకాళ్ళమీద కూర్చుని
వెదుక్కున్నా .... అన్నీ అవశేషాలే

కాలి
కమిలిపోయిన ఆ ఆదర్శాలు
ఆ చవకబారు మాటల
చైతన్యమెరుగని బండరాళ్ళు
కొన్ని ....
మది గోడకు కొట్టుకుని
చెలరేగే .... సంఘర్షణ ల
ఆదర్శపుటాలోచనల
రతనాలు కనుగొనాలనే .... ఆశ

అతనిలోని ఆవేశం .... భావన
ఒక అందమైన వచనం గానో
ఏదైనా
ఉత్ప్రేక్ష, ఉపమాలంకారం గానో కనబడగానే
అది ఒక ప్రేరణ అయి
ఆ క్షణం లో
బంగారు పడీదుల్లో
అమృతం కురిసి
ఆది దేవతను కలిసిన ఆనందం .... అతనిలో 



   
అతనిది అంతం లేని
వెదుకులాటే ఎప్పుడూ
ఏ వనం లో నైనా
ఏ పడీదులో నైనా
కార్యరూపం దాల్చని, కాల్చలేని
పిచ్చి బంగారం
ఆచరణ యోగ్యం కాని
ఆదర్శాల కలలను కని దాచుకోవాలని
మది బీరువాలో బంధించుంచుకోవాలనుంటుంది.
   
సామాన్యుడి భావనలు కొన్ని
అప్పుడప్పుడూ, సామాన్య అక్షర
పద కావ్య రూపాలై
అతని మదిలో
మెరుపులా మెరిసి
విముక్తికై ప్రాకులాడి, అంతలోనే
ప్రాముఖ్యతను కోల్పోయి
ఓడిపోతుంటాయి
మదిలో ఒంటరి మరణం మరణిస్తుంటాయి.

4 comments:

  1. Athadu Oka kavi kaadu.vispoTanam.

    ReplyDelete
    Replies
    1. అతడు ఒక కవి కాడు విస్పోటనం
      బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు కార్తీక్! శుభసాయంత్రం!!

      Delete
  2. ఒక సామాన్యుడి అంతర్మధనం బాగా వివరించారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఒక సామాన్యుడి అంతర్మధనం
      బాగా వివరించారు చంద్రగారు.
      బాగుంది పరిశీలనాత్మక స్పందన ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete