Thursday, April 10, 2014

మబ్బే మసకేసింది




అయోమయం, అస్పష్టతల నిశ్శబ్దం
నన్ను చుట్టేసినప్పుడు ....
చిత్రంగా
అది నా చెలి ఆత్మేమో అనే అనుభూతే
కలుగుతూ ఉంటుంది మదిలో.
పొగబారిన
మనో అనుభూతుల కోరికల
తడి మాటలు అవగతం కాక
బహుశ అవి .... చెలి గుసగుసలే అని
సరిపెట్టుకుంటుంది హృదయం




శరీరాన్ని అంటిపెట్టుకునున్న వస్త్రం లా ....
తియ్యని తమకమేదో
బద్దకం ముసుగేసుకుని
హృదయాంతరాలాలలో
సున్నిత లక్షణమై ....
ప్రేమగా రూపాంతరం చెంది, అంతలోనే
తెలియని కారణం గా మారి
హృదయం వొణికి .... ఆ కన్నీరు
ఒలికిన కావ్య అణువులు .... ఈ అక్షరాలు.

ఒక అపస్మారకం నుంచి స్మారకం లోకి
చిక్కని నిద్రలోంచి మేలుకువ లోకి
ప్రతి రోజూ ప్రాతఃసంధ్య వేళ
మసకేసిపోయిన
అనుభూతుల ఊహల లోకి
జారి, లోతుల్ని తొంగి చూసుకుని,
మది అద్దం పై పేరుకుపోయిన
ఆ అస్పష్టత మంచును తుడుచుకుని
ఎప్పుడో నాలో పూచిన .... చెలి నవ్వు
జ్ఞాపకం ను వెదుక్కుంటూ,




అది ఒక మోసపూరిత నవ్వు అని
ఏనాడూ అనుకోలేను.
భావోద్వేగాలతో నేను మోసపోయి
అనియంతృడ్నై, ఒత్తిడికి లోనై
ఆ హృదయ స్పందన కన్నీరు
ముఖం పై ఉప్పు చారికై
తలతిప్పుకుని సరిదిద్దుకునే సమయం ....
ప్రయత్నం చేసే లోపు ....
చెలిని కోల్పోయిన వాస్తవం బాధ .... నీడై వెంటాడి

2 comments:

  1. ఒక అపస్మారకం నుంచి స్మారకం లోకి
    చిక్కని నిద్రలోంచి మేలుకువ లోకి
    ప్రతి రోజూ ప్రాతఃసంధ్య వేళ
    మసకేసిపోయిన......అందమైన పదబంధాలు

    ReplyDelete
    Replies
    1. ఒక అపస్మారకం నుంచి స్మారకం లోకి
      చిక్కని నిద్రలోంచి మేలుకువ లోకి
      ప్రతి రోజూ ప్రాతఃసంధ్య వేళ
      మసకేసిపోయిన......
      అందమైన పదబంధాలు
      అందమైన చక్కటి స్పందన స్నేహాభినందన!
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! సుప్రభాతం!!

      Delete