Sunday, April 20, 2014

రైతు కూలీకి .... కోపం వస్తే?




ఒళ్ళు దాచుకోలేదు ఏనాడూ .... రైతు కూలీని. 
శ్రమించాను. సేద్యం చేసాను 
ఆఖరి చెమటబొట్టు ఆవిరయ్యేవరకూ 
.........
మనిషిగా జీవించేందుకే, 
...........
నీరసం ఫలితం అయి
అడ్డం తిరగాలనిపించి
నిలదీసాను. కష్టానికి ఫలితం యిమ్మని. 
..........
బయటకు గెంటాడు. 
కొట్టించాడు. 
...........
నేనూ కొట్టాను. 
తల చిట్లింది. 
..........
పాపం! 
ఎండెరుగని ప్రాణం నొప్పిని తట్టుకోలేక .... 
అతను దొర
............
ఇప్పుడు, తప్పు చేసాననే బాధ 
నాలో .... 
నేను చేసింది తప్పేమో అనే నేర భావన, 

10 comments:

  1. pachathapam padatam anedi chaala gopadi pachathapam gurichi chaala baaga cheppparu

    ReplyDelete
    Replies
    1. పచ్చాత్తాపం పడటం అనేది చాలా గొప్పది పచ్చాత్తాపం గురించి చాలా బాగా చెప్ప్పారు
      బాగుంది పరిశీలన, స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
      ధన్యవాదాలు కలిగొట్ల వెంకట రత్న శర్మ గారు! శుభోదయం!!

      Delete
  2. " ఒళ్ళు దాచుకోలేదు ఏనాడూ .... రైతు కూలీని.
    శ్రమించాను. సేద్యం చేసాను
    ఆఖరి చెమటబొట్టు ఆవిరయ్యేవరకూ
    .........
    మనిషిగా జీవించేందుకే, "

    మీ పై మాటలు కాస్తా కలతను పెంచాయి.
    వాస్తవికతను అద్దంలో చూపించారు ,
    నిజంగా రైతుకే కోపం వస్తే మన పరిస్థితేంటి చంద్ర గారు.
    బాగుంది మీ కవిత .
    అభిననదనలు సర్
    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. "ఒళ్ళు దాచుకోలేదు ఏనాడూ .... రైతు కూలీని.
      శ్రమించాను. సేద్యం చేసాను ఆఖరి చెమటబొట్టు ఆవిరయ్యేవరకూ
      .........
      మనిషిగా జీవించేందుకే, "

      మీ పై మాటలు కాస్తా కలతను పెంచాయి. వాస్తవికతను అద్దంలో చూపించారు ,
      నిజంగా రైతుకే కోపం వస్తే మన పరిస్థితేంటి చంద్ర గారు.
      బాగుంది మీ కవిత. అభినందనలు సర్
      * శ్రీపాద

      చక్కని విశ్లేషణ, పరిశీలన, స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు శ్రీపాద గారు!

      Delete
  3. రైతు అనే వాడు ఒకడుండేవాడట అనుకుంటారు తర్వాతి తరాలవాళ్ళు.
    రైతుని సమూలంగా నాశనం చేసిన ఘనత మన ప్రభుత్వానిది,
    అన్నం కాదు గడ్డితినే రోజు వస్తుంది త్వరలో.
    మన్నించాలి ఇలాంటి టాపిక్స్ నన్ను కలచి వేస్తాయి.

    ReplyDelete
    Replies
    1. రైతు అనే వాడు ఒకడుండేవాడట అనుకునేరోజులు చూడాల్సొస్తుంది తర్వాతి తరాలవాళ్ళు.
      రైతుని సమూలంగా నాశనం చేసిన ఘనత మన ప్రభుత్వానిది,
      అన్నం బదులు రసాయనాలు గడ్డి తినే రోజు వస్తుంది త్వరలో.

      మన్నించాలి

      ఇలాంటి టాపిక్స్ నన్ను కలచి వేస్తాయి.

      సహజమైన ఆవేదన ఏ ప్రభుత్వమూ పట్టించుకోని రైతు జీవితం గురించి ఆందోళన స్పందన లో
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete
  4. రైతుకి కోపం లేదని
    ఎవరన్నారు?
    అన్నం పెట్టె చేతులకి కోపమొచ్చినా
    అవి అన్నం పెట్టడం
    మానవు..
    అందుకే రైతన్న కోపం
    మనం చూడలేకపోతున్నాం .
    నేల తనను నమ్ముకుందో
    తను నేలను నమ్మాడో
    ఒకరినొకరు వొదలలేక
    ఒరుసుకుని బీళ్ళు పడ్డ
    ఇరుదేహాలు,
    తీరని దాహంతో
    ఆకాశం వైపు
    ఆశగా చూస్తూ
    ఎండిన కళ్ళనీ
    కదలని కాళ్ళనీ
    ఈడ్చుకుంటూ
    ఏడ్చుకుంటూ
    పంటకై వాడే పురుగుల మందు
    వంటికి వాడినపుడు చూడొచ్చు రైతన్న కోపం ....
    ఆరుకాలాలు
    ఇష్టంగా అలసి
    అయిన కాడికి అమ్ముకున్నా
    అప్పులు కూడా తీరకుంటే
    ఉరికొయ్య గా మారిన
    బావి మోటకీ తెల్సు
    రైతన్న కోపం .
    కబ్జా కోరులకు పోను
    మిగిలిన గుంటల భూమిని
    పెళ్ళాం పిల్లలతో పాటు
    కష్టపడ్డా
    పంట చేతికొచ్చే వేళా
    పట్వారీ
    పట్టా లేదని పంచనామా చేస్తే
    పొట్ట చేతబట్టుకుని
    పట్నం దారి పట్టి
    కట్టు బానిసైనపుడు
    నిజమైన కోపం చూడొచ్చు .
    తన కోపమే తన శత్రువన్న
    మన సామెత
    రైతన్నకోసమే నెమో ..

    ReplyDelete
    Replies
    1. రైతుకి కోపం లేదని ఎవరన్నారు?
      కానీ, అన్నం పెట్టె చేతులకి కోపమొచ్చినా అవి అన్నం పెట్టడం మానవు..
      అందుకే రైతన్న కోపాన్ని మనం చూడలేకపోతున్నాం ..... నేల తనను నమ్ముకుందో, తను నేలను నమ్మాడో .... ఒకరినొకరు వొదలలేక, ఒరుసుకుని బీళ్ళు పడ్డ ఇరుదేహాలు,
      తీరని దాహంతో ఆకాశం వైపు ఆశగా చూస్తూ
      ఎండిన కళ్ళనీ కదలని కాళ్ళనీ ఈడ్చుకుంటూ ఏడ్చుకుంటూ
      పంటకై వాడే పురుగుల మందు కడుపులో ఆకలి చల్లార్చుకోవడం కోసం వాడాల్సొచ్చినప్పుడు ఆ బాధ ....
      ఆరుకాలాలు ఇష్టంగా అలసి అయిన కాడికి అమ్ముకున్నా అప్పులు కూడా తీరకుంటే
      ఉరికొయ్య గా మారిన బావి మోటకీ తలను కొట్టుకోవాలనిపించినప్పుడు
      కబ్జా కోరులకు పోను మిగిలిన గుంటల భూమిని పెళ్ళాం పిల్లలతో పాటు కష్టపడ్డా పంట చేతికొచ్చే వేళ
      పట్వారీ పట్టా లేదని పంచనామా చేస్తే
      పొట్ట చేతబట్టుకుని పట్నం దారి పట్టి కట్టు బానిసైనపుడు

      ఆవేశం పరాకాష్టకు చేరి ఆవేదన మాత్రమే కనిపించే స్పందన
      ధన్యవాదాలు జానీ పాష గారు! శుభ సుప్రభాతం!!

      Delete
  5. బాధ తెలిసిన వాడు కనుక ఎదుటివారి బాధను గూర్చి ఆలోచిస్తాడు , తన పొరపాటుకు చింతిస్తాడు.

    ReplyDelete
    Replies
    1. బాధ తెలిసిన వాడు కనుక తన కడుపు మంటను మించి ఎదుటివారి బాధను గూర్చి ఆలోచించాడు, అది ప్రతిస్పందనే అయినా పొరపాటుగా అర్ధం చేసుకుని తన పొరపాటుకు చింతిస్తున్నాడు.

      చాక్కని పరిశీలన ఏకీభావన స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభారుణోదయం!!

      Delete